09-10-2019, 03:31 PM
(09-10-2019, 07:20 AM)Lakshmi Wrote: ధన్యవాదాలు కవిగారూ...లక్ష్మిగారూ...
మీలాగే నాకూ కథలో లోటు కనిపించింది.. అయితే దాన్ని సరి చేయలేకపోయాను... ఒకటికి రెండు సార్లు మూల కథతో పోల్చి చూసాను... దానితో పోల్చినపుడు సరిగానే అనిపిస్తుంది.. xossind గారు చక్కని ఇంగ్లీషులో అద్భుతంగా రాసారు... నేను ఇంచుమించు అవే వాక్యాలను తెలుగులోకి తర్జుమా చేసాను... కానీ ఆ ఫీల్ రాలేదు... ఇక మీదట(4వ భాగం నుండి) ప్రయత్నిస్తాను... మీ సలహాకు మరోసారి ధన్యవాదాలు... కానీ క్షమాపణలు కోరడం బాగాలేదు... ఇంకోసారి అలా చేయకండి... కథ ఎలా ఉన్నా బాగుంది అనే మాట కన్నా.. సలహాలు, సూచనలు, సద్విమర్శలు చేయడమే సరైన పని... వాటి వల్ల కథకి పరిపూర్ణత వస్తుంది...
ఒక అనువాద కథ వ్రాస్తున్నప్పుడు... అది ఏ భాష నుంచి వ్రాస్తున్నా మన భాషలో వ్రాసేప్పుడు, మనం ఎంచుకునే ప్రాంతం, పాత్రల పేర్లు, మనకున్న సంప్రదాయం, యాస (సాధ్యమైనంత వరకు) అనుసరిస్తూ వ్రాస్తే కథ మనది అయిపోతుంది. ఆంగ్లంలో వ్రాసిన కథలకైతే మనం ఇంకా ఎక్కువ కసరత్తు చెయ్యాల్సి వుంటుంది. స్థానిక భాషలలో ఉండే విరుపులు ఆంగ్లంలో కనిపించవు. అలాగే మనమూ తర్జుమా చేస్తే మక్కీకి మక్కీ కాపీ చేసేశాం అని మనకే అనిపిస్తుంది. ఉదాహరణకు నేను వ్రాస్తున్న గర్ల్స్ హైకాలేజ్ (ఎప్పుడూ ఇదే కథ గురించి చెప్తాడని విసుక్కోకండి)లో హింగ్లీష్ లో ఉన్న కథ చదివి నచ్చి దాన్ని అనువదించడానికి కనీసం రెండు వారాలు మన ఆంధ్రాలో ఉన్న ఏరియాలు, స్కూళ్ళు... వగైరా గురించి కాస్త రీసెర్చ్ చేసి తరవాత అమలాపురం బ్యాక్*డ్రాపులో తెలుగు నేటివిటీకి తగినట్లు కథను వ్రాసాను. ఒరిజినల్ అప్డేట్ చదివి నాకు నచ్చినట్టుగా మన భాషలో సంభాషణలు వ్రాసేవాన్ని. అనవసరం అనిపించినవి త్యజించేవాణ్ణి. కొత్తగా కథలో పాత్రలు, సీన్లు వ్రాసేవాణ్ణి.
ఇక రొమాన్స్ కి వస్తే ఒరిజినల్ లో పైపైన తేల్చేసి వుంటే అదే వ్రాస్తే మనవాళ్ళు మెచ్చరని నా స్వంత పద్ధతిలో వ్రాసేవాణ్ణి. (అది కూడ సరిపోలేదని అన్న మెసేజీలు చాలా వచ్చాయనుకోండి ;))
ఐనా... కథ, కథనం అందరికీ నచ్చింది. ఆదరించారు.
కనుక, మీరు చదివిన కథని మీ స్వంత కథగా భావించి ప్రతి పాత్రని, సన్నివేశాలని, మనోవేదనని స్వంత ధోరణిలో (మీ మొదటి కథ మాదిరిగా) వ్రాసుకుంటూ ముందుకు దూసుకుపోండి.
అప్పుడే మీ ఈ కథ పరిపూర్ణంగా మీదవుతుంది.
ఇక, క్షమాపణలు అడిగింది మిమ్మల్ని కాదు లక్ష్మిగారూ... మీలోని రైటర్ని. ఒక రైటర్ గా ఎంతో కొంత ఇగో ఉంటుంది. అబ్బే లేదని పైకి బుకాయించినాసరే! కష్టపడి వ్రాస్తున్నదానిలో ఎవరో వేలెడితే వచ్చే మంట మామూలుగా వుండదు(నా స్వంత అనుభవం). ఆ విధంగా మిమ్మల్ని కొంతైనా హర్ట్ చేసి వుంటాననే నేను సారీ చెప్పాను.
ఆల్ ద బెస్ట్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK