17-01-2019, 06:40 PM
సాయంత్రానికి నా బుర్రలో సరోజకు, కాంతి కి కంపారిసన్ మొదలైంది. నా కళ్లకి కాంతి కంటే సరోజ అందంగా కనబడ సాగింది. తనకు జీవితం లో ఓ గోల్ అంటూ ఉంది , కష్టపడి పైకి రావాలనుకుంటుంది. డబ్బు విలువ తెలుసు తనకు , కానీ శరీరం కలర్ లోనే ఇద్దరు చాలా తేడా , అలాగే మనసులో వాళ్ళ ఆలోచనలో ఇద్దరు తెలుపు నలుపు కు ఉన్నంత తేడా గా ఉన్నారు.
రాత్రి మేము అందరూ సర్పంచి ఇంట్లో సమావేశమై , అన్నీ చర్చించు కొన్న తరువాత, సరోజ వాళ్ళ అవుకు వాడుతున్న మెడిసిన అన్నిటికి వాడాలని నిర్ణయించుకున్నాము.
నేను రాత్రిళ్లు సరోజ వాళ్ళ అవును గమనిస్తూ ఉంటాను అంటూ సరోజ వాళ్ళ ఇంటికి వచ్చాను. పొలానికి వెళ్ళిన వాళ్ళ అమ్మ వచ్చినట్టు ఉంది , నేను వేల్ల గానే.
"మా అవుకు బాగై నట్లేనా సారూ"
"బాగై నట్లే కానీ రాత్రంతా దాన్ని గంటకో సారి చూస్తూ ఉండాలి " అన్నాను
"అయితే మీరు ఇక్కడే పడుకోండి నేను మంచం పరుపు ఇక్కడే వేయిస్తా , సరోజా , సారూ ఇక్కడే పడుకొంటాడంట ఆ మంచం పరుపు బైట వెయ్యి " అంది.
తను మంచం పరుపు బైట వేయగానే దాని మీద కూచొని పిచ్చా పాటి మాట్లాడుతూ ఉండగా సరోజ టించర్ తో బయటకు వచ్చింది. మా యమ్మ టించర్ తెప్పించింది ఆ చేతికి కొద్దిగా పట్టించండి తొందరగా తగ్గిపోతుంది అంది కాటన్ , టించర్ మంచం మీద పెడుతూ
"నువ్వు పుయ్యి ఆయప్ప ఎలా పుసుకోంటాడు " అంటూ వాళ్ళ అమ్మా తనను పురమాయించింది. నా చేతిని పట్టుకొని పసుపు మీద ఆ టించర్ అద్దుతూ నోటితో అక్కడ గాలి ఊదుతూ , అట్ట కట్టిన పసుపును తీసేసింది.
తను చేసే పనిలో ఓ పద్దతి , వైనం కనబడసాగాయి , బహు శా నేను తనను ఇస్టపడుతుండడం వలన నెమో. పాడుకొనే ముందు ఓ గ్లాసు పాలు ఇచ్చింది తాగమని.
ఆ తరువాత రెండు రోజులు వేగంగా జరిగి పొయ్యా యి , మేము వాడిన ఆ కొత్తరకం మందుకు రో గాన పడ్డ పశువులన్నీ కోలుకున్నాయి. మండలం లో ఉన్న డాక్టరు కు ఆ మందులు స్టాక్ తెప్పించి ఉంచ మని చెప్పి మా క్యాంపు ను క్లోజ్ చేశాము.
రెండో రోజు , సరోజ కు చెప్పాను తనంటే ఇష్టం అని, మూడో రోజు వాళ్ళ అమ్మ పొలానికి వెళ్ళినప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాను , తను నా చేతుల్లో ఒదిగి పోతూ నాకు సరెండర్ అయ్యింది. కానీ ఎందుకో అంతకంటే ముందకు వెళ్ళాలనిపించ లేదు.
నా కౌగిట్లో ఉండగా తనతో అన్నాను "నేను వెళ్లి మా అమ్మా వాళ్ళను పంపుతాను చూసుకోవడానికి , మీ అమ్మకు నువ్వు చెప్పు " అన్నాను.
“పెళ్లి అయ్యాక మా అమ్మ మనతోనే ఉంటుంది తనను చూసుకోవడానికి ఎవరు లేరు” అంది
“అలాగే , మీ అమ్మా , మా అమ్మా ఇద్దరు మన దగ్గరే ఉంటారు , ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయా అమ్మాయి గారికి”
“నేను ఇంకా చదువుకోంటా”
“మంచిది, ఇంకా”
“మా దగ్గర డబ్బులు ఏమి లేవు , నేను ఒక్క దాన్నే కూతుర్ని , కాబట్టి మా పొలం నాకే వస్తుంది , ఇంత కంటే కట్నం ఇవ్వలేదు మా అమ్మ”
“నాకు పైసా కట్నం వద్దు, ఇంకా”
“పెండ్లి ఆడ పిల్ల వల్లే చేయించాల కదా , గ్రాండ్ గా చేయించ లేదు అమ్మ”
“అవసరం లేదు , కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొందాము సరేనా”
“సరే” అన్నట్లు తనే నా బుగ్గ మీద ముద్దు పెట్టి పంపింది .
ఆఫీస్ లో క్యాంపు రిపోర్ట్ సబ్‌మిట్ చేసి, ఆ రోజు సాయంత్రం కాంతి తో డిన్నర్ కు బయటికి వచ్చాను. ముందే డిసైడ్ చేసుకున్నా మనసులో తనకు చెప్పేయాలని తెలుపు కంటే నాకు నలుపే ఇష్టం అని( తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని).
అనుకున్న చోటు కు చేరుకున్న ఓ 20 నిమిషాలకు తను వచ్చింది పక్కన ఇంకో వ్యక్తి తో.
"హాయ్ , మీట్ మై ఫ్రెండ్ రాకేష్ " అంటూ తనని పరిచయం చేసింది. తనతో నెక్స్ట్ వీక్ ఎంగేజ్ మెంటు అని చెప్పింది , నేను చెప్పాల్సిన మాటను తనే చెప్పడం వలన నా మనస్సుకు భారం తగ్గి నట్లు అయ్యింది.
డిన్నర్ ముగించు కొని తనకు వీడ్కోలు చెప్పి రూమ్ కు చేరుకున్నాను. ఒక 10 రోజులు ఆఫీస్ కు సెలవు పెట్టి ఇంటికి వెళ్లి అమ్మా వాళ్ళను తీసుకొని సరోజ ఉరికి వెళ్లాను.
అందరిని వొప్పించి వాళ్ళ ఊర్లో నే సింపుల్ గా గుళ్లో పెళ్లి చేసుకొని అటు నుంచి ఆటే సరోజను తీసుకొని హాని మూన్ వెళ్లాను.
ఇదండీ నా నలుపు తెలుపు కధ.
END