27-07-2019, 08:52 AM
అమృతం కురిసిన రాత్రి
దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.
ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు:
ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి - వెళ్ళిపొండి, టులాన్ మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ ఇంటూ ప్లస్.
>>> DOWNLOAD<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK