15-08-2019, 06:27 PM
(This post was last modified: 16-08-2019, 07:46 AM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
మహా భారతము
మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) ప్రకారము మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు."యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.
మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
మహాభారతంలోని పర్వాలు:
1. ఆది పర్వము: DOWNLOAD
2. సభా పర్వము: DOWNLOAD
3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: DOWNLOAD
4. విరాట పర్వము: DOWNLOAD
5. ఉద్యోగ పర్వము: DOWNLOAD
6. భీష్మ పర్వము: DOWNLOAD
7. ద్రోణ పర్వము: DOWNLOAD
8. కర్ణ పర్వము: DOWNLOAD
9. శల్య పర్వము: DOWNLOAD
10. సౌప్తిక పర్వము: DOWNLOAD
11. స్త్రీ పర్వము: DOWNLOAD
12. శాంతి పర్వము: DOWNLOAD
13. అనుశాసనిక పర్వము: DOWNLOAD
14. అశ్వమేధ పర్వము: DOWNLOAD
15. ఆశ్రమవాస పర్వము: DOWNLOAD
16. మౌసల పర్వము: DOWNLOAD
17. మహాప్రస్ధానిక పర్వము: DOWNLOAD
18. స్వర్గారోహణ పర్వము: DOWNLOAD
ఉపసంహారము: DOWNLOAD
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK