17-10-2019, 11:29 AM
క్యు లో ఉన్న అమ్మాయిలు అందరూ ఎవరిని ఈ మేనేజర్ సార్ అంటున్నాడు అని మానేజర్ వస్తున్న వైపు ఆత్రంగా చూడసాగారు. సరిగ్గా అతిని దగ్గరకు వచ్చి, "మీరు ఏంటి సర్ ఇక్కడ నిలబడ్డారు "
"టికెట్స్ కోసం నిలబడ్డా "
"మీరు టికెట్స్ కోసం నిలబడ్డం ఏంటి సర్, ఈ ఎండలో రండి నా ac రూమ్ లో కుచోందురు , మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ నేను బుక్ చేస్తాను."
"పర్లేదు లెండి , ఎలాగా షో మొదలవుతుంది కదా , టికెట్స్ కోసం ఫ్రెండ్ ఆల్ రెడీ క్యు లో నిలబడి ఉంది"
"మీ ఫ్రెండ్ ను కూడా తీసుకొని రండి సర్ , ఇక్కడ నిలబడ్డం అస్సలు నచ్చ లేదు నాకు , ఇంతకూ ఎవరు మీ ఫ్రెండ్" అంటూ లేడీస్ క్యు వైపు చూసాడు.
అతని దగ్గర డబ్బులు తీసుకొన్న అమ్మాయి తో పాటు లేడీస్ క్యు లో ఉన్న అందరూ ఎవరబ్బా ఈయన , మేనేజర్ అంత మర్యాద ఇస్తున్నాడు అనుకొంటూ ఆశ్చర్యం గా చూడ సాగారు.
"ఏమండి , మీరు క్యు లో ఎందుకు , నాతొ పాటు రండి " అంటూ తను డబ్బులు ఇచ్చిన అమ్మాయిని రిక్వెస్ట్ చేసాడు.
"మీరు వెళ్ళండి , నేను క్యు లో ఉండి టికెట్ తీసుకుంటాను " అంది ఆ అమ్మాయి అతని డబ్బులు వాపస్ ఇవ్వబోతూ.
"అలా అయితే, నా టికెట్ కూడా మీరే తీసుకోండి నేను ఇక్కడే నిలబడ తాను" అంటూ మానేజర్ వైపు చూసాడు ఆ అమ్మాయి రాక పొతే నేను రాను అన్నట్లు.
"మీరు క్యు లో నిలబడ్డం ఏంటి మేడం , మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ బ్లాక్ చేస్తాము , ప్లీజ్ రండి మేడం " అంటూ ఆమె దగ్గరకు వెళ్లి బతిమలాడాడు.
ఆ అమ్మాయికి ఇస్తున్న importence కి అయ్యో అయన దగ్గర నేను టికెట్స్ తీసుకొంటే బాగుండు నే అనుకోండి ఆ అమ్మాయి వెనుక ఉన్న సుందరాంగి.
"మీరు వెళ్ళండి , నా బండిని పార్క్ చేసి వస్తాను అన్నాడు" ఆ 6 అడుగులు
"మీరు కీస్ ఇవ్వండి సర్ , మా వాళ్ళు పార్క్ చేస్తారు , ఇంతకూ మీ వెహికల్ ఎక్కడ సర్ " అన్నాడు మేనేజర్
అక్కడ క్యు లో ఉన్న అందరి కళ్ళు వాళ్ళ వైపే ఉన్నాయి, అక్కడ ఎం జరుగుతుందో అని.
తన చేతిలో ఉన్న కీస్ ను మేనేజర్ కు ఇస్తూ , ధియేటర్ కు ఓ వైపున ఉన్న బెంజి కారును చూపిస్తూ దాన్ని పార్క్ చేయండి అంటూ హాల్లో కి నడిచాడు ఆ అమ్మాయితో పాటు ఆ 6 అడుగులు.
వాళ్ళను చూస్తున్న వాళ్ళ ఆ అమ్మాయి అదృష్టానికి ఈర్ష్య పడ సాగారు. ఆ అమ్మాయి ముందు ఉన్న అమ్మాయి "అయ్యో నేను తీసుకున్నా బాగుండేదే అతనికి టికెట్స్ " అంటూ వాళ్ళు వెళ్ళిన వైపు చూడసాగింది మెల్లగా సాగుతున్న క్యు లో కదులుతూ.