Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరం
#1
చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరం
రోహిత్‌ రావుకు సారథి పగ్గాలు
[Image: 23kohili105spo.jpg]
ముంబయి: న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకు, టీ20 సిరీస్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. రెండు వన్డేలకు, టీ20 సిరీస్‌ నుంచి కోహ్లీకి విశ్రాంతినివ్వనున్నట్లు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కోహ్లీ స్థానంలో ఆ బాధ్యతలను రోహిత్‌ రావుకు ఇవ్వనున్నారు. గతేడాది జరిగిన ఆసియాకప్‌ నుంచి కూడా కోహ్లీకి విశ్రాంతి లభించడంతో రోహిత్‌ రావు కెప్టెన్‌ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కివీస్‌తో జరిగే మరో రెండు వన్డేలకు మాత్రమే కోహ్లీ అందుబాటులో ఉంటాడు. తర్వాత నాలుగు, ఐదో వన్డే మ్యాచ్‌, వచ్చే నెలలో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లకు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది. గత కొద్ది నెలల నుంచి విరామం లేకుండా కోహ్లీ ఆడుతున్నాడు. దీంతో ఫిట్‌నెస్‌, ఆరోగ్యం రీత్యా బీసీసీఐ అతడికి విశ్రాంతి ఇచ్చింది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆ ప్రభావం ప్రపంచ కప్‌ మీద పడే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది.
న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత ఆసీస్‌తో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. తర్వాత ఐపీఎల్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 30 నుంచి ప్రపంచకప్‌ సమరం మొదలవుతుంది. అయితే ఇక వరల్డ్‌ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో కోహ్లీకి విశ్రాంతినివ్వడానికి ఇదే సరైన సమయమని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)