22-07-2019, 06:39 AM
(This post was last modified: 22-07-2019, 04:26 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
దర్గామిట్ట కతలు
(Dargamitta Kathalu – Khadeer babu)
మహమ్మద్ ఖాదిర్ బాబు
“దర్గామిట్ట కతలు” — ఈ పుస్తకం బావుంటుంది.. చదవమని చాలా మంది చెప్పారు.. అయినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా.. చివరికి మొన్నా మధ్య పుస్తకోత్సవం (బెంగళూరు) లో కూడా పెద్ద పట్టించుకోలేదు.. కొన్ని పుస్తకాలు తీసుకుని, కౌంటర్ దాకా వెళ్ళిన తరువాతహంపీ నుండి హరప్పా దాకా గుర్తుకు వచ్చింది.. మళ్ళీ వెనక్కి వచ్చా.. అది దొరకలేదు కానీ, ఈ పుస్తకం కనిపించింది.. తీసుకుందామా, వద్దా అని కాసేపు ఊగిసలాడి సరే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నా..
పుస్తకం పేరు చూసి, హైదరాబాద్ లో ఏ పాత బస్తీ కి సంబంధించిన కధో అనుకున్నా.. దర్గా మిట్ట నెల్లూరులో ఉంది అని తెలుసు కానీ, ఈ రెంటిని అన్వయించుకోలేకపోయా.. ఇది వ్రాసింది '', అదీనూ పాత బస్తీ కి సంబంధించినది కాబట్టి హిందువులతో పడ్డ గొడవలూ, అవీ-ఇవీ ఉంటాయేమో అనుకుంటూ పుస్తకం తెరిచా (ముందు మాట చదివే వరకూ ఇదే అభిప్రాయం!)..
కతల వెనక కత చదివేసరికి అప్పటివరకూ ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది.. వెనక కధే ఇలాగుంటే ఇక ముందున్న కధలు ఎలా ఉన్నాయో అనుకుంటూ, గబగబా పేజీలు తిప్పా..
↓
↓
↓
సేమ్యా పాయసం, సేమ్యా ఉప్మా అంటూ తినడమే తప్ప సేమ్యాలు ఎలా వస్తాయో, వాటి తయారీ విధానం ఎలానో తెలుసా.. అసలు వాటిని చేత్తో కూడా తయారు చేయచ్చు అనే సంగతి తెలుసా..?! అయితే అర్జెంటుగా “సేమ్యాల ముగ్గు" చదవాల్సిందే…కొరియాలో ఉన్నప్పుడు మా గెస్ట్ హౌస్ లో వారానికి రెండు సార్లు చేపల వంటాకాలు ఉండేవి.. మా స్నేహితులు బావుంది, బావుంది అంటూ లొట్టలు వేసుకుని తినే వాళ్ళు.. ఒకసారి అడిగా, అవి ఏ రకం చేపలు అని? దానికి మాకేం తెలుసు.. తినడం మాత్రం మహ బాగా తెలుసు అని చక్కా పోయారు! చేపల్లో సముద్రం చేపలు, మంచినీటి చేపలు మళ్ళీ వాటిల్లో ఎన్నో ఉపరకాలు.. అవన్నీ ఏంటా అని కుతూహలంగా ఉందా.. అయితే “చీదరలు – వంజరాలు” చూడండి మరి.. మాకు ఆల్రెడీ అన్ని రకాలు తెలుసంటారా.. అయినా కూడా చదవాల్సిందే.. మరి డబుల్ చెక్ చేసుకోవాలి కదా!!
ఇంట్లోని పిల్లలందరిలో పెద్దవాళ్ళకి ఉండే గౌరవమూ అదీ, చిన్నవాళ్ళకి ఉండే గారాబమూ ఇదీ, మధ్యలో వాళ్ళకి ఉండదు.. మరి ఆ పెద్దోళ్ళలో చిన్నోడు – చిన్నోళ్ళలో పెద్దోడుఎన్ని నకరాలు చేశాడో తెలియాలంటే ఆలస్యం చేయకుండా “నేను నేలలో – మా అమ్మ బెంచీలో” కి పేజీలు త్రిప్పండి..
అన్నీ చిలిపి, తుంటరి పనులేనా ఇంకేలేవా అంటే.. మనసు మూగవోయే “మా అన్నే గానీ చదివుంటే”, "బాగారంగడిలో నౌకరి” కూడా ఉన్నాయి… “నమ్మకం పోతే పనోడు బతికినా ఒకటే, సచ్చినా ఒకటేరా" అని ఒక్క మాటలో జీవిత సత్యాన్ని చెప్పే కధలు కూడా ఉన్నాయి..
అయినా అది త్రికోణమితి, ఇది జ్యామితి అంటూ వర్గీకరించడానికి ఇవేమీ లెక్కలు కావు.. జీవితం.. లెక్కల్లో పట్టబధ్రుడైన ఒక వ్యక్తి జీవన గమనం.. మనసు పొరల్లో హత్తుకు పోయిన ఘటనలు.. కళ్ళ ముందు జరిగిన నిలువెత్తు సంఘటనలు..
ఈదేసిన గోదారి, దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయంటారు ముళ్ళపూడి వారు.. మరి అలాంటి మహానుభావుడితో ముందుమాట వ్రాయించి మరీ మన ముందుకు ఈ కధలు తీసుకు వచ్చారు ఖాదిర్ బాబు గారు.. ఇంతకీ మీకు ‘ఖ’ ఎలా పలకాలో తెలుసా.. అయితే “మీసాల సుబ్బరాజు” కథ చదవాల్సిందే...
ఈ వ్యాసం రాసినవారు: మేధ (అతిథి)
దర్గామిట్ట కథలు — 32 MB
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK