(05-11-2018, 09:38 AM)~rp Wrote: while appreciating the interest shown, sorry,
once again, I've to disagree with advertising.
at present, main focus needs to be survival.
we need not attract other languages people.
others have their own sites & blogs.
lets have our own limited group members
శృతిలో ఉంటే చక్కటి సంగీతం అవుతుంది.
శృతి తప్పితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది
మీరు చెప్పింది బావుంది. ఐతే... ఇతర భాషల వాళ్ళకు సెపరేట్ సైట్లున్నాయా లేదా అన్నది ప్రక్కన పెడితే... ఈ సైట్ లో ఇతర భాషలవాళ్ళకి కూడా చోటుంది. వాళ్ళ కథలనూ చదివే పాఠకులు వున్నారు.
XOSSIPలో అన్ని భాషల కథలూ చదివినట్లే ఇక్కడా అన్ని భాషల కథలూ చదివే హక్కు అందరికీ వుంటుందని నేను అనుకుంటున్నాను. దీనివలన తెలుగువాళ్లకు వచ్చే నష్టం ఏమీ వుండదు. పైగా ప్రజాదరణ పెరుగుతుంది. సైట్ గురించి పలుగురూ తెలుసుకుంటారు.
సంగీతంలో సప్త స్వరాలూ వున్నట్లే భాష అంటే తెలుగు, తమిళ, మళయాళ, హిందీ, ఇంగ్లీషు, బెంగాళీ అనేకం వున్నాయి.
భాష అనేది భావవ్యక్తీకరణకు ఒక వారధి. అంతేగానీ మనుషుల్ని విడదీసే గోడకాదు.
ఒక పాట శృతిలో పలకాలంటే స్వరాల సమన్వయం చాలా ఆవశ్యకం. "హాయి హాయిగా ఆమని సాగే...." పాటలో ఆ సంగీత దర్శకుడు ఏడు రాగాలలో తయారు చేసి రసరంజకమైన గీతికని మనకు అందించాడు. అన్ని రాగాలు వాడటం వల్ల శృతి, లయ ఏమీ తేడా కాలేదే... చేసే పనిని శ్రద్ధాశక్తులతో చేస్తే ఏదీ రసాభాసగా అయిపోదు.
అయినా... సరిత్ బ్రో వున్నాడు. శంకరాభరణం శంకరరావులా "శారదా...!" అంటూ ఎలాంటి అపస్వరాన్నయినా అదుపు చేయగలడు. శంకరంలా మనం కాస్త చేయూతనిస్తే చాలు...
కనుక, ఇతర భాషలనూ, మనుషులనూ వ్యతిరేకంగా చూడవద్దు. తప్పుగా మాటతూలితే... అది మనవాళ్ళయినా వదలొద్దు.
ఈ సైట్ చక్కగా అందరి మన్ననలను అందుకుని ముందుకు సాగిపోవాలని మనస్పూర్తిగా ఆశిద్దాం. అంతే!!!