17-10-2026, 08:40 PM
(17-10-2026, 06:35 PM)dom nic torrento Wrote: అప్డేట్ ల రాణి అనామిక
అని బిరుదు ఇవ్వాలి మీకు
ఎలా రాస్తున్నారు అండి బాబు ఇన్ని update lu.
Appatlo oka అతను ఉండేవాడు, మహేష్ అని. అతను కూడా మీ టైప్ ఏ.
ఏమైనా రాస్తూ వెళ్తాడా, అసలు ఒక్కో అప్డేట్ 6కే వర్డ్స్ అలా ఉంటాయి. అవి చదవలేక
స్టోరీ నే వదిలేసిన రోజులు ఉన్నాయ్.
కథలు నేను ఈ ఫోరమ్ లో పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టినప్పటినుండి పోయిన నెల వరకు నాకు చాలా సమయం దొరికేది, అప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను, అంటే స్టోరీ లైన్ అలాగే సన్నివేశాలు కూడా, అయితే ఇప్పుడు మొత్తం నా షెడ్యూల్ మారిపోయింది. అందుకే రోజుకి ఒక్క కథకి మాత్రమే అప్డేట్ ఇవ్వగలుగుతున్నాను. మీరు అన్నట్లు కొంచెం కష్టమే అవుతోంది. అందుకే ఈ నాలుగు కథలకే పరిమితం అవుదామని నిర్ణయించుకున్నాను. ఇక్కడ కథలు పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టాక, వేరే హిందీ కథలు, ఇంగ్లీష్ కథలు అసలు చదవడం కుదరడంలేదు. నాకున్న ఫ్రీ టైములో దాదాపు 75% కథలు ప్రిపేర్ చేసుకుని పోస్ట్ చెయ్యడానికే సరిపోతుంది. మొదలుపెట్టాను కాబట్టి మధ్యలో వదిలిపెట్టి చదివేవాళ్ళని అసంతృప్తికి గురిచేయడం ఇష్టంలేక ఎలాగోలా టైంని సర్దుకుంటున్నాను.
మీలాంటి సీనియర్ రచయిత దగ్గరనుండి ఒక ప్రశంస వచ్చింది. It means a lot to me.
ఎందుకు ప్రత్యేకం అంటే, నేను గమనించినతవరకు మీరు రిప్లై లు ఇచ్చినప్పుడు కానీ, మెసేజ్ లు పెట్టినప్పుడు కానీ ఎక్కడా నాకు అస్లీలత, గర్వం కనిపించలేదు. ఆ రెండు లేని మనుషులంటే నాకు చాలా గౌరవం. కొందరు ఇక్కడ నాకు నచ్చిన రచయితలు వున్నారు కానీ నేను పైన చెప్పిన ఆ రెండు కారణాలవల్ల వాళ్లంటే ఇప్పుడు ఇంతకుముందులాంటి అభిమానం లేకుండా పోయింది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)