01-01-2019, 11:30 AM
(This post was last modified: 01-01-2019, 11:31 AM by Vikatakavi02.)
రోగిని పేరు అడగగానే.... వైద్యుణ్ణి పరిగెత్తించి మరీ కొట్టారు
అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్‌దేవ్ ఆసుపత్రి(జీఎన్డీహెచ్)కి చికిత్స పొందేందుకు వచ్చిన మహిళను వైద్యుడు ‘నీ పేరేమిటి?’ అని అడిగారు. దీనిని విన్న ఆమె బంధువులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనపై వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. దీనికితోడు ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యులు నిందితులపై సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెసిడెంట్ డాక్టర్ ఈ ఉదంతాన్ని వివరించారు. డాక్టర్ సచిన్ వర్థన్ డ్యూటీలో ఉన్న సమయంలో 8మంది వ్యక్తులు ఒక మహిళా రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ సచిన్ ఆమెకు వైద్యచికిత్స అందిస్తూ ‘నీ పేరేమిటి?’ అని అడిగారు. దీంతో ఆమెతో వచ్చినవారంతా ఆగ్రహం వ్యక్తంచేస్తూ వైద్యుడితో ‘నీకెందుకు చెప్పాలి?’ అన్నారు. ఇంతటితో ఆగకుండా వారంతా సదరు వైద్యునిపై దాడికి దిగుతూ ఆసుపత్రిలో నానా గందరగోళం సృష్టించారు. తన గదిలోకి వెళ్లిపోయిన ఆయనను వదలకుండా కొడుతూవచ్చారు. అయితే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వైద్యుడిని కాపాడారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆసుపత్రి వెలుపల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అమృతపాల్ సింగ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రక్షణ కరువైందన్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలానే జరిగిందన్నారు. ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK