29-09-2019, 09:40 PM
(This post was last modified: 29-09-2019, 09:45 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
పరోపకారం ఇదం శరీరం
ఒక విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము.భోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం విస్తరి ఆకును మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడ అంతే! ఊపిరి పోగానే ఊరిబయట పారేసి వస్తారు.
పారేసినప్పుడు విస్తరాకు ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే పొయేముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది.
విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవచేసే అవకాశము వచ్చినపుడు తప్పక చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా మాత్రం వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే మన ఊపిరి కుండ ఎప్పుడైనా పగలవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
అప్పుడు ఎంత సంపాదించి ఏమి లాభం?
ఒక్కపైసా కూడా తీసుకుపోగలమా?
కనీసం మన ఒంటిమీద బట్టని కూడా మిగలనివ్వరు. వ్యర్ధమైన కట్టెగా మిగిలిపోవాలసి వుంటుంది.
అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. సాటి మనుషులలో భగవంతుణ్ణి చూడండి. వాళ్ళనీ చూడనివ్వండి.
ధర్మో రక్షతి రక్షితః
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK