Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇక తిరుమలలో ఏకరూప ట్యాగ్స్‌!
#1
ఇక తిరుమలలో ఏకరూప ట్యాగ్స్‌!

తిరుమల: ఇల వైకుంఠం తిరుమలలో చిన్నారుల అపహరణకు అడ్డుకట్ట వేసేలా సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఏకరూప ట్యాగులు వేయనున్నారు.

తిరుమల కొండపై చిన్నారుల అపహరణ ఉదంతాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపై ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో దుండగులు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. గడిచిన మూడేళ్లలో ఏడు అపహరణలు జరగగా.. 2012లో అలా మాయమైన  ఓ చిన్నారి ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైనా మూడు రోజులపాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అడుగడుగునా నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తున్నా కిడ్నాప్‌లకు పాల్పడుతుండడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇకపై తిరుమల కొండపై అలాంటి ఘటనకు ఆస్కారం లేకుండా తితిదే అధికారులు, తిరుపతి అర్బన్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండపైకి వచ్చే చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు ట్యాగులు వేస్తున్నారు. తిరుమలకు వాహనమార్గంతో పాటు కాలినడకన వెళ్లే మార్గాల్లోనూ  చిన్నారులు వారి తల్లిదండ్రులకు ట్యాగింగ్‌ చేస్తున్నారు. కొండ దిగే సమయంలో రెండు ట్యాగ్‌లు సరిపోకపోతే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సగటున రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులను తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా, భద్రత విభాగ అధికారుల సహకారంతో గుర్తించి ట్యాగులు వేస్తామని సెక్యూరిటీ ఆఫీసర్లు తెలిపారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఇక తిరుమలలో ఏకరూప ట్యాగ్స్‌! - by Vikatakavi02 - 03-01-2019, 08:16 PM



Users browsing this thread: 1 Guest(s)