Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ దారుణాన్ని ఏమనాలి?
#1
ఈ దుర్మార్గాన్ని ఏమనాలి?
  • తీవ్రంగా కొట్టారు
  • వివస్త్రను చేసి వీధుల్లో పరిగెత్తించారు
  •  యూపీలో పట్టపగలు దారుణం

[Image: 30hyd-main10a_2.jpg]
భదోహీ: పట్టపగలు కొందరు దుర్మార్గులు ఓ మహిళను దారుణంగా కొట్టి, వివస్త్రను చేశారు. తోడేళ్లలా వెంటపడి నడివీధిలో పరుగులు పెట్టించారు. ఆ నిస్సహాయురాలు తీవ్రంగా భయకంపితురాలైంది. దీన్ని ఆ ఊరంతా చూసింది తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొందరు వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. సభ్య సమాజం అనేది ఒకటి ఉంటే మాత్రం ఈ దారుణాన్ని చూసి తలదించుకోకుండా ఎదురుతిరిగి ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహీ జిల్లా గోపీగంజ్‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో శనివారం ఈ దౌర్జన్యకాండ కొనసాగింది. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే జులాయిల ఆగడాలను (ఈవ్‌ టీజింగ్‌) అడ్డుకోవడమే. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు రంగంలోకి దిగి ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని సెక్యూరిటీ ఆఫీసర్ సర్కిల్‌ అధికారి యాదవేంద్ర యాదవ్‌ ఆదివారం తెలిపారు. లాల్‌చంద్ర యాదవ్‌ అనే వ్యక్తి తనను వేధిస్తుంటే బాధితురాలు అడ్డుకుంది. దీంతో సాయంత్రం అతను మరో ముగ్గురితో కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి దారుణానికి ఒడిగట్టినట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు తెలిపారు. ఈ అమానుష కాండను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారని సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో గోపీగంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ యాదవ్‌ను అక్కడి బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.

Source : Eenadu.net

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
దారుణమని, ఘోరమని .. అంటూనే ఉంటాము.
ఇలాంటి దుర్ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.

మన భారతదేశం సంస్కృతీ నిలయమని గొప్పలు చెప్పుకుంటాం.
మన ఆలోచనలలో , ఆచరణలో సంస్కారం అడుగంటిపోతున్నది.
Like Reply




Users browsing this thread: