Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
#1
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

[Image: 637006039589298365.jpg]

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 370 అధికరణ రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, ఆ కొద్ది సేపటికే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడంతో ఇకకశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే సంక్రమించనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.
జమ్మూ-కశ్మీరు మహారాజు హరి సింగ్ 1927, 1932లలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా పాలితులు, వారి హక్కులను నిర్వచించారు. ఆ రాజ్యానికి వలస వెళ్ళినవారి హక్కులను కూడా క్రమబద్ధీకరించారు. 1947 అక్టోబరులో రాజా హరిసింగ్ భారత దేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. భారత దేశంలో విలీనమైన తర్వాత జమ్మూ-కశ్మీరు షేక్ అబ్దుల్లా పాలనలోకి వచ్చింది. ఆయన 1949లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, రాజ్యాంగంలో అధికరణ 370ని చేర్చేలా చేశారు. ఈ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తోంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగతావన్నీ జమ్మూ-కశ్మీరు అధికార పరిథిలోనే ఉంటాయని ఈ అధికరణ చెప్తోంది.
1952 ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1954లో జమ్మూ-కశ్మీరుకు వర్తింపజేశారు. ఈ అగ్రిమెంట్‌ను షేక్ అబ్దుల్లా, జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్నారు. అదే సమయంలో అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.
1956లో జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిలో గతంలో మహారాజా నిర్వచించిన శాశ్వత నివాసుల నిర్వచనాన్ని యథాతథంగా ఉంచారు. దీని ప్రకారం 1911కు పూర్వం రాష్ట్రంలో జన్మించిన లేదా స్థిరపడిన అందరూ శాశ్వత నివాసులవుతారు. లేదంటే, 1911కు పూర్వం పదేళ్ళ నుంచి ఆ రాష్ట్రంలో నివసిస్తూ చట్టబద్ధంగా స్థిరాస్తిని సంపాదించుకున్నవారు కూడా శాశ్వత నివాసులవుతారు. జమ్మూ-కశ్మీరు నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్ళిపోయినవారిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు. వారి రెండు తరాల సంతతిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు.
పర్మినెంట్ రెసిడెంట్ చట్టం వల్ల శాశ్వత నివాసులు కానివారు ఆ రాష్ట్రంలో స్థిరపడటం నిషిద్ధం. స్థిరాస్తిని కూడా సంపాదించుకోకూడదు, ప్రభుత్వోద్యోగాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయాలు పొందడానికి హక్కులు ఉండవు. మరోవైపు జమ్మూ-కశ్మీరు మహిళలు నాన్ పర్మినెంట్ రెసిడెంట్స్‌ను వివాహం చేసుకుంటే, ఆ మహిళలకు రాష్ట్ర పాలితులుగా ఉండే హక్కులు లభించవు. ఈ హక్కులు ఇటువంటి మహిళలకు వర్తించవు. అయితే 2002 అక్టోబరులో ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరట ఇచ్చింది. నాన్ పర్మినెంట్ రెసిడెంట్స్‌న వివాహం చేసుకునే మహిళలు తమ హక్కులు కోల్పోరని, వారి సంతానానికి మాత్రం వారసత్వ హక్కులు ఉండవని తెలిపింది.

35ఏ గురించి...
భారత రాజ్యాంగంలోని అధికరణ 35ఏ ప్రకారం జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాశ్వత నివాసులను నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకు ఈ అధికరణ ద్వారా లభిస్తోంది. ఈ అధికరణను 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భారత రాజ్యాంగంలో చేర్చారు. కాగా, ‘వుయ్ ద సిటిజెన్స్’ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చిన తీరును ప్రశ్నించింది. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవలసి ఉండగా, అటువంటి సవరణ జరగకుండానే అధికరణ 35ఏను చేర్చారని ఆరోపించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, వెంటనే అమల్లోకి రాలేదని తెలిపింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)