25-09-2019, 09:22 PM
(This post was last modified: 04-10-2019, 08:19 PM by prasad_rao16. Edited 2 times in total. Edited 2 times in total.)
కాని అక్కడ ఉన్న ఒక ఇంట్లో ఎవరో ఒకామెను కొట్టినట్టు శబ్దం రావడంతో రాము వెంటనే ఆగిపోయి వెనక్కు తిరిగి ఆ ఇంట్లోకి వెళ్లాడు.
ఆ ఇంట్లో నేల మీద ఒక ఆడ మనిషి అచేతనంగా పడి ఉన్నది.
ఒకతను ఆమెను కత్తితో పొడుస్తున్నాడు….దాంతో ఆమె గిలగిలా కొట్టుకుని చనిపోయింది.
ఆ హత్యను చూసిన రాము కళ్ళు హత్య చేసిన అతని వైపు మళ్ళాయి.
ఆ హత్య చేసిన అతను తన చేతులకు అంటిన రక్తాన్ని అక్కడే ఉన్న గోడకు రాస్తున్నాడు.
తన చేతులకు అంటిన రక్తాన్ని గోడకు తుడిచిన తరువాత తన నోట్లో ఉన్న మోర్ సిగరెట్ ఒక్కసారి గట్టిగా పఫ్ లాగి… సిగరెట్ ని పెదవుల మధ్య లోనుండి తీసి తనను తాను అక్కడ ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని నోట్లో నుండి పొగ వదిలాడు.
తరువాత పక్కనే ఉన్న గ్లాసులో సిగరెట్ ని పడేసాడు.
అది చూసిన రాము కోపంతో తన బెల్ట్ కి ఉన్న పౌచ్ లో రివాల్వర్ తీసి, “రేయ్….ఎవడ్రా నువ్వు….పట్ట పగలే హత్య చేసావు,” అంటూ గన్ ని అతనికి గురిపెట్టాడు.
![[Image: Suriya.png?hfd8QdSvNy0VUVYD8hGkVTiIOnZtKnG8]](https://akm-img-a-in.tosshub.com/indiatoday/images/story/201805/Suriya.png?hfd8QdSvNy0VUVYD8hGkVTiIOnZtKnG8)
హత్య చేసిన అశోక్ వెనక్కు తిరిగి అక్కడ నిలబడి ఉన్న రాముని చూసి ఆశ్చర్యపోయి అలాగే నిల్చున్నాడు.
కాని వెంటనె తేరుకుని పక్కనే చైర్ లో ఉన్న తన కోటుని తీసి రాము మొహం మీదకు విసిరేసి అశోక్ అక్కడ నుండి పరిగెత్తాడు.
రాము కూడా వెంటనే అశోక్ ని ఫాలో అవుతూ అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడు.
అలా పరిగెత్తుతున్న రాముకి సడన్ గా లారీ ఒకటి అడ్డం రావడంతో దాన్ని తప్పించుకోవడానికి పక్కకు దూకాడు.
ఈ లోపులో అశోక్ వెంటనే అక్కడ నుండి తప్పించుకొని అక్కడ ఉన్న పాడుబడ్డ గ్యారేజీ లోకి పరిగెత్తాడు.
రాము కూడా వెంటనే పైకి లేచి ఆ గ్యారేజీ లోకి వెళ్ళి అశోక్ ఎక్కడ ఉన్నాడా అని చుట్టూ చూస్తున్నాడు.
ఆ గ్యారేజీలో అశోక్ ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్న రాముకి ఊహించని విధంగా అశోక్ వెనక నుండి అతని తల మీద రాడ్ తీసుకుని గట్టిగా కొట్టాడు.
దాంతో రాము వెంటనే తల పట్టుకుని బాధతో కళ్ళు బైర్లు కమ్ముతుండగా….కళ్ళ ముందు అంతా మసగ్గా కనిపిస్తుంటే కింద పడిపోయాడు.
అశోక్ తన చేతిలో ఉన్న రాడ్ ని రాము మీదకు విసిరేసి కాలితో రాము ఛాతీ మీద, కడుపు మీద ఎక్కడ బడితే అక్కడ కొడుతున్నాడు.
అశోక్ కొట్టిన దెబ్బలకు రాము దాదాపుగా సృహ కోల్పోయినట్టు ఉన్నాడు….కళ్ళ ముందు ఏం జరుగుతుందో కనిపిస్తున్నది….కాని ఏమీ చేయలేకపోతున్నాడు.
రాము ఇక లేవలేడని నిర్ధారణకు వచ్చిన అశోక్ ముందుకు ఒంగి రాము చేతిని పట్టుకుని అక్కడ దగ్గరలో ఉన్న మిషన్ కి ఒక రాడ్ కోపుగా బయటకు వచ్చి ఉండటం చూసి…దానికి రాముని గుద్ది చంపేద్దామని లాకెళ్తున్నాడు.
రాము తనను తాను రక్షించుకోవడానికి చేత్తో అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని తడుముతున్నాడు.
కాని రాము చేతికి ఏమీ తగల్లేదు.
రాము చేతిని వదిలి అశోక్ తన రెండు చేతులతో రాము షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి ఆ రాడ్ కి రాము తలను గుద్దుదామని పైకి లేపాడు.
రాము అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఏం జరగబోతున్నదో ఊహించి వెంటనే అక్కడ తన చేతికి అనుకోకుండా అందిన రాడ్ తీసుకుని ఏం జరుగుతుందో అశోక్ ఊహించేలోపు ఆ రాడ్ ని అశోక్ మెడలో దింపేసాడు.
దాంతో అశోక్ రాముని వదిలేసి చేత్తో మెడని పట్టుకుని నొప్పితో గట్టిగా అరుస్తూ కింద పడిపోతూ తన ఫ్యాంట్ పాకెట్ లోనుండి ఏదో ఎలక్ట్రానిక్ డివైజ్ తీసి దాని మీద ఉన్న బటన్ నొక్కాడు.
బటన్ నొక్కిన వెంటనే ఆ డివైజ్ పని చేస్తున్నట్టు గ్రీన్ కలర్ ఇండికేషన్ వెలిగింది.
అది చూసిన అశోక్ పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిగింది.
ఆ మరుక్షణమే అతని ప్రాణం పోవడంతో ఆ పెదవుల మీద నవ్వు మాయమైపోయి అతని కళ్ళు నిర్జీవంగా ఆకాశం లోకి చూస్తున్నాయి.
పక్కనే రాము కూడా సృహ తప్పి పోయాడు.
అప్పుడే ప్రసాద్ క్రిమినల్ ని పట్టుకుని తన టీమ్ కి అప్పగించి రాము కోసం వెతుక్కుంటూ గ్యారేజీకి వచ్చి అక్కడ సృహ తప్పి పడిపోయిన రాముని, పక్కనే చనిపోయిన అశోక్ ని చూసి తన దగ్గర ఉన్న ఫోన్‍లో అంబులెన్స్ ని పంపించమని చెప్పాడు.
ప్రసాద్ టెన్షన్ తో రాము దగ్గరకు వచ్చి గొంతు దగ్గర వేళ్ళు పెట్టి చూసి బ్రతికే ఉన్నాడని నిర్ధారించుకుని ఒక్కసారి రిలీఫ్ అయ్యి అంబులెన్స్ రాగానే వెంటనె అందులోకి రాముని ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.
హాస్పిటల్ చేరుకున్న తరువాత రాముకి వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి తలకు కట్టు కట్టి….బయట కంగారుగా ఉన్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ప్రసాద్ గారూ….ఇంకో గంటలో రాము గారికి సృహ వస్తుంది,” అన్నాడు.
ఆ మాట వినగానే ప్రసాద్ ఆనందతో డాక్టర్ చేతులు పట్టుకుని, “చాలా థాంక్స్ డాక్టర్….” అన్నాడు.
“కొట్టిన వాడు ఎవడో కాని మనిషి ఎక్కడ కొడితె బాగా డ్యామేజ్ జరుగుద్దో తెలిసిన వాడు….కాకపోతే రాము గారి అదృష్టం బాగుండటంతో…దెబ్బ వేరే చోట తగిలింది,” అన్నాడు డాక్టర్.
“అలాగా….సరె….వాడి గురించి తరువాత ఎంక్వైరీ చేస్తాను….నేను రాము సార్ ని చూడొచ్చా,” అనడిగాడు ప్రసాద్.
“తప్పకుండా….కాకపోతే ఆయన్ను కదిలించకండి,” అంటూ డాక్టర్ తన పక్కనే ఉన్న నర్స్ కి ఏం మందులు వాడాలో వివరంగా చెబుతున్నాడు.
ప్రసాద్ వెంటనె రాము ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు.
లోపల బెడ్ మీద రాము హాస్పిటల్ డ్రస్ లో పడుకుని ఉన్నాడు….అతని తలకు కట్టుకట్టి ఉన్నది.
(To B Continued...........)
(తరువాత అప్డేట్ 726వ పేజీలో ఉన్నది......https://xossipy.com/showthread.php?tid=27&page=726)