Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#11
ఎపిసోడ్ 4 - వైస్ ప్రెసిడెంట్

మరుసటి రోజు:

అశ్విన్ నా కేబిన్ దగ్గరకు వచ్చాడు. 

"సర్......మీరు.....ఇక్కడ......."

ఎం పర్లేదు

"సర్ చెప్పండి ??"

"hmmmm.........నిన్ను ఒకసారి మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు కలుస్తారంట"

నాకు అర్ధం కాలేదు. 

"కొన్ని సార్లు రాండమ్ గా పిలిచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.....5th ఫ్లోర్ కి వేళ్ళు అక్కడ లిఫ్ట్ దిగగానే రైట్ తీసుకొని వెళ్తే అక్కడే అయన క్యాబిన్ ఉంటది"

"ఇప్పుడు వెళ్లాలా ?? సర్"

"అవును.....మరెప్పుడేళ్తావ్ ??"

"ఓకే సర్......సారీ"

నేను వెంటనే లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ క్యాబిన్ దగ్గరకు వెళ్లాను.  అద్దంలో నుంచి చూసి డోర్ నాక్ చేశాను . లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్లి అతని ముందు కూర్చున్నాను. 

"మీ పేరు ??"

"నిహారిక.....నేహా అని పిలుస్తారు సర్ అందరూ"

"ఒకే.......నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా ??"

"ఎందుకు సర్ ??"

"అశ్విన్ గారు నీకేమి చెప్పలేదా ??"

"చెప్పారు సర్.......ఫీడ్ బ్యాక్ కోసం అని"

"మరి తెలియనట్లు ఎందుకు అడిగావు ??"

"సారీ సర్"

"సరే.........నీ మీద కంప్లైన్స్ వచ్చాయి......."

"నా మీద సర్ ??"

"అవును......నువ్వు చాలా అందంగా ఉన్నావని"

వీడు విడి యదవ జోకులు. 

"జస్ట్ కిడింగ్ ..... రిలాక్స్"

"ఓ...." అని చాలా  ఇబ్బంది పడుతూ నువ్వుతూ చెప్పాను. 

"ఒకే విషయానికి వద్దాం......అశ్విన్ గురించి చెప్పు......అతని గురించి నీ ఒపీనియన్ ఏంటి ??"

నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ప్రియ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒకవేళ నిజం చెప్పినా సరే అశ్విన్ కె సపోర్ట్ వెళ్తే కంపెనీ.....అప్పుడు నా ఉద్యోగానికి ప్రమాదం. అసలే అపార్ట్మెంట్ కూడా మారాలి నేను. 

"మంచి అతను సర్........బాగా వర్క్ చేస్తారు......కంపెనీ కి మంచి అసెట్"

"ఓ.........నేను కొంతమంది దగ్గర అతని గురించి చేదుగా విన్నాను......."

"చేడుగాన సర్ ??"

"యా అవును. అతను అమ్మాయల విషయంలో సరిగ్గా ఉండడని......తెలిసింది"

మంచి ఛాన్స్ దొరికిందనుకున్నాను. 

"అంటే......నేను కూడా అలాంటివి విన్నాను సర్"

"ఒకే గో ఆన్ ....."

"కొంతమంది చెప్పిందేంటంటే.......అతను కొంత మందితో సంబంధం పెట్టుకొని.......వాళ్లను వేరుగా చూస్తారని....."

"య నాకు కూడా అలంటి feedbacke వచ్చింది"

"నిన్ను ఎమన్నా అతను ఇబ్బంది పెట్టాడా ??"

"లేదు సర్........."

"ఒకే...."

"ఈ విషయం గురించి నువ్వేమన్న ఎవరితోనైనా ఇంతక ముందు చెప్పావా ??"

"లేదు సర్........"

అతను ఆలోచనలో పడ్డాడు. 

"hmmmmm......నిన్ను నేను అప్పుడప్పుడు పిలుస్తుంటాను......అతనిని బాగా observe చేయి ఇప్పటినుంచి......."

"సర్ ??"

"అదే నువ్వు అమ్మాయివి కాబట్టి.....అతను నీ పై చేడుగా ప్రవర్తించవచ్చు.......అందుకే......."

నాకంత చాల తేడాగా అనిపించింది. నన్నెందుకు పిలిచారు ?? టీం లో ఉన్న అమ్మాయిలం ఇద్దరమే. ఒకటి ప్రియ రెండు నేను. అంటే ప్రియకు ప్రమోషన్ వచ్చి నాకు రాలేదు కాబట్టి పిలిచాడ ?? లేక రూమర్స్ విని పిలిచాడ ?? నేను కూడా అశ్విన్ తో కుమ్మకై ఉండొచ్చుకదా ?? చాల ప్రశ్నలు ఉన్నాయి నాలో. 

"ఒకే సర్......."

"ఓకే థాంక్స్...." అని చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి "సరే నువ్వు వెళ్లొచ్చు.....ఇక"

"ఓకే సర్"

"అలాగే నీతో పాటు ఇంకో అమ్మాయి పనిచేస్తుంటాడంట.....ఎవరు ??"

"ప్రియ సర్"

"హా ప్రియ......ఒకసారి తనని కూడా కలవమని చెప్పు ఇప్పుడే......ఒకసారి"

"ఒకే సర్"

సో ఇద్దరినీ పిలిచారు. అంటే ఈ విషయం పై దాకా వెళ్లినట్లుంది. ఇప్పుడు ప్రియతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడితే ఎం తెలియనట్లు నటిస్తది. ఒకవేళ ప్రియ వైస్ ప్రెసిడెంట్ ఎం అడిగాడో అశ్విన్ కి మొత్తం చెప్పేస్తే ఏంటి పరిస్థితి ?? ఐన అశ్విన్ ఎం చేస్తాడులే, ఉంది వైస్ ప్రెసిడెంట్ అక్కడ. వీడు ఆయనను పీకేది ఏమి లేదు. 

నేను కిందకి వచ్చి నా కేబిన్ లో కూర్చున్నాను. జరిగిన దాని గురించి ఆలోచించాను. ఆలోచిస్తే, అశ్విన్ ఏక్సపోజ్ అవుతే ప్రియ కూడా ఎక్సపోజ్ అవుతుంది కదా. అందుకే ప్రియ, అశ్విన్ ని తప్పకుండ కాపాడుతుంది. ఇప్పుడు నేను కనుక వైస్ ప్రెసిడెంట్ కి ఉన్న విషయం మొత్తం చెప్పేస్తే, అప్పుడు ప్రియ, అశ్విన్ ఇద్దరు ఇంటికి వెళతారు నాకు ప్రమోషన్ వస్తుంది. కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యిందంటే కంపెనీని అతను కాపాడి, నన్ను ఉద్యోగం లో నుంచి తీసేస్తాడు. నాకు ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాలేదు.

కానీ feedback కోసం నన్ను పిలిచాడంటేనే, కచ్చితంగా అతను అశ్విన్ ని టార్గెట్ చేసాడు. అంటే అతను అశ్విన్ కి anti గా కంపెనీ కి pro గా ఉంటాడు. అప్పుడు కంపెనీ కి చెడ్డ పేరు వస్తుందని అశ్విన్ ని అమ్మాయిలు లేని వేరేచోటకి ఊరికినే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ అశ్విన్ ఎక్సపోజ్ అయితే కచ్చితంగా డౌట్ నా మీదకు వస్తది. అప్పుడు అశ్విన్ నాకు anti గా మారతాడు. నన్ను టార్గెట్ చేస్తాడు. ప్రియ కూడా నాకు anti  గా మరుద్దీ. అసలే నేను ఇప్పుడు అపార్ట్మెంట్ మారాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైం లో ఇవి అవసరమా అనిపించింది. 

నాకు నిజంగా పిచ్చెక్కిపోయిది. ఇందంతా ఆలోచిస్తుంటే. 

నేను ఇదంతా ఆలోచించడం మానేసి వర్క్ లోకి దిగాను. ఒక గంట తర్వాత ప్రియా వచ్చింది నా క్యాబిన్ దగ్గరికి:

"నేహా......"

"ఓ ప్రియ......ఏంటి ??"

"నన్ను వైస్ ప్రెసిడెంట్ కలవమన్నాడంటగా......నువ్వు నాకు చెప్పలేదు......."

"ఓ వెరీ సారీ ప్రియా......నేను వర్క్ లో బిజీ గా ఉండిపోయాను......"

ఈ లోపల ఫోన్ వచ్చింది. 

"నేహా అర్జెంటు గా నా కేబిన్ లోకి రా నువ్వు......"

నాకు భయం వేసింది ఎం జరిగిందో. నేను వెంటనే అశ్విన్ క్యాబిన్ లోకి వెళ్లాను. 

"నేహా.......ఈ రిపోర్ట్ డ్రాఫ్ట్ చూసాను.......ఏంటిది ??"

"సర్ ??"

"ఇద్దిగో చూడు......ఈ పేజీ లో లాస్ట్ లో ఎం రాసావో చూడు"

నేను రిపోర్ట్ తీసుకొని చూసాను. నాకేమి కనిపించలేదు. 

"సర్ ??"

"ఏంటి ?? ఇంకా కనిపించలేదా ??"

మల్ల చూసి ఒకే అనుకున్నాను "సర్ .....అంత ఓకే ......నాకేమి కనిపించట్లేదు....."

"ఒక సున్నా ఎగరకొట్టావ్....ఎంత డేంజర్ అది......."

"లేదు సర్ ఈ నెంబర్ కరెక్టే......."

"నేహా.....నేను బ్లైండ్ కాదు...... ఓకేనా...."

"సర్ ఇది millions లో ఉంది, lakhs కాదు.......అప్పుడు ఒక జీరో తగ్గుతుంది"

"ఓహ్ నిజంగానే ?? మరైతే టేబుల్ పైన ఎం రాసుందో చదువు ??"

నేను టేబుల్ పైన చూసాను lakhs అనే రాసుంది. 

నేను మేనేజర్ వైపు ఇబ్బందిగా చూసాను. 

"నేను నీకన్నా 15 ఏళ్ళు ఎక్కవ ఎక్స్పీరియన్స్.......అది మరచిపోకు......"

"రియల్లీ సారీ సర్......."

"నేహా........నువ్వు తప్పు చేస్తే నేను తిడతాను.......కానీ నేను ఆ తప్పుని చూడకపోతే.....అప్పుడు నాకు క్లాస్ పీకుతారు మనగెమెంత్ వాళ్ళు...... నువ్వు ప్రియ ఇద్దరు డాక్యుమెంట్ చూసాను అన్నారు.....ఇద్దరు ఇంకా కొత్తగా ఏదో ఉద్యోగం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ...... కొంచెం మీరు అంకెలు నేర్చుకొనిరండి.......ఇవి 5 వ తరగతి చెప్తారు....."

"సారీ సర్......."

"వీటికేమి తక్కువ లేదు......వెంటనే సరి చేయండి......"

"ఒకే సర్" అని లేయబోతున్నాను. 

"ఆగు......"

"వైస్ ప్రెసిడెంట్ ఎం అడిగాడు ??"

"ఎం అడగలేదు సర్, జనరల్ గా పిలిచారు.......ఏవో జనరల్ గా questions అడిగారు"

"నా గురించేమన్న అడిగారా ??"

"అంటే మీరు బాగా టీం ని హేండిల్ చేస్తున్నారా లేదా అని అడిగారు..."

"నువ్వేం చెప్పావ్ ??"

"గుడ్ అని చెప్పను సర్......"

"hmmmm.......సరేలే..... ఇక వెళ్ళు"

నాకు బాగా మైండ్ దొబ్బింది. ఏవేవో ఆలోచించి. కంప్యూటర్ ఆపేసి ఒక మంచి కాఫీ తాగడానికి కెఫెటేరియా కి వెళ్లాను. ఒక మంచి కాఫీ తాగేసి ఆఫీస్ వచ్చి వర్క్ స్టార్ట్ చేశాను. ఆ రోజంతా బాగా బిజీ అయిపోయాను వర్క్ లో. రాత్రి ఇంటికి వెళ్లేసరికి లేట్ అయ్యింది.

నేను నా స్కూటీ లో అపార్ట్మెంట్ లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ నన్ను కొంచెం విచిత్రంగా చూసాడు. నవ్వాడు. నమస్తే కూడా పెట్టాడు. నాకు ఇర్రిటేషన్ వచ్చింది. అసలే బాగా అలసిపోయాను. ఇంటికి వెళ్ళి ఆ విషయం గురించే ఆలోచించాను బాగా. నాకు రాకుండా ప్రియ కు ప్రమోషన్ రావటం ఇప్పటికి తట్టుకోలేక పోతున్నాను. ఫైనల్ గా రేపు వెంటనే వెళ్లి వైస్ ప్రెసిడెంట్ కి విషయమంతా చెప్పేద్ధామని డిసైడ్ అయ్యాను. ఆయనతో విషయం ఎలా చెప్పాలో కొంచెం సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. 

మరుసటి రోజు:

ఆఫీస్ కి వచ్చాను. డైరెక్ట్ గా 5th ఫ్లోర్ కి వెళ్లాను వైస్ ప్రెసిడెంట్ ని కలవడానికి. ఇంకా ఆయన రాలేదు. అక్కడ బయట అటెండర్ ఉంటె 

"బాబు, వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదా ??"

"లేరండి....."

"ఎప్పుడొస్తారు ??"

"ఆయన నిన్న resign చేసేసి వెళ్లిపోయారు కాదండి......"

"resign చేసేసారు ?? అదేంటి ??"

"ఏమోనండి.....నిన్న వెళ్ళిపోతున్నాని చెప్పారండి......నాతో....."

"అవునా ??"

"అవునండి......."

"ఎందుకు resign చేసారో ఏమైనా తెలుసా ??"

"ఏమోనండి.......చాల మంచి సార్ అయన......ఎందుకలా resign చేసి వెళ్ళాడో తెలియట్లేదు......నాకు కూడా ఈ రోజే తెలిసిందండి....."

నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సడన్ గా resign చేసి వెళ్ళటం ఏంటి ?? నిన్నే చెప్పాడు నాతో అప్పుడప్పుడు వచ్చి కలవమని. resign చేసేవాడు ఎందుకలా నాతో చెప్తాడు ??

ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. అశ్విన్ నన్ను అర్జెంటు గా పిలిచాడు. 

"సర్.....పిలిచారు అర్జెంట్ అన్నారు"

"నేహా....వెరీ సారీ......."

"ఏంటి సర్ ?? ఏమైంది ??"

"ఇదిగో....." అంటూ ఒక పేపర్ ఇచ్చాడు. నాకు భయం వేసింది. 

ఓపెన్ చేసి చూసాను "టెర్మినేషన్ లెటర్......" అని ఉంది. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు. 

టు బె కంటిన్యూడ్ ......... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 06-11-2018, 06:33 PM



Users browsing this thread: 3 Guest(s)