Thread Rating:
  • 10 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery పేరులో ఏముంది

Showing only the posts of prasthanam: 113 of 596 posts. Show all posts
#21

(17-06-2020, 07:33 AM)nandurk Wrote:  mkole123 గారి లాంటి మరియు మీ లాంటి రచయితలు దొరకటం (ఇక్కడ దొరకటం) మా అదృష్టం. Namaskar clp);

చాలా థాంక్సండీ మీ కామెంట్ కి. ఇలాంటివి చదువుతున్నప్పుడు నేను వెచ్చించిన సమయం వృధా కాలేదు అనిపిస్తుంది. కధలో మునిగిపోయి వేరే కధలు చదవడం లేదు. కధ అయినా తరువాత మొదలెట్టాలి మళ్ళీ.

(17-06-2020, 09:39 AM)twinciteeguy Wrote:  very nice. good boy our hero so far

థాంక్స్. అవునండి గుడ్ బాయ్ సో ఫార్.

(17-06-2020, 01:27 PM)Rohan-Hyd Wrote:  Wow, nice story going in a flow. Continue with regular updates.

Story is simply superb.

వారానికి రెండు అప్డేట్లు పెడతాను తప్పకుండా. కధ నచ్చినందుకు ఆనందం.

(17-06-2020, 02:43 PM)maheshtheja143143 Wrote:  E update kosam chala chala enthusiast ga wait chesanu yem avuthundho yela untundho ani.....
meru next episode ki double enthusiasm create chesaru... Suspense ni asalu thattu koleni nalanti vallaku edhi chala kastam... Pls update kodhiga fast ga evvandhi jii..

కధ, అప్డేట్ నచ్చినందుకు ఆనందం. నెక్స్ట్ అప్డేట్ నచ్చుతుందని ఆశిస్తున్నా.

(17-06-2020, 05:42 PM)Okyes? Wrote:  ప్రస్థాణం గారు

సింప్లీ సూపర్ సర్........
దయచేసి ఆ పెళ్లి తొందరగా జరపండి సార్....
ఆ శోబనపు ఎపిసోడ్ చదవాడానికి తొందరవుతుంది........
మరోసారి ........
సూపర్ కథ....కథనం....

థాంక్స్ సర్.కొంచెం ఓపిక పట్టండి. కధని ఎక్కువ సాగదీయాలని లేదు. పెళ్లి వరకు పాత్రల స్వభావాలు చెప్పటం కోసం విపులంగా రాసాను. పెళ్లి తరువాత తొందరగా సాగిపోతుంది. నేను ప్లాన్ చేసిన ప్రకారం ఇంకో 20-22 ఎపిసోడ్స్ తో పూర్తయి పోవాలి కధ.

(18-06-2020, 12:18 AM)bobby Wrote:  very nice update

థాంక్స్ బాబీ గారు అప్డేట్ నచ్చినందుకు 

(18-06-2020, 04:48 AM)Chandra228 Wrote:  కావ్య శ్రీ రామ్ ఇద్దరు నెమ్మదిగా తమ జీవితాన్ని ఒకటిగా అమలు చేసుకుంటూ న్నారు మొదటి మీటింగ్ బాగుంది ఇక ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

చంద్ర గారు కధ, అప్డేట్ నచ్చినందుకు ఆనందం. నెక్స్ట్ అప్డేట్ నచ్చుతుందని ఆశిస్తున్నా.

(18-06-2020, 01:22 PM)Gsyguwgjj Wrote:  Super update

అప్డేట్ నచ్చినందుకు అప్డేట్ నచ్చినందుకు 

(18-06-2020, 02:45 PM)ravi Wrote:  Peru lo emi unna lekapoina, kathalo manchi content undi sir, plz continue, thanks for update waiting for new

థాంక్ యు. మీ అందరి కామెంట్స్ నాకూ మంచి ప్రోత్సహం.

(18-06-2020, 07:49 PM)lovelyraj Wrote:  మంచి కథనం ప్రస్థానం గారు

Slow steady and wins the race

సామెత లా ఏమాత్రం తొందర పడొద్దని నా సలహా...

మీ సలహా నా ప్లానింగ్ కి కొంచెం రి అస్సురింగ్ గా ఉంది. థాంక్ యు వెరీ మచ్. కధ మొత్తం సన్నివేశాల ప్రకారం విభజించి రాస్తున్నా. ఇంకో 20-22 ఎపిసోడ్స్ తో పూర్తయిపోతుంది కధ.

సమయం తీసుకొని కామెంట్స్ తో ప్రోత్సాహిస్తున్న పాఠకులందరికీ మరొక్కసారి ధన్యవాదములు. తొందరగా అప్డేట్లు పెట్టమని చాలా కామెంట్స్ లో కనిపించింది. ఇంతకు ముందు చెప్పినట్టు వారానికి రెండు అప్డేట్లు, ప్రతి బుధవారం, శనివారం (ఏదైనా అవాంతరం వస్తే తప్ప) పెడతాను. తరువాత ఎపిసోడ్ రేపు పోస్ట్ చేస్తాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

ఎపిసోడ్ 8

లోపలికి వచ్చిన కావ్య మెల్లిగా తమ గదిలో జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న రాజారావు, "ఇంతకీ నీ అభిప్రాయం ఏంటమ్మా"అని అడిగాడు.
"నాకు నచ్చారు నాన్న", అంది స్థిరంగా. ఆ మాటతో పెళ్లి అయిపోయినంత సంబర పడ్డాడు.
కూతురు నచ్చిందని చెప్పటంతో ఆనందించిన జానకి,"మరి అబ్బాయిని ఎలా వొప్పించాలంటారు", అలాంటి విషయాల్లో భర్త సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో.
"ముందుగా వియ్యంకుడితో మాట్లాడితే బాగుంటుందేమో"అన్నాడు కావ్య రియాక్షన్ కోసం చూస్తూ.
"లేదు నాన్న. ఇలాంటి విషయాల్లో తనతో డైరెక్ట్ గా మాట్లాడితే మంచిది. వ్యక్తిత్వం ఉన్నవాడు, నిర్ణయం తీసుకోగలడు. అతనిదే నిర్ణయం అని చెప్పారుగా శ్రీరామ్ పేరెంట్స్ కూడా."
కూతురి నుంచి అదే సమాధానం కోసం ఎదురు చేస్తున్న,"వెరీ గుడ్ తల్లి. రేపు ఆదివారం. ఆలస్యం చేయకుండా రేపే మాట్లాడదాము. అవసరం అయితే హైదరాబాద్ వెళ్లి కలుద్దాము"అన్నాడు ధైర్యంగా. 
భర్త నిబ్బరం చూసి, కూతురి తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిబ్బరంగా అంది,"మీ నాన్నను మించినట్టున్నాడు. అయినా ఎక్కడికి పోతాడు."

**********************

దారిలో సూర్య పేటలో భోజనం చేసి రాత్రి ఇంటికి చేరే సరికి పది దాటింది. లేట్ అయ్యింది, రేపు ఫోన్ చేసి చెప్పచ్చు అనుకొని మంచం పై చేరాడు. ఆ రోజు పెళ్లి చూపులు గుర్తుకు వచ్చాయి. ఒక ఫామిలీ ఫ్రెండ్ కలిసినట్టు వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన పద్దతి నచ్చింది. మొబైల్ లో కావ్య ఫోటో తీసి చూసాడు. ఇంత అందానికి వద్దు అని ఎలా చెప్పానా అని మనస్సులో ముల్లు గుచ్చుకున్నట్టయింది. అంతలోనే తాను ఎందుకు వద్దన్నాడో తెలిసి సమాధాన పడ్డాడు. ఇంతకీ తరువాత మాట్లాడదాం అంది, దేని గురించి అయి ఉంటుంది. బహుశా యాంత్రికంగా అన్నదేమో, తానె ఎక్కువగా పట్టించుకుంటున్నాడు అని అనుకొన్నాడు. ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.

**********************

కావ్యకు పొద్దున్న తన బెడ్ రూమ్ లో జరిగినదంతా పదే పదే గుర్తుకు వస్తుంది. తాను కోరుకున్న వ్యక్తిత్వం ఉన్న శ్రీరామ్ అంటే బాగా ఇష్టం కలుగుతోంది. అతనితో రేపు ఏమి మాట్లాడాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావటంతో, మెల్లిగా తీపి ఊహలు మొదలయ్యాయి. దానికి తోడు పేరెంట్స్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న సౌమ్య అప్పుడే ఫోన్ చేసి బావ చాలా అందంగా ఉన్నాడు. నీకు నచ్చకపోతే చెప్పు. నేను ఫిక్స్ అయిపోతా అంటూ ఒక అరగంట సేపు ఏడిపించింది.

మాటల్లో,"శ్రీరామ్ ఫోటో నా రూమ్మేట్ కి చూపించా. చాలా బాగున్నాడు, ఇవ్వాళ్ళ రాత్రికి టిక్కు పెడతాను అని చెప్పింది."
"టిక్కు పెట్టడమేంటే?" అని అడిగింది అర్ధం కాక.
"అది మా కోడ్ వర్డ్ లే. ఆ మాత్రం అర్ధం చేసుకోలేవేమిటే. ఊహించుకొని, వేళ్ళకు పనిచెప్పడమే."
"ఛీ అవేమి మాటలే, మరీ పచ్చిగా!", టిక్ అన్న మాటకు అర్ధం అయి, లేని కోపం తెచ్చుకుంటూ.
"పచ్చి ఏముందే ఇందులో మనస్సులో ఉన్నది చెబుతుంటే. మనల్ని చూసి ఎంతమంది ఖరాబు చేసుకోవడం లేదు. నువ్వు ప్రభాస్ కి ఎన్ని సార్లు టిక్కు పెట్టలేదు", అంది సౌమ్య మరింత రెట్టిస్తూ.
"నీవు మరీ రెచ్చి పోతున్నావు. నీ రూమ్మెట్ నీకంటే ముదురులా ఉంది!"
"ఇద్దరమూ ఒకటే. కాకపొతే అది బయటకు చెప్పింది. నేను చెప్పలేదు. అయినా నాకు నీ మీద డౌటే. నువ్వే పెట్టేస్తెవేమో ఈ రాత్రికి టిక్కు", అంది కొంటెగా.
"నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఫోన్ పెట్టేస్తున్న", అంటూ కాల్ కట్ చేసింది.

సౌమ్యతో మాట్లాడిన తర్వాత ఒళ్ళంతా వేడి ఎక్కి భారం అయ్యింది.
ఫోన్లో శ్రీరామ్ ఫోటో చూస్తూ,"మరీ బెట్టు చెయ్యక, ఒప్పుకో బాబు", అంటూ లైట్ ఆర్పేసింది.

వయసు పోరుతో ఒక పట్టాన నిద్ర పట్టలేదు. అప్రయత్నంగా నైటీ హుక్స్ విప్పేసింది. బ్రా వేసుకోక పోవడంతో ఆమె నిండైన బత్తాయిలు గాలి పోసుకున్నాయి. మెల్లిగా తన చేతులతో కుచమర్దనం చేసుకుంది. దాంతో ఇంకా వేడెక్కింది. మెల్లిగా నైటీ పైకి లాగి,  పాంటీ తీసేసింది. తాటి ముంజల్లాగ, గిల్లితే గాటు పడేలాగా ఉన్న, బలిసిన మెత్తటి తన నిలువు రెమ్మల మీద చేయి వేసి వత్తుకొంది. కొద్దిగా తడి తగిలింది. చూపుడు వేలు, బొటన వేలుతో చింత గింజంత తన తొడిమను సుతారంగా మీటింది. వొళ్ళంతా అద్భుత ప్రకంపనలు. అప్రయత్నంగా రెండు వేళ్ళు తడిగా ఉన్న తన మానం లోకి దూర్చి మెల్లిగా ఆడించ సాగింది. మస్తిష్కంలో శ్రీరామ్ రూపం తన మీద మెదులుతుంటే వేగం పెంచింది. కొంత సేపు అలా ఆడించిన తరువాత ఉధృతంగా కార్చేసింది. ఒళ్ళంతా తేలికై మెల్లిగా నిద్రలోకి జారుకొంది.

**********************

ఉదయం టిఫిన్ తరువాత కూతుర్ని పక్కనే కూర్చుబెట్టుకొని శ్రీరామ్ కి ఫోన్ చేసాడు, స్పీకర్ ఆన్ లో పెట్టి.

ఫోన్ రింగ్ కి నిద్ర లేచిన శ్రీరామ్ నాన్న ఫోన్ చేస్తున్నారేమోనని ఫోన్ తీసాడు. రాజారావు అన్న పేరు చూసి,"గుడ్ మార్నింగ్ అంకుల్"అన్నాడు సమయం చూస్తూ. అప్పుడే తొమ్మిది అయ్యిందా అనుకొన్నాడు.

ఫ్రెండ్స్ పేరెంట్స్ ని కలిసారా, దర్శనం బాగా జరిగిందా లాంటి కుశల ప్రశ్నల తరువాత డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాడు."కావ్య నీతో మాట్లాడనుకొంటుంది బాబు. నీవు ఫ్రీ గా ఉంటె ఒకసారి తనతో మాట్లాడితే బాగుంటుంది", అన్నాడు.

ఒక క్షణం ఆలోచించి, తను అప్పుడే లేచానన్న విషయం చెప్పకుండా,"ఒక గంటలో ఫోన్ చెయ్యనా అంకుల్. వారు ఫ్రీ గా ఉంటారా?"
అది విన్న కావ్య, తండ్రికి తన ఫోన్ చూపిస్తూ తనకే డైరెక్ట్ ఫోన్ చేయమని చెప్పు అని సైగ చేసింది.
"కంగారు లేదు బాబు. ఈ రోజు సండే కదా, కావ్య ఇంట్లోనే ఉంటుంది. నీవు ఫ్రీ అయినప్పుడు తనకే డైరెక్ట్ గా ఫోన్ చెయ్యి, మధ్యలో నేనెందుకు."
"అలాగే అంకుల్, తను నిన్న మిస్సెడ్ కాల్ ఇచ్చారు. నెంబర్ ఉండాలి. ఎందుకైనా మంచిది తన నెంబర్ మెసేజ్ చేస్తారా. అలాగే నా నెంబర్ తనకి ఇవ్వండి. నేను ఫోన్ చేస్తే తెలుస్తుంది. గుడ్ డే"అంటూ ఫోన్ పెట్టేసాడు.

రాజారావు కావ్య ఫోన్ నెంబర్ శ్రీరామ్ కి మెసేజ్ చేసి, శ్రీరామ్ నెంబర్ కావ్య కి ఇచ్చి సేవ్ చేసుకోమన్నాడు. "పైకి వెళ్లి మాట్లాడతావా. అయిన తరువాత ఏ సంగతి చెప్పు. తరువాత ఏమి చేద్దామో ఆలోచిద్దాము".
"కొంచెం కాఫీ తాగి వెళ్లవే"అంది జానకి నవ్వుతూ. కూతురికి, తమకి నచ్చడంతో ఈ సంభందం కుదిరితే బాగుండు అని దేవుడ్ని మనసులోనే కోరుకొంది.

**********************

వెంటనే లేచి మొహం కడుక్కొని, స్నానం చేసి టిఫిన్ చేసాడు. ఏ పని చేసిన కావ్య ఏమి మాట్లాడ బోతోందో అని ఆలోచన మెదుల్తోంది అతని బుర్రలో. ఒక వేళ తనకి ఇష్టమని చెబితే ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ పేరెంట్స్ తో మాట్లాడదామా అనుకోని, వాళ్ళకి నచ్చిందని చెప్పారు కదా అని మానేసాడు. కొంచెం సేపు ఎదురు చూసి, పది అవ్వగానే కావ్య నెంబర్ కి కాల్ చేసాడు.

అతని కాల్ గురించి ఎదురు చూస్తుండటంతో ఒక్క రింగ్ కె ఫోన్ ఆన్సర్ చేసి హలో చెప్పింది. ఇద్దరికీ క్లియర్ గా వినిపిస్తుంది అని అడిగి తెలుసు కొన్నాక, విషయానికి వచ్చేసాడు. "ఇందాక మీ నాన్నగారు ఫోన్ చేసి, మీరు మాట్లాడాలని చెప్పారు."
"అవునండి. నిన్న మీరు వెళ్లిన తరువాత బాగా ఆలోచించాను. మీ గురించి చెప్పింది నాకు బాగా నచ్చింది. కానీ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీరు ఏక పక్ష నిర్ణయం తీసుకున్నట్టు ఉంది", అని చెప్పింది ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా.

ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది శ్రీరామ్ కి. ఆ మాటల్లో చాలా అర్ధాలు కనిపించాయి. తనంటే ఇష్టమని పరోక్షంగా తెలియ చేస్తూ, తన తప్పిదాన్ని సున్నితంగా చెప్పింది. మొదటి నుంచి తన నిర్ణయం అదే అయితే, అన్ని విషయాలు తెలిసి పెళ్లి చూపులకు ఎందుకు వచ్చినట్టు? కావ్య సగటు ఆడపిల్ల కాదని అర్ధం అయ్యింది.

"అవునండి. నాదే తప్పు. పేరెంట్స్ మాటిచ్చాను అంటే వచ్చాను. రాకుండా ఫోన్ లోనే మాట్లాడ వలసింది."
అతను తన మాటలను ఇంకోలా అర్ధం చేసుకుంటున్నాడని, "అలాంటిది ఏమి లేదు. మీరు రావడం మంచిదయ్యింది. నిర్ణయం ఏమైనా మీ లాంటి మంచి వ్యక్తిని కలిసే అవకాశం పోయేది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు."
బాగా పరిణతి చెందినట్లున్న ఆమె మాటలతో మాములయ్యాడు. "చెప్పండి I am all ears."

"మీ గురించి చెప్పినట్టు, నేను నా గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న గారు తన స్వశక్తితో కష్టపడి పైకొచ్చిన వారే. మాకున్నదంతా ఆయన కష్టార్జితం. కాకపోతే ముందులో తాతయ్య, అమ్మమ్మ ల సపోర్ట్ కొంచెం వుంది. నిజం చెప్పాలంటే మాకు ఏ కష్టం తెలియకుండా పెంచారు. అలా అని రియాల్టీతో సంభంధం లేకుండా కాదు. నాకు మీలాగే స్వంత కాళ్ళ మీద నిలబడటం ఇష్టం. అలా అని అవసరం అయితే సహాయం తీసుకోవడంలో తప్పులేదనుకుంటాను. మనకి తెలిసినవారు కష్టాల్లో ఉన్నారంటే మనము సహాయం చేస్తాము కదా, అలాగ. మీరు చెప్పినట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడం నాకూ ఇష్టం. నాకున్న చదువుతో వీలనయినంత సహాయం చేయగలను. నాకు డబ్బు కన్నా వ్యక్తిత్వం ప్రధానం. మీ సంస్కారం నాకు, పేరెంట్స్ కి బాగా నచ్చింది. నేను ఇబ్బంది పడతానని అనుకోవటం లేదు, ఏమంటారు?"

ఆమె అలా డైరెక్ట్ గా అడిగేసరికి వెంటనే ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండి పోయాడు.
"ఇప్పుడే చెప్పాలని లేదు. మీకు ఏమైనా ప్రశ్నలుంటే ఫోన్ చేసి అడగండి. కానీ బాగా ఆలోచించు కొని చెప్పండి."అంది అతనికి ఉపశమనం ఇస్తూ.
"థాంక్స్ అండీ. ఈ రోజే ఏ విషయం చెప్తా అన్నాడు."

కావ్యతో మాట్లాడిన తరువాత చాలా హాయిగా, విశ్రాంతిగా అనిపించింది. మళ్ళా కాఫీ పెట్టుకుని తాగుతూ ఆలోచిస్తూ ఉంటె తన ఆలోచనలో మంచితనం ఉన్నా, డబ్బున్న అమ్మాయిల మీద తనకి ఒక  స్థిర అభిప్రాయం, ప్రెజుడిస్ ఉండటం కరెక్ట్ కాదని అనుకొన్నాడు. తనకి ఉన్నట్టుగానే ఆ అమ్మాయికి సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన ఎందుకు ఉండకూడదు? కనీసం తను అడగాల్సింది కదా, ఏమయ్యింది తన అనలిటికల్ థింకింగ్ కి అని మధన పడ్డాడు. ఆలోచించగా కావ్య అన్ని విధాలా మంచి భార్య అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఫోన్ మోగింది. చూస్తే నాన్న దగ్గరనుంచి. తండ్రులతో పెళ్లి చూపుల దగ్గర నుంచి ఇంతవరకు జరిగినదంతా చెప్పాడు. బాగా మాట్లాడుకొని చివరికి అందరూ సంభందం ఖాయం చేసుకోవాలనుకున్నారు. ప్రసాద్ రావు దంపతులకు కాబోయే  కోడలి మీద చాలా మంచి అభిప్రాయం కలిగింది.

**********************

ఈ లోపుల అక్కడ కావ్య తల్లి తండ్రులకు తమ సంభాషణ చెప్పింది. తమ పెంపకాన్ని, కూతురి మీద తమకున్న అపారమైన నమ్మకాన్నీ, మనసులోనే దాచుకుంటూ,"బాగా చెప్పవమ్మా"అని అభినందించాడు.

లంచ్ కి కూర్చోబోతుండగా కావ్య ఫోన్ మోగింది. శ్రీరామ్ దగ్గరనుంచి కావడంతో ముక్కు మీద వేలు పెట్టి నిశ్శబ్దం అన్నట్టు సైగ చేసి, "చెప్పండి శ్రీరామ్", అంది.

"బాగా ఆలోచించి చెబుతున్నానండి. నా ఆలోచనలో కొంచెం లోపం ఉంది. మీరు ధైర్యంగా  చెప్పక పొతే మిమ్మల్ని మిస్ అయ్యే వాణ్ని. నిన్నే చెప్పానుగా, మీకు వంక పెట్టటానికి ఏమి లేదు అని. మీరంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. మా పేరెంట్స్ కి  కూడా మీరు బాగా నచ్చారు. మీకు, మీ పేరెంట్స్ కి కూడా ఇష్టమయితే, అంకుల్ కి వీలయినప్పుడు నాన్న గారితో మాట్లాడమనండి."

"అలాగే చెబుతానండి", అంది ఆనందంగా.
"థాంక్ యు అండ్ కంగ్రాట్స్ టు యు. మీ కేమన్న నా గురించి తెలుసు కోవాలనుకుంటే నాకు ఫోన్ చెయ్యండి. ఉంటాను."
"కంగ్రాట్యులేషన్స్. మీరు కూడా. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. గుడ్ డే. బై "అంటూ కాల్ కట్ చేసింది.

తల్లి తండ్రులు తన మాటలు వింటున్నారని కొంచెం సిగ్గు ముంచు కొచ్చింది. కూతురి ముఖం లోని వెలుగు చూసి విషయం అర్ధం అయ్యింది. అబ్బాయి ఒప్పుకోవడంతో తల మీదనుంచి పెద్ద బరువు దించినట్టయింది రాజారావుకి.

"సీతా! ముందు ఆ పరమాన్నం తినిపించవే అందరికి", అంది జానకి ఆనందంగా.
[+] 11 users Like prasthanam's post
Like Reply
#23

(20-06-2020, 07:49 AM)Eswar P Wrote:  ప్రస్తాణం గారు మీ రచన సింప్లి సూపర్బ్ అద్భుతం. చాలా బాగుంది .

బాగా నచ్చినందుకు చాలా థాంక్స్. 

(20-06-2020, 07:56 AM)twinciteeguy Wrote:  chalaa baavundi

బాగా నచ్చినందుకు చాలా థాంక్స్. 

(20-06-2020, 07:56 AM)Sunny73 Wrote:  Awesome story writing... Slow build up...

అవునండి మీరు అన్నట్టు మెల్లిగా పాత్రల వ్యక్తిత్వాలు బిల్డ్ అప్ చేసుకుంటూ వస్తున్నా. పెళ్లి తరువాత కధా గమనం ఊపందుకుంటుంది.

(20-06-2020, 12:17 PM)nagu65595 Wrote:  Good update

చాలా థాంక్స్

(20-06-2020, 03:15 PM)superifnu Wrote:  Bagundandi..

చాలా థాంక్స్

(20-06-2020, 03:42 PM)rohanronn4u; Wrote:  Chaalaa... bagundi...

చాలా చాలా థాంక్స్.

(20-06-2020, 03:58 PM)Gopi299 Wrote:  
బాగుంది చాలా బాగుంది
ఇలా చెప్తే సరిపోతుందా


No

మృదువుగా మధురంగా
సాగుతోంది

ఇలాగే కొనసాగించాలని కోరుతూ...

మొత్తం కధ, సన్నీవేశాలు ప్లానింగ్ పూర్తయి పోయింది. రాయటమే మిగిలింది. టెంపో మైంటైన్ అయ్యిందో లేదో తరువాత మీరే చెప్పాలి. థాంక్స్.

(20-06-2020, 08:48 PM)will Wrote:  బాగుంది,,కానీ సబ్జెక్ట్ ఏమిటో అర్థం కాలేదు,,అంటే స్టోరీ ఏ లక్ష్యం వైపు వెళ్తోంది..

కొంచెం ఓపిక పట్టండి. నచ్చినందుకు థాంక్స్. పేరు గురించి చివరలో వివరిస్తాను.

(21-06-2020, 03:14 AM)bobby Wrote:  story super nice, need to see how it goes further

థాంక్స్ అండి. ఇంకో ఏడెనిమిది ఎపిసోడ్స్ తర్వాత కధ అర్ధమై పోవచ్చు.

(21-06-2020, 09:48 AM)Okyes? Wrote:  ప్రస్థాణం గారు

సింప్లీ సూపర్ సర్........ సింప్లీ సూపర్
ఆఖరికి కావ్యా....శ్రీరామ్ లను ఒ కొలిక్కి తెచ్చారు సంతోషం.......
ఇక మేము కూడా టిక్కు పెట్టుకొనేలా చెయ్యండి ......


నచ్చినందుకు చాలా థాంక్స్ సర్. నేను అనుకొన్న ప్రకారం శృంగారం ఈ శనివారం నుంచి మెల్లిగా మొదలై, కధానుసారంగా అక్కడక్కడా చివరి వరకు ఉంటుంది.


కామెంట్స్ తో ప్రోత్సహిస్తున్న అందరికి మరొక్కసారి ధన్యవాదములు. రేపు పెద్ద అప్డేట్ తో ముందుకు వస్తా.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
#24

(23-06-2020, 05:23 PM)Chandra228 Wrote:  ఆహ్ కావ్య శ్రీరామ్ లు కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు బాగుంది

అవునండీ త్వరలోనే.
Like Reply
#25

ఎపిసోడ్ 9

కళ్యాణ మొచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు. మంచి రోజులు దొరకడంతో రెండు వారాల్లో తాంబూలాలు, నెలన్నరలో పెళ్లి నిర్ణయించుకున్నారు. కట్న కానుకలు ఏమి అడగలేదు, కొడుకు ముందే చెప్పడం వల్ల. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తరువాత రెండు రోజుల వరకు శ్రీరామ్ కాల్ చేయకపోతే, తనే కాల్ చేసింది. మెల్లిగా రోజు కాల్ చేసే రొటీన్ లో పడ్డారు. అలాగే శ్రీరామ్ తనని ఇంకా మీరు అని పిలుస్తుంటే రెండు మూడు సార్లు వారించి ఏక వచనం లోకి మార్పించింది. తన కాబోయే భర్త మీద మెల్లిగా మంచి అవగాహన రాసాగింది.

నోవొటెల్ హోటల్ లో దగ్గర బంధువులను పిలిచి ఎంగేజిమెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. అది చూసి ప్రసాద్ రావు దంపతులు, బంధువులు బాగా ఆనందించారు. శ్రీరామ్ కి అన్ని విధాలా సరి అయిన జోడి దొరికిందని అభినందించారు. అంతవరకూ ఫోటో మాత్రమే చూసిన సౌమ్య, బావను చూసి చాలా ఆనందించింది. " నెల రోజుల్లో పెళ్లి. ఆ తరువాత ఫుల్ ఎంజాయ్. అక్కా నువ్వు చాలా లక్కీ. నిన్ను చూస్తుంటే చాలా అసూయగా ఉంది"అంటూ అక్కను ఏడిపించసాగింది.

డిన్నర్ అయిన తరువాత బంధువులు అందరూ మెల్లిగా జారు కొన్నారు. పెళ్లి వారికి అదే హోటల్ లో బస ఏర్పాటు చేయడంతో అందరూ రూమ్స్ కి వెళ్లారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటామని అక్కడ  లాబీలో సోఫాలో రిలాక్స్ అయ్యారు. 
కొంచెంసేపు వాళ్ళను మాట్లాడుకోనిచ్చి సౌమ్య కూడా చేరింది అక్కడికి"గుడ్ ఈవెనింగ్ బావా"అంటూ.
"ఏమిటి నువ్వు ఇంకా వెళ్లలేదా"అన్నాడు ఏమి మాట్లాడాలో తెలియక.
"మీ ప్రైవసీ డిస్టర్బ్ చేస్తున్నానా? అక్కతో తప్ప నాతొ మాట్లాడవా? అయితే వెళ్ళిపోతా"అంది కోపం నటిస్తూ.
"అబ్బె అలాంటిదేమి లేదు. కూర్చో. సెమిస్టరు మధ్యలో వచ్చావు. నీ స్టడీస్ డిస్టర్బ్ కాలేదు కదా."
"చదువు గురించి ఇప్పుడెందుకులే. నాకు నీ విషయాలు తెలియాలి."
"అయితే అడుగు"అన్నాడు సౌమ్య ఏమి అడగబోతుందో తెలియక.
"దాంతో కొంచెం జాగ్రత్త శ్రీరామ్"అంది కావ్య చెల్లి దూకుడు తెలిసి.
"అబ్బో పెళ్లి కాకుండానే మొగుడ్ని వెనకేసుకు వస్తున్నావు. నువ్వు అటు తిరుగు. నేను బావని కొన్ని అడగాలి"అంటూ శ్రీరామ్ వైపు తిరిగి,"బావా నీవు నిజం చెప్పాలి. నీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్, ఇంతవరకు"

ఊహించని ఆ ప్రశ్న కు షాక్ తిన్నాడు. మొహంలో నవ్వుపోయి సిగ్గుతో ఎర్రగా అయ్యింది. అసలే తెలుపేమో. క్లియర్ గా తెలుస్తోంది. భర్త రియాక్షన్ తో అతని ఇబ్బంది గమనించింది. తనతో కూడా ఫోన్ లో కాబోయే జీవితం గురించి, అపార్ట్మెంట్ కి ఏమి కొనాలో, అభిరుచులు, బంధువులు, పుస్తకాలు, పని గురించి తప్పితే అఫైర్స్ , ప్రేమలు గురించి ఏమి మాట్లాడేవాడు కాదు. తనకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే కాదు, అలాంటి వ్యగ్తిగత విషయాలు వేరే వాళ్లతో సంభాషించే అలవాటు లేదని గ్రహించింది. 

"మంచి నీళ్లు కావాలా బావా"అంది వాటర్ బాటిల్ చూపించి ఆట పట్టిస్తూ.
"ఏయ్. బావను ఆట పట్టించింది చాలు. నువ్వు వెళ్లవే", అంది కావ్య
బావ లాంటి అందమైన తెలివైన మెతక మనిషి అంతవరకూ జీవితంలో ఎవరు ఎదురు పడలేదు సౌమ్యకు. అందుకే అతన్ని ఆటపట్టించడం సరదాగా ఉంది తనకి.
"బావకి మాట్లాటడం రాదా. ప్రతిదానికి నువ్వు అడ్డు పడుతున్నావు. బావ చెప్తే వెళ్ళిపోతా"అంది కవ్విస్తూ. 
శ్రీరామ్ కొంచెం తేరుకొని, "ఇంతవరకు ఎవ్వరు లేరు. ఇప్పుడు మీ అక్క "
"మా అక్కను ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నావుగా. ఇక నుంచి నేనే నీ గర్ల్ ఫ్రెండ్. రాత్రికి ఫోన్ చెయ్యి" అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయింది.
"ఏమనుకోకు. అది ఒక్క అల్లరి మేళం. But she is really fun to hang out with." అంది కావ్య
"It's ok. I had friends like that in college and at work but not among relatives. I will start getting used to it now", నవ్వుతూ అన్నాడు, ఆ సరదాకి ఒక ముగింపు పలుకుతూ


ఎపిసోడ్ 10

ఎంగేజ్మెంట్ అయిన తరువాత రోజు అందరూ వాళ్ళ ఊళ్లకు వెళ్లిపోయారు. రెండు వైపులా పెద్దవాళ్ళు పెళ్లి పనులు మొదలు పెట్టారు. ఇంట్లో మొదటి పెద్ద శుభకార్యం కావటంతో భారీ ఎత్తున చేయటానికి ఏర్పాట్లు చేయసాగారు. కావ్య, శ్రీరామ్ లు రోజు ఫోన్ లో మాట్లాడు కోసాగారు. మొదట్లో కొంచెం రిజర్వేడ్ గా ఉన్నా మెల్లిగా ఓపెన్ అయ్యాడు. పది, పదిహేను నిముషాలు మాట్లాడే శ్రీరామ్ ను కొన్ని రోజుల్లోనే గంటల్లోకి తీసుకెళ్లింది కావ్య. శ్రీరామ్ ని బాగా గమనించడంతో కావ్యకు అతని మనస్తత్వం పై ఒక పూర్తి అవగాహన వొచ్చింది. అతనితో మాట్లాడిన ప్రతి సారి ఒక కొత్త విషయం తెలిసేది కావ్యకు. అలాగని తను తెలివైన వాడన్న గర్వం ఏ కోశానా లేకుండా, తనని ఒక సమానురాలు లాగ మాట్లాడటంతో అతనిపై ప్రేమ, గౌరవం మరింత పెరిగింది.  పని చాలా శ్రద్ధతో చేస్తాడని అంచనా కి వచ్చింది కావ్య. ఆఫీస్ సమయంలో అస్సలు ఫోన్ చేయడు. తాను మెసేజ్ పెడితే మాత్రం జవాబిస్తాడు. అతని రెస్పాన్స్ సమయం బట్టి, అస్తమాను ఫోన్ చెక్ చేసుకొనే రకం కాదని అర్ధం అయ్యింది. ఫొటోస్ షేర్ చేసుకునే వారు. మెల్లిగా తన డ్రెస్సెస్ ను మెచ్చుకోటం మొదలు పెట్టి, మెల్లిగా తాను ఇచ్చిన చనువుతో తన అందాల మీద కామెంట్స్, చివరకు ఫోన్ లో ముద్దు వరకు వచ్చారు. అలా అని చెప్పి మరీ పచ్చిగా మాట్లాడేవాడు కాదు. అతనితో తన శృంగార జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచనలతో, తీపి ఊహల్తొ నిద్ర పట్టేది కాదు కావ్యకు.

అప్పుడప్పుడు శ్రీరామ్ చెల్లితో, తల్లి తండ్రులతో మాట్లాడేది కావ్య. మంచి అణకువ కలిగిన  కోడలు దొరికిందని చాలా సంతోషం పడేవారు శ్రీరామ్ పేరెంట్స్. అది కూడా కావ్య అంటే మరింత ఇష్టం కలిగేలా, మానసికంగా దగ్గరయ్యేలా చేసింది.

శ్రీరామ్ తన  అపార్ట్మెంట్ లోపల చిన్న వీడియోలు, ఫొటోస్ తీసి, కావ్యకు షేర్ చేసి ఆమెకు పూర్తి అవగాహన వచ్చేలా చేసాడు. ఎక్కువగా పెళ్ళైన తరువాత ఇంట్లోకి ఏమి కావాలో తెలుసుకొని షాపింగ్ చేసేవాడు. ఒక రోజు మాటల్లో కొత్త కర్టైన్స్ వేస్తె బాగుంటుందని చెప్పింది.
వెంటనే "తప్పకుండా. మా అమ్మ గారు కొన్న కొత్తలో తొందరలో బట్ట కొని కొట్టించారు. మార్చాలని  నేను అనుకుంటున్నాను. రేపే దర్పణ్ షాప్ కి వెళ్లి అక్కడనుంచి నుంచి ఫోన్ చేస్తా"అన్నాడు. అది ఎక్ష్పెక్త్ చేయని కావ్య మొదట చెప్పాలా వద్దా అని సందేహించింది. 
చివరకు ఎప్పటికైనా డబ్బు విషయాలు మాట్లాడటం తప్పదని, "ఎంత బడ్జెట్ అనుకొంటున్నావు"
 "ఎంత అవుతుందో నాకు అంచనా లేదు. ఎంత అవుతుందో నీకు తెలుసా"అని అడిగాడు.
"నాకు కొంచెం ఐడియా ఉంది. కాని పిండి కొలది రొట్టె అన్నారు కదా. మనం ఎంత పెట్టగలమో నిర్ణయించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది కదా!"
ఆ మాట శ్రీరామ్ కి బాగా నచ్చింది."వెరీ గుడ్. నువ్వు నాలాగే ఆలోచిస్తావన్న మాట. నేను అంతే. కొంచెం పెద్ద ఖర్చులకు, బడ్జెట్ ప్రకారమే ముందుకు వెళ్తాను. నా దగ్గర బ్యాంకు లో ఆరు లక్షలకు పైగా ఉంది. ఇది మొత్తం పెళ్లికి బట్టలకు, ఇంట్లో ఫర్నిచర్ కు, హనీమూన్ ఖర్చులు అన్నింటికీ కలిపి. నువ్వే ఆలోచించి డిసైడ్ చెయ్యి" అన్నాడు.
ఆ మాటతో తన కాబోయే భర్త మాటల సూరుడు కాదని, తనకు పెళ్లి చూపుల్లో చెప్పినట్టు తన కాళ్లపై నిలబడేవాడని గ్రహింపు కొచ్చింది. "ఆలోచించి రేపు చెబుతా"అని అప్పటికి సంభాషణ ముగించింది. కాబోయే భర్త వెంట హానీమూన్ మాట వచ్చేసరికి ఆ ఊహలతో రోజు లాగే నిద్ర ఆలస్యమయింది.

మరుసటి రోజు భోజన సమయంలో ఆ విషయం తల్లి తండ్రులిద్దరికి మెల్లిగా చెప్పింది. ఆ విషయం విని సంతోషించినా, "బాగానే ఉంది. కాని కొత్త కాపురానికి ఫర్నిచర్ పెట్టడం మన సంప్రదాయం కదా అమ్మ. అలాగే పెళ్ళైన తరువాత మీ ఇద్దరినీ ఒక వారం స్విట్జర్లాండ్ పంపిద్దామనుకొంటున్నాను. కట్నం కూడా తీసుకోవడం లేదు. అట్లాంటిది మన చేత ఆ మాత్రం ఖర్చు పెట్టించక పొతే ఎలా"అన్నాడు రాజారావు.

"పెళ్ళికి బాగా ఖర్చు చేస్తున్నావు కదా నాన్న. దానికి ఏమి అడ్డు చెప్పటం లేదు కదా. కావాలంటే ఆరు నెలల తరువాత స్విట్జర్లాండ్ ఏదో బహుమతి అని ఒప్పిస్తానులే. ప్రస్తుతానికి తన ఖర్చుతో వెళితే తనకు ఒక తృప్తి. నాకు కూడా. కర్టైన్స్ తప్ప మరేమి కొనిపించనులే"
కూతురు కూడా అల్లుడి తరపు మాట్లాడటం నచ్చింది లలితకు."పోనిలే ఫర్నిచర్ వరకు మనం ఇచ్చేట్టు మాట్లాడి ఒప్పించు. మాకూ ఆనందంగా ఉంటుంది."

ఆ రోజే శ్రీరామ్ తో మాట్లాడుతూ డబల్ రాడ్ తో కర్టైన్స్ వేస్తె బాగుంటుంది. ఒక లేయర్ తెల్లటి పలుచని సిల్క్ గుడ్డతో రెండవ లేయర్ డిజైన్ క్లాత్ తో వేయటానికి ఒక లక్ష లోపులో అన్ని కిటికీలకు కర్టైన్స్ వేయొచ్చని చెప్పి వప్పించింది. తెల్లటి పరదా వేసినప్పుడు ప్రైవసీ తో బాటు వెలుగు కూడా వస్తుందని, భార్య ఐడియా ని మెచ్చుకున్నాడు. హనీమూన్ డిస్కషన్ కూడా కావ్య తీసుకు రావడంతో శ్రీరామ్ కేరళ కాని, మారిషస్ కాని అని చెప్పటంతో ఇద్దరు ఒక వారం పాటు మున్నార్, అలెప్పి, హౌస్ బోట్, తేక్కడి, కొచ్చిన్ కేరళ ట్రిప్ కి వెళదామని డిసైడ్ చేసుకున్నారు. శ్రీరామ్ రిజర్వేషన్ చేస్తానంటే, మాకూ తెలిసిన ట్రావెల్స్ తో చేయిద్దాము. నాన్నగారు చెబితే తరువాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు, నువ్వే పే చేద్దువు కాని అని చెప్పటంతో శ్రీరామ్ కూడా ఓకే చెప్పాడు. అదే ఊపులో అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు ఫర్నిచర్ ఇవ్వడం ఆనవాయితి అని తనను ఏమి కొనవద్దని చెప్పింది. తన చెల్లికి తల్లి తండ్రులు ఇచ్చినట్టు గుర్తు ఉండటంతో అభ్యంతరం చెప్పలేదు.

సౌమ్య కూడా ఫోన్ చేసినప్పుడల్లా తన మాటలతో మరింత వేడి ఎక్కించేది. పెళ్లి కుదిరిన తరువాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి తమ గురించి అడుగుతుండే వారు. అదేమిటీ హైదరాబాద్ లో ఉండి, ఒక్క సారి విజయవాడ రాకుండా ఎట్లా వున్నాడు. పెళ్ళికి ముందు తాము ఎలా కలుసుకొనేది, ముద్దులు, కౌగలింతలు, వీడియో షేరింగ్ లు, వాళ్ళ విరహం గురించి పచ్చిగా ఫోన్ లో మాట్లాడుకున్న మాటలు చెబుతుంటే తాను ఏమన్నా మిస్ అవుతున్నానేమో అనే భావన కలిగేది.

మాటల్లో ఒక సారి పరోక్షంగా అడిగింది. "మా ఫ్రెండ్స్ ఆశ్చర్య పోతున్నారు, మనిద్దరం ఇంతవరకు ముద్దు పెట్టు కోలేదంటే."
"నీకు ఏమైనా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా"అని అడిగాడు 
ఆ మాటతో సర్దుకొని, "లేదు. నాకు అలాంటి ఫీలింగ్ ఏమి లేదు"
"మనకింకా నాలుగు దశాబ్దాల పైనే సమయం ఉంది. తొందర ఎందుకు. ఇన్ని రోజులు ఆగాము. ఇంకెంత కొన్ని రోజులు మాత్రమే. ఆ ఎదురు చూడడంలోనే ఉన్నది తీపి. లవ్ యు. అంత వరకు ఇది తీసుకో"అంటూ చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టాడు.

ఆ మాటతో తనలాగే భర్తకు కనీసం పర స్త్రీ స్పర్శ ఎరుగడని స్పష్ట మయ్యింది. ఏదో మిస్ అవుతున్నాను అన్న తన ఆలోచనలన్నీ పక్కన పెట్టింది.

అలా పగలంతా జ్యువలరీ, బట్టల షాపింగ్, సన్నిహితుల పిలుపు కబుర్లతో, రాత్రి తీపి కబుర్లతో, తియ్యటి ఊహలతో గడిచి పోయింది కావ్యకు. రోజులు భారంగా గడిచినా పెళ్లి రోజు రానే వచ్చింది.
[+] 8 users Like prasthanam's post
Like Reply
#26

(24-06-2020, 07:39 AM)twinciteeguy Wrote:  super narration

థాంక్ యు.

(24-06-2020, 09:26 AM)sunil Wrote:  Chaala chakkaga raastunnaru

నచ్చినందుకు థాంక్స్.  

(24-06-2020, 10:08 AM)paamu_buss Wrote:  Inka aata modalaledhu
.... Waiting for next update

రేపటినుండి మెల్లిగా మొదలవుతుంది.

(24-06-2020, 05:14 PM)bobby Wrote:  super update

థాంక్ యు.

(24-06-2020, 05:48 PM)nobody2u Wrote:  merru story ki firstlo pettina tittle tho hero character 100% match avutondi...
           story bagundi....mee kadhanam super....nakenduko kavya cheli soumyani chustuntay bava nachadu movie vibes vastunnayi....eagerly waiting for your next update..... yr):

గమనించారన్న మాట. నేను ఆ పేరు పెట్టడానికి ముఖ్య కారణం మీరు చెప్పిందే. ఎందుకు మార్చవలసి వచ్చిందో చివరలో చెబుతాను. బావ నచ్చాడు, సినిమా చూడలేదు. మీరు సిఫారసు చేసారుగా. వీలున్నప్పుడు తప్పక చూస్తాను. నచ్చినందుకు థాంక్స్.


రేపు మరొక అప్డేట్ తో ముందుకు వస్తాను.
Like Reply
#27

(26-06-2020, 08:57 AM)nobody2u Wrote:  pls chudodu aa movie :) ..very bad movie..  just akka mogudi meda manasu pada character vundani polchanu....... mee story 100 times better aa movie kannaa...eagerly waiting for your next update...

క్లారిఫై చేసినందుకు థాంక్స్. రివ్యూ చేసి ఇంకో పదిహేను నిముషాల్లో పెడతాను.

(26-06-2020, 09:01 AM)SVK007 Wrote:  Excellent update bro

నచ్చినందుకు థాంక్స్.

(26-06-2020, 01:52 PM)ravi Wrote:  Exlent sir, katha kathnam  bagunnadu, mundu mundu story ela continue avuthunda ani ........

నచ్చినందుకు థాంక్స్. ఇంకో పదిహేను నిముషాల్లో అప్డేట్ పెడుతున్న.

(26-06-2020, 02:39 PM)siva_reddy32 Wrote:  హాయ్  

ఈరోజు  చూసాను మీ  దారం ,   ఉపోద్గాతం బాగుంది  రెగ్యులర్  గా అప్డేట్  ఇవ్వడం చాలా గ్రేట్.

దాదాపు  రెండు సంవత్సరాల  క్రితం  నేను ఇదే భావాలతో  నా దారం మొదలు పెట్టాను ,   చాలా  బాగాలు అనుకొన్నట్లు గానే ఇచ్చాను , కానీ జీవితం లో అన్ని రోజులు ఒకలా ఉండవుగా, ప్రస్తుతం  రెండు వారాలకు ఒక  ఎపిసోడ్  ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది.

నేను మిమ్మల్ని discarage  చేయడం లేదు,   మీ  ఆలోచనా విదానం బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం.   మీ  కథ పుర్తి  పూర్తిగా ఎటువంటి ఇబ్బందులతో మీరు అనుకొన్నట్లు సాగాలని కోరుతున్నాను.

కథ చాలా బాగా రాస్తున్నారు  అలాగే  రాసుకొంటూ పొండి

అంతా మంచి జరగాలని కోరుతూ

శివ

వివరంగా మీ భావాల్ని షేర్ చేసినందుకు థాంక్స్ శివ గారు. మొదటగా ఈ ఫోరమ్ నిర్వహణకు అడ్మినిస్ట్రేటర్ గా మీ సేవకు అభినందనలు. మీ బాధని అర్ధం చేసుకోగలను. మీరు ఇంకా ప్రయత్నిస్తున్నారు, అందుకు కృతజ్ఞతలు. కధ ఇప్పటికి మూడొంతులు అయిపొయింది. చెప్పినట్టుగా వారానికి కనీసం రెండు అప్డేట్లతో పూర్తి చేద్దామని ప్రయత్నం. మీ ప్రోత్సహానికి థాంక్స్.


ఫ్రెండ్స్, అప్డేట్ ఇంకో పదిహేను నిముషాల్లో పెడతాను. వచ్చేవారం కొంత విరామ సమయం దొరికేలా ఉంది. వీలయితే ఒక ఎక్సట్రా అప్డేట్ పెడతానికి ప్రయత్నిస్తా.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
#28

ఎపిసోడ్ 11

అత్యంత వైభవంగా జరిగింది కావ్య శ్రీరామ్ ల పెళ్లి. పలువురు పుర ప్రముఖులతో పాటు, సెలెబ్రెటీలు, రాజకీయ నాయుకులు, ఉన్నత బ్యూరాక్రటిక్ అధికారులు వచ్చారు పెళ్ళికి. శ్రీరామ్ తరపు భందువులందరికి ఆశర్యం. ధనికుల సంభందం అని తెలుసు కాని, శ్రీరామ్ మామ గారికి అంత పరపతి ఉందన్న విషయం ప్రత్యక్షంగా చూడడంతో, ప్రసాద్ రావు దంపతులకు, శ్రీరామ్ కి అంత హడావుడిలో కూడా తమ అబ్బాయిలకు ఉద్యోగం విషయం లో సహాయం చేయాలని అభ్యర్ధనలు. అంత VIP ల మధ్య హడావుడిలో కూడా, వియ్యంకులు తమకు సముచిత గౌరవం, మర్యాదలు చేయడంతో ప్రసాద్ రావు, లలిత చాలా ఆనంద పడ్డారు. పెళ్ళైన తరువాత కావ్యతో కాకినాడకు వెళ్లారు మొగ పెళ్లివారు. కావ్యతో పాటు తోడుగా తమ బంధువుల్లో శ్రీరామ్ ఆర్ధిక స్థితికి తగిన కజిన్, ఆమె భర్తను పంపించారు.

తరువాత రోజు కాకినాడలో సాయంత్రం SRMT ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ జరిగింది. వచ్చిన బంధువులు అందరూ కావ్యను చూసి శ్రీరామ్ కి తగ్గ జోడి అని చాలా మెచ్చుకొన్నారు. ఫంక్షన్ అయిన తరువాత బంధువులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మూడు గదులు అపార్ట్మెంట్ కావడంతో శ్రీరామ్ చెల్లి, భర్త కాకినాడ వాళ్ళ చుట్టాలింట్లో ఉన్నారు. ఆ రాత్రి తమ బెడ్ రూమ్ లో ప్రసాద రావు దంపుతులు, రెండో బెడ్ రూమ్ లో కావ్యకు తోడుగా వచ్చిన వారికి ఇచ్చి, మూడో గదిలో కావ్యకు పడక ఏర్పాటు చేశారు. హాల్లో శ్రీరామ్ పడుకొన్నాడు.  గదిలోకి వెళ్లి భార్యతో మాట్లాడదామని ఉన్న, పొరపాటున ఎవరైనా లేస్తే బాగుండదని మొహమాటంతో ఆగిపోయాడు. రాత్రి పన్నెండు దాటినా నిద్ర రాలేదు కావ్యకు. శ్రీరామ్ వస్తాడేమో అని చాలా సేపు చూసి, అతను రాడని నిశ్చయానికి వచ్చి తనే మెల్లిగా హాల్లోకి వచ్చింది. అలసి పోయున్నాడేమో శ్రీరామ్ నిద్రలోకి జారుకున్నాడు. దాదాపు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు పొడవు వుండే భర్త, అయిదున్నర అడుగుల దివానుపై అలా కాళ్ళు ముడుచుకొని పడుకోవటం చూసి జాలి పుట్టింది. లేపాలా, వద్దా అని ఆలోచించి చివరకు దగ్గరగా వెళ్లి భుజంపై ప్రేమగా చెయ్యి వేసింది. పూలచెండు తగిలినట్టు మెత్తటి ఆమె చెయ్యి స్పర్శకు టక్కున కళ్ళు తెరిచాడు శ్రీరామ్. ఎదురుగా బెడ్ లైట్ వెలుగులో భార్య కనిపించేసరికి ఆనందంతో లేచి కూర్చున్నాడు.

ప్రేమగా,"నిద్దుర పట్టడం లేదా కావ్య" అని అడిగాడు లోగొంతుకతో.
ముందే ఆలోచించి పెట్టుకోవడంతో, "దాహం వేసింది" అంది.
"అయ్యో నీ బెడ్ రూమ్ లో నీళ్లు పెట్టలేదా"అంటూ లేచి కిచెన్ లో ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకు వచ్చాడు.
దాహం లేకపోయినా కొంచెం తాగి,"నీకు ఇది చిన్నగా ఉంది. లోపల పడుకో, నేను ఇక్కడ పడుకుంటా."
తన పట్ల భార్య శ్రద్ద, ప్రేమ గమనించి ఆమెకు తనతో మాట్లాడాలని ఉందని గ్రహించి, "అమ్మో, అసలే నువ్వు కొత్త కోడలివి. నిన్ను ఇక్కడ చూస్తే రేపు నాకు అందరూ క్లాస్ పీకుతారు. నాకిది అలవాటే. నీకు నిద్ర వచ్చేవరకు నీ గదిలో కబుర్లు చెప్పుకుందాం పదా."

ఆనందంగా భర్త వెంట గదిలోకి నడిచింది. ఆ గదిలో కిటికీ తెరిచి ఉంచడంతో చల్లని గాలితో పాటు వెన్నెల కురుస్తోంది. ఆ వెలుగులో నైటీలో తన సహజ సౌందర్యంతో వెలిగి పోతున్న కావ్యను చూసి వివశుడై దగ్గరకు తీసుకోని గట్టిగా హత్తు కొన్నాడు. మొదటి సారి ఒక స్త్రీని కౌగలించుకోవడం శ్రీరామ్ కు. సర్రున రక్తం పాకింది నరాల్లో. పడుకునే ముందు అండర్వేర్ తీసివేయడంతో గట్టిగా నిక్కి కావ్య పొత్తి కడుపుకు వత్తుకొంది. కావ్యకు అదే మొదటి కౌగిలి ఒక పురుషునితో. శ్రీరామ్ మెడపై తల ఆనించి అతని నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకొంది. పొత్తి కడుపుకు తగిలి గిలిగింతలు పెడుతున్న అతని మగతనం స్పర్శను అనుభవిస్తూ ఉండి పోయింది. 

మెల్లిగా తన కుడి చేత్తో ఆమె చుబుకం ఎత్తి తన కళ్ళలోకి చూస్తూ,"ఎంత అందంగా ఉన్నావో తెలుసా. ఇంత కాలం ఎలాగో ఉగ్గబెట్టి ఉన్నా. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని ఇంకా మూడు రోజులు ఆగటం చాలా కష్టం"అన్నాడు ఆమె చనుగుత్తులు తన ఛాతిపై వత్తుకోవడంతో వచ్చిన తమకంతో.

అతన్ని మరింత గట్టిగా హత్తుకొని, అతని స్పర్శను అణువణువునా అనుభవిస్తూ,"ఆపుకోమని ఎవరు అడ్డు పెట్టారు"అంది కొంటెగా. ఆ మాటల చిలిపి తనానికి గిలిగింతలు పెట్టినట్టు అయ్యింది. ప్రేమగా ఆమె పెదవులపై ముద్దాడాడు. ఆ పెదవుల మృదువైన స్పర్సకు మరింత వత్తిడి పెంచారు ఇద్దరూ. పెదవుల తీపిదనాన్ని జుర్రు కోడానికి మెల్లిగా ఇద్దరూ ఒకరితో ఒక్కరూ పోటీ పడసాగారు. దాదాపు రెండు నిముషాల తర్వాత మధ్యలో గాలి పీల్చడం ఆపెయ్యడం వల్ల, ఊపిరి కోసం విడివడ్డారు. వెంటనే ప్రేమతో మరింత గట్టిగా హత్తుకొంటూ ముద్దు పెట్టుకోసాగారు. ఈసారి ఒకరి నాలుకను ఇంకొకరి పెదవుల్లో చొప్పించి పెదవుల తీపిని పరస్పరం అనుభవించ సాగారు. అసంకల్పితంగా తన నడుమును కిందకు జార్చి తన దాన్ని ఆమె తొడల మధ్యకు వచ్చేలా సర్దుతుంటే, తన మునికాళ్ళపై లేచి అతనికి సహకరించింది కావ్య. ఇప్పుడు అతని దండం సూటిగా ఆమె ఉపస్తుపై నైటీ మీద నుంచే అంకుశంలా పొడుస్తోంది. దానికి తోడు ఇద్దరూ తమ చేతులను ఇంకొకరి పిరుదులపై వేసి తమవైపు బలంగా వత్తుకోసాగారు.

కావ్య కూడా పడుకునే ముందు పాంటీ తీసెయ్యడంతో శ్రీరామ్ దండం తన దిమ్మని పొడుస్తుండడం స్పష్టంగా తెలుస్తోంది. అతని సిల్క్ షార్ట్స్ లో చెయ్యి పెట్టి తనని పొడుస్తున్న అంకుశాన్ని గుప్పెటతో పట్టుకోవాలని ఉంది, కానీ అతను ఏమి అనుకుంటాడో అన్న సంశయంతో ముందడుగు వేయలేక పోతుంది.  తమకంతో అతన్ని పిరుదులపై చేయి వేసి తన వేపు నొక్కుకుంటూ, మెల్లిగా అతని చేతిని కిందకు తన తొడ వైపు జరిపింది. ఆమెను ముద్దాడుతూ, ఎడమ చేత్తో అదుముకుంటూ, బుల్లెట్ల లాగ గుచ్చుకొంటున్న ఆమె ముచ్చికల స్పర్శ, ఆపై ఆమె స్తన స్పర్శను ఆస్వాదిస్తూ,  అప్రయత్నంగా శ్రీరామ్ తన కుడిచేత్తో తొడమీదుగా ఆమె నైటీ బాగాపైకి లాగి, మృదువైన తొడపై మెల్లిగా పామాడు. సుఖంతో వొళ్ళంతా గగుర్పొడించింది. దాంతో ష్ ష్ ష్ అన్న కైపుతో కూడిన శబ్దాలు బయటకు వచ్చాయి. మెల్లిగా చెయ్యి కొంచెం జరిపి అరచేతిని ఆమె దిమ్మపై వేసి కసిగా వత్తాడు. ఉన్ని పట్టులా మెత్తగా తగిలాయి ఆమె నిలువు పెదాలు. జీవితంలో మొదటి సారి నిలువు చీలిక స్పర్శ, కొంచెం వెచ్చగా హాయిగా తగలడంతో మైల్డ్ షాక్ కొట్టినట్టు ఒళ్ళంతా ఒక ప్రకంపన. కావ్య అయితే మరింత గట్టిగా నొక్కుకొని ఎక్కడో విహరిస్తోంది.
అనిర్వచనీయమైన సుఖం వళ్ళంతా పాకుతోంది ఇద్దరికీ. అలా కొంచెం సేపు స్వర్గంలో విహరిస్తుండగా, ఆ పరవశాన్ని భగ్నం చేస్తూ, శ్రీరామ్ విడి పడ్డాడు. ఇంకా భర్తతో కలిసి ముందుకు ఈదాలని ఉన్నా, అతను విడివడడంతో తాను సర్దుకొని రిలాక్స్ అయ్యింది.

ఒక అర నిముషం పాటు భారంగా ఊపిరితీస్తూ నార్మల్ అవటానికి ట్రై చేసాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, "This is a slippery slope. ఒక సారి జారడం మొదలు పెడితే ఎక్కడ ఆగుతామో అన్న దాని మీద మనకు కంట్రోల్ ఉండదు. ఇంతకాలం ఆ సుముహూర్తం కోసం ఎదురు చూసాము. ఇంకెంతా మూడు రోజులు ఎదురు చూద్దామా", అన్నాడు అపోలోజిటిక్ గా స్మైల్ చేస్తూ. 

అగ్ని సాక్షిగా వివాహ మాడిన భర్త, తనపై సర్వాధికారాలు ఉన్న వ్యక్తి, అతనితో కలిసి ఆలపించడానికి సిద్ధంగా ఉన్న భార్య, అంత ఉద్రేకాన్ని రుచి చూసినా ఆపుకున్న అతని నిగ్రహ శక్తికి కావ్య నిజంగా ఆశ్చర్య పోయింది. భర్తపై అవ్యాజనురాగమైన ప్రేమ పుట్టుకొచ్చింది.
కాని తన కొంటె తనం ఆపుకోలేక, "దేనికి ఎదురు చూడడం"అంది తెలియనట్టు.
"అమ్మదొంగా నా చేత చెప్పించాలనే. శోభనం కోసం"అన్నాడు ఏ మాత్రం తొణక్కుండా.
"దానికి ఓకే. కాని దీని కోసం అవసరం లేదు" అంటూ ముద్దు పెట్టుకొంది.

వైవాహిక జీవితం, పిల్లలు ఎప్పుడు, హనీమూన్ లాంటి విషయాలు మాట్లాడు కొంటూ ఇంకో రెండు గంటలు గడిపేశారు. మాటల్లో శోభనం టాపిక్ వచ్చింది. వాళ్ల ఇల్లు పెద్దది కావటంతో హోటల్ కంటే ఇంట్లో అయితే బాగుంటుందని శ్రీరామ్ తన అభిప్రాయం చెప్పాడు. మధ్య మధ్యలో ముద్దులు పెట్టుకుంటూ, ఆమె గుబ్బలను పైనుంచే వత్తుతూ, కింద పీఠ భూమిని అరచేత్తో పాముతూ అతను ఉద్రేక పడుతుంటే, షార్ట్ పైనుంచే రూళ్ళకర్రలా వున్న అతని దండాన్ని పాముతూ కావ్య, దాన్ని తనలో దింపుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో కారి పోయింది. 

ఎవరైనా లేస్తే బాగుండదని శ్రీరామ్ వదలలేక వదలలేక వెళ్లి పడుకొన్నాడు. కొంచెం శారీరకంగా, బాగా మానసికంగా దగ్గరయిన ఆ అనుభవంతో కావ్యలో మిగిలివున్న ఆ కాస్త అనుమానం తొలిగి పోయి హాయిగా నిద్ర పోయింది. పడుకోబోతు అమ్మకు శ్రీరామ్ అభిప్రాయం మెసేజ్ చేసి పడుకొంది. ఫోన్ లో అలారం పెట్టుకొని ఏడు గంటలకు లేచి మొహం కడుక్కొని కిచెన్ లోకి వెళ్లి అత్తకు గుడ్ మార్నింగ్ చెప్పింది. 
"కొంచెం సేపు పడుకో పోయావా కావ్య. ఇప్పుడేమి తొందర. కాఫీ తాగుతావా"అంటూ లలిత హడావుడి చేసింది. పెద్దింటి కోడలు తమతో అలా కలిసిపోవడం చాలా నచ్చింది ఆవిడకు. "సాయంత్రం సినిమాకు వెళ్ళండి. రేపు అన్నవరం వెళదాము"అంటూ ప్రేమగా మాట్లాడింది.

ఆ రెండు రోజులు సరదాగా గడిచింది. కాకినాడ మరీ పెద్ద సిటీ కాదు. సాయంత్రం మసీద్ సెంటర్ దగ్గర మెయిన్ రోడ్ తీసుకు వెళ్ళాడు. అత్త మామలను రమ్మన్నా రాలేదు. బలవంతం మీద కావ్యతో తోడుగా వచ్చిన వారిని తీసుకు వెళ్లారు. కోటయ్య కాజాల షాప్ లో కాజాలు తిన్నారు. శ్రీరామ్ చేతిలో చెయ్యి వేసి అలా రోడ్ కి ఇరువైపులా ఉన్న షాప్స్ చూస్తూ నడుస్తూ ఉంటె చాలా థ్రిల్లింగ్ గా వుంది కావ్యకు. అతన్ని ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బాగుండదని బలవంతంగా ఆపుకొంది. మరుసటి రోజు టాక్సీలో అన్నవరం వెళ్లి వ్రతం చేసుకొని వచ్చారు. సాయంకాలం సినిమా స్ట్రీట్ తిప్పి తీసుకు వచ్చాడు. ఆ రెండు రోజులు ప్రైవసీ దొరికి నప్పుడల్లా ముద్దులు, పిసుకుళ్ళతో వేడెక్కి పోయేవారు. చివరి రోజు రాత్రి రాత్రి కావ్య పాంటీ, బ్రా తీసెయ్యడంతో ఆమె పరువాలు మరింత మెత్తగా, స్పష్టంగా తెలిసేవి శ్రీరామ్ కి. ఆ కైపులో పుట్టలో చేయిపెట్టి పామును పట్టినట్టు, కావ్య తన షార్ట్ లో చేయిపెట్టి నాగుపాముని పట్టుకున్నట్టు ఒడుపుగా తన దాన్ని పట్టుకొని ఆడిస్తుంటే అడ్డు చెప్పలేదు. కాని ఆమె చేతిలో పాలు పోయడం ఇష్టంలేక,"జస్ట్ వన్ మోర్ డే"అంటూ మెల్లిగా చేతిని తప్పించాడు.

మరుసటి రోజు పొద్దునే సామర్లకోటకు కార్ లో వెళ్లి జన్మభూమి రైలులో విజయవాడ చేరుకొన్నారు. వాళ్ళను సాదరంగా రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో అడుగు పెట్టగానే సాయంత్రం ఫంక్షన్ తాలూకు హడావుడి కనిపించింది. భోజనాలు తరువాత హోటల్ లో బస ఏర్పాటు చేయడంతో అందరూ అక్కడ రిలాక్స్ అయ్యారు. సాయంత్రం ఐదు గంటల కల్లా రాజారావు ఇంటికి చేరుకొన్నారు. బాగా దగ్గరి బంధువులను లోకల్ గా ఉన్నవాళ్ళను కొంత మందిని పిలిచారు. కావ్య బెడ్ రూమ్ ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.  పూజారితో ఇద్దరి చేత పూజ  చేయించిన తరువాత అందరికి భోజనాలు పెట్టారు. దాదాపు తొమ్మిది గంటలకు ముందు శ్రీరామ్ ని గదిలోకి పంపించి కొంచెం సేపటి తరువాత కావ్య ను లోపలికి పంపారు. శ్రీరామ్ తల్లి తండ్రులు, చెల్లెలు ఆమె భర్త , మరుసటి రోజు ఉదయం హోటల్ నుంచి తిన్నగా రైల్వే స్టేషన్ కి వెళ్లి కాకినాడ వెళ్లిపోయేట్టు నిర్ణయించుకొని, రాజారావు దంపతుల దగ్గర సెలవు తీసుకోని హోటల్ కి వెళ్లి పోయారు. ఆ తరువాత ఒక్క జానకి చెల్లెలు తప్ప మెల్లిగా బంధువులు వెళ్లిపోయారు. ఇల్లంతా పని మనుషులతో సర్దించి, వాళ్ళ బెడ్ రూమ్స్ లోకి జారుకున్నారు జానకి, ఆమె చెల్లెలు. అప్పటికే వాళ్ళని కార్యం గదిలోకి పంపి గంట పైనే అయ్యింది. పైన అక్క బెడ్ రూమ్ లో ఏమి జరగబోతోందో అని ఊహించుకుంటూ సౌమ్య తన గదిలో మంచం పై వాలింది. కొన్ని రోజులుగా బంధువులతో కబుర్లతో నిద్దుర కరువైయిందేమో అంతలోనే నిద్రలోకి జారుకొంది. ఒక రెండు వారాలుగా పెళ్లి సందడి, బంధువులతో కళ కళ లాడిన ఆ ఇల్లు బాగా సద్దుమణిగింది. కావ్య గదిలో ఆ నాలుగు గోడల మధ్య ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జోరుగా మోత మొదలయ్యింది.
Like Reply
#29

(27-06-2020, 07:15 AM)Okyes? Wrote:  ఉష్...... ఉంమ్.....

 ఆ గదిలో ఏం జరుగుతుందో ఏమో.....
ఆగలేకపోతున్నాను ప్రస్థాణం గారు......
ఇంత నిర్దయగా అపెయ్యడం నచ్చలేదు ....
ఇద్దరి మద్య చిన్న చిన్న జలక్ లు అద్బుతంగా రాసారు సర్......
తరువాయి అప్డేటు కొరకు waiting.....

గిరీశం గారు, చిన్న చిన్న ఝలక్ లు నచ్చినందుకు థాంక్స్. ఏమి జరుగుతుందో అన్న మీ ఆత్రుతకు నీళ్లు చల్లినందుకు ఈ సారికి క్షమించెయ్యండి సార్. మీరు ఇంతకూ ముందు కూడా శోభనం మీద ఒక కామెంట్ పెట్టారు. మీకోసం రాద్దామని ట్రై చేసాను. నాకు నచ్చినంతగా రావట్లేదు. మొదటి రాత్రిపై ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా యాంటిసిపేషన్ తెలియ చేశారు. అందరికి ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 07:53 AM)Vikatakavi02 Wrote:  గిరీశంగారు చెప్పాక తెలిసింది. మీరు ఒక కథని వ్రాస్తున్నారని. ఇన్నిరోజులూ చూడనందుకు క్షమించండి సర్.
మీ ఈ కథని చదివాక మరలా రిప్లయి ఇస్తాను.
కథ పేరు గమ్మత్తుగా ఉంది. 'పేరులో ఏముంది'

వికటికవి గారు, నో ప్రాబ్లెమ్ సార్. చదివిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి. పేరు గురించి చివరలో చెబుతాను.

(27-06-2020, 08:19 AM)twinciteeguy Wrote:  simply excellent

twinciteeguy గారు,  రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్.

(27-06-2020, 09:32 AM)appalapradeep Wrote:  Update pl

appalapradeep గారు, అప్డేట్ పెట్టినా రోజే అప్డేట్ అడిగారు. నచ్చిందని మరోలా చెప్పారనుకుంటాను. నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 12:38 PM)Jola Wrote:  Super sir

Jola గారు, నచ్చినందుకు థాంక్స్.

(27-06-2020, 01:57 PM)sunil Wrote:  Good narration sir,

sunil గారు, నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 03:36 PM)bobby Wrote:  nice update

bobby గారు, నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 05:50 PM)Chandra228 Wrote:  ఆ గది లో మోత ఎలా ఉండబోతోందో మరి

chandra గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్. ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 06:28 PM)paamu_buss Wrote:  Prachara chitram adhirindi... " a gadhi lo Emiyindi" Anu bomma padalisina samayam kosam waiting... Chudabothe chelli shurungaram pi asakthi modalalindi.

Waiting for eagerly next update...

paamu_buss గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్. ఈ సారికి క్షమించెయ్యండి సార్. ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 09:43 PM)rameshapu7 Wrote:  Chaala Baga rastunnaru, please continue ????

ramesh గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్ 

(28-06-2020, 06:43 PM)readersp Wrote:  Excellent.. simply superb!!!

readersp గారు, నచ్చినందుకు థాంక్స్. 

(29-06-2020, 04:19 PM)Eswar P Wrote:  బాగుంది సర్ సూపర్ .

Eswar గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్న వాళ్లలో మీరు ఒకరు. నచ్చినందుకు థాంక్స్. 

(29-06-2020, 09:05 PM)Morty Wrote:  good story sir, nice update...

Morty garu, నచ్చినందుకు థాంక్స్. 


నేను ఒరిజినల్ గా కధకు అవసరమైనంతగా నాలుగు శృంగార దృశ్యాలు మాత్రమే ప్లాన్ చేశాను. అందులో శోభనం సీన్ లేదు. కధా పరంగా అవసరం లేదని పెట్టలేదు. వారిద్దరి మధ్య శృంగార బాంధవ్య సరిగా ఎస్టాబ్లిష్ చేయాలి. తొలి సమాగం తరువాత ఇద్దరి మధ్య సంశయం బాగా తగ్గుతుంది. అందువల్ల సంభాషణలు మరింత ఫ్రీ గా రాయొచ్చు. అందుకే మొదటి సీన్ మూడో రోజున పెట్టాను. మొదటి రాత్రి మనసుకి హత్తుకునేలా రాయడం అంత తేలిక కాదు. ట్రై చేసాను కానీ బాగా రావట్లేదు. అందుకే రేపు అప్డేట్ ఆలస్యం చేయకుండా అనుకున్నది పోస్ట్ చేస్తాను. అలాగే శోభనం లాంటి ఇంకో సీన్ ఒకటి వుంది. అది తప్పక రాస్తా అని హామీ. అంతే కాకుండా కధ చెడకుండా, అవసరం లేకపోయినా ఇంకో మూడు సీన్స్ రాద్దామనుకొంటున్నాను. కొంచెం నిడివి పెరిగినా అభ్యతరం ఉండదని అనుకొంటున్నాను.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
#30

(30-06-2020, 04:25 PM)Okyes? Wrote:  ప్రస్థాణం గారు......

మేము ఏదో చపలచిత్తతో మిమ్ములను రకరకాల కోరికలు కోరుతుంటాము.....
వాటిని పట్టించుకోకండి ......
 మీరు మీప్లాన్ ప్రకాారమే రాయండి......
ముఖ్యంగా సెక్స్ లోఅన్నిటికంటే ఎక్కువగా కిక్ ఇచ్చేది సెడక్షన్ పార్ట్....... 
ఆతరవాత అన్టిసిపేషన్...... ఇక ఏమి జరగబోతుంది అని తహతహలాడడం 
అది మీరు నిండుగా అందిస్తున్నారు....
థ్యాంక్యూ సర్...


థాంక్స్ సర్ మీ ప్రోత్సహపూరిత మాటలకు

(30-06-2020, 04:36 PM)appalapradeep Wrote:  సర్  కథ  బాగుంది

నచ్చినందుకు థాంక్స్ సర్

(30-06-2020, 07:59 PM)paamu_buss Wrote:  Prasthanam garu me katha me shaili lo rayandi.... Waiting for update...

కధ మార్చటం లేదు. మూడు ఎపిసోడ్స్ కలిపాను అంతే. మీ సపోర్ట్ కి థాంక్స్.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
#31

ఎపిసోడ్ 12


ఉదయం ఎనిమిది దాటింది. మెలకువ వచ్చి చూస్తే పక్కన శ్రీరామ్ లేడు. వళ్ళంతా ఒక రకమైన తీయటి నొప్పులు. లేవకుండా అలాగే పడుకొని గత రాత్రి జరిగింది నెమరు వేసుకొంది. తొమ్మిదిన్నరకు తనను గదిలోకి పంపారు. పెద్దలు అధికారికంగా కల్పించిన మొదటి అవకాశం, జీవితాంతం గుర్తు ఉండేలా ఉన్న గది అలంకరణ. సుఖ సంతోషాలతో ఊగి తేలాలంటూ చేసిన ఏర్పాట్లు. వివిధ రకాలైన పచ్చి పూలతో కళ్ళు చెదిరే అందమైన అలంకరణ, సువాసనలు గుబాళించే అత్తరులు, తినడానికి స్వీట్స్, హాట్స్, మొత్తం ఆ వాతావరణమే ఒక రకమైన మత్తు ఎక్కించింది ఇద్దరికీ.  కాకినాడలో వాళ్ళ మధ్య జరిగిన సరస సల్లాపాలు, సినిమా కి ముందు ట్రైలర్ చూసినట్టు, తాము చవి చూడబోయే ఆనందానికి అంచనాలు బాగా రేపి చాలా తొందర పెట్టినా, మృదు మధుర సంభాషణలతో కొంచెంసేపు గడిపారు. తన చదువుతో బాటు సైకాలజీ పుస్తకాలు బాగా చదివిన కావ్య బుర్రకి ఎక్కువ సేపు పట్ట లేదు, తన భర్త మీద ఒక అంచనా రావటానికి. శృంగారంలో అతనికి చొరవ తక్కువ. అలా అని కోరిక ఉదృతం లేదని కాదు. కానీ శృంగారం కేవలం పశువుల్లా శారీరకం మాత్రమే కాదు, శారీరక సుఖంతో పాటు మానసిక ఉల్లాసం పొందే సృష్టి క్రియ అని నమ్మే రకం. మరీ మొదటి రాత్రి తను బాగా చొరవ తీసుకుంటే బాగుండదని ఓపిగ్గా అతని ముందడుగు కోసం వేచి చూసింది. ఎందుకో అతను లైట్స్ ఆర్పేసి బెడ్ లైట్ మాత్రమే ఉంచాడు. త్రీ వాట్స్ బెడ్ లైట్ కాంతి మరీ అంత తక్కువ వెలుగు కాకపోవడంతో తొందరగానే కళ్ళు సర్దు కోవటంతో, ఆ నీలి వెలుగులో మరింత రొమాంటిక్ గా అనిపించింది. మొదటి సారి అతని నగ్నం దేహం చూసి చాలా ఆకర్షిస్తూ రాలయింది. స్పోర్ట్స్ పర్సన్ అని తెలిసినా, తను ఊహించలేదు అతనిది మంచి వ్యాయాయం చేసిన ధృడ శరీరం అని. అతని అంగం చూసి అచ్చెరువొందిది, తను చూసిన బ్లూ ఫిలిమ్స్ లోని మగాళ్ల కేమి తీసి పోదని. అంగ ప్రవేశం కొంచెం ఇబ్బంది అయినా ఏ మాత్రం తొందర పడకుండా తనకు ఎక్కువ నొప్పి కలుగ కుండా అతను రిబ్బన్ కటింగ్ చేసిన తీరుతో పూర్తిగా ఫిదా అయ్యింది. భర్త కూడా సెక్స్ ఎడ్యుకేషన్ బుక్స్ చదివినట్లున్నాడు. మొదటి ప్రయత్నం లోనే తనని బాగా ఇంప్రెస్స్ చేసాడు.  తనని ఒక గాజు బొమ్మలా జాగ్రత్తగా ఆడుకున్న తీరుతో మానసికంగా గెలుచు కొన్నాడు. అంతేకాదు తనలో ఎక్కడో నిద్రాణమై ఉన్న అహంభావాన్ని తొలగించాడు. చుట్టాలు, స్నేహితులు అతిగా పొగడడం వలన అంత వరకు తనకు, ఆస్తి, అంతస్తు, అందం, అవయవ సౌందర్యం అన్ని ఎక్కువేనని తను పైకి అణకువగానే ఉన్నా, తనని చేసుకున్న వాడు అదృష్ట వంతుడని ఎక్కడో ఫీలింగ్ ఉండేది. అలాంటిది ఒక ఆస్తి తప్ప మిగిలిన మిగతా అన్నింటిలో, చదువు, సంస్కారం తో సహా అన్నింటిలో భర్త  తన కంటే ఒక మెట్టు ఎక్కువని గ్రహించింది. అయినా అతనిలో ఏమాత్రం గర్వం లేదు. మనస్సులోనే దేవుడుకి ఆనందంతో ఒక నమస్కారం పెట్టింది. తొలి సమాగమం తర్వాత కొంచెం తెరపి ఇచ్చి రెండో సారి చేసుకున్నారు. ఈ సారి సిగ్గు కొంచెం తగ్గి, ప్రధమ విఘ్నం తొలగటంతో మరింత ఎక్కువ సేపు మదించి ఇద్దరు బాగా సుఖపడి, కబుర్లాడుతూ నిద్రలోకి జారారు. తెల్లారు జామున అర నిద్రలో తన ప్రతాపం మరో సారి చూపించి కావ్య మనస్సు పూర్తిగా దోచుకున్నాడు. ఒక ప్రచండ యుద్ధంలో సమ ఉజ్జితో పోరాడి రాజి పడిన యోధుడిలా తన పరువాలన్ని సమర్పించి తనూ ఒక విజేతగా గర్వ పడింది. ఇద్దరూ దాంపత్య సుఖంలోని మాధుర్యాన్ని వెలికి తీసి దాన్ని సమంగా  కలిపి పంచుకోవటం, అది కేవలం ఆరంభం అని, పరిశోధించి వెలికి తీయాల్సిన సుఖ నిధి చాలా వుంది అని తలంపుకు వచ్చి వళ్ళు పులకరించింది. మొదటి రాత్రి ఎలా జరుగుతుందో అన్న తన మనసులోని అనుమానాలన్నీ పటా పంచలు చేస్తూ, చిరకాలం గుర్తుండి పోయేలా ఇచ్చిన ఆ అనుభవానికి భర్తకి కూడా మనస్సులోనే థాంక్స్ చెప్పుకుంది. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలే కాదు, స్త్రీ సాంగత్యం కూడా లేదని మనసులో ఉన్నా, అది రుజువు కావడంతో తన భర్త పేరుకి తగినవాడే అని మురిసిపోయింది.

తనపై అస్తవ్యస్తంగా ఉన్న దుప్పటి తొలగించటంతో నగ్నంగా ఉన్న శరీరం బయట పడింది. పడకపై చల్లిన గులాబీ రేకులు అక్కడక్కడా వంటిపై అంటుకొని రాత్రి తాము చేసిన సాగర మధనాన్ని గుర్తుకు తెచ్చాయి. పువ్వుల పరిమళంతో పాటు తమ అంగాలనుంచి స్రవించిన రసాల మదపు వాసన మిళితమై, ఒక ప్రత్యేక మైన వాసనసోకింది ముక్కు పుటాలకు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేద్దామా అనుకోని మానుకొంది. ఆ గదిలో ఏమి జరుగుద్దో అని అందరికి తెలిసినా, జరిగిందన్న విషయం తెలియాలన్న తలంపుతో. మెల్లిగా బ్రా, పాంటీ ఆపై నైటీ వేసుకొని ముందుకు వెళ్ళింది మొగుడి కోసం చూస్తూ. అక్కడ సిట్ అవుట్ ఏరియాలో సోఫా లో కూర్చొని బుక్ చదువు తున్నాడు అప్పటికే తయారైన శ్రీరామ్.

"అప్పుడే లేచి పోయావా. గుడ్ మార్నింగ్", అని విష్ చేసి దగ్గరగా వెళ్ళింది. పుస్తకం పక్కన పెట్టి రెండు చేతులు విశాలంగా చాచాడు తనని ఆహ్వానిస్తూ.
దగ్గరగా వెళ్లి అతనిపై ఒంగొని ఒరుగుతూ, హాగ్ చేసుకుంది. ముఖం పక్కకి పెట్టి తన రొమ్ములను అతని ఛాతికి వత్తుతూ "ఇంకా బ్రష్ చేసు కోలేదు", అని మెడపై ముద్దు పెట్టింది.

"పరవాలేదు" అంటూ మరింత ఘాడంగా అదుము కొన్నాడు. అలాగే నైటీ మీద నుంచి ఆమె పిరుదుల్ని మృదువుగా నిమిరాడు.
"నీకు ఆకలేస్తోందేమో. తొందరగా మొహం కడుక్కొని వస్తా. సారీ, సారీ", అంది తను ఆలస్యంగా లేచినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ.
మెల్లిగా పట్టు విడుస్తూ, "రాత్రి మన కోసం చాలా స్వీట్స్ పెట్టారు. రెండు లడ్డులు తిన్నాలే. నో హర్రీ. టేక్ యువర్ ఓన్ టైం."

తొందరగా బ్రష్ చేసుకొని, జుట్టు పైపైన సరి చేసుకొని, అతనికి ఘాటైన ముద్దిచ్చి, "పది నిముషాలు వెయిట్ చెయ్యి. టిఫిన్ టేబుల్ పై రెడీ చేసి పిలుస్తా" అంటూ కిందకి వెళ్ళింది.

కిందకు దిగి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళింది. అక్కడ అమ్మ, పిన్ని మాత్రమే ఉన్నారు. కిచెన్ లోకి వచ్చిన కావ్య ముఖంలోని వెలుగు చూసి వారిద్దరికీ అర్ధం అయిపొయింది.
అయినా తన నోటి ద్వారా తెలుసుకోవాలని అడిగింది పిన్ని, "రాత్రి అంతా సవ్యంగా జరిగిందే"అని. తల్లి కూడా కూతురు ఏమి చెబుతుందా అని ఎదురు చూసింది.

"సవ్యంగా అంటే ఏమిటో?", అంది ఏమి తెలియనట్టు అమాయకంగా.
"నీకు ఒక్కటి ఇవ్వాలె పెద్ద ఏమి తెలియనట్టు. అయినా ఈ కాలం పిల్లలని మేము అడగాలా ఏంటి", అంది పిన్ని నవ్వుతూ.

అంటూనే దగ్గరగా వచ్చి లో గొంతుకతో "అంతా హ్యాపీ కదా, ఎన్ని సార్లు ఏమిటి."అంది అంతటితో వదిలేయకుండా. 
చెపితే కానీ వదిలేలా లేదని మూడు వేళ్ళు చూపిస్తూ "అబ్బా అందులో ఇంత సుఖముందని అనుకోలేదు, పిన్ని"అంది ఏ మాత్రం సిగ్గు పడకుండా.

మెల్లిగా తల్లి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి వెనకనుంచి నడుముపై రెండు చేతులతో  వాటేసుకొని, తల్లి మెడపై తల వాల్చి "అమ్మా కొంచెం మత్తుగా, ఒళ్ళు నొప్పులుగా ఉందే. ఇంకా నిద్ర పోవాలనిపిస్తుంది" అంది గోముగా.

ఆ ఒక్క మాటతో చెప్పి చెప్పకనే పూర్తిగా అర్ధం అయ్యింది పెద్దలిద్దరికి. కన్నెరికం నుంచి విముక్తి పొందిన తన కూతురు జీవన శ్రవంతిలో ఒక మెట్టు పైకెక్కింది. ఇక మాతృ మూర్తి అయితే ఒక పరిపూర్ణ స్త్రీ గా తనతో సమానం. అంతా సవ్యంగా జరిగిందని మనస్సులోని ఆనందాన్ని కొంచెం కప్పి పుచ్చుకుంటూ "బాగా మంటగా ఉంటె అక్కడ కొంచెం వెన్న రాసుకో. తగ్గుతుంది. అల్లుడు గారిని కూడా లేపు. మీరిద్దరూ టిఫిన్ తిని వేడి నీళ్లతో స్నానం చేసి, కొంచెం సేపు పడుకుంటే, అలుపు తగ్గుతుంది."

"తను ఏడూ గంటలకే లేచారమ్మా. పుస్తకం చదువు తున్నారు. టిఫిన్ రెడీ చేస్తే పిలుస్తాను."
"అదేమిటే అల్లుడు గారు లేచిన తరువాత ఇంతాలస్యం చేసావు. కావ్య నువ్వు మంచి పిల్లవి. భర్త మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. భర్త ఆలనా పాలన చూసే భాద్యత నీదే. అసలే అతనికి మన ఇంట్లో ఇంకా కొత్తతనం పోలేదు కదా. నువ్వే అతనికి సమయానికి అన్ని సమకూర్చాలి. అలా చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుంది కాపురం. వెంటనే కిందకు పిలుచుకురా. అన్ని సిద్ధంగా ఉన్నాయి"అంది హడావుడి పెడుతూ.

శ్రీరామ్, కావ్య టిఫిన్ స్టార్ట్ చేసే సమయానికి సౌమ్య కూడా జాయినయ్యింది. అస్సలే అల్లుడు మర్యాదలకి తట్టు కోలేక పోతున్న శ్రీరామ్ కి, మరదలి అల్లరి తోడయ్యింది. "వద్దండి. నాకు కావాల్సినంత పెట్టుకుంటాను" అని మర్యాదగా వారిస్తున్నా, తన ప్లేటులోని గారిని బావా ప్లేట్ లో వేస్తూ"బావా! నా చిట్టి గారి తిను బాగుంటుంది" అంటూ రెచ్చిపోయింది. తను ఇతరుల వినకూడదని మెల్లిగా అన్నా, ఆ మాటలు కావ్య చెవిన పడ్డాయి.

చెల్లెలి డబల్ మీనింగ్ మాటల్ని గ్రహించినా భర్త ఎదురుగా వారిస్తే బాగుండదని ఊరుకుంది. తన చెల్లెలికి కూడా బావ మీద ఒక విధమైన ఆకర్షణ ఏర్పడిందని  మాటల్లోనే గ్రహించిన అది సహజమే అని ఊరుకుంది. చెల్లెలు ఎంత అలుసు తీసుకున్న భర్త ఏమి స్వేచ్ఛ తీసుకోకుండా ఉండటం చూసి మనసులోనే ఆనందించింది.

******************

కేవలం శోభనం రోజే కాకుండా కార్యం మూడు రోజులు పూలతో వాళ్ళ బెడ్ రూమ్ అలంకరిచ్చేటట్టు ఏర్పాటు చేశారు. అందమైన తాజా పూలతో రోజుకొక విధంగా అలంకరించారు. ఉడుకు రక్తం, ఆపై మత్తెక్కించే పూల వాసన. రాత్రంతా వాళ్లిద్దరూ రచ్చ రచ్చ చేస్తే పొద్దున్న టిఫిన్ల తర్వాత పిల్లలు కింద హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో జానకి పనిమనిషితో శుభ్రం చేయించేది.

ముందుగా తను గదిలోకి వెళ్లి కావ్య విడిచిన నగలు, ఫోన్లు ఏమన్నా ఉంటె తను జాగ్రత్త చేసి, తరువాత పని అమ్మాయితో గది పూర్తిగా క్లీన్ చేయించి, దుప్పట్లు మార్చి మధ్యాన సమయం కల్లా వాళ్ళ కోసం మైదానాన్ని సిద్ధం  చేయించేది. పని మనిషి సీతకు ముప్పై సంవత్సరాల పైనే. ఒక పాప. నల్లగా ఉన్నా కళగా ఉంటుంది. సీత నాన్న, జానకి వాళ్ళ నాన్నగారి ఊళ్ళో పొలాలలో పని చేసే ఒక రైతు కూలి.  పదహారేళ్ళ వయసులో జానకి ఇంట్లో పనికి పెట్టారు. అది పెద్దయిన తర్వాత పెళ్ళికి ధన సహాయం చేశారు. దాని భర్తను డ్రైవర్ గా పెట్టుకొని సర్వెంట్ క్వార్టర్ లో ఉండేట్టు ఏర్పాటు చేశారు. చాలా కాలం నుంచి పనిచేయడంతో కొద్దిగా చనువు. ముఖ్యంగా సీతకు కావ్య అంటే అభిమానం. తనకు, పాపకి అప్పుడప్పుడు బట్టలు, పుట్టిన రోజున డబ్బులు ఇవ్వటమే కాకుండా చక్కగా మాట్లాడేది తనతో. 

జానకి పెళ్లి పనులతో బిజీగ ఉండటంతో పని తప్ప వేరే మాట్లాడే అవకాశం దొరకలేదు.
"మంచి మొగుడు దొరికారమ్మ కావ్యమ్మకి. బాబు గారు సినిమా హీరోలా కావ్యమ్మ కు సరి అయిన జోడి. రోజు దిష్టి తియ్యండమ్మా"అంది పూలు దులుపుతూ.

పెళ్లి అయిన దగ్గరనుంచి చాలా మంది దగ్గర ఆ కామెంట్ వింది  జానకి. సీత మాటకు నవ్వి, "అయితే నీకు నచ్చాడన్న మాట"

పూలు దులపటంతో రాత్రి కూతురు, అల్లుడు చేసిన మల్ల యుద్దానికి సాక్ష్యంగా దుప్పటి మీద కారి కొంచెం అట్ట కట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అవి ఏమిటో అర్ధం అయినా, అమ్మగారు ఎదురుగానే ఉన్నా, కావాలని కొంచెం దగ్గరగా చూచి, ఈ దుప్పటిని మెషిన్ లో వద్దమ్మా. నేను సబ్బు పెట్టి చేత్తో ఉతికేస్తాను అంది.

"అలాగేలేవే", అంది జానకి నవ్వుతూ.
"బాబు గారు గొప్ప హుషారయినా మడిసిలా ఉన్నారమ్మా!"
"ఏంటే అలాగన్నావు"అని అడిగింది, ఏమి చెబుతుందా అన్న ఉత్సుకతతో.
"ముందు కుర్చీలో,  డ్రెస్సింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో అన్ని చోట్ల నలిగి పోయిన పువ్వులు. కావ్యమ్మ అసలే లేతగా ఉంటది. ఎలా తట్టుకుంటున్నారో ఏమో."
దాని పరిశీలనా శక్తికి ఆశర్యపోతూ, "నీకు బాగా పని పెట్టారన్న మాట. కాపురానికి వెళ్లే ముందు మంచి కట్నం అడుగు."
"నేను అడగటం ఎందుకమ్మా. అమ్మగారే ఇస్తారు. నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండాలనే ఆ దుర్గమ్మని కోరుకుంటా", అంది.
సర్లే మొత్తం శుభ్రం చేసి తడి పెట్టి, ఆ కిటికీలు తెరచి, దుప్పట్లు మార్చి కిందకు రా. నేను కిందకి వెళతాను అని వెళ్లిపోయింది. 

******************

ఆ ఏర్పాట్లు, అంత హంగామా ఊహించని శ్రీరామ్ చాలా ఆనందించాడు. కాని తర్వాత రోజు మధ్యాహ్నం పూట అందరూ ఉండగా గదిలోకి వెళ్ళటానికి చాలా మొహమాట పడ్డాడు. అతను ముందు వెళతాడు అని ఎదురు చూసి ఎంతకీ కదలక పోవడంతో నిద్ర వస్తుందంటూ కావ్య పైకి  వెళ్ళింది. మనసులో కోరిక ఆరాటం పెట్టినా, వెంటనే వెళితే బాగుండదని కదల లేదు.

"బావా! నీ కోసం అక్క ఎదురు చూస్తుంటుందేమో"అంది సౌమ్య అల్లరిగా.
పైన పెద్దది ఎదురు చూస్తుందని తెలుసు. అల్లుడి మొహమాటం అర్ధం అయ్యింది. ఇంకా ఊరుకుంటే చిన్నది ఇంకా రెచ్చి పోతుందేమో అని "నువ్వెళ్ళి నీ గదిలో చదువుకోవే", అని మృదువుగా కసిరింది.
"నాకు డౌట్స్ ఉన్నాయి. బావతో క్లియర్ చేసుకుంటా. పుస్తకాలు తెచ్చుకోనా బావా", అంది ఉడికిస్తూ.
చదువు అనగానే సిన్సియర్ గా జవాబిచ్చాడు,"ఓకే. తెచ్చుకో చెబుతా".
జానకి అంతలోనే కలగచేసుకొని, "ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది."
తల్లి కంఠంలో విసుగు గమనించి, ఇక శృతిమించకూడదని,"రేపు తప్పకుండా చెప్పాలి బావా"అంటూ తన గదిలోకి వెళ్లి పోయింది.
"నువ్వు కూడా కొంచెం సేపు నడుము వాల్చు బాబు. సాయంత్రం బయటకు వెళ్ళచ్చు"అంటూ అల్లుడ్ని పైకి సాగనంపింది. 
[+] 11 users Like prasthanam's post
Like Reply
#32

(01-07-2020, 10:13 AM)twinciteeguy Wrote:  super narration

twinciteeguy గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్

(01-07-2020, 10:46 AM)appalapradeep Wrote:  Nice story

appalapradeep గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్

(01-07-2020, 01:07 PM)Chandra228 Wrote:  మరి అంత వివరంగా కాకుండా పై పైనశృంగారాన్న ఆయిన బాగుంది ముందు ముందు అయిన కొద్దిగా లోతుగా రాస్తే బాగుంటుంది

Chandra228 గారు, రేపటి అప్డేట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

(01-07-2020, 02:25 PM)bobby Wrote:  your story narration simple superb. Waiting for next update

bobby గారు, రేపెనండి తరువాత అప్డేట్.

(01-07-2020, 04:21 PM)Eswar P Wrote:  అద్భుతం అండి మీ కథ  హ్యాట్సాఫ్ సర్

Eswar P గారు, చాలా అప్డేట్ లకు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. నచ్చినందుకు థాంక్స్.

(01-07-2020, 07:43 PM)paamu_buss Wrote:  Soumya kastha ekkuva chanuvu chupistundi.... Chudham taruvata Emi jaraganundo?

paamu_buss గారు, సౌమ్య ను బాగా ఫాలో అవుతున్నారు. మున్ముందు ఏమి జరగ బోతుందో చూద్దాం.

పాఠకులందరికి, ముందు చెప్పినట్టు ఈ వారం తీరిక సమయం కొంచెం బాగానే దొరికింది. లొక్డౌన్ కారణంగా సమయం అంతా ఇంట్లోనే. ఏ నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు, టీవీ సిరీస్ చూసి గడిపేయకుండా మీరిచ్చిన ప్రోత్సాహంతో చాలా సమయం కధకు కేటాయించడానికి ఫిక్స్ అయ్యా. రేపు రెండు ఎపిసోడ్స్, శని ఆది వారాల్లో మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా.
Like Reply
#33

(02-07-2020, 06:48 PM)Thewhitewolf89 Wrote:  ఏ విషయాన్నై నా Subtle గా రాసే మీరు శృంగారాన్ని ఎలా రాస్తారో ఈ episode లో చూద్దాం అనుకున్న ... కానీ మీరు ముందు చెప్పినట్టే wait చేయిస్తున్నారు. But the thing is, I know your content is worth the wait.

Comments like this make my day and make me feel my effort is not going in vain. Thank you. Posting the update in few minutes.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
#34

ఎపిసోడ్ 13


మూడవ రోజు ఉదయం అల్పాహారం తిన్న తరువాత ఎప్పటి లాగే హాల్లో చేరారు ముగ్గురు. వంటిట్లో లంచ్ కి ఏర్పాట్లు చేస్తుంది జానకి. రాజారావు బయటకు వెళ్లాడు. సీత గిన్నెలు కడుగుతుంటే "అవన్నీ కడిగి సర్ది పైకి రావే" అంటూ  పదకొండు గంటల ప్రాంతంలో రోజు లాగే పైకి వెళ్ళింది జానకి, వాళ్ళ బెడ్ రూమ్ శుభ్రం చేయిద్దామని.

తలుపు తీసి రెండడుగులు లోపలి కెళ్ళగానే చిరపరిచితమైన తపక్ తపక్ మన్న చప్పుడు విని టక్కున ఆగిపోయింది. పనిలో పడి, వాళ్లిద్దరూ ఎప్పుడు పైకి వెళ్లారో గమనించ లేదు. అయినా డోర్ లాక్ చేసుకోకుండా ఇదేమీ చోద్యం అని అనుకుంది. సిటౌట్ ఏరియా లోనే ఉండటం వాళ్లు తనని చూడలేదు అని గ్రహించి వెనక్కి తిరిగి వెడదామనుకొంది.

తలుపు తీసి ఎవరో లోపలికి వచ్చినట్టు అనిపించడంతో కావ్య పై గుర్రపు స్వారీ చేస్తున్నట్టు వేగంగా కదం తొక్కుతున్న  శ్రీరామ్ స్విచ్ ఆఫ్ చేసినట్టు టక్కున ఆగిపోయాడు. ఆకస్మికంగా ఆపేసరికి ఉయ్యాలలో ఊగుతుంటే జారీ కింద పడినట్టయ్యింది కావ్యకు. ఒక్క సారిగా గది అంతా నిశ్శబ్దం. 

"ఏంటి శ్రీ,? ఆపేసావు. నాకు దగ్గర పడుతుంటే", అంది మత్తుగా.

శిఖరాగ్రం చేరుతున్న సమయంలో విరామం వస్తే కలిగే ఇబ్బంది తెలిసిన తను, కూతురి పరిస్థితికి తనే కారణం అని నొచ్చుకుంది. ఆ సమయంలో తన వల్ల ఏ మాత్రం చప్పుడు అయినా వాళ్ళ కార్యానికి భంగం కలుగుతుందని, అక్కడ నుండి వెంటనే తిరిగి వెళదామనుకున్న ఆలోచన మానుకుని అలా రాయిలా నుంచొని పోయింది.

వాళ్ల మంచం ఎదురుగా కనిపించక పోయిన, మంచానికి అటువైపు గోడపై అమర్చిన అద్దంలో కూతురు, తనపై మిషనరీ స్థానంలో పూర్తిగా ఆక్రమించుకున్న అల్లుడు, పెనవేసుకున్నవాళ్ళిద్దరి శరీరాలు ఛాతి దగ్గర నుంచి పాదాల వరకు కనిపించాయి. ఇద్దరి వంటిపై ఒక్క నూలుగు పోగు కూడా లేదు. వయసు, వ్యాయయంతో ఇద్దరివీ కండలు తిరిగిన శరీరాలు ఒకరి నొకరు పెనవేసుకొని కళ్ళకు ఇంపుగా, చాలా మనోహరంగా కనిపించిందా దృశ్యం.

"ఇప్పుడు ఎవ్వరు రారు. ఒక వేళ సీత వచ్చిన అది వెళ్లి పోతుంది. నువ్వు దర్జాగా లాగించు", అంటూ మొత్తను అసహనంగా కదిపి, ఎత్తి కుదేసింది. అలా చేయడంతో అతనిది లోపల మరింత నిండుగా అమరింది.

తన పెళ్లి అయిన కొత్త రోజులు గుర్తుకు వచ్చాయి జానకికి. పెళ్లయిన చాలా కాలం వరకు శృంగారంలో తను ముందడుగు వేసింది లేదు. అలాంటిది శోభనం అయిన మూడు రోజులకె తన కూతురు పెద్ద ఆరిందలా  ప్రవర్తించడం చూసి ఆశ్చర్య పోయింది. మొగుణ్ణి దబాయించి మరీ వత్తించుకోవడం చూసి, తన కళ్ళ ముందు పెరిగిన పిల్లేనా అని అనిపించినా, అయినా ఆ సమయం అలాంటిది అని సమాధాన పడింది.

భార్య ఇచ్చిన కుదుపుతో ఒక రకమైన పులకింత కలిగింది. వంట్లోని రక్త మంతా తన అంగంలోకి ప్రవహించి ఉక్కు ముక్కలా గట్టిపడి, సీసాకు బిరడా దించినట్టు నిండా బిగుసుకొంది. 
దాంతో వంట్లో పుట్టిన ప్రకంపనలకు స్స్ స్స్ స్స్ అంటూ తీపిగా గొణుకుతూ, "ఊపటం మొదలు పెట్టు", అంది ముద్దు పెట్టి ముద్దుగా.

భార్యకు చింత లేనప్పుడుతనకి ఎందుకు అన్న భావంతో హుషారుగా కదిలాడు. ఆరు సెకండ్లలో సున్నా నుంచి వంద కిలోమీటర్లు దూసుకు వెళ్లే స్పోర్ట్స్ కార్ లా వేగంగా దూసుకు పోసాగాడు. అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ గది, ఇద్దరి మొత్తలు ఢీకొన్నప్పుడు వచ్చే చప్పుడుతో మారు మోగసాగింది.

ఆ హోరులో తను మెల్లగా బయటికి వెళ్లగలిగినప్పటికీ, వారిద్దరి శరీరాలు కలియ నాగుల్లా పోరాడుతున్న దృశ్యం మనోహరంగా కనిపించి అడుగు వెనక పడలేదు. అల్లుడి మోత అద్భుతంగా ఉండటంతో ఊపిరి పీల్చడం మరచిపోయి కళ్లార్ప కుండా చూస్తూ ఉండి పోయింది. ఎప్పుడో పెళ్లి అయిన తరువాత తన చెల్లెలు, మరిది చీకట్లో కుస్తీ పడితే చూడటం అంతే. భర్తతో డీవీడీలో నీలి చిత్రాలు చూసినా, ఆ తరువాత ఇతరులు చేసుకుంటుంటే ప్రత్యక్షంగా చూడడం ఇదే. అక్కడ అల్లుడి చేతిలో నలుగుతున్నది సొంత కూతురే అయినా, అస్సలు తప్పని పించక పోవడంతో ఆ ప్రత్యక్ష ప్రదర్సన చూడ సాగింది. చూస్తున్న కొద్దీ తనకు కింద చెమ్మగిల్లింది.

"హబ్బా... చాలా.. బాహుంది శ్రీరామ్. బా..గా... చేస్తున్నావు.. అలాగే గట్టిగా..."అంటూ మాటలు మింగేస్తూ, తీగలా సాగుతూ భర్తకు అనుగుణంగా కదల సాగింది. అల్లుడు వేగంగా ఊగుతుంటే, జవాబుగా కూతురు కిందనుంచి ఎదురొత్తుతుంది. 

పరీక్షల్లో ఎలాగైనా మొదటి స్తానం సంపాదించాలన్న దీక్షతో ఉన్న విద్యార్ధిలా ఏకాగ్రతతో మౌనంగా తన పని చేసుకు పోతున్నాడు అల్లుడు. ఎంత వేగంగా బయటకు తీస్తున్నాడో, అంతే వేగంతో గట్టిగా లోపలకు చొచ్చుకు పోతున్నాడు. బలిష్టమైన అతని పిరుదులు పైకి కిందకి డ్రిల్లింగ్ మెషిన్ లా ఆడుతుంటే ఆమెకు కింద పట్టిన చెమ్మ మరింత ఎక్కువ కాసాగింది.

భర్తకు హుషారిస్తూ తనకి తగ్గట్టుగా దరువు వేయించుకుంటున్న కూతుర్ని చూసి ముచ్చట పడింది. బయట అందరి మధ్య భర్తకు గౌరవమిస్తూ, పడకటింట్లో ఆధిపత్యం చూపిస్తున్న తన కూతురు అల్లుడ్ని బాగానే కొంగున కట్టేసుకుంది, అని అనుకుంది.

అల్లుడి వేగం చూసి మనసులోనే కితాబిచ్చింది. ఏ మాత్రం అలుపు లేకుండా కదులుతున్నాడు. నిజం చెప్పించాలన్న కసితో నేరస్తుణ్ణి  సెక్యూరిటీ ఆఫీసర్ థర్డ్ డిగ్రీ పద్దతిలో లాఠీతో నిర్దాక్షణంగా కొడుతున్నట్టు, కావ్య దిమ్మను ఎడ పెడా గుద్దుతున్నాడు తన రాడ్డుతో. అతను కొట్టే ప్రతి దెబ్బ గుండెల్లో తగులుతున్నట్టు అనిపించే  తీపి సుఖం అంతా తన కూతురి స్వంతం అని చాలా ఆనంద పడింది. శోభనం మొదటి రోజు తరువాత ఉదయం సౌమ్య కళ్ళల్లో చూసిన మెరుపుకు కారణం ప్రత్యక్షంగా చూసి తన కూతురి అదృష్టానికి పొంగిపోయింది.

"అలాగే  బా..గా.. గట్టిగా కొట్టు శ్రీ. నన్ను ఇష్టం వచ్చినట్టు కుమ్మేయ్. ష్..ష్..ష్.. అబ్బా... నాకు అయిపోవస్తుంది. నువ్వు అవ్వ.. చేసుకో.."అని డిక్లేర్ చేసింది కావ్య. ఆ మాటతో ఫైటర్ జెట్ లాగా మరింత వేగం పెంచాడు. పనివాడికి దగ్గరుండి చెప్తూ గదికి నలుమూలలా పట్టిన బూజులు దులిపించే యజమానురాలిలా, అల్లుడికి తనకు నచ్చినట్టు చెప్పి చేయించుకుంటున్న కూతురి జాణతనానికి అచ్చెరువొందింది.

వాళ్ళు చివరి కొస్తున్నారు, ఇక అక్కడ ఉంటె డేంజర్ అని అప్పటికే బాగా చెమ్మగిల్లిన తన దిమ్మని చీర కుచ్చిళ్ళ మీద నుంచే అర చేత్తో  రెండు మూడు సార్లు వత్తుకొని, అక్కడ నుంచి మెల్లిగా బయటకు వచ్చి చప్పుడు రాకుండా తలుపు వేసింది. తిరిగి కిందకు రాబోతుంటే ఎదురుగా వస్తున్న సీతను చూసి తర్వాత శుభ్రం చేద్దాంలే అంది వస్తున్న నవ్వు బలవంతాన ఆపుకుంటూ. అసలే అది తెలివైంది, తను చూసినట్టు పసి గడుతుందేమోనన్న సంశయం ఒక్క క్షణంలో ఎగిరి పోయింది.

"కావ్యమ్మ, బాబు గారు కింద కనపడలేదు, మీకు చెబుతామనుకునే లోపు మీరు పైకి వచ్చేసారు అమ్మ గారు" అంది ముసి ముసిగా నవ్వుతూ.
"నేను గమనించ లేదే. అయినా కొత్త దంపతులు పొద్దు ఎరగరని ఊరికే అన్నారా"
"ఈ వయసులో ముచ్చట అదేకదమ్మ. అయినా ఎంత సేపు, భోజనాలప్పుడు గది శుభ్రం చేస్తా అమ్మగారు." అంది సీత వంత పాడుతూ.
[+] 7 users Like prasthanam's post
Like Reply
#35

ఎపిసోడ్ 14


అలా కొంచెం సేపు జోరుగా కుమ్మిన తరువాత కావ్యకు భావ ప్రాప్తి కలుగటంతో బిగించిన గుప్పెళ్ళు వదిలేసింది. భార్య పెదాలు తన దండాన్ని నొక్కి వదులుతుండడంతో ఆమె తీరానికి చేరుకుంది అని గ్రహించాడు. స్త్రీలకూ ఆర్గాస్మ్ ప్రభావం ఎలా ఉంటుందో  తెలియడంతో  కొంచెం స్పీడ్ తగ్గించాడు, ఆ అనుభవం తాలూకు సుఖం అనుభవించడానికి. ఆమె పూ పెదాలు తన రాడ్డుని నొక్కి వదులుతుంటే, ప్రతి వత్తిడికి మరింత బిగుస్తూ వళ్ళంతా తీయని కరెంటు పాకిన అనుభూతి.

నరాలు సడలించడంతో, "థాంక్ యు శ్రీ. ఫర్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్."అంది మురిపెంగా.
తను ఇచ్చిన పొగడ్త భర్తపై సత్వరం పనిచేసింది అనటానికి నిదర్శనంగా లోపల మరింత లావెక్కడు.

అస్త్ర సన్యాసం చేసిన సైనికుడిలా,"ఇట్స్ యువర్ టర్న్" అంటూ గేట్లు విప్పినట్టు పూర్తిగా తొడల్ని తెరిచేసింది.

ఇక తనకు ఎదురు లేకపోవడంతో రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించాలనే లక్ష్యంతో ఉన్న రాజులా ముందుకు దూసుకుపోసాగాడు. త్వరగా తనూ తీరం చేరు కోవాలన్నా పట్టుదలతో బిగబట్టి మరీ కొడుతున్నాడు తన దండంతో. రసాలు కారి కొంచెం వదులు అవడంతో ఫ్రీ గా అయ్యి అడుగంటా గట్టిగా తగులుతోంది అతని దెబ్బ. అతని వాయింపుకు నిదర్శనంగా ఆ గది చప్పుళ్లతో మారు మ్రోగుతుంది. మరో ఐదు నిముషాలు దట్టంగా గూటించే సరికి కావ్యకు కూడా మళ్ళా వేడి రాజుకొని ఎదురూప సాగింది. అంత గట్టిగా తగిలిన, మరింత గట్టిగా కొట్టు అని సవాలు చేస్తున్నట్టు ఎదురు కొడుతోంది. అతను బలంగా కుమ్మతుంటే, ఆ ధాటికి ఆమె పిరుదులు పరుపులో అణిగి, అంతలోనే స్ప్రింగ్ ఆక్షన్ వల్ల నేలకు కొట్టిన బంతిలా పైకి ఎగిరి, ఉయ్యాలలో ఊగుతున్నట్టు వుంది ఇద్దరికీ. భార్య తనకు సవాలుగా ఊపుతుంటే మస్తిష్కంలో ఏదో విపరీతమైన కసి రేగి అంత్య దశకు చేరుకున్నాడు.

అలా రెండు నిముషాలు వేగంగా దరువేస్తూ చివరికి చేరుకున్నాడు. ఆమెలో అడుగంటా నొక్కుతూ, తమకంతో తన దండాన్ని మెల్లగా లోపల్లోపల ఆడిస్తూ, నిండా కూరుతూ చిప్పిల్లి పోయాడు. తనలోని వెచ్చటి లావాని గట్టి ఫోర్స్ తో ఆమె అడుగంట చిమ్మాడు. ఆ చిరుజల్లు స్పర్శ అనుభవిస్తూ అతనితో పాటు రెండో సారి అవుటయిపోయింది కావ్య. ఇద్దరి శరీరాలు తేలిక పడ్డాయి.

అందరి మగాళ్ల వంటి వాడు కాదు తన భర్త. తన ఫ్రెండ్స్ అయితే మూడు రోజులకే వాళ్ళ మొగుళ్ళు అరటిపండు తినిపించడమో లేక తమ కాజా తినెయ్యడము, ఇతర భంగిమలు చవి చూసాము అని చెప్పేవారు. కానీ శ్రీరామ్ అంత ప్రయోగ శాలి కాదు. భార్యకు ఇబ్బంది ఏమో అని దూకుడు ప్రదర్శించడు. మిషనరీ పద్దతిలోనే చేసేవాడు. కానీ చేసిన ప్రతిసారి స్వర్గం చూపించేవాడు. శృంగారంలో భర్త ఎక్కువ మాట్లాడడు. స్వతహాగా మంచి వ్యక్తి కావడంతో మెల్లిగా దారిలోకి తెచ్చుకోవచ్చు. తమ శృంగార జీవితానికి గట్టి పునాది వెయ్యటానికి తానే కొంచెం చొరవ తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది. 

శ్రీరామ్ కి పడక గదిలో కావ్య విచ్చల విడితనం చాలా నచ్చింది. బయట భర్త చాటు భార్యలా వ్యవహరించే తను పడక గదిలో స్వేచ్ఛగా మరియు పచ్చిగా చేసే భావ ప్రకటన ఒకరకమైన గిలిగింతలు పెట్టడమే కాకుండా మూడు రోజుల్లోనే మానసికంగా చాలా  దగ్గరయ్యేలా చేసింది. 

రెండు నిముషాలు సేద దీరిన తరువాత, తన బరువు ఆమెపై అనకుండా కొంచెం పక్కకి ఒరిగాడు.  వెంటనే లేచిపోకుండా భార్యతో ముచ్చటిస్తే బంధం గట్టిపడుతుంది అని తను చదివిన శృంగారం సాహిత్యం ఒక పక్క చెబుతుంటే, ఇంకో పక్క భోజనానికి ఆలస్యం అవుతోందని అనిపించి, మృదువుగా అన్నాడు, "కింద మనకోసం ఎదురు చేస్తున్నారేమో".

భర్త మాటల్లో సంశయం గ్రహించి, "ఫరవాలేదు. మెల్లిగా వెళ్లొచ్చు".
భార్య మనోగతం అర్ధమై, "సరే గాని, ఇందాక నాకు ఎవ్వరో మన గదిలోకి వచ్చిన చప్పుడు వినిపించింది" అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

"అవును నాకు అనిపించింది", అంది నవ్వుతూ.
"తెలిసినా నన్ను ఆపనియ్యలేదు, దొంగ!"

"ఆ సమయంలో అసలు నువ్వు ఎలా ఆగగలిగావు. అయినా కొత్త దంపతులమని తెలిసి కూడా గదిలోకి  వచ్చెయ్యడమేనా? మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నామో అన్న ధ్యాస లేకుండా"

తమ శృంగారాన్ని ఆమె వర్ణించన తీరు అతనికి ఒక చక్కిలింగింత పెట్టినట్టు అయ్యింది.

"మీది చాలా పెద్ద ఇల్లు. మా ఇంట్లో చూసావుగా అస్సలు ప్రైవసీ కష్టమే. రాత్రి పూట తప్పా, పగలు ఏ గది ఎవరి సొంతం కాదు. అక్కడ ఇలా కుదరదు. ఎంత కోరిక ఉన్న రాత్రి వరకు ఓర్చుకోవాలిసిందే", అన్నాడు నొచ్చుకోలుగా.

భర్త మాటల్లో తమ పరిస్తుతుల పట్ల నిజాయితీ, అంతే కాకుండా వాస్తవం చెప్పిన తీరు నచ్చింది.

"నాకు తెలీదా. బి ఎ రోమన్ ఇన్ ఎ రోమన్ సిటీ అన్నారు కదా. అక్కడ జాగ్రత్తగా ఉందాం. కానీ ఈ ఇంట్లో, రేపు మనింట్లో నువ్వే రాజువి. ఎప్పుడు మూడ్ వచ్చిన నీవు అస్సలు మొహమాట పడవలసిన పని లేదు. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కుమ్మెయ్యటమే."

మధ్య తరగతి వాతావరణంలో పెరిగిన తనకి ఎప్పుడు కింగ్ అన్న ఫీలింగ్ కలగ లేదు. అలాంటిది అత్తవారింట్లో, సొంత ఇంట్లో తన స్తానం ఏమిటో భార్య చెప్పడంతో కొంచెం గర్వంగా ఫీల్ అయి ఛాతి రెండు అంగుళాలు పొంగింది. అంతే కాకుండా భార్య సెక్స్ గురించి స్పష్టంగా మాట్లాడడం నచ్చింది.

భార్య నోటి వెంట కుమ్ముడు అన్న మాట ఒక కిక్ ఇచ్చి, తను ప్రతిగా ఎదో చెప్పాలనుకున్నాడు. 
"అలాగే. నీకు ఎప్పుడు మూడ్ వచ్చిన నేను రెడీ"అన్నాడు.
"అయ్యగారు మాటలు నేర్చారే"అంది కవ్వింపుగా
"ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అన్నారు. నువ్వు మూడు రోజుల్లోనే నాలో చాలా మార్పు తెచ్చావు. నా చెల్లి ఇప్పటికి తన భర్తని నువ్వు అని ఏక వచనంతో పిలవటం చూడలేదు"
"నీకు నచ్చక పొతే చెప్పు నేను మానేస్తాను"
"అలాగే పిలువు. నువ్వు అంటేనే నాకు బాగుంది." అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టి లేవబోయాడు.

ఒక్క నిముషం ఉండు అంటూ తన పక్కన రెడీగా పెట్టుకుని చిన్న తుండుగుడ్డతో కొద్దిగా వాలిన అతని మగసిరిని పైకి కిందకి వత్తి తుడవడంతో ఆ స్పర్శకు కొంచెం గట్టిపడింది. ఆ గుడ్డనే కొద్దిగా మడిచి తన దిమ్మపైన, లోపల వత్తుకొని శుభ్ర పరుచుకొని పక్క మీద నుంచి లేచింది. భార్య అలా వత్తుకోవడం సెక్సీగా కనిపించి అతనిది ఇంకాస్త గట్టి పడింది.

"దీనికి వేరే పనిలేదు. ఎప్పుడు రెడీనే." అంటూ గట్టిపడిన అతని రాడ్డుని కిందకు వంచి వదలటంతో అది స్ప్రింగ్ లా కొంచెం పైకి కిందకు ఊగింది. ఆ చిలిపి తనానికి మరింత కరెంటు పాసై, నుంచొని ఉన్న కావ్యను గట్టిగా వాటేసుకొని తన దాన్ని ఆమె నగ్న శరీరానికి నొక్కుతూ,"అయితే ఇంకో రౌండ్ వేసుకుందామా", అన్నాడు.

"ఏదో నేరకపోయి అన్నాను బాబు ఎప్పుడు రెడీ అని, మీ వాడి సంగతి తెలియక. భోజనం తరువాత చేసుకొందాము. అంతగా ఆగలేకపోతే రెడీ అంది." తనని నొక్కుతున్న భర్త అంగాన్ని గుప్పెటతో పట్టుకొని, పైకి కిందకు ఆడిస్తూ. తన కోరిక తీర్చుకోవడానికి కింద ఎదురు చూస్తున్న వాళ్ళకోసం మరింత ఆలస్యం చేయడన్న భర్త సంగతి తెలిసీ అన్నది ఆ మాట, ఏమంటాడోనని.

"ఊరికే అన్నానులే నిన్ను ఏడిపించాలని"అంటూ తనతో పాటు ఆమెను బాత్రూం వైపు నడిపించాడు.
"గుడ్. నా బుజ్జి దానికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, మీతో పోటీ పడటానికి", అతని నడుము చుట్టూ చెయ్యి వేసి నడుస్తూ.

భర్త తనతో అలా రొమాంటిక్ గా మాట్లాడటం నచ్చింది. అంతే కాకుండా అతనిలో వచ్చిన మార్పు చూసి అంతా తన మహిమే అనుకొంది.

******************************************
Like Reply
#36

(03-07-2020, 09:17 AM)bobby Wrote:  super update

bobby గారు, నచ్చినందుకు థాంక్స్

(03-07-2020, 10:47 AM)appalapradeep Wrote:  Super update

appalapradeep గారు, నచ్చినందుకు థాంక్స్

(03-07-2020, 01:06 PM)readersp Wrote:  Super Updates!!!

readersp గారు, నచ్చినందుకు థాంక్స్

(03-07-2020, 02:58 PM)twinciteeguy Wrote:  I hope this will not finally lead to fucking MIL and SIL. Excellent narration of relationship.

twinciteeguy గారు, మీ ఊహలకు త్వరలోనే సమాధానం దొరకచ్చు 

(03-07-2020, 04:02 PM)paamu_buss Wrote:  ippatiki alanti vado kanipinchatle... Problem vachinapudu telustadi Sri ....

paamu_buss గారు, పాత్రల స్వభావం బానే పట్టారు.

(04-07-2020, 01:20 AM)srinivasulu Wrote:  the way you are narrating the story is simply superb....please entertain us like this.
Thank you

srinivasulu గారు,  తప్పకుండా సర్. నచ్చినందుకు థాంక్స్

ఇంకో అప్డేట్ పది నిముషాల్లో పోస్ట్ చేస్తా.
Like Reply
#37

(04-07-2020, 07:37 AM)Chandra228 Wrote:  కావ్య శ్రీరామ్ ల శోభనం సజావుగా అద్భుతంగా సాగుతోంది చాలా చాలా బాగుంది

చంద్ర గారు, థాంక్స్ సర్ నచ్చినందుకు.
Like Reply
#38

ఎపిసోడ్ 15


ఇద్దరు శుభ్ర పడి, బట్టలు మార్చుకుని కిందకు వచ్చేసరికి తమ కోసం అత్త గారు ఎదురు చూస్తూ కనిపించేసరికి కొంచెం మనసులోనే సిగ్గు పడ్డాడు శ్రీరామ్. తమకోసం మిగిలిన అందరూ ఎదురు చూస్తున్నారని తెలిసి "సారీ ఆంటీ. మా గురించి ఎదురు చూడకుండా మీరు తినేయాల్సింది. నా వల్లే ఆలస్యం అయ్యింది."అన్నాడు క్షమాపణంగా ఆలస్యానికి తప్పంతా తన మీద వేసుకుంటూ.

ఆలస్యానికి అస్సలు విషయం ఊహించిన అత్త గారు, "అదేమీ లేదు బాబు. ఎవ్వరికి ఆకలి లేదన్నారు."అంది సమాధానపరుస్తూ.
అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేశారు. 

భోజనం అయ్యాకా ఎవ్వరు చూడకుండా పైకి వెళదామా అని సిగ్నల్ చేసింది కావ్య. వద్దని కళ్ళతోనే సమాధానం చెప్పి హాల్ లోకి తీసుకెళ్లాడు. కొంచెం సేపు కబుర్లు చెప్పి అలవాటు పాటు ప్రకారం మధ్యాహ్నం నిద్రకు పైకి వెళ్ళాడు రాజా రావు. వంట గదిలో జానకి పనివాళ్ళతో సర్దిస్తుంటే హాల్లో చివరకు ముగ్గురే మిగిలారు.

"ఇందాక టీవీ చూస్తూ నా పక్కనే ఉన్నావు కదా బావ. ఎప్పుడు పైకి వెళ్ళావు" బావను ఆట పట్టించడానికి అడిగింది సౌమ్య, 
"కొంచెం తల నెప్పిగా ఉంటె పడుకుందామని పైకి వెళ్ళా"అన్నాడు కొంచెం ఇబ్బందిగా నసుగుతూ.
"నేను గమనించ లేదు. నీవు ఎప్పుడు జారుకొన్నావే", అంది అక్క వైపు చూస్తూ.
"ఎలా వున్నారో చూడ్డానికి పైకి వెళ్ళా. తల నెప్పిగా ఉంటె కొంచెం మందు రాసా"అంది ఏమి తొణక కుండా.
"నువ్వే బావకు రాసావా లేక బావే నీకు రాయాల్సి వచ్చిందా" అంది సౌమ్య కవ్విస్తూ. 
"ఏదో ఒకటిలే. నీకు బాగా ఎక్కువయ్యింది. దెబ్బలు పడాలి", అంది సౌమ్య లేని కోపం నటిస్తూ.
"నాకు దెబ్బలు ఓకే. బావ వేస్తానంటే" ఆ మాటలో డబల్ మీనింగ్ అర్ధం అయ్యి తన భర్త మొహం కొంచెం ఎర్రగా అయి ఇబ్బంది పడటం గమనించింది.
"నీ రూమ్ లోకి వెళ్లి చదువుకోవే. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర కొస్తున్నాయి"అంది టాపిక్ మారుస్తూ. అది వెళితే తాము పైకి వెళ్లొచ్చని.
అది గ్రహించిన సౌమ్య బావని ఇంకాస్త ఆట పట్టించాలని, "నాకు కొన్ని డౌట్స్ వున్నాయి బావ. నువ్వు తెలివయిన వాడివి కదా, కొంచెం క్లారిఫై చేస్తావా"

చెల్లెలి సంగతి తెలిసి. ఇదేదో తన భర్తని ఏడిపించే ప్లాన్ వేస్తుందని గ్రహించి, "తను గ్రాడ్యుయేట్ అయి చాలా కాలం అయింది కదా. ఇప్పుడు అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి. మీ ఫ్రెండ్స్ ని గాని లెక్చరర్ని గాని అడిగి తెలుసుకో" అంది.

చదువు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి "బుక్స్ తీసుకురా చెబుతా"అన్నాడు కలగా చేసుకొంటూ. ఆ మాట వినగానే గదిలోకి పరిగెత్తింది పుస్తకాలు తేవడానికి.
"అబ్బా ఇప్పుడు ఎందుకు?"అంది అసహనంగా లోగొంతుకలో. అతని పైజామా కిస్తా మీద చేతితో మృదువుగా పాముతూ. "బుజ్జిది రెడీ గా వుంది నీకోసం". తన స్పర్శకు గట్టిపడిన అతని అంగాన్ని పైనుంచే వేళ్ళతో దువ్వుతూ, "బుజ్జిగాడు కూడా రెడీ గానే ఉన్నాడు", అంది హస్కీగా .
"పాపం డౌట్స్ అంటుందిగా. చెప్పేసి వెళదాం"అంటూ కావ్య చేతి పై తన చెయ్యి వేసి నొక్కి మెల్లిగా ఆమె చేయిని అక్కడ నుంచి తప్పించాడు.

ఇంతలో పుస్తకాలతో వచ్చిన సౌమ్య పుస్తకంలో ఒక ప్రాబ్లెమ్ సాల్వ్ చేయమని అడిగింది. ప్రైవేట్ కాలేజీ లో ఎం.టెక్ చేసి తమకు సబ్జెక్టు చెప్తున్నలెక్చరర్ ను రెండు వారల క్రితం మూడు చెరువుల నీళ్లు తాగించారు ఆ ప్రాబ్లెమ్ తో సౌమ్య దాని ఫ్రెండ్స్. 

అది చదివి నొసలు దగ్గరగా చేసి దీక్షగా ఆలోచిస్తున్న భర్తని చూసి ఏమి అవుతుందా?, తనని ఈ ఇబ్బంది నుంచి ఎలా తప్పించాలా అని కావ్య ఆలోచిస్తుంటే, ఏమి పంచ్ డైలాగ్ వెయ్యాలా అన్న ఆలోచనలో పడింది సౌమ్య.

రెండు నిముషాలు దీర్ఘంగా ఆలోచించి పేపర్ పై ప్రాబ్లెమ్ సాల్వ్ చేయటం మొదలు పెట్టాడు. స్టెప్ బై స్టెప్ సౌమ్య కు వివరిస్తూ మధ్యలో కొంచెం ఆగి, గుర్తుకు తెచ్చుకుంటూ పది నిముషాల్లో బాగా క్లియర్ గా అర్ధం అయ్యేట్టు వివరించాడు. అతను చెప్పేది అర్ధం కాకపోయినా తన భర్త వివరిస్తున్న తీరుబట్టి అతనికి సబ్జెక్టు లో ఉన్న పట్టు అర్ధం అయ్యి ఏమి మాట్లాడకుండా గర్వంగా చూస్తూ ఉండి పోయింది. ఆ ప్రాబ్లెమ్ అవ్వగానే పట్టుదలగా ఇంకో ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యమంది సౌమ్య.

"నేను సాల్వ్ చేయడం కాదు. మీరు సాల్వ్ చెయ్యాలి. ఎక్కడన్నా ఆగిపోతే అయితే నేను క్లియర్ చేస్తా".

అలా సౌమ్య చేత ప్రాబ్లెమ్ సాల్వ్ చేయిస్తూ, మధ్యలో ఆగిపోతే వివరిస్తూ రెండో ప్రాబ్లెమ్ కూడా పూర్తి చేశారు. సౌమ్య కి అర్ధం ఐయ్యింది బావ ఎంత తెలివైన వాడో. తనని మన్నిస్తూ పద్దతిగా వివరించిన తీరు బాగా నచ్చింది.

"యు అర్ వెరీ స్మార్ట్ బావ. నాకు బాగా నచ్చావు." అంది మనస్ఫూర్తిగా,  తన ఓటమిని మనస్సులోనే ఒప్పుకుంటూ. "కానీ ఒకటి. నన్ను మీరు అంటె ఏదోలా వుంది. నువ్వు అనో లేక పేరుతొ పిలు."అంది చనువుగా.

"నాకు ఎందుకో అలా అలవాటయి పోయింది. అలాగే పేరు పెట్టి పిలుస్తాలే"అన్నాడు నవ్వుతూ.

ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగుండదని,"నాకు సహాయం చేసినందుకు థాంక్స్ బావ. సాయంత్రం నన్ను బయటకి డిన్నర్ కి తీసుకు వెళ్ళాలి" అంటూ పుస్తకాలు చేతిలోకి తీసుకొంది. అక్క వేపు చూసి నవ్వుతూ"బావకు కొంచెం రెస్టు ఇవ్వు"అంటూ తన గదిలోకి వెళ్లి పోయింది.

ఇంకెవరు లేకపోవడంతో భర్త తలను రెండు చేతులతో పట్టుకొని ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది. ఆ ముద్దుకి తన అండర్వేర్ గట్టిగా బిగియడంతో, ఎడమ చేత్తో దగ్గరికి పొదువుకుంటూ కుడి చేత్తో టాప్ లోంచి టెన్నిస్ బంతిలా బయటకు పొంగుకొస్తున్న రొమ్ముని పిసికాడు. అతని పెదవుల్లో తన పెదాన్ని లోపలికి పోనిచ్చి నాలుకని ఆడిస్తూ, గొడుగులా పొడుచుకున్న అతని మొల భాగాన్ని చేత్తో తడిమింది. 

ప్రతిగా కావ్య రెండు తొడల మధ్య అర చెయ్యి పట్టి లెగ్గ్గింగ్ మీద నుంచే అక్కడ వత్తుతూ "గది లోకి పోదాం పద". గొంతులోని సన్నని గీర అతనిలో పేరుకుంటున్న దూలని తెలియ పరుస్తోంది. 

కావాలని తన గదిలోంచి బయటికి వచ్చిన సౌమ్యకు సోఫా వెనుక నుంచి అక్క బావతో కలియ బడటం చూసి వంట్లో తియ్యగా లాగింది. 

"నేను అంతా చూస్తున్న" అన్న సౌమ్య కేక దూరం నుంచి వినబడటంతో శ్రీరామ్ గబుక్కున విడివడి సర్దుకొని కూర్చున్నాడు.
గాలి తీసిన బుడగలా అతని అంగం చల్ల బడటం చూసి, "నీకు ఇక్కడ ఏమి పనే. లోపలికి పోయి చదువుకో. పైకి పోదాం రా"అంటూ భర్తని లేవదీసింది.

సౌమ్య కేసి చూసే ధైర్యం లేక కొంచెం సిగ్గుగా భార్య వెంట పైకి నడిచాడు. వాళ్ళ అడుగుల చప్పుడు దూరం కావడంతో మనసులోనే నవ్వుకుంది సౌమ్య. బావ మీద ఒక రకమైన మంచి ఇంప్రెషన్ కలిగి, అక్కకు మంచి మొగుడు దొరికినందుకు హ్యాపీ గా ఫీల్ అయ్యింది.

తమ రూమ్ లోకి వెళ్లిన తరువాత కింద జరిగిన షాక్ వల్ల మెల్లిగా మంచం మీద చేరి తలగడ ఎత్తుగా పెట్టి వెనక్కి వాలాడు. భర్త పక్కనే చేరి ఆర్తిగా అతని ఛాతిపై చెయ్యి వేసి పామ సాగింది, అతని మూడ్ మార్చడానికి.

"మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి", అన్నాడు మౌనం ఛేదిస్తూ.
ఆ మాట ఎందుకో అని తెలిసినా, భర్త నోటితో వినాలని. "దేనికి" అంది.
"వయస్సులో ఉన్న పిల్ల ఇంట్లో ఉండగా మనం అలా రెచ్చిపోవాల్సింది కాదు."

ఒక అందమైన అమ్మాయి, వరసకు మరదలు, ఆపై తానే టీజ్ చేస్తున్న ఏ మాత్రం చొరవ, వెకిలి తనం చూపించని భర్త సంస్కారం అర్ధం అయ్యింది. మరదలితో సరసం అనే ముసుగులో మగాళ్లు వేసే వెకిలి చేష్టలు, ముతక జోకులు చూసిన కావ్యకు, తన చెల్లెలి పట్ల భర్త చింత అర్ధం అయ్యింది.

"అదేమి చిన్న పిల్ల కాదు. దానికి తెలియనిది ఏమి లేదు. తనకు చదువు అయిన తరువాత పెళ్లి చేస్తారుగా. ఎవిరీ డాగ్ హేజ్ ఇట్స్ డే", అంది వాతావరణం తేలిక పరుస్తూ.
"అవుననుకో కానీ అలాంటివి చూస్తే వికారం వస్తుందిగా."
"నీవు చూసే వుంటావుగా పోర్న్. మరి నీకు వికారం వచ్చి ఉండాలిగా", అంది. ఆ మాటతో భార్య లాజిక్ అర్ధమయ్యింది.
"అంటె నాకు కంట్రోల్ చేసుకునే శక్తి వుంది", అన్నాడు ఏమని సమాధానం చెప్పాలో తెలీక.
"అదే నేను చెప్పేది. ఈ రోజుల్లో అలాంటివి చూడడం చాలా కామన్. నీ లాగే దానికి కంట్రోల్ చేసుకునే శక్తి వుంది. నథింగ్ టు ఫీల్ గిల్టీ విత్ వాట్ వుయ్ డిడ్ దేర్. షీ జస్ట్ ఎంజాయ్స్ టీజింగ్ యు. లెట్ హర్ హేవ్ ఫన్."

ఆ మాటతో నార్మల్ అయ్యాడు. మెల్లిగా కావ్య వైపు తిరిగి ఆమె వీపుపై నిమురుతూ "నువ్వు పోర్న్ చూసిన తర్వాత ఏమి చేసేదానివి?"

"ఆ సంగతులు తర్వాత తీరుబడిగా చెప్తా, ముందు దీని సంగతి చూడు"అంది అతని చేతిని తన తొడలు మధ్య పెట్టి నొక్కుకుంటూ. దాంతో ఒక్క సారిగా అగ్గి రాజుకోవడంతో తన అర చేతిని ఆమె లెగ్గింగ్ కింద పాంటీలో దూర్చి మరింత కసిగా వత్తుతూ,"ఐ లవ్ యు"అంటూ ఆమెపై ఒరిగి తన పెదాలతో ఆమె పెదాలని కప్పేసాడు.
[+] 10 users Like prasthanam's post
Like Reply
#39

(04-07-2020, 08:23 AM)Chandra228 Wrote:  సౌమ్య బావ ని బాగా టీజ్ చేస్తుంది కావ్య శ్రీరామ్ ని శృంగరం లో మునిగి తెలుస్తోంది.

Chandra228 గారు, థాంక్స్ అండి. ప్రస్తుతానికి మీరు అన్నట్టే జరుగుతోంది.

(04-07-2020, 08:39 AM)paamu_buss Wrote:  Pogadathalu parakasta ki cheruthunnayi, expectations penchestunaru, oka problem vaste situation Enti ? Sri decision making ela? Worth the wait?

paamu_buss గారు, 

(04-07-2020, 08:57 AM)Okyes? Wrote:  ప్రస్థాణం గారు......

సూపర్ డూపర్ హిట్ సర్......
నవదంపతుల మూడు రోజుల మన్మథ మంథనాన్ని ఇంత సున్నితంగా చెప్పడం మీకే చెల్లు ....... "హట్స్ అప్ టు యూ సర్"
కూతురుకు మంచి పోటుగాడైన భర్త దొరికాడు
అని అమ్మ....... 
అక్కకు సరసుడైన మొగుడు దొరికాడని చెల్లెలు సౌమ్యా అనందపడడమేనా లేకా.....
అత్తకు ఆ పోటులో సుఖం అందిచే అల్లుడుగా......
మరుదలుకు సరసం లో అనందం అందించే బావ గా ......
మారుతాడా మన హీరో శ్రీరామ్.......?
వేయిటింగ్ సర్.......


Okyes?  గారు, థాంక్స్ సర్ నచ్చినందుకు. చాలా ప్రశ్నలు. మీ ప్రశ్నలకు ఈ రోజు ఎపిసోడ్లో కనీసం ఒక ప్రశ్నకు  సమాధానం దొరకొచ్చు.

(04-07-2020, 10:49 AM)Eswar P Wrote:  ప్రస్తాణం గారు మీరు కథ వ్రాసే విధానం ఆమోగం. చాలా చాలా బాగుంది.

Eswar P గారు, థాంక్స్ సర్ నచ్చినందుకు. I will try to do my best.

(04-07-2020, 01:26 PM)bobby Wrote:  Super update, It looks like Sriram is having So many morals.

bobby గారు, అవునండీ. అలాంటి వాళ్ళు అరుదు, కానీ ఉంటారు.

(04-07-2020, 03:11 PM)Morty Wrote:  chelli kanney anukuntay, eppudu thali kannu kudda padindi.....  sex ee drusyani chusina taruvata
chanchalamyna attagari manasu tappu alochinchakunda unda galugutundaa.... tana alochanalaku karya rupam dalchey vidam gaa aa cheryalu cheyaka povochu gani ,attagari madilo chinipati alajadi, prakampana shrustinchi undavachu mana kadhanayakudu..... kadha yetu malupu tirugutundo ani asakti gaa undi .... adbutam gaa undi mee kadha , kadhanam... clp); clp); clp);

Morty గారు, థాంక్స్ సర్ మీ ఎనాలిసిస్ కి. థాంక్స్ సర్ మీ ఎనాలిసిస్ కి. అత్తా గారు దిస్తుర్బ్ అయిన మాట నిజం. ఈ రోజు ఎపిసోడ్ లో సమాధానం దొరకొచ్చు.

(04-07-2020, 04:17 PM)Venrao Wrote:  super updates
nice story

Venrao గారు, నచ్చినందుకు థాంక్స్

(04-07-2020, 04:58 PM)readersp Wrote:  very very nice!!!

readersp గారు, నచ్చినందుకు థాంక్స్

(04-07-2020, 11:37 PM)Fufufu Wrote:  మీ రచన శైలి అమోఘం.......

Fufufu గారు, నచ్చినందుకు థాంక్స్

ముందే చెప్పినట్టు కొంచెం సమయం దొరకటంతో ఇంకో అప్డేట్ ఇస్తున్నాను కొంచెం సేపట్లో. వచ్చే వారం నుంచి మాములుగా రెండు అప్డేట్ లు బుధవారం, శనివారం ఇస్తాను.

ఒరిజినల్ గా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసి కొంచెం రాసాను. కధ నిడివి పెరుగుతుందని కొంత కంటెంట్ రాసింది రివ్యూలో అవసరం లేకపోతె తీసేస్తున్నాను. కధకు అంత సంభందం లేదని ఇది రాద్దామా వద్దా అన్న సందేహం. వరసైన మరదలు, వాళ్ళను చూసిన అత్త గారి మీద సందేహం వెళ్ళటం సహజం. పాఠకుల అభిప్రాయలు చదివిన తరువాత ఈ అప్డేట్ రాస్తే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో డ్రాఫ్ట్ ని పూర్తిగా డెవలప్ చేసి ఇస్తున్నా. నచ్చుతుందని ఆశిస్తున్నా.
Like Reply
#40

ఎపిసోడ్ 16


మధ్యాహ్నం భోజనాల తరువాత కూతురు, అల్లుడు బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయారు. తన చెల్లి, సౌమ్య కింద వాళ్ల గదుల్లోకి వెళ్లిపోయారు. కూతుళ్ళకు జానకి అంద చందాలే వచ్చాయి, కాకపొతే తాను కావ్య కంటే ఎత్తులో రెండు అంగుళాలు తక్కువ. అది తప్ప మిగిలినవి అన్ని కొంచెం ఎక్కువే. అంత అందమైన, ఐశ్వర్య వంతురాలైన భార్య దొరకటం తన అదృష్టంగా భావిస్తుంటాడు రాజారావు. భార్యను ప్రేమగా చూసుకోవటమే కాదు, తనకి పడకటింటి ఆనందంలో ఏ లోటు రానివ్వ లేదు. నలభై అయిదేళ్ల  వయసులో కూడా ఆమె అందం, వయస్సుతో పెరిగిన అందాలతో అతనిలో నిప్పు రాజేస్తుంటుంది. అసలే పెళ్లి హడావుడిలో రోజూ బాగా కష్ట పడటం, పనుల వత్తిడిలో ఆలస్యంగా పడుకోవటంతో ఈ మధ్య చాలా నాగాలు పడ్డాయి. మధ్యలో రెండు మూడు సార్లు చేసుకున్న అంత సావకాశముగా చేసుకోవడం కుదర లేదు. పొద్దున్న కూతురి భాగోతం చూసిన తరువాత జానకికి కూడా వంట్లో కరెంటు పారసాగింది. కుమ్మరి పురుగు తొలిచి నట్టు, లోపల బాగా దురద పెట్ట సాగింది. అప్పటికి ఎవరు చూడకుండా రెండు మూడు సార్లు చీర పైనుంచే గోక్కుంది జిల తగ్గటానికి. దెబ్బ పడితే కాని అది తగ్గేలా లేదని వంటిల్లు దగ్గరుండి సర్దించి వంటావిడకు నాలుగు గంటలకల్లా బజ్జీలకు పిండి కలిపి ఉంచమని పురమాయించి, తను పైన తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

అప్పటికే పైకి చేరుకున్న రాజారావు చొక్కా లేకుండా లుంగీతో పడకపై భార్య గురించి ఎదురు చూస్తూ, పేపర్ చదువుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.  AC ఆన్ లో ఉండటంతో గది చల్ల బడింది.  జానకి తిన్నగా బాత్రూమ్ లోకి పోయి మొహం కడుక్కొని, ట్రిమ్ గా తయారైంది. డ్రెస్సింగ్ రూమ్ లో ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పి, కింద ఎర్రటి పాంటీ  దానిపై పలుచని నైటీ వేసుకొని బొత్తాలు పెట్టు కోకుండా వదిలేసింది. దానిపై భర్తకు ఇష్టమైన స్ప్రే చల్లుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. జానకి అలా నడుచుకుంటూ వస్తుంటే బ్రా లేని తన సళ్ళు నైటీ లో కొద్దిగా కనిపిస్తూ పైకి కిందకు ఊగుతున్నాయి. అసలే గ్యాప్ వచ్చిందేమో, నైటీ లో ఆమె తెల్లని తొడలు, ఎర్రటి పాంటీ చూస్తుంటే స్విచ్ వేస్తె వెలిగే బల్బులా లుంగీలో అతనిది టక్కున లేచింది. తలుపు లాక్ చేసి, కిటికీ తెరలని పూర్తిగా కప్పడంతో గది కొంచెం చీకటయ్యింది. 

మెల్లిగా వచ్చి మంచం పై భర్త పక్కనే చేరి గుడారంలా లేచి వున్నలుంగీని చూసి, "ఏమిటి దొరగారు అప్పుడే రెడీ అయ్యారు"అంటూ లుంగీ పైనుంచే పట్టుకొని వత్తింది.

"నీ అందాలు చూసిన తరువాత అది నిద్ర లేవకుండా ఉంటుందా", అంటూ తన చేతిని ఆమె నైటీలో పెట్టి బంగిన పండు సైజులో ఉన్న ఆమె ఎడమ వక్షోజాన్ని అర చేతిని పూర్తిగా చాపి అందుకొన్నాడు. చపాతీ పిండి పిసికినట్టు మెత్తగా పిసుకుతూ, "నా చేతికి సరిపోవటం లేదు" అన్నాడు చిలిపిగా.

పెళ్ళైన కొత్తలో కొంచెం బెరుకుగా ఉండే జానకి కొద్ది కాలంలోనే అతని ప్రోత్సహంతో అన్ని రుచులు చూసింది. పాతికేళ్ల సంసారంలో శృంగారంతో భర్త గురించి పూర్తి అవగాహన ఉంది. అతనికి ట్రాష్ టాక్ వయాగ్రా కన్నా బలంగా పని చేస్తుందని తెలుసు.

పది నిముషాలు పాటు ముద్దులు, పిసుకుళ్ళతో  వాళ్ళ శరీరాలు వేడెక్కాయి. తన లుంగీని అప్పటికే తప్పించి ఆమె నైటీ తీసేస్తుంటే "కూతురి పెళ్లి చేసినా, ఇంకా ఏమిటి కుర్ర వేషాలు"అంది భర్తకు సహకరిస్తూ.

"కూతురి పెళ్లి చేస్తే ఏంటంటా? మనిద్దరికీ కోరిక ఉన్నంత కాలం వయసుతో పని లేదు"అంటూ ఆమెని పూర్తిగా వివస్త్ర చేసాడు.

నగ్నంగా పరుపుపై వెనక్కి వాలి బోర విరిచింది అతన్ని ఆహ్వానిస్తూ. విశ్వ రూపం దాల్చిన తన మగతనాన్ని ఆమె చేతికి ఇస్తూ, ఆమెపై నిండుగా వాలి, కొద్దిగా వాలిన రొమ్ముని ఒకదాన్ని నోట్లో కుక్కుకొని రెండోది గట్టిగా పిసక సాగాడు. నోట్లో పెట్టుకున్న దాన్ని నూజివీడు రసాన్ని చీకినట్టు చీకుతుంటే, కింద రసాలు ఊరసాగాయి.

అతని చీకుడును ఆస్వాదిస్తూ, "ఒబ్బిడిగా మామిడి రసాలు చీకినట్టు బాగా కుడుస్తావు. నాకు కింద బాగా ఊరుతున్నాయి. కొంచెం దీని పని కూడా పట్టు అంటూ" రెండోది అందించింది.

కూతురి మాట రాగానే, "బాగానే కలిసినట్టున్నాడు. అమ్మాయి అల్లుడు మధ్య అంతా ఓకే నా?"అని అడిగాడు.

"ఊ .. కొంచెం నెమ్మది..  కావ్య, అల్లుడు బాగా కలిసి పోయారండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది.  స్స్.. స్స్.. స్స్.. ఈ వయసులో కూడా చంపుతున్నారు. చీకింది చాలు ఇక పెట్టెయ్యండి. అస్సలే చాలా జిలగా ఉంది లోపల", అంది బాగా వేడి ఎక్కడంతో.

ఆమె కాళ్ళ మధ్య మోకాళ్ళ మీద సర్దుకున్నాడు. ఆమె చేత్తో అతని గూటాన్ని అలవాటుగా తన పెదాల గాడిమీద ఆనించి పైనుంచి కిందవరకూ రెండు సార్లు రాసుకొని పాయింట్ సెట్ చేసింది.

"కలిసి పోవడం అంటే ఇలాగేనా" అంటూ ఒక్క ఊపుతో విలాసంగా తన దాన్ని అడుగంటా దింపాడు. అలవాటైన దారి అవటంతో పూర్తిగా దిగాడు.

నిండా పెట్టిన ఆ ఆనందానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ భర్తకి మురిపెంగా ఒక ముద్దు ఇచ్చింది. తన రెండు కాళ్ళు అతని పిర్రల చుట్టూ అడ్డ కత్తెరలా బిగించి, రెండు చేతులు అతని వీపు చుట్టూ వేసి గట్టిగా కౌగలించు కోవడంతో, వారిద్దరి మధ్య గాలి చొరడానికి కూడా ఖాళి లేదు. 

"కలిసి పోవడం అంటే ఇలా"అంది తను ఏ మాత్రం తగ్గకుండా.

ఇద్దరి మొత్తలు తాపడమై ఉండడంతో ఇద్దరికీ బాగా కసి పెరిగింది. కాసేపు అలా ఉంచి మెల్లిగా తన కాళ్ళు విడిచి బంధం సడలించడంతో అతను తనదాన్ని మెల్లిగా బయటకు లాగి కసిగా ఇంకో పోటు పొడిచాడు. బలంగా తొయ్యడంతో మరింత లోపలికి చొచ్చుకు పోయాడు.

ఈ పాటికి అల్లుడు కూడా తన కూతురికి కొసరి కొసరి తినిపిస్తుంటాడు. తన లాగే, తన కూతురు కూడా ఏమి తక్కువ కాదు ఆ విషయంలో అనుకొని లోలోపలే నవ్వుకుంది. తను చూసిన వాళ్ల లైవ్ షో గుర్తుకు వచ్చి కసిగా తన మొత్తతో విసురుగా ఎదురు ఊప సాగింది.

"మీ దాంతో పొడిచి చింపేస్తారా ఏమిటి"అంది మరింత పురి ఎక్కిస్తూ.
"ఇద్దరొచ్చారు దానిలోంచి. అంత ఈజీ కాదులే"అంటూ మెల్లిగా కదల సాగాడు.

పొద్దున్న తాను చూసిన కూతురి దబాయింపు, అల్లుడి దూకుడు భర్తకి చెబుదామా అనుకొని ఒక క్షణం ఆలోచించి మానుకొంది. అంతలోనే మనసు మార్చుకొని , "కావ్య చాలా సంతోషంగా వుంది. అన్ని విధాలా సుఖ బెట్టే మీ లాంటి మంచి భర్త దొరికాడు. అదృష్ట వంతురాలు, నాలాగే" అంది ఆ విషయాన్ని పరోక్షంగా తెలియ చేస్తూ.

ఆ కాప్లిమెంటుతో అతనిది ఆమె లోపల మరింత వ్యాపించింది. స్పీడ్ పెంచి జోరుగా ఊగసాగాడు. అన్నేళ్ల అనుభవంతో ప్రతి దెబ్బ తూకంగా సాచి కొడుతుంటే "స్స్ స్స్  మీది లోపల తొలిచేస్తోంది. వయసొచ్చినా మీలో బలం తగ్గలేదు. అల్లుడికి పాఠాలు చెప్పగలరు ఈ విషయంలో అలాగే కొట్టండి", అంది గొంతు గీరపోతుంటే.

భార్య దగ్గర నుంచి తన సామర్థ్యంపై సర్టిఫికెట్ రావడంతో మరింత జోరుగా ఊగ సాగాడు. అంత చల్లని గదిలో వాళ్లకు చమట్లు పడుతున్నాయి. 

ఒక పక్క ఆమె మెదడులో పొద్దున్న చూసిన అల్లుడి కూతుర్ల పోరు ఒక సినిమా రీలులా కదులుతుంటే, ఇంకో పక్క భర్త అన్ని రోజుల విరహాన్నంతా తన గునపంలో కేంద్రీకరించి మరీ కసిగా పొడుస్తుంటే జానకి త్వరగానే స్వర్గపు టంచులకు చేరుకొంది.

ఇద్దరి మొత్తలు తాపడం అయ్యినప్పుడల్లా వచ్చే చప్పుళ్ళు, దానికి తోడు పెళ్ళాం కేరింతలు, చాలా మంది మగాళ్ల లాగే అతనిలో మరింత ఆవేశం పొంగిస్తున్నాయి. కాని భార్యనుంచి సంకేతం అందేవరకు ఆపుకోవాలని మనస్సుని దారి మళ్లిస్తున్నాడు.

"ష్ ష్ ష్.. నీది బాగా దూలెక్కి కొట్టుకొంటుంది. ఊ.. ఊ.. ఈ సుఖంతో చచ్చి పోయేలా ఉన్నాను. నాకయి పోతోంది. కానివ్వు." అంటూ మెల్లిగా తన స్రావాలు కార్చడం మొదలు పెట్టింది.

ఆమె మాటలు వినగానే జింకను వేటాడే చిరుతలా మరింత వేగం పెంచాడు. ధ్యాస అంతా దాని మీదే ఉండటంతో నర నరాల్లో కసి పొంగుతుంది. "పెళ్లయి పాతిక సంవత్సరాలు అయినా నీలో చాలా కసి ఉంది. నీ దిమ్మకి వారం రోజులుగా సరైన దెబ్బ పడక దూలెక్కి కొట్టుకుంటోంది. దాని పొగరు అణుస్తా, "అంటూ తాగితే కైపెక్కి వళ్ళు తెలియనట్లు ఏదేదో వాగుతూ, మదంతో బలంగా పోట్లు వేస్తూ ఒక్క సారిగా ఆమెలో నిండాపెట్టి కోడి గుడ్డులా చితికి పోయాడు. ఆఖరి చుక్క పడేంత వరకు ముద్దులు పెడుతూ, మెల్లి మెల్లిగా గుల్లించాడు. రెండు నిముషాలు పాటు ఇద్దరూ మాట్లాడలేదు.

"పొద్దున్నించి ఒకటే జిలగా ఉంది. దురద తగ్గి హాయిగా ఉంది. బాగా చేసావు".
"నీతో ఎప్పుడు హుషారుగా ఉంటుంది నాకు".
"పెద్ద దానికి పెళ్లి చేసాం. చాలా సంపాదించారు. చూస్తే అల్లుడు డబ్బులు వద్దంటాడు. సంపాదించి ఎవరికోసం. కొంచెం నెమ్మదించొచ్చుగా", అంది జానకి.
భార్య బిజినెస్ గురించే చెబుతుంది అని అర్ధం అయినా, "స్లో గా అయితే నీకు నచ్చదేమో. ఎప్పుడు వేగం, గట్టిగా అంటావుగా", అన్నాడు నవ్వుతూ.
భర్త చెణుకు అర్ధం అయ్యి, "ఎప్పుడు మీకు ఆ ధ్యాసే".
"అబ్బో నీకు లేనట్టు. రెండు మూడేళ్ల వరకు సౌమ్య పెళ్లి విషయం లేదు. ఇంట్లో కూడా ఇద్దరమే. నీ జిలేబి పానకం పట్టి చాలా రుచిగా ఉంటుంది. రోజూ వేడిగా తినాలనిపిస్తుంది."
"ఎప్పుడు కావాలన్న తినిపించడానికి నేను రెడీ, దీని ఓపిక", అంది అతని అరటి పండు మీద చేయి వేసింది.
"నీ ఊట బావిలో మునగ తీస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. నీ లాంటి భార్య దొరకడం నా అదృష్టం."అంటూ తాను ముద్దులు కురిపించాడు.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)