06-11-2018, 07:20 PM
అని అతనితో గుసగుసగా అంటుండగానే సుమిత్ర ఒక్కసారిగా నడవడం ఆపి కదలకుండా నిల్చున్నది.
సుమిత్ర ఎందుకు ఆగిందో అర్ధం కాక వాళ్ళిద్దరూ కూడా ఆగి ఆమె వైపు చూస్తున్నారు.
సుమిత్ర ఒక్కసారిగా వెనక్కు తిరిగింది….ఆమె మొహం మొత్తం వికృతంగా మారిపోయింది.
అది చూసి మహేష్, “అరేయ్ రాము….దీన్ని ఆ మోహిని ఆవహించిందిరా….నిన్న నా ఆత్మ జైల్లో ఈమెను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నదిరా అనుకున్నాను….కాని ఇప్పుడేంటిరా ఇలా భయంకరంగా ఉన్నది…..” అన్నాడు కంగారుగా.
రాము : అరేయ్….నాక్కూడా అర్ధమవుతున్నది…ముందు ఏం చేద్దామో చెప్పు….మనం ఎలాగైనా ఈ మహల్ నుండి బయటకు వెళ్ళగలిగితే చుట్టూ నది ఉన్నది కాబట్టి నీళ్లల్లో ఈ అస్థికలను ఈజీగా కలపొచ్చు…..
మహేష్ : ఏంటిరా చెప్పేది….సుమిత్రను చూస్తుంటేనే ఇక్కడ ఫ్యాంట్ తడిచిపోతున్నది….దాని అస్థికల సంగతి తరువాత….ముందు మన అస్థికలు నీళ్ళల్లో కలవకుండా చూసుకోవాలి….
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే సుమిత్ర వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ….
సుమిత్ర : ఎక్కడికి తీసుకెళ్తున్నార్రా నా అస్థికలను…..(అంటూ తన మొహాన్ని ఇంకా భయంకరంగా మారుస్తూ రాము వైపు కోపంగా చూస్తూ) నా అస్థికలు నాకు ఇచ్చేయ్…..
సుమిత్రను అలా చూసేసరికి రాముకి ఏం చేయాలొ అర్ధం కాలేదు….దాంతో ముందు అక్కడ నుండి తప్పించుకుపోవాలని అనుకుంటూ తప్పించుకునే దారి కొసం చుట్టూ చూస్తున్నాడు.
అలా రాము ఆలోచిస్తుండగానే సుమిత్ర రాము దగ్గరకు వచ్చి అతని చేతిలో ఉన్న కుండని లాక్కోవడానికి ట్రై చేస్తున్నది.
అంతలో మహేష్ కూడా తేరుకుని ఆ కుండని సుమిత్రకు అందనివ్వకుండా రాముతో పాటు కుండ సుమిత్ర చేతుల్లోకి వెళ్లకుండా ఆమెను తోస్తున్నాడు.
దాంతో సుమిత్ర కోపంతో ఒక చేత్తో మహేష్ ని బలంగా తోసేసరికి ఎగిరి దూరంగా పడిపోయాడు.
అలా ఎగిరి పడటంతో మహేష్ పైకి లేవలేక నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు.
ఇంతలో సుమిత్ర ఒక చేత్తో రాము గొంతుని గట్టిగా పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపి ఇంకొ చేత్తో రాము చేతిలొ ఉన్న కుండను అందుకోవడానికి ప్రయత్నిస్తూ, “నా అస్థికలు నాకిచ్చేయ్,” అంటూ కుండను లాక్కోవడానికి ట్రై చేస్తున్నది.
రాము తన చేతిలో ఉన్న కుండని సుమిత్రకు అందకుండా పైకెత్తి పట్టుకుని తన గొంతుని గట్టిగా పట్టుకున్న ఆమె చేతిని పట్టుకుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ మహేష్ వైపు చూసాడు.
అప్పుడే మహేష్ కూడా పైకి లేవడంతో రాము తన చేతిలో ఉన్న కుండను మహేష్ వైపుకి విసిరేసాడు.
దాంతో మహేష్ వెంటనే కుండను పట్టుకున్నాడు.
సుమిత్ర వెంటనే రాముని వదిలేసింది…..కాని సుమిత్రకు మాత్రం తనను మోహిని ఆవహించిందని అర్ధమవుతున్నది.
దాంతో తనలో ఉన్న మోహిని మళ్ళీ రాముని పట్టుకోకుందా ఉండటానికి తన శక్తి నంతా కూడగట్టుకుని తన ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నది.
కాని మోహిని ప్రేతాత్మ ముందు సుమిత్ర మానవ శక్తి చాలడం లేదు.
సుమిత్ర అలా తనలొ ఉన్న మోహిని ప్రేతాత్మని ప్రతిఘటించడం చూసి రాము భయంతో పైకి లేచి నిల్చున్నాడు.
అది చూసి సుమిత్ర, “రామూ….వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు…..” అంటూ అక్కడ ఉన్న స్తంభాన్ని పట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకోవాడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆమెలో ఉన్న ప్రేతాత్మ మాత్రం సుమిత్ర ఒంటిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నది.