Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జనవరి 1 సమీపిస్తోంది.. చిప్‌ కార్డు ఉందా.. ?
#1
జనవరి 1 సమీపిస్తోంది... చిప్‌ కార్డు ఉందా...?

మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డులు పనిచేసేది 31 వరకే
మోసాల నివారణ కోసమే కొత్త కార్డులు
ఈ సేవ పూర్తిగా ఉచితం

[Image: 22business1a_1.jpg]
డెబిట్‌/క్రెడిట్‌కార్డ్‌ మోసాలు అధికంగా చోటుచేసుకుంటోంది మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల్లోనే. వీటి నుంచి డేటా సేకరించడం సులభం కావడంతో, స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ చేయడం ద్వారా నకిలీ కార్డులు సృష్టించి నగదు అపహరిస్తున్నారు. కార్డులు పోగొట్టుకున్నపుడు, వాటి నుపయోగించి ఖాతాల నుంచి నగదు తీసేస్తున్న వారు ఎందరో. ఇలాంటి కేసులు పెరుగుతున్నందున, చిప్‌ ఆధారిత కార్డులు జారీ చేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. 2019 జనవరి 1 నుంచి చిప్‌ ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. మాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడి కార్డులను తప్పనిసరిగా అందరూ మార్చుకోవాల్సిందే.

ఈనాడు వాణిజ్య విభాగం

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. మనం జరిపే ప్రతి లావాదేవీ వివరాలు మనకు తెలియాలంటే బ్యాంక్‌ ఖాతాకు మొబైల్‌ నెంబరు అనుసంధానించడం తప్పనిసరి. దీంతోపాటు లావాదేవీల్లో పారదర్శకత కోసం శాశ్వతఖాతా సంఖ్య (పాన్‌)ను జతచేయాల్సిందే. ఇవి జతచేస్తేనే కొత్త చిప్‌కార్డును పొందడం వీలవుతుంది. యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా (ఈఎంవీ) చిప్‌, పిన్‌ (పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌) ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే 2019 జనవరి 1 నుంచి పనిచేస్తాయని ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడిన పాత కార్డులను ఈనెల 31లోగా మార్చుకోవాలి. కొత్త కార్డుల జారీకి బ్యాంకులు రుసుము ఏమీ వసూలు చేయవు.
మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌: కార్డుదారుల సమాచారం, కార్డు వెనుక నల్లరంగులో ఉండే స్ట్రిప్‌లో శాశ్వతంగా (స్టాటిక్‌) మారకుండా ఉంటుంది. అందువల్ల వివరాలు సేకరించడం మోసగాళ్లకు సులువవుతుంది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల వద్ద వీటిని స్వైప్‌ చేస్తే, చెల్లింపు పూర్తవుతుంది.

ఈఎంవీ కార్డులు: వీటిలో సమాచారం డైనమిక్‌గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లో సమాచారం నిల్వ ఉంటుంది. ప్రతి లావాదేవీకి వివరాలు మారుతుంటాయి. అందువల్ల మోసం చేయడం చాలా కష్టం. ఈ కార్డులను క్లోనింగ్‌ చేయలేరు. ఏటీఎంలలో స్కిమ్మింగ్‌ యంత్రాలను ఉంచి, డేటాను అపహరించడం కూడా కష్టమవుతుంది. పీఓఎస్‌లలో వీటిని ఉంచి, పిన్‌ను నొక్కితే కానీ, చెల్లింపు పూర్తి కాదు.

2016 జనవరి 31 నుంచి..
పాత కార్డులను డిసెంబరు 31లోగా మార్చుకోమని బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదార్లకు సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌ల)ను పంపాయి. అంతర్జాతీయంగా వినియోగించే కార్డులు కూడా మార్చుకోవాల్సిందే. ఈఎంవీ చిప్‌ కార్డులు 2016 జనవరి నుంచి అందుబాటులోకి వచ్చాయి. 2016 జనవరి 31 తరవాత నుంచి కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరిచిన వారికి, కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జారీచేస్తున్న కార్డులు చిప్‌తోనే ఉంటున్నాయి. డేటా ఎన్‌క్రిప్షన్‌ మరింత ఉన్నత ప్రమాణాలతో ఉండటం చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులతో సాధ్యమవుతుంది. డేటా నిల్వ సాంకేతికత కూడా మెరుగుపడుతుంది. అయితే కార్డు సంఖ్య, సీవీవీ వంటి వివరాలతో పాటు మొబైల్‌కు వచ్చే ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటివి చెబితే, ఆన్‌లైన్‌ లావాదేవీ పూర్తి చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందని గుర్తించాలి. అందువల్ల ఈ వివరాలు ఎవరికీ తెలియనీయకుండా ఉంచాలి.

చాలా కార్డులు మార్చాల్సి ఉన్నా..
మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల్లో ఇప్పటివరకు 50-70 శాతం వరకు మాత్రమే ఆయా బ్యాంకులు మార్చినట్లు సమాచారం. ఖాతాదారులు కూడా సమయం ఉంది కదా అని వాయిదా వేసుకుంటూ గడపడం మరో కారణం. గడువు మరో వారం రోజులే ఉండటంతో ఇప్పుడు హడావుడి పడుతున్నారు.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం, తన ఖాతాదారులు గత 12 నెలల్లో ఒక్కసారి అయినా, మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డును వినియోగించి లావాదేవీ నిర్వహించి ఉంటే, వారికి కొత్త చిప్‌ కార్డును ఇప్పటికే వారి నమోదిత చిరునామాకు పంపింది. గత ఏడాది కాలంలో కార్డును ఒక్కసారీ వాడకపోతే మాత్రం, ఖాతాదారులు తమ శాఖను సంప్రదించి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ను వినియోగించే వారు, లాగిన్‌ అయి, ఇ-సేవల్లో, ఏటీఎం విభాగానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్‌ నెంబరు, పాన్‌ నెంబరు ఖాతాకు జతయి ఉంటేనే వీలవుతుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
I have applied for replacement but I didn't receive it yet. Hope it arrives soon.
Like Reply
#3
Maybe, the cards are out of stock now. They'll send them or you can go to the branch to get yours.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: