Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ఆరోజు మామూలుగా రాము తన ఆఫీస్ కి వెళ్ళి తాను చూడాల్సిన కేసు ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు.

కొద్దిసేపటికి ప్రసాద్ కూడా స్టేషన్ కి వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “ఏంటి సార్….అంత దీర్ఘంగా చూస్తున్నారు,” అనడిగాడు.
రాము ఒక్కసారి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ, “ఏమున్నది ప్రసాద్….మనం చూడాల్సిన కేస్ డీటైల్స్ చూస్తున్నాను,” అంటూ ప్రసాద్ ని కూర్చోమని సైగ చేస్తూ ఆ కేసు ఫైల్ ని అతని ముందుకు తోసాడు.

[Image: security%20officersecurity%20officer_076.jpg]

ప్రసాద్ ఆ ఫైల్ తీసుకుని స్టడీ చేస్తున్నాడు.
ఇక్కడ వీళ్ళీద్దరూ కేసు గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
*****
అదే నగరంలో ఒక ఏరియాలో ఒక భవనం ముందు చావు మేళం మోగుతున్నది.
అందరూ చాలా విచారంగా చనిపోయిన అతని గురించి మాట్లాడుకుంటున్నారు.
అంతలో ఒకతను వచ్చి అక్కడ కూర్చున్న ఒకాయనతో, “సార్….ఇక్కడ డాక్టర్ అని రాసి ఉన్నది…ఈయన హాస్పిటల్ లో డాక్టరా…లేకపోతే phd చేసిన డాక్టరా….ఇక్కడ సంతాపం తెలిపే బోర్డ్ మీద ఏమని రాయాలి,” అనడిగాడు.
దానికి చైర్ లో కూర్చున్న అతను, “ఏమయ్యా….చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద మనిషి…సైంటిస్ట్...చాలా ప్రయోగాలు చేసాడు….ప్రెసిడెంట్ అవార్డ్ కూడా నామినేట్ అయ్యాడు….అందుకని అందరికీ అర్ధమయ్యేలా క్లియర్ గా రాయి….” అన్నాడు.
“సార్….ఇక్కడా నాకు ఇచ్చిన పేపర్ మీద డిగ్రీలు చాలా ఉన్నాయి….బోర్డ్ మీద అన్ని డిగ్రీలు రాయాలా…లేకపోతే డాక్టర్ అని రాస్తే చాలా,” అనడిగాడు.
దానికి కుర్చిలో అతను సమాధానం చెప్పేలోపు అక్కడకు ఒకతను చనిపోయిన వ్యక్తికి దండ వేయడానికి వచ్చిన అతను, “ఏయ్….” అంటూ బోర్డ్ రాసే అతని దగ్గరకు వచ్చాడు.
దాంతో బోర్డ్ రాసే కుర్రాడు దండ పట్టుకున్న అతని వైపు తిరిగి, “చెప్పండన్నా….” అన్నాడు.
“రేయ్….అంతా క్లియర్ గా రాసిచ్చాను కదా….అలాగే రాయి,” అన్నాడు.
బోర్డ్ రాసే కుర్రాడు మళ్ళీ ఒకసారి పేపర్ చూసుకుని, “అలాగే అన్నా…” అంటూ అక్కడ నుండి వెళ్ళీపోయాడు.
దండ పట్టుకున్న అతను, “ఇక వెళ్ళి….బోర్డ్ సరీగా రాయి,” అంటూ తన చేతిలో దండ పట్టుకుని శవం దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న దండని శవం ఉన్న గాజు ఐస్ బాక్స్ మీద పెట్టాడు.
ఒక్కసారి ఆ సైంటిస్ట్ శవాన్ని ఒక్క సెకను బాధగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అతను అంత పెద్ద దండ తీసుకొచ్చి సైంటిస్ట్ మీద వేసే సరికి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకావిడ పక్కన ఉన్న ఆవిడతో, “ఏమ్మా….అతను ఎవరు,” అని చనిపోయిన సైంటిస్ట్ భార్యని అడిగింది.
దానికి ఆమె, “అతను మా ఆయన జిమ్ ట్రైనర్ అశోక్…ఆరు నెలల నుండి ఆ అబ్బాయి మా ఆయన పక్కనే ఉండి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవాడు,” అన్నది.
జిమ్ ట్రైనర్ అశోక్ సైంటిస్ట్ శవం దగ్గర నుండి బయటకు వచ్చి జేబులో ఉన్న మోర్ సిగరెట్ తీసి కాల్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చి సైంటిస్ట్ భవనం వైపు చూసి వదిలాడు.
ఒక్క నిముషం ఆ భవనం వైపు చూసి సిగిరెట్ తాగుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
******
ఆరోజు సాయంత్రం రాము, ప్రసాద్ ఎప్పటిలాగే కాఫీ ఫాప్‍లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

[Image: 500_F_241726765_M6RplZTUtuA9efUDigswoKkjXQM9SXcf.jpg]

ప్రసాద్ : సార్….ఒక్క విషయం అడగనా…..
రాము : అడుగు ప్రసాద్….ఏంటి….
ప్రసాద్ : ఎవరైనా స్టేషన్‍లోనో….లేకపోతే ఆఫీస్‍లోనో కేస్ డిస్కస్ చేస్తారు….మీరు ఎప్పుడు చూసినా కేస్ డిస్కషన్ కాఫీ షాప్‍లో పెడతారేంటి….
రాము : నాకు అక్కడ కూర్చుంటే మూడ్ రావడం లేదు ప్రసాద్….ఎప్పుడు చూసినా అవే మొహాలు…వెధవ రౌడీ షీటర్లు….వాళ్ళ మొహాలు చూసి చూసి విసుగొచ్చేసింది…అదే కాఫీ షాప్స్ లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అనుకో….కళ్ళకు చాలా ఎక్సర్‍సైజ్ కూడా….అందమైన అమ్మాయిలు చాలా మంది కనిపిస్తుంటారు…వాళ్లను చూస్తే చాలు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది….
ప్రసాద్ : ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉండి ఇలా అమ్మాయిల కోసం చేయడం తప్పు కదా సార్….
రాము : నేను ఎవరినీ బలవంతపెట్టడం లేదు ప్రసాద్….అమ్మాయి ఇష్ట ప్రకారంతోనే చేస్తున్నాను…ఎవరినీ నా హోదా చూపించి భయపెట్టడం లేదు…ట్రై చేస్తున్నా…అమ్మాయికి ఇష్టం అయితే రెస్పాన్స్ ఇస్తుంది…లేకపోతే ఇంకొ అమ్మయిని ట్రై చేద్దాం…..
రాము ఇచ్చిన క్లారిటీకి ప్రసాద్‍కి కళ్ళ ముందు పట్టపగలే నక్షత్రాలు కనిపించాయి.

[Image: Rajendra+Shisatkar5-crime-patrol-dastak-blog.jpg]

ప్రసాద్ : చాలా క్లారిటీతో ఉన్నారు సార్…..
రాము : నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యవయ్యా…..ఎవరినైనా ట్రై చేస్తావా…..
ప్రసాద్ : అమ్మో…నాకు అంత ధైర్యం లేదు సార్….అసలే ఈ మధ్య కెమేరాలు ఎక్కడ బడితే అక్కడ ఉంటున్నాయి…. ఏదైనా అటూ ఇటూ జరిగిందంటే….బతుకు యూట్యూబ్ అయిపోతుంది….ఆ తంటాలేవో మీరే పడండి….
ప్రసాద్ అలా అనగానే రాము కూడా ఒక్కసారిగా నవ్వాడు.
ప్రసాద్ : సార్….ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను….
రాము : ఏంటి….అమ్మాయిల విషయం ఇంకా డౌటా….
ప్రసాద్ : అది కాదు సార్…..ఇవ్వాళ మీరు మా ఇంటికి డిన్నర్‍కి రావాలి….
రాము : ఏంటి స్పెషల్….మీ మ్యారేజ్ డేనా…..
ప్రసాద్ : అలాంటిదేం లేదు సార్….ఏదో మిమ్మల్ని పిలవాలి అనిపించింది…..
రాము : ఇప్పుడెందుకు ప్రసాద్….అవసరమా….చక్కగా బయట కలిసి ఎంజాయ్ చేస్తున్నాం కదా….
ప్రసాద్ : లేదు సార్…..అల్రెడీ నా భార్యకి మీ౦రు వస్తున్నారని చెప్పాను…ఏవో స్పెషల్స్ కూడా చేస్తున్నది….

[Image: Manish-Goyal.jpg]
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 10-09-2019, 08:57 PM



Users browsing this thread: shekhadu, 3 Guest(s)