Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నేను చదివిన కథలు - అక్క చేతి ముద్ద - భగినీ హస్త భోజనంRunning

అక్క చేతి ముద్ద - భగినీ హస్త భోజనం.

" తమ్ముడు ! రేపు తప్పకుండా వచ్చి భోజనం చేసి వెళ్ళరా అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగే పక్క ఊరిలో ఉంటున్న మా అక్క.

ఆ రోజు భగినీ హస్త భోజనం. అందుకే అక్క ఆహ్వానం.

మరుసటి రోజు ఉదయాన్నే లేచి మొదటి బస్సులో బయలుదేరాను.

మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాం. నేను ఇంటర్మీడియట్ చదువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయాను. అక్క మాత్రం పదో తరగతితోనే చదువు ఆపేసింది. మేనమామకిచ్చి పెళ్లి చేశాము. అదే ఊరిలో కాపురం.
బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది.

అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది.

అక్క పరిస్థితి చూస్తే ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ తనకు ఉన్న మొహమాటం అలాంటిది. తన సంసారం గురించి ఒక్క చిన్న మాట కూడా చెప్పదు. తన కష్టాల గురించి అసలే ప్రస్తావించదు. బావగారు తనను బాగా చూసుకుంటున్నారని చెబుతుంది.

ఎప్పుడూ ఆ మూడు గదుల చిన్న ఇంట్లోనే కాపురం. ఇంట్లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఇద్దరు పిల్లల చదువులు... ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో!

పెద్దయ్యాక ఎవరి జీవితాలు వారివే. చిన్నప్పుడు ఎంత అన్యోన్యంగా తిరిగినా, పెళ్లయిన తర్వాత మనసులోని కొన్ని విషయాలను దాచేసుకుంటారు. చిన్నప్పుడు మాత్రం దాపరికాలుండేవి కావు.
అమ్మ పెట్టిన తాయిలం దగ్గర నుంచి ఇంట్లో జరిగిన గొడవల వరకు అన్నీ పంచుకునేవాళ్లం.

వీధిలోని పిల్లల్లో ఎవరైనా నన్ను కొట్టడానికి వస్తే అక్క అడ్డుపడేది. నాన్న నన్ను తిడుతుంటే మధ్యలో కలగజేసుకుని తానే దెబ్బలు తినేది. కాలేజ్లో నేను చేసిన అల్లరి అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడేది.

అక్క గురించి ఆలోచనల్లో ఉండగానే బస్సు గమ్యం చేరుకుంది.

గుమ్మంలోకి అడుగుపెట్టిన నన్ను చూసి అక్క ముఖం వెలిగిపోయింది.

“రారా తమ్ముడూ! లోపలికి రా. ఇలా కూర్చో” అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది.

ఇంట్లో అటూ ఇటూ చూసి, కొంచెం సిగ్గుపడుతూ మూలన ఉన్న తుంగచాపను తీసుకొచ్చి నేలమీద పరిచింది. మంచినీళ్ల గ్లాసు అందిస్తూ కుశల ప్రశ్నలు వేసింది.

“సరే, కాళ్లు కడుక్కుని రా. భోజనం వడ్డిస్తాను” అంది.

“బావగారు, పిల్లలతో కలిపి తింటాను” అన్నాను.

“వాళ్లంతా తినేసి వెళ్లారు. బావగారు సాయంకాలం వరకు రారు” అంది.

ఏడాది అయింది అక్కను చూసి. కుటుంబ పరిస్థితుల్లోనూ, అక్క జీవితంలోనూ పెద్దగా మార్పేమీ లేదు. గత ఏడాది కంటే అక్క మరింత చిక్కిపోయింది. కానీ అభిమానం, ఆప్యాయత, ప్రేమలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఏటేటా అవి పెరుగుతూనే ఉన్నాయి.

ప్రేమగా ఆహ్వానించింది. అరిటాకులో అభిమానంగా వడ్డించింది. పీట పక్కన కూర్చుని, “ఇంకొంచెం వేసుకోరా” అంటూ కొసరి కొసరి వడ్డించింది.

“నువ్వు కూడా కూర్చోకూడదా?” అని అడిగేలోపే గబుక్కున అన్నం గిన్నెకు మూత పెట్టేసింది.

అప్పుడే నాకు పరిస్థితి అర్థమైంది.

అన్నం, పప్పు, వంకాయ కూర, ముక్కల పులుసు, కొబ్బరికాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు, సేమియా పాయసం, పెరుగు...

అక్క చేతి వంట నిజంగా అమృతమే! ఆ ఆప్యాయతకు తోడు రుచికరమైన భోజనం కావడంతో కొంచెం ఎక్కువగానే తినేశాను.

ఇంతలో పిల్లలు కాలేజీ నుంచి వచ్చారు.

“సాయంకాలం వరకు రాము అన్నారు కదరా?” అని అక్క వాళ్లను అడిగింది.

“ఎవరో వచ్చి స్ట్రైక్ చేయించారు” అన్నారు పిల్లలు.

“వాళ్లకు కూడా పెట్టకూడదా?” అని అడిగాను.

“లేదురా, నువ్వు ముందు తినేయి” అంది అక్క.

భోజనం ముగించుకుని హాల్లోకి వచ్చి మంచం మీద వాలాను. ఇంతలో పిల్లలు భోజనం చేస్తున్న దగ్గర నుంచి మాటలు వినిపించాయి.

“అమ్మా! కొంచెం పాయసం వేయవా?” అని చిన్నపాప అడిగింది.

“లేదమ్మా! అది మావయ్య కోసమే చేశాను” అంది అక్క.

ఆ మాట వినగానే గుండె ఎవరో గట్టిగా పిండినట్లయింది.

కాసేపటికి అక్క చేతులు తుడుచుకుంటూ పిల్లలను వెంటబెట్టుకుని హాల్లోకి వచ్చింది. వెంటనే నా సంచిలో ఉన్న స్వీట్ ప్యాకెట్లు, పండ్లు పిల్లలకు అందించాను.

పాపం! పిల్లల ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. నా ముందే ప్యాకెట్లు విప్పి స్వీట్లు తినడం ప్రారంభించారు.

వాళ్లను చూస్తుంటే మనసు చాలా బాధపడింది. అక్క ముఖం చూస్తే పిల్లలు అలా అడగడం, నా ముందే స్వీట్లు తినడం చూసి సిగ్గుపడుతున్నట్లుగా అనిపించింది.

ఎన్నోసార్లు అమ్మానాన్నలతో అక్క పరిస్థితి గురించి చెప్పాను. కానీ నాన్న ఎప్పుడూ, “తనింటి సంగతులు తానే చూసుకుంటుంది” అని మాట దాటవేసేవారు.

కానీ ఆ మూడు గదుల ఇంట్లో, పావు కిలో పప్పు, అరకిలో బియ్యంతో సాగుతున్న ఆ కుటుంబ జీవితం తలుచుకుంటేనే బాధగా ఉండేది.

అమ్మ చనిపోయి ఆరు నెలలైంది.

నిన్న అక్క దగ్గరకు వెళ్లి వస్తానని నాన్నతో చెప్పినప్పుడు, నాన్న నన్ను గదిలోకి పిలిచారు. తన వీలునామా చూపించారు. అప్పుడు అసలు విషయం అర్థమైంది.

“ఇన్నాళ్లూ ఒక నిజాన్ని నీకు చెప్పకుండా దాచాను. నీ అక్క నా మొదటి భార్య కూతురు. నీకు సవతి అక్క అయినా, నిన్ను సొంత తమ్ముడిలా చూసుకుంది. అమ్మకు భయపడి ఆస్తి పంపకాలు చేయలేకపోయాను. నా తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఈ ఆస్తిలో తనకు రావాల్సిన వాటా అందాలి. ఈ వీలునామా కాగితాలు తనకు ఇవ్వు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ కాగితాలను ఒక కవరులో పెట్టి నా చేతిలో పెట్టారు.

వంటింటి నుంచి హాల్లోకి వచ్చిన అక్క చేతిలో నాన్న ఇచ్చిన వీలునామా కవర్ పెట్టాను. లోపల ఉన్న వీలునామా కాగితాన్ని బయటకు తీసి చదివింది. అక్క దాన్ని చూసి అదోరకంగా నవ్వింది.

“నాకెందుకురా ఆస్తులు! ఆడపిల్లకు పెళ్లయిన తర్వాత పుట్టింటి నుంచి కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు, అభిమానం, ఆప్యాయత. ‘ఎలా ఉన్నావు?’ అని పలకరించే మనసు. అంతే!

పెళ్లి చేసి పంపిన తర్వాత పుట్టింటి నుంచి ఈ పలకరింపులు లేకపోతే బంధాలు తెగిపోతాయి. రాకపోకలు లేకపోతే మనుషులు దూరమవుతారు. మనసుల సంగతి సరేసరి!

ఏదో ఒక వంకతో అందరూ కలుసుకోవాలని మన పెద్దలు పెట్టిన సంప్రదాయమే ఈ భగినీ హస్త భోజనం లాంటి పండుగల పరమార్థం” అని చెప్పింది.

అలా అంటూనే లోపలికి వెళ్లి ఒక సంచి తీసుకొచ్చి నా చేతికిచ్చింది.

“ఇది వెళ్లేటప్పుడు పట్టుకెళ్లడం మర్చిపోకు” అంది.

పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఏనాడూ పుట్టింటి నుంచి గుప్పెడు బియ్యం కూడా ఆశించని అక్క మీద నా గౌరవం మరింత పెరిగింది.

సవతి తమ్ముడినైనా సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఆదరించిన అక్క నాకు దేవతలా కనిపించింది.

“సరే అక్కా! నేను వెళ్లొస్తాను” అని చెప్పి బయలుదేరాను.

అక్క గుమ్మం దగ్గర నిలబడి కన్నీళ్లతో నాకు వీడ్కోలు చెప్పింది.

బస్సులో కూర్చున్నాక, అక్క తినమని ఇచ్చిన చిన్న డబ్బా గుర్తొచ్చింది. సంచిలోంచి తీసి తెరిచాను.

లోపల సేమియా పాయసం!

నాకోసమే ప్రత్యేకంగా దాచిపెట్టిన పాయసం.

కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

దానితో పాటు నేను ఇచ్చిన కవర్ కూడా ఆ సంచిలో భద్రంగా కనిపించింది.

ఆ క్షణం నాకు అర్థమైంది...

అక్కకు నా ఆస్తి అవసరం లేదు. నా ఆప్యాయత చాలు. ఆమెకు కావలసింది డబ్బు కాదు. ప్రేమ, అభిమానం, అనుబంధం కొనసాగించే చిన్నప్పటి తమ్ముడు.

వీలున్నప్పుడల్లా అక్క గుమ్మంలో అడుగుపెట్టి, “ఎలా ఉన్నావక్కా?” అని పలకరించే తమ్ముడు.

నిజమే... ఆస్తిపాస్తులు పంచుకోవడం కన్నా ఆప్యాయతను పంచుకోవడమే గొప్ప సంపద.

ఆ రోజు భగినీ హస్త భోజనంలో అక్క నాకు పెట్టింది కేవలం భోజనం కాదు... జీవితాంతం గుర్తుండిపోయే ప్రేమానురాగాల విందు.


రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
నేను చదివిన కథలు - అక్క చేతి ముద్ద - భగినీ హస్త భోజనం - by k3vv3 - 09-10-2024, 03:51 PM
RE: నేను చదివిన కథలు - by sri7869 - 10-10-2024, 12:42 PM
RE: నేను చదివిన కథలు - by Uday - 10-10-2024, 12:47 PM
RE: నేను చదివిన కథలు - by k3vv3 - 10-10-2024, 02:23 PM
RE: నేను చదివిన కథలు - by k3vv3 - 10-10-2024, 02:24 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by Uday - 10-10-2024, 07:16 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by sri7869 - 11-10-2024, 02:07 PM
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by k3vv3 - 16-10-2024, 01:32 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by sri7869 - 17-10-2024, 09:51 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:08 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:16 PM
RE: నేను చదివిన కథలు - భార్యా బాధితులు - by k3vv3 - 26-10-2024, 05:17 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by sri7869 - 26-10-2024, 10:29 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by Uday - 27-10-2024, 04:36 PM
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by k3vv3 - 10-11-2024, 01:41 PM
RE: నేను చదివిన కథలు - దేవకన్య - by sri7869 - 10-11-2024, 10:32 PM
RE: నేను చదివిన కథలు - దేవకన్య - by k3vv3 - 21-11-2024, 12:59 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by sri7869 - 21-11-2024, 08:44 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by k3vv3 - 02-12-2024, 01:38 PM
RE: నేను చదివిన కథలు - బర్త్‌డే విషెస్ - by k3vv3 - 02-12-2024, 01:40 PM
RE: నేను చదివిన కథలు - అదృష్టం అంటే నాదే - by sri7869 - 03-12-2024, 05:05 PM
RE: నేను చదివిన కథలు - అదృష్టం అంటే నాదే - by k3vv3 - 12-12-2024, 03:58 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by sri7869 - 17-12-2024, 05:40 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:29 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:32 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by k3vv3 - 19-12-2024, 02:33 PM
RE: నేను చదివిన కథలు - దసరా టు దీపావళి - by TheCaptain1983 - 20-12-2024, 06:37 AM
RE: నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది - by sri7869 - 19-12-2024, 04:56 PM
RE: నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది - by k3vv3 - 24-12-2024, 10:40 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by sri7869 - 29-12-2024, 04:35 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:06 PM
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:10 PM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by sri7869 - 02-01-2025, 04:56 PM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:37 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:40 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:41 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:42 AM
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:43 AM
RE: నేను చదివిన కథలు - మాతృదేవోభవ - by sri7869 - 10-01-2025, 01:40 PM
RE: నేను చదివిన కథలు - మాతృదేవోభవ - by k3vv3 - 21-01-2025, 04:25 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 21-01-2025, 04:27 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by sri7869 - 21-01-2025, 04:49 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:09 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:13 PM
RE: నేను చదివిన కథలు - గురుబ్రహ్మ - by k3vv3 - 22-01-2025, 02:15 PM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by sri7869 - 22-01-2025, 06:53 PM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by k3vv3 - 30-01-2025, 11:57 AM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by k3vv3 - 30-01-2025, 11:59 AM
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by sri7869 - 30-01-2025, 12:18 PM
RE: నేను చదివిన కథలు - ఎల్లలు లేని స్వార్ధం - by k3vv3 - 06-02-2025, 09:46 PM
RE: నేను చదివిన కథలు - ఎల్లలు లేని స్వార్ధం - by k3vv3 - 06-02-2025, 09:48 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:34 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:35 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:37 PM
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:38 PM
RE: నేను చదివిన కథలు - వెలుతురులోకి - by k3vv3 - 06-03-2025, 10:53 PM
RE: నేను చదివిన కథలు - వెలుతురులోకి - by k3vv3 - 06-03-2025, 10:55 PM
RE: నేను చదివిన కథలు - సేవే మా ధ్యేయం - by k3vv3 - 14-03-2025, 09:25 AM
RE: నేను చదివిన కథలు - సేవే మా ధ్యేయం - by k3vv3 - 14-03-2025, 09:27 AM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 24-03-2025, 10:17 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:39 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:40 PM
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:41 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 12:59 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:00 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:03 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:04 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:12 AM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:13 AM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 3/3 - by k3vv3 - 20-04-2025, 12:52 PM
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 3/3 - by k3vv3 - 20-04-2025, 12:54 PM
RE: నేను చదివిన కథలు - నరకం నుండి స్వర్గానికి - by k3vv3 - 23-04-2025, 06:10 PM
RE: నేను చదివిన కథలు - నరకం నుండి స్వర్గానికి - by k3vv3 - 23-04-2025, 06:13 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:44 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:46 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:46 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:47 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:50 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:51 PM
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:53 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 14-05-2025, 01:54 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:55 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:57 PM
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:58 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by Uday - 14-05-2025, 03:15 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:49 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:50 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:52 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:53 PM
RE: నేను చదివిన కథలు - పాచిక - by k3vv3 - 18-05-2025, 06:55 PM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 11:55 AM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 11:58 AM
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 12:18 PM
RE: నేను చదివిన కథలు - శ్రీమతి 2.O - by k3vv3 - 05-06-2025, 02:00 PM
RE: నేను చదివిన కథలు - శ్రీమతి 2.O - by k3vv3 - 05-06-2025, 02:01 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 19-06-2025, 02:07 PM
RE: నేను చదివిన కథలు - గ్రహాంతరవాసి - by k3vv3 - 19-06-2025, 02:09 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:13 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:14 PM
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:16 PM
RE: నేను చదివిన కథలు - రహస్య స్నేహితుడు! - by k3vv3 - 02-08-2025, 01:07 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:18 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:20 PM
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:22 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:20 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:21 PM
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:24 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:48 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:51 PM
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:57 PM
RE: నేను చదివిన కథలు - వీకెండ్స్ - by k3vv3 - 01-09-2025, 05:26 PM
RE: నేను చదివిన కథలు - వీకెండ్స్ - by k3vv3 - 01-09-2025, 05:28 PM
RE: నేను చదివిన కథలు - అక్క మరో అమ్మ - by k3vv3 - 09-09-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - భిన్నత్వంలో ఏకత్వం - by k3vv3 - 14-09-2025, 01:43 PM
RE: నేను చదివిన కథలు - భిన్నత్వంలో ఏకత్వం - by k3vv3 - 14-09-2025, 01:45 PM
RE: నేను చదివిన కథలు - భలే స్నేహితులు - by k3vv3 - 20-09-2025, 02:48 PM
RE: నేను చదివిన కథలు - భలే స్నేహితులు - by k3vv3 - 20-09-2025, 02:49 PM
RE: నేను చదివిన కథలు - కాలగమనం - by k3vv3 - 25-09-2025, 02:02 PM
RE: నేను చదివిన కథలు - తెలుగు - పార్ట్ 1 - by k3vv3 - 03-10-2025, 08:31 AM
RE: నేను చదివిన కథలు - తెలుగు - పార్ట్ 1 - by k3vv3 - 03-10-2025, 08:33 AM
RE: నేను చదివిన కథలు - క్యాస్ట్ ఫీలింగ్ - by k3vv3 - 10-10-2025, 09:30 AM
RE: నేను చదివిన కథలు - క్యాస్ట్ ఫీలింగ్ - by k3vv3 - 10-10-2025, 09:32 AM
RE: నేను చదివిన కథలు - దొంగ మొగుడు - by k3vv3 - 15-10-2025, 03:31 PM
RE: నేను చదివిన కథలు - కోడలు ఇన్ - అత్త అవుట్ - by k3vv3 - 21-10-2025, 01:50 PM
RE: నేను చదివిన కథలు - కోడలు ఇన్ - అత్త అవుట్ - by k3vv3 - 21-10-2025, 01:51 PM
RE: నేను చదివిన కథలు - అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!.. - by k3vv3 - 27-10-2025, 09:04 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:41 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:42 AM
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:44 AM
RE: నేను చదివిన కథలు - మువ్వల రిక్షా - by k3vv3 - 08-11-2025, 10:13 AM
RE: నేను చదివిన కథలు - మువ్వల రిక్షా - by k3vv3 - 08-11-2025, 10:16 AM
RE: నేను చదివిన కథలు - ఒకరికొకరు - by k3vv3 - 14-11-2025, 08:59 AM
RE: నేను చదివిన కథలు - ఒకరికొకరు - by k3vv3 - 14-11-2025, 09:00 AM
RE: నేను చదివిన కథలు - అమ్మి.. అమ్మ.. అత్త!.. - by k3vv3 - 19-11-2025, 04:52 PM
RE: నేను చదివిన కథలు - ఆదివారం ఆడవాళ్ళకు సెలవు - by k3vv3 - 28-11-2025, 04:25 PM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 12-12-2025, 01:47 PM
RE: నేను చదివిన కథలు - పాత గుడ్డలు - by k3vv3 - 19-12-2025, 02:35 PM
RE: నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు - by k3vv3 - 27-12-2025, 01:17 PM
RE: నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు - by k3vv3 - 27-12-2025, 01:19 PM
RE: నేను చదివిన కథలు - అల్లుకున్న బంధాలు - by k3vv3 - 04-01-2026, 06:21 PM
RE: నేను చదివిన కథలు - అత్త కూడా అమ్మ లాంటిదే - by k3vv3 - 10-01-2026, 04:19 PM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by vdsp1980 - 11-01-2026, 11:20 AM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by k3vv3 - 11-01-2026, 02:35 PM
RE: నేను చదివిన కథలు - శ్వేతపత్రం - by k3vv3 - 21-01-2026, 10:01 AM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 29-01-2026, 06:47 PM
RE: నేను చదివిన కథలు - తిక్క తీరిందా.. తింగరోడా! - by k3vv3 - 02-02-2026, 09:45 PM
RE: నేను చదివిన కథలు - మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం - by k3vv3 - 13-02-2026, 01:00 PM
RE: నేను చదివిన కథలు - సుజన ధైర్యం - by k3vv3 - 18-02-2026, 09:34 AM
RE: నేను చదివిన కథలు - తిరప్తి - by k3vv3 - 23-02-2026, 04:47 PM
RE: నేను చదివిన కథలు - తిరప్తి - by k3vv3 - 23-02-2026, 04:52 PM
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:08 PM
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:13 PM
RE: నేను చదివిన కథలు - కృతజ్ఞత - by k3vv3 - 06-03-2026, 06:18 PM
RE: నేను చదివిన కథలు - కృతజ్ఞత - by k3vv3 - 06-03-2026, 06:20 PM
RE: నేను చదివిన కథలు - బతుకు భయం - by k3vv3 - 18-03-2026, 02:51 PM
RE: నేను చదివిన కథలు - బతుకు భయం - by k3vv3 - 18-03-2026, 02:52 PM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by Omkar2016 - 19-03-2026, 07:23 AM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by k3vv3 - 19-03-2026, 10:05 AM
RE: నేను చదివిన కథలు - కలుపుకుంటే కలదు సుఖం! - by k3vv3 - 23-03-2026, 02:06 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత - by k3vv3 - 23-03-2026, 02:12 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:47 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:48 PM
RE: నేను చదివిన కథలు - ఇల్లాలే దేవత-----నాన్న - by k3vv3 - 27-03-2026, 10:50 PM
RE: నేను చదివిన కథలు - మాతృత్వం - ఓ భార్య మనోవేదన - by k3vv3 - 02-04-2026, 05:23 PM
RE: నేను చదివిన కథలు - మాతృత్వం - ఓ భార్య మనోవేదన - by k3vv3 - 02-04-2026, 05:27 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:06 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:08 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:09 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:10 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:07 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:08 PM
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:09 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:21 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:22 PM
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:24 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:54 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:56 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:57 PM
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 06:01 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:35 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:36 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:37 PM
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:38 PM
RE: నేను చదివిన కథలు - విప్లవ ఉగాది - by k3vv3 - 23-05-2026, 09:25 AM
RE: నేను చదివిన కథలు - విప్లవ ఉగాది - by k3vv3 - 23-05-2026, 09:27 AM
RE: నేను చదివిన కథలు - అక్షర - by k3vv3 - 30-05-2026, 04:19 PM
RE: నేను చదివిన కథలు - అక్షర - by k3vv3 - 30-05-2026, 04:20 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - by k3vv3 - 07-06-2026, 01:40 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - by k3vv3 - 07-06-2026, 01:42 PM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 26-06-2026, 10:49 AM
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 26-06-2026, 10:51 AM
RE: నేను చదివిన కథలు - అందమైన అబద్ధం - by k3vv3 - 05-07-2026, 04:56 PM
RE: నేను చదివిన కథలు - ప్రేమకు ప్రతిరూపం - by k3vv3 - 11-07-2026, 01:06 PM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:34 AM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:36 AM
RE: నేను చదివిన కథలు - మధుమేహుడు @ వాట్సప్ - by k3vv3 - 21-07-2026, 11:37 AM
RE: నేను చదివిన కథలు - ఆనందాల ఆదివారం - by k3vv3 - 28-07-2026, 10:43 AM
RE: నేను చదివిన కథలు - ఆనందాల ఆదివారం - by k3vv3 - 28-07-2026, 10:45 AM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:41 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:43 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:44 PM
RE: నేను చదివిన కథలు - భారవి భారం - by k3vv3 - 03-08-2026, 05:49 PM
RE: నేను చదివిన కథలు - నొప్పించక తానొవ్వక - by k3vv3 - 10-08-2026, 09:26 PM
RE: నేను చదివిన కథలు - నొప్పించక తానొవ్వక - by k3vv3 - 10-08-2026, 09:29 PM
RE: నేను చదివిన కథలు - మీనాక్షి టీచర్.. ! - by k3vv3 - 19-08-2026, 10:28 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 10:58 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 11:00 AM
RE: నేను చదివిన కథలు - అంతా మీ మంచికే - by k3vv3 - 27-08-2026, 11:03 AM
RE: నేను చదివిన కథలు - ప్రేమ ప్రేమే - by k3vv3 - 03-09-2026, 08:24 AM
RE: నేను చదివిన కథలు - ప్రమోషన్ డిమోషన్ - by k3vv3 - 13-09-2026, 01:05 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:32 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:35 PM
RE: నేను చదివిన కథలు - నేనూ అంతేగా?! - by k3vv3 - 20-09-2026, 12:36 PM
RE: నేను చదివిన కథలు - కొందరు కుర్రవాళ్ళు పుట్టుకతో బద్ధకస్తులు - by k3vv3 - 02-10-2026, 02:03 PM
RE: నేను చదివిన కథలు - ప్రశ్న - by k3vv3 - 11-10-2026, 11:01 PM
RE: నేను చదివిన కథలు - ప్రశ్న - by k3vv3 - 11-10-2026, 11:03 PM
RE: నేను చదివిన - బంగారు బంధం - by parinda35 - 13-10-2026, 10:10 PM
RE: నేను చదివిన - బంగారు బంధం - by k3vv3 - 21-10-2026, 11:32 AM
RE: నేను చదివిన - బంగారు బంధం - by k3vv3 - 21-10-2026, 11:38 AM
RE: నేను చదివిన - అత్తింటి అవమానాలు - by k3vv3 - 31-10-2026, 11:51 AM
RE: నేను చదివిన - అత్తింటి అవమానాలు - by k3vv3 - 07-11-2026, 02:08 PM
RE: నేను చదివిన కథలు - పెళ్ళి చూపులు - by k3vv3 - 11-11-2026, 02:04 PM



Users browsing this thread: 2 Guest(s)