17-11-2018, 04:57 PM
“రెండోది ఏంటంటే….నేను ఇక్కడ చర్చిలో మీ కోసం నేను ప్రార్ధనలు చేస్తాను….నేను ప్రార్ధన చేస్తున్నంత సేపు ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఎవరికీ హాని తలపెట్టలేదు….అలా అని మీరు అజాగ్రత్తగా ఉండకూడదు….అది మిమ్మల్ని చంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది….అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి….అది ఏ విధంగానైనా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు మాత్రం……” అంటూ ఫాదర్ చెప్పబోతుండగా….
“మేము మాత్రం ఆ ప్రేతాత్మ పేరు మా నోటి నుండి పలకకూడదు….అంతేకదా ఫాదర్,” అన్నాడు రాము.
ఫాదర్ రాము వైపు మెచ్చుకుంటున్నట్టు చూసూ, “చాలా కరెక్ట్ గా చెప్పావు….ఈ విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోండి….మీ నోటి నుండి ఎట్టి పరిస్థితుల్లోను ఆ ప్రేతాత్మ పేరు బయటకు రాకూడదు….ఒక వేళ పొరపాటున అయినా పలికారంటే ఆ పలికిన వాళ్లను ఆ ప్రేతాత్మ ఆవహింస్తుంది…ఈ విషయం మీరు గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు.
దాంతో వాళ్ళు ముగ్గురూ ఫాదర్ చెప్పిన జాగ్రత్తలు విని చర్చి నుండి బయటకు వచ్చారు.
వాళ్ళు బయటకు రావడం చూసిన డ్రైవర్ కారు స్టార్ట్ చేసి…..వాళ్ళు ఎక్కగానే విల్లా వైపు పోనిచ్చాడు.
విల్లా లోకి వెళ్లగానే రేణుక, సునీత తమకు కావలసిన వస్తువులు, బట్టలు సర్దిపెట్టి టైం కరెక్ట్ గా మధ్యాహ్నం మూడు కాగానే విల్లా నుండి బయటకు వచ్చి తమ చేతిల్లో ఉన్న రెండు సూట్ కేస్ లు కారులో పెట్టారు.
అప్పటికే రాము డ్రైవర్ దగ్గర కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేసి వాళ్ల కోసం రెడీగా ఉన్నాడు.
వాళ్ళిద్దరూ కారు ఎక్కగానే అక్కడ నుండి బయలుదేరారు.
********
వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపటికి సుందర్ ప్రేతాత్మ సాయంత్రం ఆరు గంటలకు బలం పుంజుకుని రేణుక కోసం ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
కాని బెడ్ రూమ్ లో రేణుక కనిపించకపోయే సరికి ఆమె కోసం విల్లా మొత్తం వెదికింది….కాని ఎక్కడా కనిపించకపోయే సరికి విల్లా నుండి బయటకు వచ్చి తన శక్తితో వాళ్ళు ఎటు వైపు వెళ్తున్నారో తెలుసుకుని వాళ్ళు వెళ్తున్న వైపు కోపంతో బయలుదేరింది.
అలా కొద్దిదూరం గాల్లో తేలుకుంటూ వెళ్ళిన తరువాత ఒక రోడ్డు మీద రేణుక వాళ్ళు కారులో వెళ్తున్నట్టు చూసింది.
కారు రాము డ్రైవ్ చేస్తుండటం చూసి వాళ్ళ మీదకు దాడి చేయబోయింది.
కాని చర్చిలో ఫాదర్ చేస్తున్న ప్రేయర్ కారణంగా వాళ్ళను తాకలేకపోయింది.
అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు రాత్రి ఎనిమిది అయ్యే సరికి దారిలో ఉన్న ఒక హోటల్ కి వెళ్లి రెండు రూమ్ లు తీసుకుని ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకుని మళ్ళి ఉదయాన్నే బయలుదేరదామని అనుకున్నారు.
హోటల్ లోకి వెళ్ళిన వాళ్లు ఒక రూమ్ రాము తీసుకోగా, ఇంకో రూమ్ సునీత, రేణుక తీసుకున్నారు.
ఆ రాత్రి భోజనం చేసిన తరువాత ముగ్గురూ తరువాత రోజు ఏం చెయ్యాలో మాట్లాడుకున్నారు.
సునీత వాళ్ళిద్దరితో, “ఇప్పుడే వస్తాను,” అని చెప్పి వెళ్లి పది నిముషాల తరువాత వచ్చింది.
“రేణుక….నేను రిసిప్షన్ లో మీ నాన్నగారి ఢిల్లీ నెంబర్ కి ట్రంకాల్ బుక్ చేసి వచ్చాను….వాళ్ళకు లైను కలవగానే మనల్ని పిలుస్తారు,” అన్నది సునీత.
“అలాగే సునీత,” అన్నది రేణుక.
“ఇక వెళ్లి పడుకుందాం పద…ఇప్పటికే చాలా దూరం జర్నీ చేసి బాగా అలసిపోయాము….” అన్నది సునీత.
కాని రేణుకకు మాత్రం రాముతో గడపాలని అనుకుంటున్నది.
సుందర్ చనిపోయిన దగ్గర నుండి తనకు రాముతో ప్రశాంతంగా గడపడానికి టైం దొరకకపోవడంతో చాలా అసహనంగా ఉన్నది రేణుకకి.
దాంతో రేణుక సునీత వైప్ చూస్తూ, “మీరు వెళ్ళి పడుకోండి సునీత….నేను కొద్దిసేపు రాముతో మాట్లాడి వస్తాను,” అన్నది.
రేణుక అలా అనగానే వాళ్ళిద్దరి సంగతి తెలిసిన సునీత చిన్నగా నవ్వుతూ, “సరె….ఎక్కువ సేపు కబుర్లతో కాలక్షేపం చేయకుండా తొందరగా వచ్చేయ్….మళ్ళి పొద్దున్నె జర్నీ చేయాలి….ఈ ప్రాబ్లం నుండి బయటపడితే నేను మీ ఇద్దరి విషయం మీ అమ్మకు చెప్పి పెళ్ళి చేయించేస్తాను….అప్పుడు మీ ఇద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉందురుగారు,” అన్నది.
సునీత అన్న మాటలకు రేణుక నవ్వుతూ సిగ్గుపడుతూ తల వంచుకున్నది.