Posts: 14,367
Threads: 249
Likes Received: 18,466 in 9,632 posts
Likes Given: 1,922
Joined: Nov 2018
Reputation:
381
సంధ్యావందనం
వి.యస్.పి. తెన్నేటి
or
use below link - ↓ - ellnki0wsszb
Sandhya Vandanam_V S P Tenneti_1993_238 P.pdf
Size: 11.2 MB
.
Posts: 573
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
12-11-2018, 07:58 AM
(This post was last modified: 12-11-2018, 09:15 AM by ~rp.)
వికటకవి గారు అందించిన సంధ్యావందనం నవల టైపుప్రతి నుండి ముందుమాట (Dt: 2017 April 13)
Quote:నిజాయితీగా రాయబడిన నిఖార్సైన నవల
ఈ నవల రాయాలనే ఆలోచన తెన్నేటికి పది సంవత్సరాలుగా వుందని నాకు తెలుసు. అతడు నాకు చూచాయిగా ఈ కథ గురించి చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తున్న సరికొత్త సినిమా పాట "ఓలమ్మీ తిక్క రేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా?" అది ఏ సంవత్సరంలోనో నాకు సరిగ్గా గుర్తులేదు. మా రోజుల్లో ఆచార్య ఆత్రేయ "లేవనంటావా? నన్నే లేపమంటావా? పెట పెటలాడే పచ్చి వయసు పైపైకొచ్చింది" "మెరిక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి వాడి జోరు, వాడు తోడుతుంటే తీరుతుంది వయసుపోరు—" అని పాటలు రాస్తుంటే "ఛీ పాడు, బూతు. ఆయన ఆత్రేయ కాదు బూత్రేయ" అని ముక్కున వేలేసుకున్నారు. రానురానూ సినిమాల్లోనూ, పాటల్లోనూ సెక్స్ అనేది ఉధృతమౌతునే వున్నా అది సర్వ సామాన్యమైపోయింది. వాన పాటలు, డబుల్ మీనింగ్ పద ప్రయోగాలు సర్వ సహజమైపోయాయి. జనం వాటిని ఆదరించినంతగా వేటినీ ఆదరించకపోవడంతో సినిమాలని రెండురకాలుగా విభజించి ఆనందిస్తున్నారు. కళాత్మక చిత్రాలు, వ్యాపారాత్మగా చిత్రాలు.
తెలుగు నవలా సాహిత్యంలో కూడా వ్యాపారాత్మక నవలలు రాకపోలేదు. వ్యాపారాత్మక నవలల్లో బహుశా యండమూరి వీరేంద్రనాథ్ అనబడే ఓ సంచలనాత్మక రచయితదే అగ్రస్థానం అయ్యుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకు కారణం ఎవరి నోట విన్నా ఆయన పేరే. ఈ మధ్యకాలంలో వస్తున్న నవలల ధోరణి నాకంతగా తెలీదు. నేను చలం అభిమానిని. ఆయన మైదానం, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ దాదాపుగా కంఠోపాఠంగా అప్పజెప్పగల వ్యక్తినంటే అతిశయోక్తి కాదండోయ్. తర్వాత తర్వాత వడ్డెర చండీదాస్ నాకు నచ్చాడు. అతని అనుక్షణికం ఓ మూడు నాలుగుసార్లు చదివాను. తెన్నేటి పత్రికా సంపాదకుడుగా వుంటూ ఎంతటి సృజనాత్మక కనబరిచేవాడో నాకు జ్ఞాపకం వుంది. అతని సంపాదకత్వంలో వెలువడిన స్రవంతి, హారిక వారపత్రికలు అడపా దడపా చూస్తుండేవాడిని. నేటి పాఠకులకి ఏం కావాలో బాగా తెలిసిన వాడు తెన్నేటి. ట్రెండ్ సెట్టర్ ఔనో కాదో గానీ ట్రెండ్ రీడర్ అని చెప్పొచ్చును.
మా పిల్లలు అడియో వీడియో క్యాసెట్లు తెచ్చి వింటూండడం, సినిమాలు చూస్తుండడం మూలంగా.... నా దృష్టి మధ్య మధ్యలో 'రజనీష్ ఫిలాసఫీ' 'జిడ్డు కృష్ణమూర్తి ఐడియాలజీ'ల మీంచి మళ్ళి....వాటి మీద పడకుండా ఆపలేకపోవడంచేత.... నా మెదడు కంప్యూటర్ లో అప్రయత్నంగా రికార్డ్ అయిపోయిన కొన్ని సినిమా పాటల తాలూకు పల్లవులో చరణాలో ట్యూన్స్ తో సహా వల్లె వేయగలను. రసవంతమైన గమ్మత్తు పాటలు అవి.
"జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో! మారిందయ్యో.... మారిందయ్యో.... 'పువ్వుకు' రంగు మారిందయ్యో...." అనే ఒక పాటలో పువ్వు అనేచోట శ్రద్ధగా వినండి. సినీ మాయాజాలం అర్ధం ఔతుంది. "మదన జనక నీ నెత్తి మీద టోపీ వెనక్కి జరిగిందేమిటో, పడుచు గుమ్మ పూకొరకు గుడిశెలో నేరక దూరిన పాపమే" అని ఓ పాటలో.... "ఏందిబే ఎట్టాగ వుంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చేప ముల్లు.... ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, సఠ్టిలో సరుకేదో నింపుకెళ్ళు" అని ఓ చోట.... ఇలా చెప్పుకుంటూపోతే ఓ వెయ్యికి పైగా నేనే టీకా తాత్పర్యాలతో సహా నొక్కి వక్కాణించగల పాటలున్నాయి. పదాల గారడీలో అశ్లీలాన్ని దాచుకుని ఇంటింటా రేడియోల్లో టేప్ రికార్డర్స్ లో మోగుతున్నాయి. జాలాది అని నేనెంతో ఇష్టపడే కవి— ఈమధ్య ఓ చిత్రంలో చాకచక్యంగా రాసిన పాటలో "చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో దున్నేవాడే ఓయమ్మలో— గుచ్చీ గుచ్చీ కన్నె గుండెలో గుమ్మెత్తించే ఓయమ్మలో— జుంటి తేనెకై చంటి పూవుతో సరసమాడుతుంటే— ఆ రేకు విప్పుకుని సోకులాడి మళ్ళీ మళ్ళీ పడుతుంటే" అంటాడు. ఎంతటి భాషాచాతుర్యం భావసౌందర్యం కదం దొక్కుదోంతో ఆ పాటలో రసజ్ఞులు గ్రహించకపోలేదు.
సినిమాల సంగతి వదిలేయండి. మన పత్రికల భోగట్టా ఎలా వుంది? నేను చెబుతుంది మామూలు కుటుంబ పత్రికలు. సెక్స్ ఎడ్యుకేషన్ ముసుగులో ఎంత విజృంభిస్తున్నాయో మనం గ్రహించటం లేదనా? హస్త ప్రయోగం గురించి, రతి జరిపే విధానం గురించి, అంగ చూషణం గురించి, లింగ స్థంభన గురించి, కన్నెపొర గురించి, అవయవ పరిణామాల గురించి, ప్రశ్నలు-జవాబుల రూపంలో చెప్పిందే చెప్పి, రాసిందే రాసి, కుతిదీరా కసిదీరా ఎడా పెడా ప్రచురిస్తోంటే ఎంత హాయిగా చదువుకోవటం లేదు మనం. జనం. మనజనం.
కుటుంబ నియంత్రణ ప్రకటనలు ఎంత బాహాటంగా అంతా విడమర్చి చెప్పటంలేదూ? ఈ నిరోధ్ ఏంటి తాతయ్యా, కామసూత్ర కాండోమ్స్ అంటే ఏంటి తాతయ్యా అని మా మనవడే నన్నడిగాడంటే అది కాలమహిమ కాదనగలరా? శృంగారం, సెక్స్, బూతు.... ఏదైతెన్నే కథల్లో స్పష్టంగా చోటు చేసుకుంటోంది. బ్లూఫిలింలు విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతున్నాయి. ఇంటర్ మీడియేట్ చదువుకుంటోన్న ఏడుగురు అబ్బాయిలు (మా ప్రాంతంలోనే) వారానికి కనీసం ఒక్కసారైనా అందరూ కలిసి నీలిచిత్రం చూస్తుంటారని ఈమధ్యనే బైటపడి నానా గొడవ అయ్యింది.
ఇదంతా నేరమనీ, ఘోరమనీ నిందించటం లేదు నేను. సమాజం చెడిపోతోందనీ వాపోవటం లేదు నేను. SEX AWARENESS మనిషికి అవసరం. పరదాల చాటు సరదాగా, గుప్పిట్లో గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్న కొలదీ బహిరంగంగా రహస్యంగా వర్ధిల్లుతూంటుంది. అదేం దురదృష్టమో, ఈ దేశంలో సెక్స్ అనేది ఒక హిపోక్రసీ. తాను చదివి, చూసి, అనుభవించి, ఆనందించి, పరవశించి, తన్మయత్వం చెంది బైటకొచ్చి పదిమంది ముందు— "ఛ ఛ సెక్స్ండీ, వెధవ సెక్సు, మరీ టూమచ్ అయిపోతోందీ మధ్య...." అని కబుర్లు చెప్పే హిపోక్రాట్స్ ఎన్ని లక్షలమంది లేరు?
సెక్స్ జుగుప్సాకరంగా కాకుండా అందంగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటంత ఆహ్లాదంగా చతురంగా రాయగల సత్తా వున్న నవలా రచయితలు లేరు అని ఘంటాపధంగా చెప్పొచ్చు. కానీ....
తెన్నేటి దగ్గర శైలి వుంది. అతని రచనల్లో ఆ చాతుర్యం తొంగి చూస్తూంటుంది. మోతాదు మించకుండా ఆరోగ్యవంతమైన ముచ్చటైన సెక్స్ అద్భుతంగా రాయగల దమ్ము అతనికుంది.
'సంధ్యావందనం' చదవమని అడిగాడు తెన్నేటి. ముద్రణ అయ్యాక చదువుతానులే అన్నాను. అలాకాదు, దీనికి మీరే ముందుమాట రాయాలి, మీరు బావులేదు అంటే వ్రాతప్రతిని చింపి పారేస్తాను, అని రిక్వెస్ట్ చేసాడు. ఐతే చదివి వినిపించమన్నాను.
నవల ఎత్తుకోవడంలోనే అర్ధమయ్యింది. సంధ్యావందనం చవకబారు సెక్సు నవల కాదని. యాభై పేజీలు చదివేసరికి నాకు బోలెడంత ఆశ్చర్యం వేసింది. అలా రాయటం అందరికీ సాధ్యం కాదు. నవల సగం దాటాక నాక్కొంచెం భయం వేసింది. నవల క్లయిమాక్స్ కి చేరుకుంటూ వుంటే నేను పట్టరాని ఆనందంతో "శభాష్ తెన్నేటి" అని అభినందించకుండా వుండలేకపోయాను. నవల నామకరణం చెయ్యటమే ఎంతో గొప్పగా చేసాడనిపించింది.
I loved the frankness, the straight and bold way of expression, the Anonymous style of putting it into sentences and sequences.
చిరంజీవి 'తెన్నేటి' భవిష్యత్తులో మరింత పదునైన, ఆలోచనాత్మక, సంచలన రచనలు చెయ్యాలని ఆశీర్వదిస్తూ -
భాగవతుల లక్ష్మీనారాయణమూర్తి
(బియెల్లెన్)
25-9-93
హైద్రాబాద్
•
Posts: 573
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
మననం చేసుకోదగిన మొదటి అధ్యాయం - వికటకవి గారు అందించిన టైపుప్రతి నుండి :
Quote:సెక్స్...
ఛి....పాడు...బూతు...
సెక్స్...
ష్...రహస్యం...హిపోక్రసీ...
సెక్స్...
నిషేధింపబడిన స్వప్నం...నిక్షేపించబడిన స్వర్గం.
సెక్స్...
రెండు నగ్న శరీరాల మధ్య...
స్త్రీ పురుషుల మధ్య...
కొన్ని నిముషాల రాపిడి...
అది ఒక రంగుల చిత్రం. అది ఒక అద్భుతం. అది ఒక పునాది. అనాదిగా సకల చరాచర సృష్టికీ మూలాధారం. ఆడమ్ అండ్ ఈవ్ లతో మొదలయ్యిందది.
ఊహలు. స్పందనలు. ప్రతిస్పందనలు. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం. సరసం. మధురసం. ఆహ్లాదం. ఆనందం. తాదాత్మ్యలు పరవశం రిలాక్స్
పెర్వెర్షన్.
పశుత్వం.
రాక్షసత్వం.
పైశాచికం.
సరళం.
కఠినం.
అపారం. ఆనందం. అద్వితీయం. అపూర్వం. అఖండం. అజరామరం. అనిర్వచనీయం. నిశ్శబ్దం. మౌనం. రభస. తపన. ఆరాటం. పోరాటం. గెలుపు. ఓటమి, సర్వస్వం.
సెక్స్...సెక్స్...సెక్స్...
ఆడది...మగాడికోసం సృష్టించబడిన విలాసవస్తువు
అఫ్కోర్స్!
మగాడు కూడా... ఆడదానికోసం సృష్టించబడిన విలాసవస్తువే.
పొరపాటు ఆడదే చేస్తోంది.
మగాడికి పెద్దపీట వేసి, మగాడికి అనవసరమైన ఆధిక్యతనిచ్చి, తనని తాను పరోక్షంగా కించపరుచుకుంటోంది.
సెక్సీగా కనిపించే ఆడదాన్ని చూడగానే మగాడెంతగా స్పందిస్తాడో...
హాండ్ ఫుల్ గా హాండ్ సమ్ గా వుండే మగాడిని చూసి ఆడదీ అంతగా స్పందించే అవకాశం లేకపోలేదు.
ఆడది తనకు తానే ఓ పరిధిని సృష్టించుకుంటోంది.
మగాడు ఆ పరిధిని ఆమె ప్రపంచంగా నిర్దేశిస్తున్నాడు.
బలవంతులు దుర్బలజాతిని ఎక్సప్లాయిట్ చెయ్యటం సర్వ సహజమైన సాంఘిక దురాచారం.
బలవంతుడు మగాడైతే ఎక్సప్లాయిట్ చెయ్యబడేది ఆడది.
బలవంతురాలు ఆడదైతే ఎక్సప్లాయిట్ చెయ్యబడేది మగాడు.
తను ఏ విధంగానూ మగాడికన్నా బలహీనం కాదని, ఇన్ ఫాక్ట్, మగాడికన్నా వెయ్యిన్నొక్క రెట్లు బలవంతురాలినని నమ్మే ఆడవాళ్ళు నానాటికీ పెరుగుతూనే వున్నారు.
విష్ యు గుడ్ లక్ మేడమ్స్, డీమ్స్, వుమెన్, గర్ల్స్...ఎండ్ ది ఫిమినైన్ బ్రీడ్.
కుడోస్ టు ది విమెన్ కైండ్.
•
Posts: 2,160
Threads: 246
Likes Received: 1,329 in 807 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
నేను టైప్ చేసినది మీ దగ్గర వుంటే మొత్తంగా ఇక్కడ పోస్టు చెయ్యగలరు.
•
Posts: 573
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
12-11-2018, 06:18 PM
(This post was last modified: 18-02-2019, 12:25 PM by ~rp. Edited 2 times in total. Edited 2 times in total.)
^ పూర్తిగా లేదండీ ..
•
Posts: 2,160
Threads: 246
Likes Received: 1,329 in 807 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
•
Posts: 14
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
•
|