15-11-2018, 11:07 AM
ఆరోజు మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిన్ది... మా అమ్మ చాలా పెద్దగా ప్లాన్ చేసి ఊరు మొత్తాన్ని పిలిచినట్లుంది....ఇల్లంతా హడావుడి గా వు ది....విద్య ముందు మా ఇంట్లో దిగి ఫ్రెష్ అయి తర్వాత నాతో కలిసి రమ్య ఇంటికి వెళ్లాం...అక్కడికి వెళ్ళేసరికి ఇల్లంతా చుట్టాలతో పెళ్లి ఇల్లులాగా ఉంది...అప్పటికే బయట వంట స్టార్ట్ చేశారు రేపటి కోసం....చుట్టూ అంత మంది ఉన్న కూడా నేను రమ్య కోసం వెతుకుతూ ఉన్న....ఇంతలో నేను ఎందుకో ఆకాశం లోకి చూడగానే నెలపొడుపు కనపడింది...ఎప్పుడు నెలపొడుపు చూసినా నాకు వెంటనే రమ్య మొహాన్ని కానీ...లేదా నా పర్సు లో ఉన్న రమ్య ఫోటో ని కానీ చూడటం అలవాటు..వెంటనే కళ్ళు మూసుకుని జేబు లో పర్స్ కోసం చూస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది నేను నైట్ పాయింట్ లో వచ్చాను...అని....అలానే కళ్ళు మూసుకుని ఎం చెయ్యాలో అర్థం కాక కూర్చుని ఉంటే అప్పుడే విద్య ప్లేట్ లో స్వీట్ లు తీసుకువచ్చి నా పక్కన కూర్చున్న మా మామయ్య కి ఇస్తూ ",తీసుకోండి పెదనాన్న...."అంటూ మాట వినపడగానే నేను వెంటనే చేయ చాపి "విద్య...విద్య...నన్ను అర్జంట్ గా రమ్య దగ్గర కి తీసుకెళ్లు..."అంటూ కళ్ళు మూసుకుని చేయ చాప....విద్య కొంచం కంగారుగా "ఏమైంది బావగారు...కళ్ళు ముసుకున్నారే....."అంటుండగా నేను వెంటనే "ఎం లేదు లే...ప్లీస్....తీసుకెళ్లు....." అని అనగానే విద్య నా చెయ్ పట్టుకుని మెల్లగా ఇంట్లో కి తీసుకెళ్లింది..దారిలో ఇద్దరిని రమ్య ఎక్కడ ఉంది అని అడుగుతూ నాకు వినపడింది...ఇంతలో మా అమ్మ నన్ను చూసి "ఒరేయ్...ఏమైంది ర....ఆటలు ఆడుకుంటున్నార ఈ వయసు లో....ఇంట్లో బంధువులు ఉన్నారని కూడా లేకుండా....అమ్మాయి...చెయ్ వదులు ముందు"అని పెద్దగా అరిచింది....ఇంతలో లోపల కిచెన్ లో నుండి రమ్య నన్ను చూసి పెద్దగా "ఎం లేదులే అత్తయ్య...నేను చూస్తా లే ఉండు...మీరు పెద్దగా అరవకండి అందరిముందు"అంటూ నా ఎదురుగా వచ్చి నుంన్చుని నా బుగ్గలమీద రెండు చేతులు వేసి మెల్లగా "మ్మ్....కళ్ళు తెరవండి"అని అన్నది...దాదాపు రెండు నెలల తర్వాత అది కూడా చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్న రమ్య మొహం.చూడగానే నాకు ఒక్కసారిగా రమ్య మీద ప్రేమ తట్టుకోలేక ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది....నాకు తెలియకుండానే రమ్య నడుం మీద చెయ్ వేయగానే రమ్య వెంటనే "ష్..అందరూ వున్నారు....అయినా ఏంటి మీరు....పెళ్లై 11 ఏళ్ళు అయినా కూడా ఇంకా..."అని అంటూ తాను మెల్లగా కళ్ళలో నుండి నీళ్ళు వస్తుంటే అవి ఎవరికి కనపడకుండా తుడుచుకుంటూ "ఐ.లవ్ యు విజయ్"అని అన్నది...నాకు వెంటనే రమ్య ని గట్టిగా వాటేసుకోవాలి అని అనిపించింది... కానీ చుట్టూ బంధువులు అప్పటికే మమ్మల్ని వింతగా చూస్తున్నారు....రమ్య వెంటనే తేరుకుని "వెళ్ళండి..వెళ్లి..నాన్న వాళ్ళతో కూర్చోండి కాసేపు....మా మేనత్త వాళ్ళు డబ్బులు అవసరం అయి పొలం అమ్ముతున్నారు....బయటకి అమ్మటం ఎందుకు...మనమే కొందాం...తర్వతః వాళ్ళు స్థిరపడ్డాక కావాలంటే మళ్ళీ వాళ్ళకే అమ్ముదాం..వెళ్లి అది ఏదొకటి ఫైనల్ చేయండి...నేను మెమల్ని అడిగి చెప్తా అని చెప్పా"అంటూ లోపలకి వెళ్ళింది...పక్కనే విద్య నుంచుని నా వైపు చూస్తూ ఉంది.తన కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయి...నేను గమనించి "ఏమైనెది... నువ్వెందుకు ఎదుస్తున్నావ్"అని అనగానే విద్య తల అడ్డం గా ఊపి "ఎం లేదు లే....మీరు మీ ఆవిడ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు.....మరి మీ తమ్ముడు ఎందుకు అలా వున్నారు...ఇంత వరకు ఒక్కసారి కూడా నన్ను తిన్నావ అని అడిగిన రోజు లేదు...."అని అంటుండగా కిచెన్ లో నుండి రమ్య విద్య ని "విద్య....బెడ్ రూమ్ లో బియ్యం పిండి ఉంది తీసుకుని ఇటు ర త్వరగా.....పాకం అయిపోయిన్ది......"అని అనగానే విద్య వెళ్లిపోయిన్ది...