Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ఆధ్యాత్మిక చింతన

#12

ఏది నీది?
[Image: images-1.jpg]

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: ఆ పెట్టెలో ఏముంది స్వామీ?

దేవుడు: నీకు చెందినవి ఈ పెట్టెలో ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 19-09-2019, 10:52 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 19-09-2019, 12:30 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 19-09-2019, 12:54 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-09-2019, 06:25 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-09-2019, 11:20 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by oxy.raj - 21-09-2019, 07:55 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 22-09-2019, 09:48 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 22-09-2019, 09:56 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 23-09-2019, 05:48 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 24-09-2019, 09:46 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 25-09-2019, 11:30 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 29-09-2019, 07:57 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 29-09-2019, 09:40 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 04-10-2019, 09:28 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 08-10-2019, 06:07 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 10-10-2019, 01:47 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 13-10-2019, 04:31 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 23-10-2019, 11:56 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 25-10-2019, 06:37 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 30-10-2019, 02:11 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 12-11-2019, 01:45 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 26-11-2019, 05:36 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 30-11-2019, 07:23 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 01-12-2019, 08:23 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 06-12-2019, 12:44 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 08-12-2019, 08:34 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 08-12-2019, 09:23 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 12-12-2019, 10:35 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-12-2019, 02:25 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-12-2019, 03:02 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 03-01-2020, 12:31 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 07-01-2020, 05:03 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 07-01-2020, 05:04 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by smitha143 - 28-01-2020, 03:09 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 30-01-2020, 07:52 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 08-02-2020, 09:49 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 12-02-2020, 05:17 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 17-02-2020, 06:53 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 01-04-2020, 11:14 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 19-05-2020, 08:50 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 25-05-2020, 10:22 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 02-08-2020, 08:53 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 02-08-2020, 11:59 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 08-08-2020, 04:28 PM
గణపతిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు? - by oxy.raj - 23-08-2020, 12:31 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 27-08-2020, 09:57 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 27-08-2020, 09:57 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 09-03-2021, 11:03 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 09-03-2021, 11:16 PM
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-03-2021, 08:50 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by oxy.raj - 22-07-2021, 09:07 AM
RE: ఆధ్యాత్మిక చింతన - by sri7869 - 20-08-2023, 10:38 PM



Users browsing this thread: 1 Guest(s)