17-11-2018, 04:40 PM
(This post was last modified: 22-03-2019, 02:29 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode : 9
అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన రాము అప్పటికే విల్లా నుండి గేట్ వైపుకి వెళ్తున్న దారి లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కొద్ది దూరంలో రేణుక నిల్చుని గేట్ వైపు చూసి గట్టిగా ఏడుస్తూ భయంతా కేకలు పెట్టడం చూసాడు.
ఆమెను అలా చూసిన రాముకి పరిస్థితి అర్ధం అయింది….గేటు వైపు చూస్తూ చిన్నగా నడుచుకుంటూ ముందు వస్తున్నాడు.
రేణుకకి నాలుగడుగుల ముందు సునీత, సునీత కి నాలుగడుగుల ముందు డ్రైవర్ ముగ్గురూ నిల్చుని భయంతో గేటుకి వేలాడదీసి ఉన్న కిషన్ తల వైపు చూస్తున్నారు.
కిషన్ తల గేటుకి వేలాడదీసి ఉండటం చూసిన రాము అతన్ని కాపాడలేకపోయానన్న బాధతో అలా చూస్తుండిపోయాడు.
రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన తరువాత రాము రేణుక వాళ్ళింటికి వచ్చాడు.
రాము హాస్పిటల్ నుండి వచ్చేయడం చూసిన రేణుక అతనికి ఎదురెళ్ళి గట్టిగా వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టి, “ఇప్పుడు ఎలా ఉన్నది….నేను, సునీత నిన్ను తీసుకొద్దామని ఇప్పుడే బయలుదేరబోతున్నాము,” అన్నది.
రేణుక అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళ్ ఆమె చెక్కిళ్లను తడుపుతూ కిందకు జారిపోతున్నాయి.
రాము ఆమె కన్నీళ్లను తుడుస్తూ, “అంతా బాగానే ఉన్నది….నీతో మాట్లాడాలి,” అంటూ రేణుకని అక్కడ సోఫాలో కూర్చోబెట్టాడు.
అంతలో సునీత కూడా అక్కడకు వచ్చి రాముని పలకరించింది.
రాము రేణుక వైపు చూసి, “ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరిద్దరికీ నమ్మకం కుదరకపోవచ్చు…..మీ ప్లేసులో నేను ఉన్నా కూడా ఈ విషయం నమ్మలేను….కాని నేను ఏదైతే చెప్పాలని ఇక్కడకు వచ్చానో అది నిజం….” అంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “రేణుక….నేను నీకు ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఇక్కడి వాడిని కాదు….అంటే నేను ఈ కాలం వాడిని కాదు,” అన్నాడు.
రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాని రేణుక అతని వైపు అయోమయంగా చూస్తూ, “నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కావడం లేదు రాము,” అన్నది.
“కాలం నన్ను యాభై ఏళ్ళు వెనక్కు తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెట్టింది….” అన్నాడు రాము.
అది విన్న సునీత, “రాము….ఇప్పుడున్న పరిస్థితుల్లో జోకులు వేయకు,” అన్నది.
రాము సునీత వైపు చూసి, “నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్లు ఇక్కడకు వచ్చారు…” అన్నాడు.
ఆ మాట వినగానే సునీత మొహంలో రంగులు మారాయి….సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి వెళ్ళిన విషయం హాస్పిటల్ లో ఉన్న రాముకి ఎలా తెలిసిందని సునీత ఆలోచిస్తున్నది.
రాము మళ్ళీ రేణుక వైపు చూస్తూ, “సెక్యూరిటీ ఆఫీసర్లు మొత్తం investigation చేసారు….కాని నిన్ను(రేణుక) ఏమీ అడగలేదు,” అన్నాడు.
రాము చెప్పింది నమ్మలేనట్టు రేణుక సునీత వైపు చూసింది.
సునీత కూడా రాముకి ఇవన్నీ ఎలా తెలిసాయి అన్నట్టు ఆశ్చర్యంతో చూస్తున్నది.
రేణుక మళ్ళీ రాము వైపు చూస్తూ, “ఇవన్నీ నీకు ఎలా తెలుసు,” అని అడిగింది.
రేణుక అలా అడుగుతున్నప్పుడు పైనుండి సుందర్ ప్రేతాత్మ వాళ్ళున్న గది వైపు వస్తున్నాడు.
అది గమనించని రాము ఏం చెబుతున్నాడో, జరిగింది చూసినట్టు ఎలా చెబుతున్నాడో అర్ధం కాక రేణుక, సునీత రాము వైపు ఇంకా అతను ఏం చెబుతాడా అన్నట్టు చూస్తున్నారు.
“రెండో రోజు సెక్యూరిటీ ఆఫీసర్లు మళ్ళి ఇంటికి వచ్చారు….వాళ్ళు సునీత కి సుందర్ ఇంట్లో దొరికిన వస్తువులు ఇచ్చేసి వెళ్ళిపోయారు… ఆ వస్తువులు ఏంటంటే వాడు వేసిన నీ బొమ్మలు, నీ స్కార్ఫ్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు,” అన్నాడు రాము.