Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రపంచాన్ని కదిలించిన ప్రకటనలు
#2
★ ఇళ్ళులే జైలుగా మారిన వేళ
[Image: IMG-20190105-230159.jpg]

జైలంటే బందిఖానా.. నాలుగు గోడల మధ్య నలగడం. నేరస్తులు ఉండే ప్రదేశం. కానీ ఏం పాపం చేసారని బయట గ్రౌండ్‌కు వెళ్లి ఆడుకోవాల్సిన పిల్లలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఒకప్పుడు ఈ వీడియో గేమ్ లు, స్మార్ట్ ఫోన్ లు గట్రా లేని సమయంలో పిల్లలు గ్రౌండ్‌లో ఆడుకునే వారు. కాని ఇప్పుడు ఈ సాంకేతిక పుణ్యమా అని అధిక శాతం పిల్లలు ఇళ్లకే పరిమితం అవుతున్నారని అనేక సర్వేలు భయపెడుతున్నాయి.

★ మనం పెదవి విప్పే వరకు బాల కార్మికులు ఉంటారు..

[Image: IMG-20190105-225912.jpg]

బాల కార్మిక నిర్మూలన ఇప్పటికీ అందని ద్రాక్షే. ఇప్పటికీ మనము వెళ్లే కొన్ని కొన్ని వ్యాపార సంస్థలలో, హోటల్స్ మొదలగు చోట్ల మనకు బాల కార్మికులు దర్శనమిస్తారు. అయినా కూడా మనము నోరు మెదపడం లేదు. చూసి చూడనట్టు ఉంటున్నాం. మనం కూడా నోరు విప్పి బాలకార్మికుల కోసం మాట్లాడితేనే పూర్తిగా నిర్మూలించబడుతుంది.


★ ఈ ఫోటోకు వేరే అర్థం రాని సమాజాన్ని నిర్మిద్దాం..

[Image: IMG-20190105-225958.jpg]

ఈ ఫోటో చూస్తే ఒక పెద్దాయన ఒక చిన్న పాపను ఆప్యాయంగా ముద్దాడుతున్నాడు. కానీ ప్రస్తుతం మనము వింటున్న కొన్ని వార్తలు ఈ ఫోటో వేరే అర్థం వచ్చే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. అదే మైనర్ బాలికల మీద లైంగిక దాడి. ఈ వేరే అర్థం రాని సమాజాన్ని నిర్మిద్దాం.

★ మనం వృధా చేస్తున్నాం... వాళ్ళు అలమటిస్తున్నారు

[Image: IMG-20190105-230023.jpg]
ఆహారం వృధా చేయడం. మనము ఎంతో అవలీలగా చేస్తున్నాం. కానీ మనకు ఎక్కువై వదిలేస్తున్న ఆ ఆహారం ఎంత మంది కడుపు నింపుతుందో ఆలోచించలేక పోతున్నాం. ఈ కారణంగా ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ఆకలితో నిదురిస్తున్నారు, అప్పుడప్పుడు మరణిస్తున్నారు.

★ అడవుల నరికివేత..

[Image: images-2.jpg]

ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా అడవుల నరికివేత పెరుగుతోంది. దీని వలన వెంటనే సమస్య తలెత్తకపోయిన భవిష్యత్తు తరాలకు ఇది ఎంతో ప్రమాదకరం.

★ రోడ్డు భద్రతకు లేదు భద్రత..

[Image: IMG-20190105-230129.jpg]
అభివృద్ధి చెందుతోన్న దేశాలు ఎదురుకొంటున్న మరో ప్రముఖ సమస్య రోడ్డు భద్రత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకండి.. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ కోసం ఇంటి దగ్గర వేచి చూస్తున్నారని ఎన్ని ప్రకటనలు చేసినా కూడా.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారుడు మృతి అనే వార్తలు మనము ఇంకా చూస్తున్నాం. ఈ ధోరణి మారాలి.


కేవలం చదివి వదిలేయకుండా..! మనము పాటిద్దాం..! నలుగురికి షేర్ చేసి వారిని పాటించమని ప్రోత్సహిద్దాం..!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: ప్రపంచాన్ని కదిలించిన ప్రకటనలు - by Vikatakavi02 - 05-01-2019, 11:39 PM



Users browsing this thread: 1 Guest(s)