09-10-2019, 03:49 PM
(08-10-2019, 06:28 PM)Sadusri Wrote: Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa
మిత్రమా సాదుశ్రీ... మీ నామధేయము కడు విచిత్రంగా వున్నది.
అనువాద కథ వ్రాయటం స్వంత కథను వ్రాయటం కన్నా బహు కష్టం సుమీ! మన స్వంత కథ అయితే ఎటు నుంచి ఎటుకైనా మలుపు తిప్పవచ్చు. కానీ, అనువాద కథని మాతృకకి లోబడి వ్రాయవలసి వుంటుంది. పైగా ఆంగ్ల కథని అనువదించి వ్రాయటం చాలా కష్టముతో కూడిన పని. అక్కడ ఒక్క పదంతో తేల్చేసినదానికి ఇక్కడ నాలుగైదు పదాలు వ్రాయవలసి వస్తుంది.
మరో విషయం... ఇక్కడ వ్రాసే రైటర్లు అందరూ ప్రొఫెషనల్స్ కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కథలు టకటకా వ్రాసేయటానికి. బయట పనుల ఒత్తిడి, మూడ్, టైమ్, పాఠకుల విపరీత స్పందన, తిట్లు, శాపనార్ధాలు అన్నిటినీ తట్టుకొని కేవలం కథల మీద మమకారంతో వచ్చి వ్రాస్తున్నారు. అది కూడ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... గా...
కనుక, రచన అనేది అంత తేలికైన పని కాదని తెలియజేస్తున్నాను.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK