17-01-2019, 06:39 PM
ఇలా జరుగుతుండగా , ఎక్కడో మారుమూల ఓ పల్లెలో ప్రభలిని ఓ పశువుల కు వచ్చిన రోగం నా జీవితాన్ని మార్చి వేసింది.
ఎదో ఓ కొత్త వ్యాధి ఆంధ్రా లోని ఓ మారు మూల పల్లెలో పశువులను పొట్టన పెట్టుకోసాగింది , ఓ వారం లో దాదాపు 300 పశువులు బలయ్యాయి ఆ వ్యాదికి. దాన్ని వెంటనే అరికట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ అందుకొని ఆ పల్లెలో క్యాంపు వేయడానికి అక్కడికి బయలు దేరాము. ఎప్పుడు రిటర్న్ వస్తామో తెలియదు.
ఈ విషయాన్ని కాంతి కి చెప్పి 4 స్పెషలిస్ట్ డాక్టర్స్ తో వెళ్ళాము , నా డ్యూటీ వాళ్ళకు అన్ని సదుపాయాలూ సమకురుస్తూ హెల్ప్ మేనేజ్ చేస్తూ ఉండడం.
ఆ పల్లె దగ్గర మండలానికి 5 కిమీ దూరం లో ఉంది. మండలానికి చేరుకొని అక్కడనుంచి మరుసటి రోజు ఉదయం ఆ పల్లెకు చేరుకున్నాము. దగ్గర దగ్గర 300 గడపలున్న పల్లె. మండలం నుంచి ఇద్దరు మాకు తోడూ రాగా 6 గురు కలిసి పల్లెలో దిగాము.
రాగానే మా డాక్టర్స్ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. నాతొ వచ్చిన మండల రిసోర్స్ ను ఉపయోగించు కొని ఆ ఊర్లో ని సర్పంచి ఇంటికి వెళ్ళాము. తనకు ముందే మా గురించి తెలిసినట్లు ఉంది మేము వెళ్ళగానే , మా ఇంట్లో నే ఉండండి మీకు కావాల్సిన సౌకర్యాలు నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళ పాలేరుకు చెప్పి మా సామాన్లు మాకు కేటాయించిన గదిలో పెట్టమన్నాడు.
5 మందికి పడుకోవడానికి వీలుగా ఉంది , భోజనం ఎలాగు సర్పంచి ఇంట్లో కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకొంటూ తెచ్చుకొన్న బ్యాగ్ లు అక్కడ పడేసి నేను కూడా డాక్టర్స్ దగ్గరకు వెళ్లాను.
మా ప్లాన్ ప్రకారం ఒక్కో డాక్టర్ ఒక్క కేసు తీసుకొని వాటిని క్లోజ్ గా ఫాలో అవుతూ ట్రీట్ చెయ్యాలి , ఈవినింగ్ ఆ రిజల్ట్స్ షేర్ చేసుకోవాలి దాన్ని బట్టి మరుసటి రోజు ఎ విధంగా ముందుకు నడవాలి అనేది ఈవినింగ్ అందరం కలిసి డిస్కస్ చేసుకోవాలి.
సర్పంచి ఇంటి నుంచి డాక్టర్స్ దగ్గరు బయలు దేరాను. వీధిలో వెళ్తుండగా నాకు ఎదురుగా ఓ 4 అమ్మాయిలు నీళ్ళ బిందెలు చంకలో పెట్టుకొని వస్తు కనబడ్డారు. వాళ్లకు వెనుక వైపు కొద్ది దూరం లో ఓ ఎద్దు పరిగెత్తు కొంటూ వాళ్ళ వైపు రాసాగింది. వాళ్ళు మాటల్లో పడి దాన్ని గమనించ లేదు. అదేమో బాగా కసి మీదున్నట్లు బుసలు కొడుతూ వస్తుంది.
"తప్పుకోండి , అది తాళ్లు తెంపుకొని వస్తుంది , ఎదురుగా ఉంటే పొడుస్తుంది " అంటూ దానికో కొద్దిగా వెనుక ఓ పెద్దాయన అరుస్తూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూన్నాడు.
వాళ్లలో ముగ్గురు ఆ పెద్దాయన అరిచిన అరుపుకు రియాక్ట్ అవుతూ పక్కనే ఉన్న ఇంట్లోకి జంప్ చేసారు. నాలుగో అమ్మాయి టెన్సన్ తో ఎం చేయాలో పాలు పోక అలాగే ముందుకు రాసాగింది చంకలో బిందెతో . ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసిన ఆ ఎద్దు ఆ అమ్మాయి మీద చూపు నిలుపుతూ ముందుకు రాసాగింది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ను అది పొడవడం ఖాయం అనుకొంటూ ఒక్క గెంతులో ఆ అమ్మాయిని చేరుకొని ఆ అమ్మాయి నడుం పట్టుకొని ఇంకో పక్కకు గెంతాను. కొమ్ములకు ఆ అమ్మాయి చిక్కింది అనుకున్న ఎద్దుకు అక్కడ శూన్యం కనబడే సరికి ముందుకు ఉరికి నిలతోక్కుకొని వెనక్కు తిరిగింది.
ఈ లోపున ఆ అమ్మాయిని అటువైపు ఉన్న ఇంట్లోకి నెట్టి ఎద్దుకు ఎదురుగా వెళ్లాను
"అది పోడుత్తుంది జాగ్రత్త " అంటూ గట్టిగా అరిచాడు దాన్ని పట్టుకోవడానికి వస్తున్న పెద్దాయన.
అది వచ్చి రావడం టోన్ కొమ్ములు ముందుకు వంచి నా వైపు దూకింది. దానికి అందకుండా పక్కకు దూకి దాని ముక్కు తాడు వడేసి గట్టిగా పట్టుకొని మోచేతితో ఒక్క పొడుపు పొడిచాను దాని మూ పురం మీద.
ఆ దెబ్బకు దాని మోకాళ్లు మడత పడి ముందుకు కుచోంది పోయింది అక్కడే , దాని వెనుకే వస్తున్న పెద్దాయన నా దగ్గరకు వచ్చి నా చేతిలోని దాని ముక్కు తాడు పట్టుకొని దాన్ని లేపుతూ.