06-11-2018, 06:53 PM
(This post was last modified: 22-03-2019, 11:52 AM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode : 3
సుమిత్ర : ఈ బాల్ ఎక్కడ అయితే ఆగుతుందో అక్కడ అస్థికలు దాచారు….మనం వెతుకుదాం పదండి…..
అంటూ లోపలికి అడుగులు వేస్తున్నది….ఆమె వెనకాలే రాము కూడా లోపలికి వెళ్ళ బోతుంటే….మహేష్ వెంటనే రాము చెయ్యి పట్టుకుని ఆపుతూ….
మహేష్ : అరేయ్…ఇంకో సారి ఆలోచించుకోరా….ఇదంతా మనకవసరా….హాయిగా పబ్ లో మందు కొట్టి పడిపోదాంరా….
ఆ మాట వినగానే సుమిత్ర వెనక్కి తిరిగి మహేష్ వైపు చూసి నవ్వుతూ….
సుమిత్ర : ఇంత దూరం వచ్చిన తరువాత భయపడతావేంటి….అయినా నీకు ముందే చెప్పాం కదా…వెనక్కు వెళ్ళిపోమని….
మహేష్ : అంటె…..అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నది….ఇప్పుడు చీకటిలో ఈ మహల్ చూస్తుంటే ఒక పక్క గుండె లబ్ డబ్ అంటున్నది…..
రాము : ఏం పర్లేదు….లోపలికి రా….మనం ఆ ప్రేతాత్మ అస్థికలు తీసుకుని వెళ్లిపోదాం…..
మహేష్ : ఏంటిరా…నువ్వు చెప్పేది….ఎలా చెబుతున్నావంటే….మనం ఏదో బ్యాంక్ కి వచ్చి లాకర్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు చెబుతున్నావు…..మనం ఇక్కడకు వచ్చింది ఒక ప్రేతాత్మ అస్థికలు తీసుకెళ్ళడానికి వచ్చాం….
రాము : ఏం పర్లేదురా….ఆ ప్రేతాత్మ సుందర్ తొ బిజీగా ఉన్నదిలే….మనల్ని పట్టించుకోదు….నువ్వు మాతో వచ్చేయ్….(అంటూ లోపలికి నడిచాడు.)
మహేష్ కూడా రాము వెనకాలే వస్తూ….
మహేష్ : అరేయ్….అది సుందర్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఇక్కడకు వచ్చామని తెలిస్తే అది ఇక్కడకు రావడానికి ఒక్క క్షణం చాలురా…..మన లాగా దానికి కార్లో ట్రావెల్ చేయాల్సిన పని లేదు….వెంటనే వచ్చేస్తుంది….ఎన్ని సినిమాల్లో చూసాం…
రాము : అబ్బా….నీ నస ఆపరా బాబు….ఇంత భయపడే వాడివి ఎందుకు వచ్చావు….
మహేష : అబ్బా….ఛా….మీ ఇద్దరు కూడా భయపడుతున్నారు….అది మీ మొహాల్లో క్లియర్ గా కనిపిస్తున్నాది…కాకపోతే మీరు బయట పడటం లేదు….నేను ఓపెన్ గా చెబుతున్నాను….అంతే తేడా…..
సుమిత్ర : సరె….సరె….మా వెనకాలే వచ్చేయ్….నువ్వు తప్పిపోయావంటే ఇంత పెద్ద మహల్ లో ప్రేతాత్మ అస్థికలు వెదకడం మానేసి….నీకోసం వెదకాల్సి వస్తుంది….అప్పుడు నువ్వు పబ్ లో తాగి పడిపోవాల్సిన నువ్వు….ఇక్కడ రాజమహల్ లో భయంతో పడిపోవాల్సి వస్తుంది…..
దాంతో మహేష్ వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ల వెనకాలే నడుస్తూ ఫాలో అయ్యాడు.
అలా వాళ్లు ముగ్గురూ బాల్ వెళ్ళిన వైపు ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే మహేష్ రాజ్ మహల్ లో చుట్టూ చూస్తూ కొంచెం వెనకబడ్డాడు.
అంతలో రాము, సుమిత్రలకు ఇద్దరికీ బాల్ కనిపించేసరికి దాని దగ్గరకు వెళ్లారు.
మెల్లగా నడుస్తున్న మహేష్ కి వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి గబగబా నడుస్తూ వచ్చిన అతనికి వాళ్ళిద్దరూ బాల్ దగ్గర ఉండటం చూసి…..
మహేష్ : ఏంటిరా…..ఒక మగాడిని అలా వదిలేసి వెళ్ళిపోతారేంటి…..
అంటూ మహేష్ పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరకు వచ్చాడు…
సుమిత్ర తల ఎత్తి మహేష్ వైపు చూసి నవ్వుతూ….
సుమిత్ర : ఇక్కడే ఎక్కడో అస్థికలు ఉంటాయి….వెదుకు…
రాము వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడ ఎక్కడ దాచిపెట్టి ఉంటారు అని ఆలొచిస్తూ అక్కడ అంతా వెదుకుతున్నాడు.
రాము : ఇక్కడ ఎక్కడ దాచిపెట్టి ఉంటారు…..అదీ కాక ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టు ఉన్నది….
సుమిత్ర : అవును….ఏదో పెయింటింగ్ పని జరుగుతున్నది….కాని ఆ అస్థికలు ఇక్కడే ఎక్కడో తప్పకుండా ఉంటాయి….అది ఏ ప్లేస్ అనేది మనం కనిపెట్టాలి…
దాంతో ముగ్గురూ అక్కడ తలా ఒక వైపుకు వెళ్ళి వెదుకుతున్నారు….
అక్కడ గోడ మీద శిల్పాలు చెక్కి ఉన్నాయి….ఆ శిల్పాలు చాలా అందంగా ఉండే సరికి వాటిని చూస్తూ చుట్టూ వెదుకుతున్నారు.
అలా వెదుకుతున్న రాముకి అక్కడ గోడ మిద ఉన్న పెళ్ళి మండంపంలో అబ్బాయి, అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్న శిల్పాలు అక్కడ చుట్టూ ఉన్న బొమ్మలు బాగా ఆకర్షించాయి….
రాము ఆ బొమ్మల్లో పక్కనే ఉన్న ఒకదాని మీద ఒకటి పేర్చిఉన్న కుండల వైపు చూస్తూ….దాని దగ్గరకు వెళ్ళి తాకుతూ….
రాము : పెళ్ళి మండపంలో ఎన్ని కుండలు పేర్చుతారు…..