Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
స్వీటీ నేను మరుసటి రోజు నుంచి మా జాబ్స్ లో బిజీ అయిపోయాము. అయితే ఈ సరి వీకెండ్ ఎక్కడైనా మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో కానీ రిసార్ట్ లో కానీ గడుపుదామని అనుకున్నాను. కానీ రెండు రోజులు కాబట్టి మంచి మంచి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ 10 వేలు తక్కువ ఎక్కడ లేవు. వీకెండ్ ప్లాన్ కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఎక్కడ లేవు. ఇక డబ్బులు లేవని వదిలేసాను. 


"రేయ్ సంజయ్....."

"హే శరత్......"

"నువ్వు డిస్కౌంట్ కుఫాన్స్ కానీ ఏమైన్స్ ఆఫర్స్ కోసం అడిగావు కదా.....నేను పోయిన సరి మెంబర్షిప్ దేనికో క్లబ్ కి తీసుకుంటే నాకు ఒక రెండు కూపన్స్ ఇచ్చారు.....నిన్నే ఇంట్లో కనపడ్డాయి..... ఇంకో 10 రోజుల్లో వాటికి డేట్ కూడా అయిపోతుంది......"

"డిస్కౌంట్ అంటే ఏ హోటల్ కైనా పనిచేస్తుందా ??"

"చూడు సంజయ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ కాదు...... నువ్వు ఈ ఇయర్ ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకుంటే వచ్చే ఇయర్ ఇదే రోజు నీకు అదే హోటల్ లో ఫ్రీగా ఉండొచ్చు..... అంటే ఇప్పుడు మొత్తం పే చేయాలి..... నెక్స్ట్ ఇయర్ ఫ్రీ....."

"ఓ....." అని కొంచెం నిరాశ పడ్డాను. 

"సంజయ్.... నీకు ఒకే అంటే చెప్పు..... లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను..... వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి......"

నేను ఆలోచించాను, ఒక 10 వేలు పోయిన మళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా ఇద్దరం ఒక వీకెండ్ స్టే చేయొచ్చు ఫ్రీగా. ఇదేదో ఆఫర్ బాగుందని అనుకున్నాను. 

"ఒకేరా థాంక్స్......బానే ఉంది ఆఫర్.....ఎం చేస్తాం మీ లాగా మాకు అంత డబ్బు లేదు..... ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం ......." అన్నాను. 

"రేయ్ ఏడవడం ఆపుతావా ?? నాకు ప్రమోషన్ తొందరగా వచ్చిందని మీ అందరికి నేనొకడ్ని దొరికాను......  నా పై పంచ్ లు వేయటం అందరికి కామన్ అయిపోయిందిరా.... నాకు కూడా టైం వస్తుంది...."

"ఏడిశావులే వెళ్లు....."

"నాకు కూడా టైం ఒస్తది రా.....మీ అందరితో నేను కూడా ఆడుకుంటాను....."

ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా నవ్వుకున్నాం. నాకు షాక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

నేను ఈవెనింగ్ టైం లో ఫోన్ లో ఒక మంచి హోటల్ వెతికి బుక్ చేసాను. అంత కలిపి పదివేల పైనే అయ్యింది. ఒక మంచి ఫోర్ స్టార్ హోటల్ లో శుక్రవారం ఈవెనింగ్ నుంచి ఆదివారంఈవెనింగ్ వరకు ఒక మంచి రూమ్ బుక్ చేసాను. డబ్బులు ఆన్లైన్ లో అడ్వాన్స్ పే చేసాను. బుకింగ్ కంఫర్మ్ అయ్యిందని మెసేజ్ వచ్చింది.  ఇదంతా శుక్రవారం వరకు దాచి స్వీటీని సుర్ప్రైస్ చేయాలని అనుకున్నాను. 

శుక్రవారం: 

ఇద్దరం లేసి రెడీ అయ్యాము ఆఫీస్ కి వెళ్ళటానికి. ఇద్దరం హోటల్ లో స్పెండ్ చేస్తాం కాబట్టి మంచి ఉషారు నాలో వచ్చింది. తనకి ఆ సుర్ప్రైస్ ఇచ్చి తనలో రియాక్షన్ చూడాలని బాగా అనిపించింది. ఇప్పుడే ఆఫీస్ కి వెళ్లేముందే చెప్పేద్దామా లేక ఈవెనింగ్ చెబుదామా అని ఆలోచించాను. ఎలాగో ఆఫీస్ మూడ్ లో ఉన్నాం కదా అని ఈవెనింగ్ చెబుదామని డిసైడ్ అయ్యాను. అయితే స్వీటీ కి ఆఫీస్ లో లేట్ అవ్వొచ్చని నేను స్వీటీతో 

"స్వీటీ...."

"hmmmmm....."

నేను తన దగ్గరకు వెళ్లి రెండు చేతులు పట్టుకొని "ఈ రోజు......ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయి......." అన్నాను. 

"ఒకే......"

"ఐదుకల్లా వచ్చేసేయి....." అన్నాను. 

"ఒకే......" అని చాల నార్మల్ గా చెప్పింది. 

ఇద్దరం ఆఫీస్ కి వెళ్ళాం. అయితే నా మూడ్ అంత వీకెండ్ గురించే. మేమిద్దరం హోటల్ రూమ్ లో ఆడుకోవటానికి కార్డ్స్, కొన్ని బోర్డు గేమ్స్ (board games) కూడా నిన్న మొన్న కొన్నాను. అలాగే కొన్ని మంచి మంచి సినిమాలు కూడా లాప్టాప్ లోను పెన్ డ్రైవ్ లోను ఎక్కించాను. ఇద్దరం అలా హోటల్ లాన్ లో బయట రొమాంటిక్ గా తిరగటానికి స్వీటీ కోసం షాలువా కూడా కొన్నాను. రేపు ఈవెనింగ్ కి హోటల్ టెర్రస్ పైన రెస్టారంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి కూడా బుక్ చేసాను. అలాగే ఎప్పటిలాగే స్వీటీ కోసం ఒక పెద్ద చాక్లెట్ అలాగే ఒక రోజా పువ్వు కూడా కొన్నాను. అలాగే ఇద్దరి కోసం మంచి మ్యూజిక్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆఫీస్ లో చాల కష్ట పది ఏదో అలా అలా పని పూర్తి చేసి ఇంటికి వచ్చాను. 

స్వీటీ రాక కోసం ఎదురు చూసాను. తను రావటానికి ఇంకా టైం పడుతుంది, ట్రాఫిక్ లో ఉన్నానని చెప్పింది. నేను ఈ లోగ ఒక సూట్ కేసు తీసి ఈ రెండు రోజులకి సద్దుకున్నాను. తన నల్ల చీర, అలాగే తను సెక్సీగా నా కోసం కొన్న డ్రెస్సులు కూడా ప్యాక్ చేసి పెట్టాను రెడీ గా. 

అప్పుడే బెల్ మోగింది. వెంటనే సూట్ కేసు ని లాక్కుని డోర్ ఎదురుగా కొంచెం దూరంలో పెట్టి డోర్ ఓపెన్ చేసాను. స్వీటీ కనిపించింది. సూట్ కేస్ చూసింది, తనకేమి అర్ధం కాలేదు. 

"సంజు.... సూట్ కేస్ ఏంటి ??"

"అది..... మనిద్దరం ఈ వీకెండ్ హోటల్ లో ఉండబోతున్నాం....."

తనకెలా రియాక్ట్ అవ్వాలో అర్ధంకాలేదు "ఓ.....వావ్......." అని కొంచెం నవ్వింది. 

తనని గట్టిగ హగ్ చేసుకున్నాను. నన్ను కూడా తను గట్టిగ హగ్ చేసుకుంది. నేననుకున్నంత రియాక్షన్ ఇవ్వలేదు స్వీటీ. ఆఫీస్ లో అలిసిపోయిందేమో అనుకున్నాను. 

అలాగే స్వీటీని హాగ్ చేసుకుంటూ నేను "స్వీటీ......అక్కడే రెడీ అవ్వు......ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తున్నాను .....టైం లేదు.... మనకి.....ఎప్పుడెప్పుడు నీతో ఏకాంతం దొరుకుతుందా... అని వెయిట్ చేసాను....నా వల్ల కావట్లేదే......." అన్నాను. 

"hmmmmm......" అంది 

కౌగిలి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాక "ఏంటే ?? ఎందుకు అదోలా ఉన్నావ్ ఈ రోజు ??" అని అడిగాను. 

"ఎం లేదు..... ఆఫీస్ వర్క్ కదా....." అంది 

"ఆఫీస్ లో ఏమైనా అయ్యిందా ??"

"అలాంటిదేమి లేదు......ఆఫీస్ ఎప్పటిలాగే హ్యాపీ గా ఉంది వీకెండ్ వల్ల......"

"hmmmm...... సర్లే..... కొంచెం అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు..... అక్కడికి వెళ్తే నీకు కూడా మూడ్ వచ్చేస్తుందిలే...."

స్వీటీ నవ్వింది. 

"సరే పద..... కిందకి వెళదాం... " అన్నాను. 

"ఒకే....." అంది. 

ఇద్దరం కిందకు వెళ్లి క్యాబ్ ఎక్కాము. క్యాబ్ లో కూడా స్వీటీ మూడ్ అంతగా బాలేదు. ఏదో మూడ్ ఆఫ్ లో ఉంది. క్యాబ్లో ఇద్దరం బాగా దగ్గరగా కూర్చున్నాము. ఒకరి చేతులు ఒకరం పట్టుకున్నాం. స్వీటీ నా భుజం పై తల పెట్టుకొని అలాగే సైలెంట్ గా ఉండిపోయాము. తను అలా నా భుజం పై తల పెట్టుకొని తన చేతులతో నన్ను గట్టిగ కౌగిలించుకొని అలాగే తన కళ్ళు రెండు మూసుకొని పోయాయి. 

నెమ్మదిగా హోటల్ కి చేరుకున్నాము. రిసెప్షన్ లో రూమ్ డోర్ స్వైప్ చేసే కార్డు తీసుకొని పైకి వెళ్లాం. బెల్ బాయ్ రూమ్ చూపించటానికి వచ్చాడు. మాకు రూమ్ చూపించి అక్కడి నుంచి బెల్ బాయ్ వెళ్ళిపోయాడు. నేను తలుపేసేసి లాక్ చేసాను. 

స్వీటీ మంచం పై కూర్చుంది. నేను తన పక్కనే బెడ్ పైన కూర్చొని "హే...... ఇందాకటి నుంచి చూస్తున్నాను.....ఇంతే స్వీటీ అలా ఉన్నవేంటి ?? మొహం లో ఉషారు లేదు....."

నా వైపు చూసి "ఎం లేదు.....సంజు....."

"స్వీటీ......ఏదో ఉంది..... అది ఏంటో నాకు చెప్పట్లేదు....."

"సంజు.....అది.... ఎం లేదు......"

"స్వీటీ....నేను నీ లైఫ్ పార్టనర్ నే..... ఏంటో చెప్పు....నా దగ్గర ఎందుకు మోహుమాటం ??"

"సంజు ఐ అం వెరీ సారీ....... " అంది 

"ఇట్స్.... ఓకే..... ఎం జరిగిందో చెప్పు....."

తన కళ్లలోనుంచి కన్నీళ్లు వచ్చాయి వెంటనే నన్ను హగ్ చేసుకుంది. 

నేను తన వీపుని నిమిరి సముదాయిస్తూ "హే....హే..... ఏమైందే నీకు ?? ఎందుకేడుస్తున్నావ్ ఇలా ??" అని అడిగాను. 

తాను మెల్లిగా "నా.....నా....బెస్ట్ ఫ్రెండ్ ..... "

"నీ బెస్ట్ ఫ్రెండ్......."

"తను ఈ రోజే సూసైడ్ చేసుకొని........"

"ఒకే ..... ఒకే....." అని మళ్ళి తనని దగ్గరకు తీసుకున్నాను.

బాగా ఏడ్చేసింది నన్ను గట్టిగ పట్టుకొని. నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు. తనని గట్టిగ పట్టుకొని "స్వీటీ..... ఇట్స్ ఒకే.....ఇట్స్ ఒకే........." 

అలాగే కొంచెం సేపు ఏడ్చి నాకు సారీ చెప్పింది. 

"సారీ సంజు.....నువ్వు నా కోసం ప్లన్స్ చేసావ్......కానీ.... కానీ....."

"స్వీటీ....ఎం మాట్లాడొద్దు....." అంటూ తన కనిళ్ళు తుడిచి తన చేయి పట్టుకొని బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లి తన మొహం తుడుచుకుంది. 

స్వీటీ చాల బాధలో ఉండేసరికి వాళ్ళ మధ్య బంధం ఎంత మంచిదో అర్ధమైంది. తనకి ఇలాంటి సమయంలో నేను దగ్గరగా ఉండాలని ఇద్దరం మంచం పైన పడుకున్నాం. స్వీటీ నన్ను గట్టిగ కౌగిలించుకొని ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళు పెట్టె హింసలు తట్టుకోలేక నిన్న రాత్రి సూసైడ్ నోట్ రాసి విషం తాగి చనిపోయిందని చెప్పింది. చాల మంచి అమ్మాయని చెప్పింది. ఎలాంటి చెడు తెలియని ఒక అమ్మాయి అలా బలైపోయిందని స్వీటీ అస్సలు తట్టుకోలేక పోయింది. మొన్న కూడా స్వీటీతో ఫోన్ లో ఒక రెండు నిమిషాలు బాగానే మాట్లాడిందంట. అలాగే స్వీటీ నాకు తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తుంటే వింటూ అలాగే ఇద్దరం డిన్నర్ కూడా తినకుండా నిద్రపోయాము. 

నాకు మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయ్యింది. స్వీటీ నా పక్కన లేదు. లేసి చూసాను. బాత్రూం లో నీళ్ల శబ్దం వినిపించింది. బాత్రూం డోర్ లాక్ చేసి లేదు. నెమ్మదిగా వెళ్లి డోర్ తీసి చూసాను. స్వీటీ బాత్రూమ్ లో షవర్ డోర్ వెనకాల కింద కూర్చొని బాగా బాధలో ఏడుస్తుంది.

నేను వెళ్లి తన పక్కనే కూర్చున్నాను. షవర్ ఆన్ చేసే ఉంది. నెమ్మదిగా నీళ్లు పడుతున్నాయి. నిద్ర పట్టలేదని చెప్పింది. నెమ్మదిగా షవర్ ఆపేసి తనని దగ్గరకు తీసుకొని అలాగే ఇద్దరం ఉండిపోయాము. 

[Image: tumblr_oomtkzx1xB1qc3ju8o2_500.gif]

[Image: tumblr_oy8ricDDoQ1qet6nvo1_500.gif]
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 15-01-2019, 02:53 AM



Users browsing this thread: 6 Guest(s)