Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రపంచాన్ని కదిలించిన ప్రకటనలు
#1
ప్రపంచాన్ని కదిలించిన ప్రకటనలు

కేవలం వ్యాపార ఎదుగుదల కోసం ఇచ్చేవి మాత్రమే కాదు ప్రకటనలు. అప్పుడప్పుడు మనుషులను కదలించడానికి కూడా కొన్ని కొన్ని ప్రకటనలు వెలువడుతుంటాయి. ప్రపంచం ఎదురుకొంటున్న సవాళ్ళను ఎత్తి చూపడానికి, ఆ సవాళ్ళను సమర్థవంతంగా ఎదురుకోవడానికి కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. వాటి సమాహారమే.. ఈ ఆర్టికల్..!

★ బడికి వెళ్లాల్సిన వయసులో యుద్దానికి వెళుతోన్న పిల్లలు

[Image: IMG-20190105-225643.jpg]

ప్రపంచాన్ని కలచివేస్తోన్న సమస్యలలో ఇది ప్రముఖమైనది. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్గనిస్తాన్ వంటి అనేక దేశాల్లో కొన్ని లక్షల్లో పిల్లలు బడికి వెళాల్సిన వయసులో తుపాకులు పట్టుకొని యుద్దానికి సన్నద్ధం అవుతున్నారు.

★ మధుమేహం... ప్రాణాలు తీసే తియ్యనైన వ్యాధి.

[Image: IMG-20190105-225730.jpg]

షుగర్ వ్యాధి అని మనము పిలుచుకునే ఈ మధుమేహం రోజు రోజుకి ప్రబలుతోంది. ఎన్నో స్వచ్చంద సంస్థలు మధుమేహ వ్యాధి మీద పోరాటం చేస్తున్నాయి. ప్రజలు మంచి జీవన శైలిని ఏర్పరచుకొని ఇలాంటి వ్యాధుల బారిన పడకూడదని తెలియజేస్తున్నాయి. అయినా కూడా మనిషికి ఉన్న పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధికి దగ్గర చేస్తున్నాయి.

★ పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం

[Image: IMG-20190105-225755.jpg]

పొగ త్రాగడం మీద ప్రపంచంలో అనేక దేశాలు నిషేధం విధిస్తున్నాయి. అయినా కూడా ఇంకా పొగ త్రాగడాన్ని నిర్మూలించలేకపోతున్నాము. పొగత్రాగడం వలన ప్రతి సంవత్సరం కోట్లలో జనాలు క్యాన్సర్ బారిన పడుతోన్నారు.

★ అద్వితీయ దానాలలో ఒకటి రక్త దానం..

[Image: IMG-20190105-225816.jpg]

మనకు ఉన్న సువర్ణ అవకాశం మన రక్తాన్ని ఒకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడడం. అయినా కూడా ఎన్నో మూఢ నమ్మకాల వల్ల మరియు అపోహల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున రక్త దానాలకు మొగ్గు చూపలేక పోతున్నారు. దీనివల్ల సంవత్సరానికి ఎందరో ప్రాణాలు వదలాల్సివస్తోంది.

★ అవయవదానం అత్యాశే..!

[Image: IMG-20190105-225846.jpg]

రక్తం ఇవ్వలేని సమాజం నుండి అవయవం ఆశించడం అత్యాశే అవుతోంది. చనిపోయిన తరువాత అవయవాలను దానం చేయడానికి మీకు తెలిసిన వాళ్లలో ఎందరు నమోదు చేసుకున్నారో తెలుసుకోండి. అవయవాలు దానం చేస్తే వచ్చే జన్మలో సదరు అవయవం లేకుండా పుడతారనే అపోహ ప్రబలుతున్న సమాజం ఇది. మనదేశ గణాంకాల ప్రకారం చనిపోయే వారు వారి కళ్ళను దానం చేస్తే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే మన దేశాన్ని అంధరహిత సమాజంగా తీర్చిదిద్దగలం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ప్రపంచాన్ని కదిలించిన ప్రకటనలు - by Vikatakavi02 - 05-01-2019, 11:38 PM



Users browsing this thread: 1 Guest(s)