అందరికి నమస్కారం. నేను చాలా రోజులు అలోచించి ఈ కథని రాయడం మొదలు పెట్టాను. కొంచెం స్లోగా ఉంటుంది మొదలులో. కచ్చితంగా మీ అభిప్రాయాలని తెలియజేయాలనీ కోరుకుంటున్నాను.
చాప్టర్ 1
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
కిటికీ పక్కన కూర్చున్న అజిత్ బయటకు చూస్తూ ఉన్నాడు. రైలు కదిలిన తర్వాత కూడా ప్లాట్‌ఫామ్ వైపు చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే తన భార్య లావణ్యను ఆమె పుట్టింట్లో వదిలి వచ్చాడు.
నాలుగు నెలల గర్భంతో ఉన్న లావణ్య, బిడ్డ పుట్టే వరకు అక్కడే ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వెంటనే చెన్నైకి తిరిగి రాదు. బిడ్డకు కనీసం ఐదు నెలలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఇద్దరూ ముందే నిర్ణయించుకున్నారు.
అంటే... ఇంకో తొమ్మిది, పది నెలలు?
అజిత్ ఆ లెక్క వేసే ప్రయత్నం చేసి మళ్లీ ఆపేశాడు.
అంత దూరం ముందుగానే ఆలోచించడం ఎందుకని అనిపించింది.
రైలు అప్పటికే హైదరాబాద్ నగరాన్ని దాటి ముందుకు వెళ్లిపోయింది.
ఆ రాత్రి ప్రయాణం పెద్దగా గుర్తుండిపోయేలా ఏమీ జరగలేదు. కొంతసేపు ఫోన్‌లో గడిపాడు. లావణ్యతో మాట్లాడాడు. ఆమెకు ఏదైనా కావాలా అని అడిగాడు. తినడానికి ఏదో తీసుకున్నాడు. మధ్యలో కొద్దిసేపు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు.
రాత్రి ఆలస్యంగా నిద్రపోయాడు.
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చెన్నై చేరుకున్నాడు.
స్టేషన్ నుంచి క్యాబ్ తీసుకుని అపార్ట్‌మెంట్‌కి చేరేసరికి అతనికి ఒక్కటే అనిపించింది.
నిద్రపోవాలి.
తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. బ్యాగ్‌ను ఒక మూల పెట్టాడు.
అదే సోఫా.
అదే టేబుల్.
అదే టీవీ.
అదే బెడ్‌రూమ్.
ఇంట్లో ఉన్నవన్నీ అలాగే ఉన్నాయి.
ఏదీ మారలేదు.
కానీ ఇంట్లో ఒక మనిషి మాత్రం లేదు.
లావణ్య.
కొన్ని నెలల పాటు ఈ ఇల్లు ఇలాగే ఉండబోతోందన్న ఆలోచన ఒక్క క్షణం అతని మనసులోకి వచ్చింది.
అతను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.
ఫోన్‌ను ఛార్జింగ్‌కి పెట్టి, బట్టలు కూడా సరిగ్గా మార్చుకోకుండా మంచం మీద పడుకున్నాడు.
ప్రయాణం అలసట, నిద్రలేమి రెండూ కలిసి కళ్లను బరువెక్కించాయి.
కొద్దిసేపటికే అతనికి నిద్ర పట్టేసింది.
---
ఉదయం పది గంటల సమయంలో ఫోన్ వైబ్రేట్ అవడంతో అజిత్ మెల్లగా కళ్లు తెరిచాడు.
మొదట ఎక్కడున్నాడో అర్థం కాలేదు.
కొన్ని సెకన్లు పైకప్పు వైపు చూస్తూ పడుకున్నాడు. తర్వాత ఫోన్ గుర్తొచ్చింది.
స్క్రీన్ చూసాడు.
Slack notification.
అతను Slack ఓపెన్ చేశాడు.
Ishika
ఒక message ఉంది.
«Ishika: Hi Ajith, customer reported an issue in the latest version. Can you check this when you get a chance? I’ve added the details and video in the ticket.»
అజిత్ ఇంకా పూర్తిగా నిద్ర మత్తులోనే ఉన్నాడు.
మెసేజ్‌ని మరోసారి చదివాడు.
టైమ్ చూసాడు.
10:03 AM.
ఆఫీస్‌కి పదిన్నర నుంచి పదకొండు మధ్యలో చేరుకోవడం అతనికి సాధారణం. Flexible timings ఉన్నా, ఉదయం meetings ఉండటంతో ఎక్కువ ఆలస్యం చేయడు.
ఫోన్ పక్కన పెట్టి మంచం మీద నుంచి లేచాడు.
బాత్రూమ్‌కి వెళ్లేలోపు మళ్లీ ఫోన్ తీసుకున్నాడు.
Slackలో reply టైప్ చేశాడు.
«Ajith: Sure. I’ll check once I’m in office.»
Send చేశాడు.
ఫోన్‌ను పక్కన పెట్టి రెడీ అవ్వడానికి వెళ్లిపోయాడు.
---
అజిత్ పని చేసే కంపెనీలో fixed nine-to-five timing లేదు.
Flexible timings ఉన్నా, ఉదయం meetings ఉండటంతో సాధారణంగా పదిన్నర నుంచి పదకొండు మధ్యలో ఆఫీస్‌కి చేరుకునేవాడు.
ఆ రోజు కూడా దాదాపు పదకొండు దాటేసరికి తన desk దగ్గర కూర్చున్నాడు.
అతని ముందు company ఇచ్చిన MacBook ఉంది.
Laptop open చేశాడు.
మొదట meetings.
తర్వాత mails.
ఆ తర్వాత Ishika పంపిన customer ticket.
Ticket open చేసి video play చేశాడు.
Issueని reproduce చేయడానికి ప్రయత్నించాడు.
మొదటి attemptలో రాలేదు.
రెండోసారి కూడా రాలేదు.
అజిత్ మళ్లీ steps చదివాడు.
“Again…”
అని తనలో తానే అనుకుని మళ్లీ మొదటి నుంచి చేశాడు.
ఈసారి bug వచ్చింది.
కుర్చీలో వెనక్కి వాలి screen వైపు చూస్తూ కొన్ని సెకన్లు ఆలోచించాడు.
Frontend sideలో ఏదో unexpected behavior.
Code open చేశాడు.
Related files వెతికాడు.
ఒక చోట logic చూసి ఆపాడు.
“Okay…”
అని మెల్లగా అనుకుని అక్కడి నుంచి debug చేయడం మొదలుపెట్టాడు.
---
మధ్యాహ్నం సమయం దాటుతున్నా అజిత్‌కి పని ఇంకా పూర్తికాలేదు.
సాధారణంగా లంచ్ టైమ్‌కి అతను, ఇషికా కలిసి పై అంతస్తులో ఉన్న food courtకి వెళ్లేవాళ్లు. అప్పుడప్పుడు వాళ్లతో పాటు ఇంకో colleague కూడా వచ్చేవాడు.
ఆఫీస్‌లో lunch, dinner రెండూ provide చేసేవారు. అయినా అజిత్ వాటిని రెగ్యులర్‌గా తినేవాడు కాదు. వీలైతే పై అంతస్తులో ఉన్న food courtకి వెళ్లి తినడం అతనికి అలవాటు.
ఆ రోజు మాత్రం ఆ routineకి టైమ్ లేదు.
Customer issue ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. దానితో పాటు ఇంకో రెండు పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
ల్యాప్‌టాప్ స్క్రీన్ నుంచి చూపు తీయకుండా ఉండిపోయాడు.
కొంతసేపటికి ఆకలి వేసిందని గుర్తొచ్చింది.
గడియారం చూసాడు.
రెండు దాటుతోంది.
“సరే…”
అని తనలో తానే అనుకుని లేచాడు.
పైకి food courtకి వెళ్లేంత సమయం కూడా లేదనిపించింది.
తన floorలోనే ఉన్న చిన్న cafeteria sectionకి వెళ్లి ఏదో తీసుకుని వచ్చాడు.
తింటూనే మరోసారి laptop వైపు చూశాడు.
ఆ రోజు ఇషికాతో కలిసి lunch చేయలేదు.
అది పెద్ద విషయమేమీ కాదు.
రోజంతా పని ఎక్కువగా ఉన్నప్పుడు అతను అప్పుడప్పుడు ఇలాగే చేసేవాడు.
లంచ్ అయిపోయిన వెంటనే మళ్లీ తన desk దగ్గర కూర్చున్నాడు.
---
మధ్యాహ్నం తర్వాత కూడా పని అలాగే కొనసాగింది.
ఒక issue fix చేశాడు.
మరొకదాన్ని టీమ్‌లో discuss చేశాడు.
Customer ticketలో అవసరమైన changes చేశాడు.
కొన్ని tests run చేశాడు.
మధ్యలో Slackలో messages.
మధ్యలో meetings.
మధ్యలో mails.
అలా రోజు ముందుకు వెళ్లిపోయింది.
సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అతను MacBook మూసేశాడు.
రోజు మొత్తం స్క్రీన్ వైపు చూస్తూ గడిపిన తర్వాత బయటకు వచ్చేసరికి కాస్త తేలికగా అనిపించింది.
---
ఇంటికి చేరేసరికి సాయంత్రం పూర్తిగా దిగిపోయింది.
బ్యాగ్‌ను సోఫా మీద పడేసి, బట్టలు మార్చుకుని కాసేపు అలాగే కూర్చున్నాడు.
ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది.
టీవీ ఆన్ చేయాలా అనిపించింది.
మళ్లీ ఆ ఆలోచన వదిలేశాడు.
కొంతసేపటి తర్వాత తన gaming PC ఆన్ చేశాడు.
ఆ PC అతనికి ఆఫీస్‌కి పూర్తిగా భిన్నమైన ప్రపంచంలా ఉండేది. రోజంతా company MacBook మీద code, meetings, tickets చూసిన తర్వాత ఇంటికి వచ్చాక సాధారణంగా అదే PC ముందు కూర్చునేవాడు.
కొన్నిసార్లు game.
కొన్నిసార్లు personal work.
అవసరం ఉంటే అప్పుడప్పుడు office work కూడా.
PC start అవుతుండగా ఫోన్ తీసుకున్నాడు.
కొన్ని personal messages ఉన్నాయి.
కొన్ని office notifications ఉన్నాయి.
Slackలో unread message కూడా కనిపించింది.
అతను Slack ఓపెన్ చేశాడు.
Ishika: Can you verify the fix once? I think the issue should be resolved now.
అజిత్ ఆ మెసేజ్ చదివాడు.
PC ముందు కూర్చుని ticket open చేశాడు.
మళ్లీ issue reproduce చేయడానికి ప్రయత్నించాడు.
ఈసారి bug రాలేదు.
అతను Slackలో చిన్న reply టైప్ చేశాడు.
«Ajith: Checked. Looks good now.»
Send చేశాడు.
ఫోన్‌ను పక్కన పెట్టాడు.
కొన్ని క్షణాలు PC screen వైపు చూస్తూ కూర్చున్నాడు.
తర్వాత game open చేశాడు.
బయట రాత్రి మెల్లగా మొదలవుతోంది.
హైదరాబాద్‌లో లావణ్య తన ఇంట్లో ఉంటుంది.
చెన్నైలో అజిత్ తన apartmentలో ఒంటరిగా ఉన్నాడు.
అతని జీవితంలో పెద్దగా ఏమీ మారలేదు.
కనీసం ఆ రోజు వరకు.
అది అతనికి తెలియకుండానే త్వరలో మారబోతోంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)