Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#17
ఈరోజు వాల్మీకి జయంతి 

మనిషిని మలిచిన మహర్షి
ఏనాటి రామకథ... ఇప్పటికీ ప్రాతఃస్మరణీయమే.
ఏం వింటే ధర్మం కరతలామలకమవుతుందో, సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో, హృదయం ఆనందంతో నిండిపోతుందో...  అలాంటి కథకు రూపకర్త వాల్మీకి. కావ్య రూప తపస్సు  చేసి మానవ జాతికి మహోపకారం చేసిన మహర్షి ఆయన

తపస్సు అంటే తపించడం. తాననుకున్న లక్ష్యం కోసం కష్టతరమైన సాధన చేసి ఓ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేది అని కూడా అర్థం ఉంది. అహంకార మమకారాలను, దేహాభిమానాన్ని, హింస, కుటిలత్వం వంటివాటిని దహించడమే తపస్సు.

రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు.

బోయవాడైన ఈయన రుషిగా మారిన తరువాత ఓ వేటగాడి చేతిలో క్రౌంచ పక్షుల జంటలో ఒకటి మరణించడం చూసినప్పుడు కలిగిన ఆవేదన రామాయణ రచనకు కారణమైందని అంటారు.

మనిషికి పుట్టుకతోనే పితృ రుణం, దేవరుణం, రుషి రుణం అనే మూడు రకాల రుణాలుంటాయి.

రుషులకు ఎందుకు రుణ పడి ఉండాలనే దానికి సనాతన ధర్మం వివరణనిస్తోంది. ఆ రుషులు మానవాళికి మార్గదర్శక సూత్రాల్లాంటి శాస్త్రాలను అందిస్తారు. జాతి హితం కోసం విజ్ఞానాన్ని రూపొందిస్తారు. దీనికోసం అంతులేని తపస్సు చేస్తారు. కాబట్టి మనిషి రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలి. అలాంటి రుషుల్లో ఒకరు రామాయణకర్త వాల్మీకి మహర్షి.

‘వేద వేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే!
వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా’

ఈ శ్లోకంలో రామాయణం సాక్షాత్తు వేద సమానమని, ప్రాచేతసుడు దీన్ని రచించాడనే అర్థం కనిపిస్తుంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రాచేతస గణం అనే రుషి వంశాలున్నాయి. అందులోనివాడే రామాయణకర్త అయిన వాల్మీకి అని పండితాభిప్రాయం.


జై శ్రీమన్నారాయణ

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 13-10-2019, 04:31 PM



Users browsing this thread: 4 Guest(s)