Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ధోనీ జాదూ: ఆసీస్‌పై వన్డే సిరీస్‌ కైవసం
#1
ధోనీ జాదూ: ఆసీస్‌పై వన్డే సిరీస్‌ కైవసం

వరుసగా మూడు అర్ధశతకాలు బాదిన మహి
[Image: 18brk-mshdoni-dk2.jpg]

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాపై పరిపూర్ణ విజయం. తొలుత 1-1తో టీ20 సిరీస్‌ సమం. తర్వాత 2-1తో టెస్టు సిరీస్ కైవసం. ఇప్పుడు 2-1తో వన్డే సిరీస్‌ భారత్‌ సొంతం. ఓ పటిష్ఠ జట్టుపై విదేశాల్లో టీమిండియా అన్ని సిరీస్‌లను కోహ్లీ నాయకత్వంలోనే అందుకోవడం అద్భుతం. నిర్ణయాత్మక చివరి వన్డే సాదా సీదాగా ఏమీ సాగలేదు. పిచ్‌ మందకొడిగా ఉండటంతో పరుగులు చేయడం కష్టమైంది. తొలుత మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ 6/42 చెలరేగడంతో ఆసీస్‌48.4 ఓవర్లకు 230 పరుగులు చేసింది. ఛేదనలో మహేంద్రసింగ్‌ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్‌ జాదవ్‌ (61; 57 బంతుల్లో 7×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్‌కు 116 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. విరాట్‌ కోహ్లీ (46; 62 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

[Image: 18brk-mshdoni-dk1_1.jpg]

సమయోచితంగా కోహ్లీ
మందకొడి పిచ్‌పై టీమిండియా ఛేదనలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9; 17 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 15 వద్దే వెనుదిరిగాడు. సిడిల్‌ వేసిన 5.6వ బంతికి షాన్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన భారత సారథి విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆచితూచి ఆడాడు. ఆసీస్‌ పేసర్లు‌ రిచర్డ్‌సన్‌, స్టాన్‌లేక్‌ బంతుల్ని చక్కగా అడ్డుకున్నాడు. వారికి తోడైన స్పిన్నర్‌ జంపా బౌలింగ్‌లోనూ ఒక్కో పరుగు సాధించాడు. జట్టు స్కోరు 59 వద్ద ధావన్‌ (23; 46 బంతుల్లో)ను స్టాయినిస్‌ ఔట్‌ చేయడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ, కోహ్లీ మూడో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకానికి చేరువైన విరాట్‌ను 30 ఓవర్‌ చివరి బంతికి రిచర్డ్‌సన్‌ పెవిలియన్‌ పంపించాడు. అప్పటి జట్టు స్కోరు 113.


[Image: 18brk-mshdoni-dk3.jpg]

ధోనీ అండగా ‘కేదార్‌ జాదూ’
విరాట్‌ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ తొలుత పరుగులు చేసేందుకు కష్టపడ్డాడు. ఒక్కో పరుగు సాధించాడు. నిలదొక్కుకున్న తర్వాత బౌండరీలు బాదేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మహేంద్రసింగ్‌ ధోనీ అర్ధశతకానికి చేరువయ్యాడు. చేయాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో కఠినంగా వస్తున్న బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. అనవసర షాట్లకు ప్రయత్నించలేదు. ఈ క్రమంలో జాదవ్‌, ధోనీ చెత్త బంతుల్ని వేటాడి బౌండరీకి తరలించారు. డ్రింక్స్‌ బ్రేక్‌ తర్వాత మహీ అర్ధశతకం సాధించాడు. చివరి ఐదు ఓవర్లలో భారత్‌ 44 పరుగులు చేయాల్సి ఉండగా కేదార్‌ జాదవ్‌ సమయోచితంగా వరుస బౌండరీలు సాధించి అర్ధశతకం అందుకున్నాడు. సమీకరణం చివరి 12 బంతుల్లో 14 పరుగులుగా మారడంతో భారత్‌ విజయం ఖాయమైంది. స్టాయినిస్‌ వేసిన 49 ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 49.2వ బంతికి జాదవ్‌ బౌండరీ సాధించి విజయం అందించారు. చాహల్‌ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌, ధోనీ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్నారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)