Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఆరుద్ర రచనలు
ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర రావు (1925-98). శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
ఆరుద్రగారి పేరు తెలియని వాళ్ళు , వినని వాళ్ళు ఉంటారేమో కాని ఈతను వ్రాసిన సినిమా పాటలు ఎపుడు వినలేదు అని అనేవాళ్ళు మాత్రం ఉండరు......
1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు" అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు. వీటి సంకలనాలు ఆరుద్ర సినీగీతాలు అన్న పేరుతో ప్రచురితమయ్యాయి.అందులో కొన్ని ......
* పెంకి పెళ్లాం చిత్రంలో - "పడచుదనం రైలుబండి పోతున్నది",
* ఉయ్యాల జంపాల చిత్రంలో - "కొండగాలి తిరిగింది", ఇదే చిత్రంలో "అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
* మీనా చిత్రంలో - "శ్రీరామ నామాలు శతకోటి" .
* బందిపోటు చిత్రంలో - "ఊహలు గుసగుసలాడే"
* బాలరాజు కథలో - "మహాబలిపురం మహాబలిపురం"
* ఆంధ్ర కేసరి చిత్రంలో - "వేదంలా ప్రవహించే గోదావరి"
* అందాల రాముడు చిత్రంలో - "ఎదగడానికికెందుకురా తొందర "
* గోరంత దీపం చిత్రంలో - "రాయినైనా కాకపోతిని "
* ముత్యాల ముగ్గు చిత్రంలో - "ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ"
* బాల భారతం చిత్రంలో - "మానవుడే మహనీయుడు"
* ఇద్దరు మిత్రులు చిత్రంలో - "హలో హలో అమ్మాయి"
* ఆత్మ గౌరవం చిత్రంలో - "రానని రాలేనని ఊరకె అంటావు."
* ఆత్మీయులు చిత్రంలో - "స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు"
మొదలగు సినిమా పాటలు వ్రాసి , ప్రతిపాటలో తన ముద్రను కనిపింప చేశారు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
17-03-2020, 11:45 AM
(This post was last modified: 17-03-2020, 11:51 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
రాముడికి సీత ఏమవుతుంది?
రాముడికి సీత ఏమవుతుంది? అనేది తెలివితక్కువ ప్రశ్న కాదు.
ఈ ప్రశ్నను తరచి, తరచి, సాంగోపాంగంగా చర్చిస్తే, ఎన్నెన్నో రామకథలు బయట పడ్డాయి. ఇన్ని రామాయణాలను చదివి చదివి వాటిలోని వావివరసల్ని విశ్లేషిస్తూ, కేవలం హరిదాసులు చెప్పే రామాయణాన్ని మాత్రమే విశ్వసించి, రామాయణ కథ తరతరాలుగా అనేక మార్పులకు, కూర్పులకు, చేర్పులకు లోనయివస్తూందనే సత్యాన్ని గుర్తించ నిరాకరించే వారికి, రామబాణం లాంటి రచన “రాముడికి సీత ఏమవుతుంది?" అనే వ్యాస పరంపర!
★★★
నే చెప్పానుగా
ఇందులో...- నే చెప్పానుగా
- భోగి పిడకలు
- రాజ ముద్రిక
- పిచుక గూళ్ళు
- పిల్లి కూన
- చేబదులు కోసం
- పరిశిస్టం
- కుడి ఎడమైతే
- దానవికం
- స్వప్నవాస్తవదత్త
- స్వర్గాదపి
- చాప క్రింద నీరు
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఆరుద్ర సినీ గీతాలు (1965-70)
★★★
ఆరుద్ర సినీ గీతాలు (1977-98)
★★★
సినీ మినీ కబుర్లు
ఆంధ్రప్రభ వారపత్రికలో 1993 ఏప్రిల్ నుండి 1994 జూన్ దాకా వెలువడిన వ్యాసాల సంకలనం.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
గుడిలో సెక్స్
ప్ర: దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?
జవాబు: దేవాలయాలలోనే ఈ బూతు పనులు చేయాలి కాబట్టి!
ఆ ప్రశ్న గానీ ఈ జవాబు గానీ ఈనాడు కొందరికి వెగటుగా ఉండొచ్చు! దేవాలయం చాలా పవిత్రమైన ప్రదేశం కనుక అక్కడ పుణ్యకార్యాలు, శభప్రదమైన పూజలూ, అర్చనలూ మొదలైనవి జరుగుతాయి అనే భావం ప్రజలలో వేళ్ళూని దిట్టంగా ఉంది. కనుక — "దేవాలయంలోనే బూతు పనులు జరగాలి" అనే వాదన విడ్డూరంగా ఉన్నట్టు తోచడంలో ఆశ్చర్యం లేదు.
.
.
.
ఈ విషయాల గురించి ఇంకా చదవాలనుకుంటే, క్రింది లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
★★★
వెన్నెల వేసవి
నిదుర నటియించితే నిజ మనుచు భ్రమయించి
నెరవయసు చెలికాడు నిధువనానికి బదులు
నెనరుతో అచ్చోట నిమిరినా వులకని
నెలతలారా! వేగ తలుపు తీయండి.
ఇది 'కళింగత్తుపరిణి' అనే తమిళ కావ్యంలోని రెండు ప్రకరణాలకు అనువాదం. అరవ భాషలో 'పరిణి' అంటే వీర ప్రబంధం అని అర్ధం. ఇది మొదటి కులోత్తుంగ చోళుని కళింగ విజయాన్ని కీర్తిస్తుంది.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
17-03-2020, 12:46 PM
(This post was last modified: 17-03-2020, 12:56 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
కూనలమ్మ పదాలు
కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట.
పార్వతీదేవి కూతుళ్ళూ కామేశ్వరీ దేవికి తోబుట్టువులూ అయిన అక్కలకు కాపుదలగా వుండే పోతురాజునకు భార్యే కూనలమ్మ.
కూనలమ్మ సంకీర్తనములు. కూనలమ్మ చీర. కూనలమ్మ వేట.
కావ్యములవలె జంపె వరుసలో నడుస్తున్నది. చరణములన్నీ దొరికిన బాగుండును" అని కృష్ణశ్రీగారు తాము సంకలనం చేసిన "పల్లెపదాలు" అనే పుస్తకంలో వ్రాశారు.
★★★
గాయాలూ - గేయాలూ
ఎవరినీ ప్రేమించకు...
ఎవరినీ ప్రేమించకు
ఎవరికీ మనసీయకు
నీ బాధలెవరికీ తెలుపకు
విని నవ్వు నీ లోకము
మనసులోనే ఉంచుకో
మరులు కలిగి విచారానికే
కన్నీళ్ళు ఇంక తుడవకు
తుడిచినా మరల కారును
కన్నీటిలో కరిగిపో
కలిగె మరులు వియోగానికే
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఆరుద్ర నాటికలు
ఈ సంపుటిలో: - విషప్రయోగం
- దేవుని ఎదుట
- న్యాయాధికారి
- పార్కుబెంచీ
- నన్ను గురించే
- దరఖాస్తు ఫారం
- అక్కయ్యకి ప్రమోషన్
★★★
త్వమేవాహం
ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము?
ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?
ఏది దాని తల్లి వేరు? ఎలా మూసుకుంటోందీ పెద్ద నోరు?
ఏమిటి దీని భాష, ఏమిటి దీని శబ్ద సముద్ర ఘోష?
ఏమిటీ కాలం? ఏమిటి దాని పరిభాషిక పదజాలం?
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
17-03-2020, 01:30 PM
(This post was last modified: 17-03-2020, 04:51 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆరుద్ర రచన కవితలు
(విపుల సంకలనం)
ఉత్తేజంలో ఆ'రుద్రుడు' తన కలం ద్వారా సృష్టించిన అద్భుతం ఈ విపుల కవితా సంకలనం.
అందులోని ఒక చెణుకు—
విజయ విహారం
ఎండిన దేహాల
మండిన హృదయాలకు
చెయ్యండ్రా రక్త ప్రదానం
పొయ్యండ్రా వీరామృతం
ప్రపంచమంతటా
ప్రజలను లేప
చీల్చండ్రా శత్రు సమూహం
పీల్చండ్రా వారి జీవం
భూగోళపు
టంచులమీద
తియ్యండ్రా రక్త చందనం
పుయ్యండ్రా వీరుల మెడలకు—
★★★
మన వేమన
శ్రీ తల్లం పుల్లన్నగుప్త గారు కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 29-5-1917న జన్మించారు. తండ్రి వీరయ్య శ్రేణి గారు, తల్లి సుబ్బమ్మ గారు తల్లిదండ్రులు దాన తత్పరులు ఆ గుణం పుత్రులయిన శ్రీ పుల్లన్న గుప్త గారిలో నిండుగా కన్పిస్తుంది. శ్రీ పుల్లన్నగుప్త గారు మూడు దశాబ్దాలుగా వ్యాపార నిమిత్తం మద్రాసులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు అనేక సంస్థలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు భూరి విరాళాలను ఇచ్చినారు శ్రీ కన్యకాపరమేశ్వరి ధర్మ సంస్థలో సభ్యులుగా, ఆ సంస్థ నిర్వహించే విద్యాలయాలకు ప్రధాన కార్య నిర్వహకులుగా శ్రీ పుల్లన్నగుప్త గారు చేస్తున్న సేవ గణనీయమైంది
1981లో ఆరుద్రగారి చేత వేమనగారిపై రెండు ఉపన్యాసాలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇప్పించారు. ఆ సందర్భంలోనే వేమన గారికి పై మరికొన్ని వ్యాసాలుకూడా ప్రచురించవలసినవి ఉన్నాయని ఆరుద్ర గారు చెప్పగా అన్నిటినీ కలిపి ఒకే గ్రంధంగా ప్రచురించే ప్రయత్నానికి శ్రీ గుప్తగారు తోడ్పడుతా మన్నారు. అది ఈ పుస్తకం ద్వారా సాకారమైంది.
— ధర్మనిధి సంస్థాపకులు
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
17-03-2020, 01:38 PM
(This post was last modified: 07-04-2020, 04:17 PM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
17-03-2020, 05:06 PM
(This post was last modified: 17-03-2020, 05:07 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
వ్యాస పీఠం
ఆరుద్ర వ్రాసిన ఎన్నో వాటిల్లో ఈ చిన్న పుస్తకం ఒకటి, అదే ఆరుద్ర వ్యాసపీఠం.
మొదటిసారి ఆరుద్ర వ్యాసపీఠం 1985 లో అతని షష్ఠిపూర్తి సంధర్బంగా ప్రచురించారు. ఆ తరువాత ఈ పుస్తకం ప్రచురించారో లేదో తెలియదు. కానీ ప్రతి ఇంట ఉండ తగిన పుస్తకం.
ఇందులో కొన్ని వ్యాసాలు ఆలొచింపదగినవిగా, మరికొన్ని అంతుచిక్కని ప్రశ్నలకి జవాబుగా నిలుస్తాయి. ఇందులో 39 వ్యాసాలు ఉన్నాయి. అందులో అశోకుడూ - ఆడవాళ్ళూ, కృష్ణూడూ కొట్టాడు -మత్సయంత్రం, అన్నమయ్య ఆడినమాట...., కోహినూరు నే జడలో పూవట... పేర్లను చూడగానే మనలో చదవాలన్న ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే ఏకలవ్యుడి పుట్టుపూర్వోత్తరాలు.... పుత్రిక ఎలాంటి కూతురు.... ఖడ్గ తిక్కన, కవి తిక్కన.... మచిలీపట్నం ముందు ముచిలింద నగరమా... కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడా.... ఇలాంటివి ఎక్కడా దొరకని వ్యాసాలు.
★★★
కథలు
మహనీయుల కలం చిత్రాలు
కథల వరుస....
1. ఊరు ఊరుకొంది 2. ఉష్ణమొస్తే బావుద్దు 3. మసాబు వెలుతురు 4. తల్లి వూ అంది 5. ముప్పయి లక్షల పందెం 6. వైనతేయులు 7. ఇందలి నీతి : చెడలేదు 8. చెప్పనా? తా ‘ళ్లూ', తో 'ళ్లూ' 9. చింతచిగురు 10. కడసారి 11. నిశానీలు 12. మానవత్వం13. దీవెన 14. నే చెప్పానుగా 15. భోగిపిడకలు 16. రాజముద్రిక 17. పిచుక గూళ్ళు 18. పిల్లికూన 19. చేబదులుకోసం 20. పరిశిష్టం 21. కుడి ఎడమైతే 22. రానవికం
23. స్వప్న వాస్తవదత్త 24. స్వర్గారపీ 25. చాపక్రింది నీరు
కలం చిత్రాలు
1. వేలూరి శివరామరావుగారు 2. బాలాంత్రపు వేంకటరావుగారు 3. వజల చిన సీతారామస్వామిరావుగారు 4. మల్లాది రామకృష్ణరావుగారు 5. ఫిడేలు నాయుడుగారు 6. శ్రీ శ్రీ 7. సరస్వతీ మహల్ 8. అశ్రుతర్పణం
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఆధునిక విజ్ఞానం అవగాహన
ఈనాడు శాస్త్రీయ విజ్ఞానం దినదినాభివృద్ధి చెందటం లేదు; క్షణక్షణాభివృద్ధి పొందుతున్నది. వివిధ దేశాలలోని శాస్త్రజ్ఞులు ఏక కాలంలో ఎన్నెన్నో విషయాల పై పరిశోధనలు జరుపుతున్నారు; కొత్త విషయాలను కనిపెడుతున్నారు; నూతన పరికరాలను సృష్టిస్తున్నారు.
శాస్త్రజ్ఞులు సాధిస్తున్న ఈ వినూత్న విజయాలవల్ల ఆధునిక జీవితం నానాటికీ చాలా సౌకర్యవంతమవుతున్నది. టెలిఫోను, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు, విమానాలు, టర్బో జెట్ యింజన్లు, రాకెట్లు, పరమాణు రియాక్టర్లు మొదలైన వాటివల్ల సామాన్య ప్రజల జీవిత విధానాలలో సైతం మార్పులు వస్తున్నాయి.
ఈ అద్భుతమైన విజ్ఞాన విజయాలను శాస్త్రజ్ఞులు ఎలా సాధించారు? నేడు మనం వాడుతున్న యాంత్రిక పరికరాలను ఎలా కని పెట్టారు?' మనం నిత్యం వాడుకొనే విద్యుద్దీపం, రేడియో సెట్టు మొదలైనవి ఏ సూత్రాల పై పని చేస్తాయి? మనం ప్రయాణం చేసే కారూ, డీసిలు బస్సూ మొదలైనవి ఎలా నడుస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సరళమైన జవాబులు చెప్పే సులభ గ్రంథాలు మన భారతీయ భాషల్లో, అందులోనూ ఆంధ్రంలో అరుదనే చెప్పాలి.
ఆ దిశగా యోచించి రచించినదే ఈ పుస్తకం. ఆంగ్లంలో విలియం హెచ్. క్రౌజ్ వ్రాసిన 'Understanding Science'ని తెలుగులోకి అనువదించారు ఆరుద్రగారు.
>>> డౌన్లోడ్ <<<
★★★
కాటమరాజు కథ
(స్టేజి నాటకం)
“కాటమరాజు కథ” అనే నాటకం ఆరుద్రగారి విశిష్ట రచన, ఒక అద్భుత సృష్టి. దీని రచన 1961లో జరిగిందనీ, శ్రీయుతులు జె.వి. రమణమూర్తి, పి.జె. రావు వంటి నటుల కోరికపై దీనిని వ్రాశారనీ, ఆ నటులు దీనిని పది పదిహేనుసార్ల కన్నా ఎక్కువగానే ప్రదర్శించారనీ శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర తెలియజేస్తున్నారు. ఈ నాటకం " ప్రగతి'' వారపత్రికలో 1-8-1969 నుండి 24-10-1969 వరకూ ధారావాహికంగా ముద్రింపబడింది.
ప్రాచీనమూ ప్రశస్తమూ అయిన చారిత్రక వీరగాథలలో పల్నాటి వీరకథల తరువాత ఎన్నదగినవి కాటమరాజు కథలు.
ఇవి ఒక సుదీర్ఘ కథాచక్రంగా ఏర్పడి ఉన్నాయి. కాని పల్నాటి వీరకథలను గురించి జరిగినంత పరిశోధన వీటిని గురించి జరగలేదు. అందుచేత ఈ వీరగాథావృత్తంలోని అనేక గాథలు సాహిత్యలోకానికి అపరిచితాలుగా ఉండిపోయాయి. తెలుగు వీరగాథలలో ఇంత పెద్ద వీరగాథావృత్తం మరొకటి లేదు. దీంట్లో మొత్తం 32 వీరగాథలు ఉన్నాయని కొందరి పరిశోధనల వల్ల తెలుస్తోంది.
>>> డౌన్లోడ్ <<<
•
Posts: 209
Threads: 0
Likes Received: 209 in 124 posts
Likes Given: 135
Joined: Jan 2019
Reputation:
5
(17-03-2020, 01:38 PM)Vikatakavi02 Wrote: వేట కుక్క
ఈ లంకె తెరుచుకోవడం లేదు ఒకసారి పరిశీలించగలరు
దాదా ఖలందర్
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
^ ఆ లంకెలో చిన్న పొరపాటు దొర్లినట్లుంది. ఇలా ప్రయత్నించి చూడండి
Code: https://www.mediafire.com/file/ip1ewurn77v52fn/
•
Posts: 209
Threads: 0
Likes Received: 209 in 124 posts
Likes Given: 135
Joined: Jan 2019
Reputation:
5
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
(05-04-2020, 02:47 PM)~rp Wrote: ^ ఆ లంకెలో చిన్న పొరపాటు దొర్లినట్లుంది. ఇలా ప్రయత్నించి చూడండి
Code: https://www.mediafire.com/file/ip1ewurn77v52fn/
ఆ లింక్ మార్చేశాను మిత్రమా... ఇప్పుడు పని చేస్తుంది చక్కగా.
•
|