Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#4
నీ దేహం ?
[Image: images?q=tbn%3AANd9GcQsE0K2A_2U3rnd0L9F_...H2USZDLlNO]
64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా ఒక  తల్లిలోకి ప్రవేశిస్తే అందులో కేవలం ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై మళ్లీ  బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి  దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహాన్ని నేనే అంటాం.

కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఓ  అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.

ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 20-09-2019, 06:25 AM



Users browsing this thread: 2 Guest(s)