15-01-2019, 10:56 AM
(22-11-2018, 11:04 PM)Vikatakavi02 Wrote: సంధ్యాకిరణ్ గారూ... మీరెలా వ్రాసినా నేను చదివేస్తాను. నాకు ముందు తెలిసేడిస్తే కదా...
నాకైతే ఏ యాస పెద్దగా తెల్వదు... అందుకే, కోనసీమలో కథ నడిపిస్తున్నా గోదారి యాసని అస్సలు వ్రాయలేకపోతున్నాను. కానీ, తెలంగాణా, రాయలసీమ ఇలాంటి మాండలికాలు వ్రాయటానికి రైటర్స్ పడుతున్న తపన(యాతన) చూస్తే చాలా ముచ్చటేస్తోంది. లక్ష్మిగారు ఇదివరలో చెప్పినట్లు — రాని యాస కోసం ప్రాకులాడి అభాసుపాలవటం కన్నా దాని ఊసెత్తకపోవటమే మేలు. కానీ, ఒక్కసారి దిగాక మాత్రం లోతుపాతులను ఎంచుకుంటు ముందుకు సాగిపోవటం మరీ మంచిది.
(కమల్) కృష్ణుడు చక్కగా అన్నాడు — మాటల్లో మాండలికాలు వాడి నేపధ్యంలో మామూలుగా వ్రాయమని. ఇది చాలావరకు బరువుని తగ్గిస్తుందని నాకూ అన్పిస్తోంది.
మీ తరవాత అప్డేట్ కోసం ఎదురుచూస్తూ....
ఓ
పాఠకుడు
గ్రేట్ advise సూపర్బ్...