పద్మినీ' అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది పద్మిని
వస్తున్నా అమ్మగారూ...........అంటూ పూజ గదిలోకి వచ్చింది.
అలివేలుకి 54; మొగుడితో పాటూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యే వాలంటరీ రిటైర్ అయ్యింది.
అంతకు ముందే మొగుడు సూపరింటెండెంటుగా చేసి నెలక్రితమే రిటైరయ్యాడు.
గవర్నమెంట్ ఇద్దరికీ పెన్షన్ ఇస్తోంది. అంతా బానే ఉంది
కానీ ఈ మగాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాలకి ఏదో పొడుచుకొస్తుందిట., మళ్ళీ పెళ్ళైన 30 ఏళ్లకి పొడుచుకొచ్చింది.
పద్మిని: "ఏమ్మా.....అలా కేకేశారు?"
అలివేలు: "పూజకు కూర్చున్నా గదా., తోడుగా కూర్చోవే......అవీ ఇవీ అందిస్తూ ఉండచ్చు"
పద్మిని: "ఇక్కడ కూర్చుంటే పనులు ఎలా తెములుతాయమ్మా?"
అలివేలు: "ఇప్పుడు నువ్వు వెలగబెట్టాల్సిన పనులేమీ లేవు., మాట్లాడకుండా కృష్ణా రామా అనుకొవే., గమ్ముండు"
పద్మిని: నాకు తెలియదనుకొంటోంది., ఇంత వయాసొచ్చిన్నా మొగుడు మీద అనుమానం పోలే., అయ్యాగారు పేరుకే పట్టాభి రాము, సంగతి తెలియదనుకుంటా...."సరేలే అమ్మా.,ఇక్కడే ఉంటాలే".
పట్టాభి అప్పుడే స్నానం చేసి వచ్చాడు. అలివేలూ అంటూ గట్టిగా కేకేసాడు.
అలివేలు: "అబ్బా.....! మొదలైందీ!; కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వరు కదా., ఎమోచ్చింది? రిటైర్ అయ్యారు కదా....అరగంట ఓపిక పట్టండి" అంటూ విసుకుంటూనే "ఏం కావేలే?" అంటూ విసుగ్గా అడిగింది.