14-11-2018, 07:06 AM
ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు 18 వరకు పెంపు
అమరావతి/రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018 దరఖాస్తు స్వీకరణ గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 వరకు, దరఖాస్తులకు 16 వరకు అవకాశం ఉంది. అయితే, బీటెక్‌తో పాటు ఏ డిగ్రీ చదివినా డీఎస్సీకి దరఖాస్తుచేసుకునేందుకు అర్హత కల్పించడం, ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థులు తప్పులు చేసినట్లయితే వాటిని సవరించుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో.. ఫీజు చెల్లింపునకు 17 వరకు, దరఖాస్తు స్వీకరణ గడువు 18 వరకు పొడిగించినట్లు వివరించారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో ప్రస్తుతం టెన్త్ పబ్లిక్ పరీక్షా కేంద్రాలు 2,300 ఉన్నాయని, వీటిలో సుమారు 100 కేంద్రాలను మార్చే యోచనలో ఉన్నామని సంధ్యారాణి తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని నన్నయ వర్సిటీకి వచ్చిన ఆమె మాట్లాడుతూ.. మూడేళ్లుగా వస్తున్న సూచనలు, ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సమస్యలున్న పరీక్షా కేంద్రాలను మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తునట్టు పేర్కొన్నారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK