Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
29-11-2019, 11:16 AM
(This post was last modified: 29-11-2019, 01:17 PM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
మిత్రులారా...
XossipY తొలి యేడాదిని పూర్తిచేసుకుని దాదాపుగా నెలరోజులు కావొస్తోంది.
ఈ సందర్భంగా నేను రివైండు సైకిలేసుకుని బయలుదేరాను. అయితే... నిజంగా సైటు దిగ్విజయంగా తొలి మజిలీని చేరుకుందా?
ఇకపై ఎలాంటి సమస్యలూ లేనట్టేనా...?
హ్మ్... ఆ విషయం గురించి చివర్లో మాట్లాడుకుందాం...!
ముందుగా, ఈ యేడాది ప్రయాణాన్ని ఓమాటు గుర్తు చేసుకుందాం... మనందరి కోసం!
Xossipy : రివైండ్ @ 365
పార్ట్ - 1
గత ఏడాది సడెన్ గా eXbii మూతపడిందనగానే చాలా వెలితిగా అన్పించింది. ఎన్నో అనుభవాలు... పరిచయాలు... కథలు... అన్నీ అర్ధాంతరంగా ముగిసిపోయాయి.
ఐతే, అంతకుముందే సరిత్ బ్రో తానొక సైట్ ని నిర్మిస్తున్నట్లు తెలపడంతో వెళ్ళి చూశాం. ఇంకా నిర్మాణ దశలోనే(prototype) వున్న ఆ సైట్ ని చూశాక eXbii లాంటి మహాసముద్రంలో ఈదులాడాక ఒక పిల్లకాలువలోకి దిగినట్లు అన్పించింది. ఐతే, అదే సమయంలో మిత్రుడు సరిత్ సంకల్ప బలం అర్ధమైంది. ఒక సైట్ ని తయారు చెయ్యటం, నడపడం వంటివి తెలియకపోయినా, ఎటువంటి అనుభవం లేకపోయినా... తుఫానులో తలో దిక్కుకు కొట్టుకుపోయిన మిత్రులని మరలా ఒక చోట కలపడానికి, రైటర్స్ తమ కథలను కొనసాగించడానికి, పాత కథలని, శీర్షికలను నిక్షిప్తం చెయ్యడానికి ఒక వారధిని నెలకొల్పడం మామూలు మాటలు కాదు... అందుకు కావలసిన కార్యాచరణలో మరో మిత్రుడు శివారెడ్డి అందించిన తోడ్పాటు అనిర్వచనీయమైనది.తమ చేతి చమురుని వదులుకొని ఒక మహా యజ్ఞానికి పూనుకున్నారా యిద్దరూ...
'మన్మధలీల' అని మొదట వారు సైటుకి పెట్టుకున్న పేరుని పాత xossip మెంబర్స్ కి మరింతగా చేరువయ్యేలా ఒక క్యాచీ పేరుని తర్వాత సూచించారు.
అలా పుట్టిందే.... ఈ XOSSIPY.
క్రితం సంవత్సరం దసరాకి తయారు చేసిన లోగో...
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
29-11-2019, 11:18 AM
(This post was last modified: 29-11-2019, 11:20 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 2
XOSSIPY పేరుని అందరూ ఆమోదించాక ఫోరమ్ కి అలా నామకరణ ప్రక్రియ జరిగింది. అయినా ఏదో వెలితి. ఫోరమ్ interface చూడ్డానికి అంత బాగుండలేదు. కానీ, అంతకన్నా ఏం ఆశిస్తాం? మనకు చేతకాదు. 'ఐనా... ఇలా చెయ్యటమే చాలా కష్టం' అని అనుకున్నాన్నేను.
![[Image: IMG-20191106-143622.jpg]](https://i.ibb.co/hVchgh5/IMG-20191106-143622.jpg)
ఐతే... సరిత్ మరియు శివ తెరవెనుక గతించిన సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నారని మాకెవ్వరికీ తెలియదు. మెల్లిగా ఆ ప్రక్రియ జరిగిపోతున్నది.
ఒకనాడు సరిత్ గారు వారు తయారు చేసిన కొత్త Xossipy ముఖాన్ని నాకు చూపించారు.
అద్భుతం!
అచ్చంగా పాత xbని చూస్తున్న భావన కలిగింది.
చిన్న పిల్లాడికి మళ్ళే ఉత్సాహంగా ఆ సైట్ లో కలియతిరిగాను. కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనం మాదిరి ఫోరమ్ మొత్తం ఖాళీగా వుంది. కానీ, ఆ interface నాకు చాలా నచ్చేసింది. అలాగే, కొత్త ఫీచర్లు కొన్నింటిని తెలుసుకున్నాను. కొన్ని అవసరమనిపించిన మార్పులను సూచించాను.
కొన్నిరోజులు గడిచాయి.
ఆ సరికొత్త మాధ్యమం యొక్క పనితీరుని సరి చూసుకొన్నాక ఒక మంచి రోజుని చూసుకొని గతేడాది నవంబర్ నెల నాల్గవ తేదీన లాంఛనంగా ఈ www.Xossipy.com ని ప్రారంభించడం జరిగింది.
అదీ ఆరంభం!
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
Xossipy : రివైండ్ @ 365
పార్టు - ౩
అందరూ ఈ కొత్త XossipYని చూసి మొదట అబ్బురపడ్డారు. తర్వాత ఆనందపడ్డారు... అభినందించారు.
అచ్చంగా xbని పోలి వుందన్న మాట పలుమార్లు కనపడినది.
అందరూ తమ పోస్టులని కొత్త ఫోరమ్ లో అప్డేట్ చెయ్యటం ప్రారంభించారు. సరిత్-శివలకు కృతజ్ఞతలు తెలుపుకోవటం పరిపాటిగా మారిపోయింది.
లక్కీవైరస్ మొదలగు మిత్రులు వివిధ రచనలను కొత్తగా ముస్తాబు చేసిన 'పడగ్గది'లో పోగేశారు. ఎన్నెన్నో దారాలను తెరిచారు.
మరోవైపు ఇంకా బోసిగా పడి వున్న అనేక సెక్షన్లని నింపే ప్రయత్నంలో పడ్డాం మేము.
అదే సమయంలో, మిత్రుడు pastispresent ఒక లోగోను ఫోరమ్ కోసం తయారు చేశారు (అది లభ్యం కాలేదు కనుక చూపించట్లేదు). మరో మిత్రుడు ~rp చక్కని ట్యాగ్ లైన్ సూచించారు. (info - fun - masti)
అప్పటివరకూ నేనూ XossipYకి ప్రత్యేకంగా లోగో పెట్టాలనే అలోచనలోనే వున్నాను... pastispresent పెట్టిన లోగో నాకో కొత్త inspiration ఇచ్చింది. Xb స్టైల్ లో ఒక లోగోని డిజైన్ చేద్దాం అనుకుని ప్రయత్నించాను.
XossipY కోసం నేను మొదట Design చేసిన Name Logo...
అలా ఫోరమ్ లో చక్కగా పని జరుగుతున్న సమయంలో కొందరికి కన్ను కుట్టింది.
అసూయా ద్వేషాలను మనసులో నింపుకొన్న దేవుని బడ్డ ఒకరు ఆ తండ్రి(godfather) వేషంలో వచ్చి అక్కసు వెళ్ళగక్కి పోయారు.
అలాగే, ఫోరమ్ మొదలెట్టి నెలరోజులు అయ్యిందనే ఆనందంలో మరో ఇబ్బంది తలెత్తింది. బోర్డు లెక్కల విషయంలో తేడాలొచ్చి ఏడ్చి 'గీ'పెట్టిన లక్కీ'జీ'వుడు అలకబూని 'ఏకాంతం ముగిసింద'ని చెప్పి సెలవు తీసుకున్నాడు. ధన్యుడు!
ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే!
ముందుంది మొసళ్ళ పండగ! మీరు చదివినది కరెక్టే... Infront there is Crocodiles festival!
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
29-11-2019, 11:26 AM
(This post was last modified: 29-11-2019, 11:28 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 4
అలా కొన్ని కొన్ని పిల్లమూకల పిచ్చి చేష్టలను (నన్ను కూడా కలిపి చెప్పుకుంటున్నాను ;)) ఓర్పుతో భరిస్తూ నేర్పుగా ఫోరమ్ ను ముందుకి నడిపించసాగారు అడ్మిన్లు.
అడపాదడపా డేటా చౌర్యం గురించి boltikhani వంటి పలు సైట్ల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి. అలాంటి సమయంలో అనుభవలేమి వారిని వెక్కిరించినా పట్టుదలతో వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
క్రమంగా జనాదరణ పెరిగి నెమ్మనెమ్మదిగా ఫోరమ్ లో మెంబర్స్ పెరిగారు. దాంతో ఓ వైపు సంతోషంగా వున్నా మరోప్రక్క భయం పెరిగింది. 'ఇంతమందిని తట్టుకునేంత చోటు ఫోరమ్ లో వుందా?'
అందుకు తగ్గట్లే సూచనలు కనపడసాగాయి. అప్పుడప్పుడు ఫోరమ్ హ్యాంగ్ అయిపోయేది.
'మంది పెరిగేకొద్ది...' అన్నట్లు జనం రద్దీ వలన సైట్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతమంది ఆదరణ లభించడం ఆనందాన్ని కలిగించినా, పదేపదే సైట్ కి అంతరాయం కలగటం కన్నీరు పెట్టించింది.
అడ్మిన్లు రకరకాలుగా ప్రయత్నించారు. మరింత సొమ్ముని పెట్టి బెటర్ సెర్వర్ ని కొనుగోలు చేశారు. అయినా, అదీ సరిపోలేదు.
![[Image: PIC-1.png]](https://i.ibb.co/F5NzKDs/PIC-1.png)
రోజుకి 80 వేలమంది ఫోరమ్ లో సంచరిస్తుండటంతో వెబ్ ట్రాఫిక్ అమాంతం పెరిగి సెర్వర్ తట్టుకోలేకపోయింది. అడ్మిన్లు తాత్కాలిక ఏర్పాట్లతో కొంతకాలం సైట్ కుంటి నడకను సాగించింది. చివరికి ఫోరమ్ నిర్వహణ ఖర్చు అడ్మిన్లకి తలకి మించిన భారంగా మారింది. ఏం చెయ్యాలి?
ఇలాగే కొనసాగితే చరిత్ర తప్పక పునరావృతం అవుతుంది. ఈ సైట్ కూడా పాత XB మాదిరి మూత పడవలసినదే...
ఏమిటి మార్గం...?
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 5
Exbii లేని లోటుని ఇన్నిరోజులుగా పూడుస్తున్న Xossipy కూడా మూత పడే రోజులు దగ్గర పడ్డాయా?
సైట్ నిర్వహణ భారం కొండలా పెరిగిపోతోంది. నిధులు చూస్తే చాలా తక్కువగా వున్నాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు. మా అందరిలో స్పష్టంగా భయం కనపడసాగింది. అదే సమయంలో నిలబడగలమనే సంకల్పం కూడా మాలో ఉంది.
ఐతే, ఏం చెయ్యాలి? ఎలా కాపాడుకోవాలి?
కనీసం 240 USD (అంటే మన రూపాయిల్లో సుమారుగా ₹18,000/-) కావాలి సైట్ ని బ్రతికించుకోవటానికి. ఇది కేవలం ఒక్క నెలకి మాత్రమే! ఆ తర్వాత ఫోరమ్ తిరిగి సక్రమంగా పని చెయ్యటానికి ఇంకా చాలా ఖర్చవుతుంది.
ఓప్రక్క సైట్ ట్రాఫిక్ అధికమైపోతోంది... రోజుకి ఎనభై -ఎనభై ఐదు లక్షల చిల్లర జనం ఫోరమ్ ని సందర్శిస్తున్నారు. దానివలన లోడింగ్ కి ఎక్కువ సమయం అవుతోంది.
దాన్ని కాస్తయినా తగ్గించడానికి కంపల్సరీగా రిజిస్టరు చేసుకున్నవాళ్ళకే ఫోరమ్ ని సందర్శించడానికి అనుమతించడం జరిగింది.
ఇక ఆదాయం పెంచుకోవడం కోసం ఎటువంటి మార్గాలు ఉన్నాయా ఆని ఆలోచించసాగారు.
యాడ్స్ ద్వారా సమీకరించవచ్చునని అనిపించింది. అయితే, గూగుల్ adsense వాళ్ళు అడల్ట్ కంటెంట్ ఉన్న సైట్లలో తమ యాడ్లను పెట్టడానికి అనుమతించరు.
దాంతో, ఎడల్ట్ యాడ్లు అనే ఆప్షన్ తెరపైకి వచ్చింది. వాటిని పెట్టవచ్చు కానీ, వాటికి సంబంధించి అడ్మిన్లకి సరయిన అవగాహన లేదు. స్వతహాగా సరిత్ గారికి యాడ్ల సంద్రాన్ని ఈదుతూ సైట్ ని యాక్సెస్ చెయ్యటమంటే మొదట్నుంచీ పరమ చిరాకు. అందుకే, ముందునుంచి సైట్ లో యాడ్స్ ని పెట్టాలనే ఆలోచనని వ్యతిరేకించారు.
పైగా ఈ ఎడల్ట్ యాడ్స్ ప్రొవైడర్లు సైట్లని హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని కూడా సమాచారం ఉండటంతో ఆ ఆప్షన్ ని తప్పనిసరి అయితేనే పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానించుకున్నారు.
ఇక మరో దారి... మెంబర్ల నుంచి డొనేషన్లు స్వీకరించడం.!
అప్పటికే ఫోరమ్ లో రిజిస్టర్ అయ్యిన మెంబర్ల సంఖ్య రమారమీగా అరవై వేలు దాటింది. కంపల్సరీ రిజిస్ట్రేషన్ కి వెళ్ళినందుకు రోజూవారీ సందర్శకుల సంఖ్య తగ్గినా ఫోరమ్ లో రిజిస్టర్ చేసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. ఈ విశేష ఆదరణ చూసి కొందరికి కన్నుకుట్టి ఫోరమ్ పై దుష్ప్రచారం చెయ్యాలని కొన్ని పిపీలక సైట్లు ప్రయత్నించాయి, అది వేరే సంగతి.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే, బెటర్ సెర్వర్ ని అద్దెకు తీసుకోవటానికి అప్పటికే తమ పరిధికి మించిన సొమ్ముని వెచ్చించారు అడ్మిన్లు. ఏదో ఒక పరిష్కారం లభించకపోతే సెప్టెంబరు మాసం కల్లా సైట్ ని మూసెయ్యాల్సి వస్తుంది.
దాంతో, సైట్ మనుగడ కోసం డొనేషన్లని స్వీకరిస్తున్నట్లు అందరికీ మెసేజీలు పెట్టాలని తలిచారు. కానీ, ఇక్కడొక చిక్కొచ్చింది.
ఎటువంటి మాధ్యమం ద్వారా సొమ్ముని డొనేట్ చెయ్యమని అడగాలి?
మామూలు సైట్లలోలా బహిరంగంగా డొనేట్ చెయ్యటానికి ఎవరూ ఇటువంటి సైట్లలో అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా గోప్యత పాటించడం చాలా ఆవశ్యకం. అసలు డొనేట్ చెయ్యాలి అన్నందుకే ఆమడ దూరం పారిపోయినవాళ్ళూ ఉన్నారులేగానీ, ఎంతోకొంత సహాయం చెయ్యాలనుకునేవారికి సహేతుకమైన మాధ్యమాన్ని ఏర్పరచాలని భావించి పలువురిని సంప్రదించి, అనేక సమాలోచనలు జరిపాక ఆఖర్న amazonpay, paypal ద్వారా డొనేట్ చెయ్యమని ఫోరమ్ లో ప్రతి చోటా సందేశాలను ఏర్పాటు చేయటం జరిగింది.
మొదట కొందరు ఈ ఆలోచనను సమర్ధిస్తే మరికొందరు వ్యతిరేకించారు. నడపలేకపోతే మూసేయమని మొహం మీదే తేల్చి చెప్పేశారు ఇంకొందరు.!
ఇలాంటి సైట్లలోకి వచ్చేది కేవలం ఆనందం కోసం... అంతేగానీ, అందుకోసం డబ్బులిచ్చేంత కమిట్మెంట్ ఎవరికీ వుండదు అంటూ వాపోయారు.
eXbii పోయి Xossipy వచ్చే డుం డుం డుం... Xossipy పోతే మరోటి వస్తుందిలేఁ డుం డుం డుం... అంటూ పాటలేసుకున్నారు!
ఇటుప్రక్క డొనేషన్ ప్రక్రియ మెల్లగా నడుస్తోంది. సభ్యులకి నగదు పంపడంలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. వారి సందేహాలను తీరుస్తూ డనేట్ చేసే ప్రక్రియని తెలియజేసాం... ప్రతి ఒక్కరూ కనీసం ఒక డాలరు లేదా వంద రూపాయలను ప్రతి నెలా చెల్లించి ఫోరమ్ మనుగడకి దోహదపడవలసినదని అన్ని సెక్షన్లలో పదే పదే మెసేజీలను పోస్టు చేశాం.
మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తినా వాటిని ఓపికతో ఎదుర్కొన్నారు.
నెమ్మనెమ్మదిగా డొనేషన్లు పెరగసాగాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం అందరికీ సంతోషాన్ని పంచాలనే సంకల్పంతో ఫోరమ్ ని నడిపించిన అడ్మిన్ల కష్టాన్ని పంచుకోవటానికి సభ్యులందరూ తలో చెయ్యి వెయ్యసాగారు.
Contributions made by some members...
Acknowledged by the Admin time to time...
ఇదంతా చూస్తే నమ్మకం, అభిమానం అనే మాటలకి ఇంతకంటే సరైన నిర్వచనాలు ఇంకెక్కడ లభిస్తాయి అనిపించింది.
సభ్యులందరి అపూర్వ సహకారంతో ఫోరమ్ గడ్డు పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొని నేటికిలా రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టగలిగింది.
ఈ మొదటి మజిలీని చేరుకునే ప్రయాణంలో ఫోరమ్ లోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఎంతలా ప్రోత్సాహించుకున్నారో అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇక ముందు కూడా కలిసి అడుగులేస్తే...
సుదూర ప్రయాణమైనా అలుపు వుండదు.
లేశమాత్రమైనా విసుగు దరిచేరదు.
ఎప్పటికీ యీ అనుబంధం వీగిపోదు.
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
29-11-2019, 12:47 PM
(This post was last modified: 29-11-2019, 01:20 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
చివరిగా... ఒక మాట!
సెర్వర్ ని కొనుగోలు చెయ్యడానికి అడ్మిన్లు సేకరించిన సొమ్ము అప్పుడే చాలావరకు అయిపోయింది. ఇటీవలే శివారెడ్డి మరలా కొత్త సెర్వర్ ను మార్చారు. అది మరికొన్ని నెలల వరకు మాత్రమే ఫోరమ్ ని కాపాడుతుందని సమాచారం.
ఈ పరిస్థితులలో ఫోరమ్ నిర్విరామంగా కొనసాగాలంటే అందరూ మరలా నడుం బిగించాలి. ప్రతి నెలా మీకు తోచినంత కాంట్రిబ్యూషన్ ని డొనేషన్ల రూపంలో అందించగలరు. (కనీసం నెలకి ఒక డాలరు లేదా ఒక వంద రూపాయిలు డొనేట్ చేసినా చాలు.)
అలాగే, అడ్మిన్ల ద్వారా పోస్టు చేయబడిన ఆడియో, విడియో, డాక్యుమెంట్ ఫైల్స్ (shortearn.eu) ఏమైనాసరే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి వెయ్యి డౌన్లోడ్లకీ వారికి నాలుగు డాలర్లు వస్తాయి. కనుక, ఈ తీరుగా కూడా మీరు ఫోరమ్ కోసం కాంట్రిబ్యూట్ చేయవచ్చు.
ఇకపోతే, ఈ రివైండు @ 365 సైకిల్ ద్వారా
నేను చేసిన యీ చిరు ప్రయత్నం వలన ఎవరికైనా పొరబాటున మనసుకి బాధ కలిగినట్లయిన వారికి నా క్షమాపణలు. ఒకవేళ నచ్చితే అదో తుత్తి!
ఇక ఉంటాను మరి!
జైహింద్
మీ
వికటకవి ౦౨
ఇంకా ఈ రోలర్ కోస్టర్ జర్నీ ముగిసిపోలేదు.
గెట్... సెట్... XossipY...!
•
Posts: 380
Threads: 0
Likes Received: 249 in 201 posts
Likes Given: 437
Joined: Nov 2018
Reputation:
1
very very nice kavi garu!!! 1 year journey ni summarize chesaru...
Posts: 1,178
Threads: 0
Likes Received: 804 in 629 posts
Likes Given: 879
Joined: Nov 2018
Reputation:
13
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
ఏడిపించావ్ అన్నా..
ఛా.. మొదట్నుంచీ మీకు చేదోడు వాదోడుగా ఉండలేదని ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది.
ఇక నా పని మంచి కథలు రాసి మెంబెర్స్ పెరిగేలా చెయ్యడమే
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(29-11-2019, 02:14 PM)readersp Wrote: very very nice kavi garu!!! 1 year journey ni summarize chesaru...
గత ఏడాది ప్రయాణాన్నే కాదు మిత్రమా... ఇప్పుడున్న సమస్యలను గురించి కూడా ప్రస్తావించాను. మరలా మిత్రులు ముందుకొచ్చి తోడ్పాటుని అందించకపోతే తర్వాత మజిలీని చేరటం కష్టమైపోతుంది.
ఒక నెలలో అందరూ ఎన్నోరకాల ఖర్చులు పెడుతూ వుంటారు. ఒక్క 100 రూపాయిలు అందులోంచి ప్రక్కకి తీసి అందరూ సైట్ మనుగడ కోసం తలో చెయ్యి వెయ్యండి.
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
19-12-2019, 10:25 PM
(This post was last modified: 19-12-2019, 10:28 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
(29-11-2019, 02:21 PM)Madhu Wrote: Keep going
ఇకమీదట కూడా అందరం కలిసి అడుగేస్తే మీరు చెప్పినట్లు ఈ ఫోరమ్, నేను వ్రాసే ప్రయాణం మరింత రసవత్తరంగా సాగిపోతుంది మధు...
నా తర్వాత అప్డేట్ కావాలంటే ఈసారి సపోర్టు ఇంకాస్త గట్టిగా కావాలి!
ఎంత గట్టిగా అంటే... వచ్చే పది వసంతాలకి ఫోరమ్ నిలబడేందుకు సరిపోయేంత!
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
19-12-2019, 10:36 PM
(This post was last modified: 19-12-2019, 11:03 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Drool
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
(16-12-2019, 12:04 AM)naresh2706 Wrote: ఏడిపించావ్ అన్నా..
ఛా.. మొదట్నుంచీ మీకు చేదోడు వాదోడుగా ఉండలేదని ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది.
ఇక నా పని మంచి కథలు రాసి మెంబెర్స్ పెరిగేలా చెయ్యడమే
మంచిది నరేషా...
ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం... ఇంపాక్ట్ పడిందా లేదా అన్నదే ముఖ్యం. నీలాగే, ప్రతీ రచయిత(త్రి), పాఠకుడు(రాలు) కలిసి ముందుకి వచ్చి డొనేషన్ విషయంలో మిత్రులందరికీ సందేశాలను ఇస్తే బాగుంటుంది.
నువ్వు కూడా నీ కథలను వ్రాయడమే కాదు. కుదిరినంతవరకు మిగతా దారాలనూ సందర్శించి మిత్రులను ప్రోత్సాహించు. అలాగే, సైట్ కాంట్రిబ్యూషన్ గురించి చేతనైనంతవరకు ప్రచారం చెయ్. ఆల్రెడీ నీ సిగ్నేచర్ లో పెట్టావ్, బాగుంది. కానీ, నీ మార్కు సెగ అందరికీ తగిలేలా ఎప్పటికప్పుడు మార్చుతూ వుండు.
•
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
May the new year be filled with brightness and hope so that darkness and sadness stay away from you.
Happy New Year
2020
My Dear Friends
•
|