10-10-2019, 09:27 AM
(09-10-2019, 08:18 AM)Chandra228 Wrote: రెండో అప్డేట్ తోనే ఆతృత గా ఉంది కష్టాల నుండి బయట పడటానికి కొంత సర్దుకుపోవాలి రేఖ అయినా సంజన అయినా చాలా బాగుంది ఇలాంటి వి రేఖ కు ముందే సర్దుకుపోయింది అనిపిస్తుంది.
నిజం చెప్పారు చంద్ర గారు... ధన్యవాదాలు
(09-10-2019, 09:35 AM)stories1968 Wrote: మన జీవితం మన చేతుల్లో లేదు. దీనిని చాలా మంది ఖండిస్తుంటారు. కానీ ఇది పచ్చి నిజం. ప్రతీ ఇంటిలో మనం అనుకున్నవన్నీ అయ్యాయా.. ఒక్కసారి అందరూ జీవితాన్ని తరచి చూసుకుంటే అర్ధం అవుతుంది.
మనకు తెలియకుండానే మనం ఊహించకుండానే ఎన్నో సంఘటనలు మన జీవితంలో దొర్లిపోతుంటాయి. కొన్ని పాజిటివ్ గా ఉండొచ్చు కొన్ని నెగటివ్ గా ఉండొచ్చు.
నేను పూర్తిగా నమ్మేది... ఇది అంతా దేవుడు ఆడించే ఆట. మనమంతా పావులం. మన కార్యక్రమం పూర్తి అయితే మనలను క్షణం కూడా భూమి మీద ఉండనివ్వడు భగవంతుడు.
మీరు ఎంత తొందరగా dession తీసుకొంటే అంత మంచిది
అమూల్యమైన మాట చెప్పారు స్టోరీస్ గారూ... మన చేతుల్లో ఏమీ లేదు...అంతా కీలుబొమ్మలమే...
మీ బొమ్మలు చాలా బాగున్నాయి ధన్యవాదాలు
(09-10-2019, 01:38 PM)saleem8026 Wrote: Nice narration
(09-10-2019, 03:31 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
ఒక అనువాద కథ వ్రాస్తున్నప్పుడు... అది ఏ భాష నుంచి వ్రాస్తున్నా మన భాషలో వ్రాసేప్పుడు, మనం ఎంచుకునే ప్రాంతం, పాత్రల పేర్లు, మనకున్న సంప్రదాయం, యాస (సాధ్యమైనంత వరకు) అనుసరిస్తూ వ్రాస్తే కథ మనది అయిపోతుంది. ఆంగ్లంలో వ్రాసిన కథలకైతే మనం ఇంకా ఎక్కువ కసరత్తు చెయ్యాల్సి వుంటుంది. స్థానిక భాషలలో ఉండే విరుపులు ఆంగ్లంలో కనిపించవు. అలాగే మనమూ తర్జుమా చేస్తే మక్కీకి మక్కీ కాపీ చేసేశాం అని మనకే అనిపిస్తుంది. ఉదాహరణకు నేను వ్రాస్తున్న గర్ల్స్ హైకాలేజ్ (ఎప్పుడూ ఇదే కథ గురించి చెప్తాడని విసుక్కోకండి)లో హింగ్లీష్ లో ఉన్న కథ చదివి నచ్చి దాన్ని అనువదించడానికి కనీసం రెండు వారాలు మన ఆంధ్రాలో ఉన్న ఏరియాలు, స్కూళ్ళు... వగైరా గురించి కాస్త రీసెర్చ్ చేసి తరవాత అమలాపురం బ్యాక్*డ్రాపులో తెలుగు నేటివిటీకి తగినట్లు కథను వ్రాసాను. ఒరిజినల్ అప్డేట్ చదివి నాకు నచ్చినట్టుగా మన భాషలో సంభాషణలు వ్రాసేవాన్ని. అనవసరం అనిపించినవి త్యజించేవాణ్ణి. కొత్తగా కథలో పాత్రలు, సీన్లు వ్రాసేవాణ్ణి.
ఇక రొమాన్స్ కి వస్తే ఒరిజినల్ లో పైపైన తేల్చేసి వుంటే అదే వ్రాస్తే మనవాళ్ళు మెచ్చరని నా స్వంత పద్ధతిలో వ్రాసేవాణ్ణి. (అది కూడ సరిపోలేదని అన్న మెసేజీలు చాలా వచ్చాయనుకోండి ;))
ఐనా... కథ, కథనం అందరికీ నచ్చింది. ఆదరించారు.
కనుక, మీరు చదివిన కథని మీ స్వంత కథగా భావించి ప్రతి పాత్రని, సన్నివేశాలని, మనోవేదనని స్వంత ధోరణిలో (మీ మొదటి కథ మాదిరిగా) వ్రాసుకుంటూ ముందుకు దూసుకుపోండి.
అప్పుడే మీ ఈ కథ పరిపూర్ణంగా మీదవుతుంది.
ఇక, క్షమాపణలు అడిగింది మిమ్మల్ని కాదు లక్ష్మిగారూ... మీలోని రైటర్ని. ఒక రైటర్ గా ఎంతో కొంత ఇగో ఉంటుంది. అబ్బే లేదని పైకి బుకాయించినాసరే! కష్టపడి వ్రాస్తున్నదానిలో ఎవరో వేలెడితే వచ్చే మంట మామూలుగా వుండదు(నా స్వంత అనుభవం). ఆ విధంగా మిమ్మల్ని కొంతైనా హర్ట్ చేసి వుంటాననే నేను సారీ చెప్పాను.
ఆల్ ద బెస్ట్
(09-10-2019, 03:49 PM)Vikatakavi02 Wrote: మిత్రమా సాదుశ్రీ... మీ నామధేయము కడు విచిత్రంగా వున్నది.
అనువాద కథ వ్రాయటం స్వంత కథను వ్రాయటం కన్నా బహు కష్టం సుమీ! మన స్వంత కథ అయితే ఎటు నుంచి ఎటుకైనా మలుపు తిప్పవచ్చు. కానీ, అనువాద కథని మాతృకకి లోబడి వ్రాయవలసి వుంటుంది. పైగా ఆంగ్ల కథని అనువదించి వ్రాయటం చాలా కష్టముతో కూడిన పని. అక్కడ ఒక్క పదంతో తేల్చేసినదానికి ఇక్కడ నాలుగైదు పదాలు వ్రాయవలసి వస్తుంది.
మరో విషయం... ఇక్కడ వ్రాసే రైటర్లు అందరూ ప్రొఫెషనల్స్ కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కథలు టకటకా వ్రాసేయటానికి. బయట పనుల ఒత్తిడి, మూడ్, టైమ్, పాఠకుల విపరీత స్పందన, తిట్లు, శాపనార్ధాలు అన్నిటినీ తట్టుకొని కేవలం కథల మీద మమకారంతో వచ్చి వ్రాస్తున్నారు. అది కూడ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... గా...
కనుక, రచన అనేది అంత తేలికైన పని కాదని తెలియజేస్తున్నాను.
కవి గారూ... మీ సలహాలు గుర్తుంచుకుంటాను... నేను బుకాయించానని మీరు అనుకున్నా సరే కానీ... ఇది నిజం... మీరు చెప్పిన మాటలతో నేను ఏ మాత్రమూ హర్ట్ కాలేదు... నేను కథ రాసిన ప్రతిసారీ నాలోని లోపాలని ఎత్తి చూపాలని కోరుకుంటాను... దాని వల్ల కథ ఇంకా బాగా రాయగలను.... ఏదీ ఏమైనా మీ తోడ్పాటుకు ఆమోల్యమైనది... సాధుశ్రీ గారికి మీరు సరైన విధంగా వివరించారు... ధన్యవాదాలు
(09-10-2019, 05:34 PM)Okyes? Wrote: లక్ష్మీ గారు......
లవ్లీ రాజ్, సాదుశ్రీ, వికటకవి గార్ల కామెంట్లు చదివా...... మీ రిప్లై చూసా.....
వాటిని సీరియస్ గా తీసుకోకండీ
నేను మూలకథ చదువలేదు.....
కాని అర్థం అయ్యింది ఏంటంటే మీరు ఓపనింగ్ సంక్షిప్తీకరణం చేసి రాసారు....
మీ శైలిలో రాసారు......
అందుకే వాల్లకు ఏదో లోటు ఉన్నట్లు అనిపించింది అంతే.
పైగా మక్కీకి మక్కీ గా ట్రాన్స్ లేట్ చేస్తే ఎవ్వరు చదువరు గాక చదువరు
ఈ కథకు మీరు పూర్తి న్యాయం చేస్తారనే విశ్వాసం ఉంది
ఈ కామెంట్స్ ని positiveగా తీసుకొండి and
జస్ట్ కీప్ రైటింగ్.......
థ్యాంక్యూ వెరి మచ్.....
ధన్యవాదాలు గిరీశం గారూ...
నేను వాళ్ళ కామెంట్స్ positive గానే తీసుకున్నాను... వాటి ఆధారంగా కథనంలో మార్పులు చేస్తాను (కథలో కాదు)
(09-10-2019, 10:20 PM)Divyakumari Wrote: Next update plzzzకాసేపట్లో మూడో భాగం మీ ముందుంటుంది.... ధన్యవాదాలు
(10-10-2019, 06:29 AM)Chinna 9993 Wrote: Good update continueధన్యవాదాలు చిన్నా గారు
(10-10-2019, 07:56 AM)ssm Wrote: Every enni cheppina mee shaili lo meru rayandi daya chesi kathani madyalo apoddu plzzz starting superr plz give update
ధన్యవాదాలు ssm గారూ... సలహాలు ఏవైనా పనికి వచ్చేవి ఉపయోగించుకుంటాను... నా శైలిలోనే రాస్తాను... ఇంకోలా రాయడం నాకు రాదుకూడా....
ఇక కథ మధ్యలో ఆపే ప్రశ్నేలేదు... ఆలస్యం అవ్వొచ్చేమో గానీ ఆగిపోదని మీకు హామీ ఇస్తున్నాను