02-07-2026, 10:29 PM
(This post was last modified: 02-07-2026, 10:32 PM by Raagaa. Edited 2 times in total. Edited 2 times in total.)
దుబాయ్ రోడ్ల మీద గోపీ అందరినీ పరిగెత్తిస్తున్నాడు. రెండు బైకులు నాలు కార్లతో గోపీ కారులో ఉండగా తనని పట్టుకోవడం అసాధ్యమని తెలిసి తనని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. షైక్ జయేడ్ రోడ్. తప్పించుకుపోవడం ఈజీనే కానీ రేస్ ట్రాక్ వెనక ఉంది. వెనక్కి వెళ్ళాలి. అసలు ప్రతీసారి ఫ్రాన్స్‌లో జరిగే లే మాన్స్ రేస్ మొదటి సారి దుబాయ్‌లో జరగడం. ఏదో తెలియని శక్తి సాయం చేస్తున్నట్టు అనిపించింది. నాలుగు కార్లకు ఇంకో నాలుగు తొడయ్యాయి.
అవసరం లేకపోయినా ఎక్కువ రైజ్ ఇస్తున్నాడు గోపీ. జోయా తయారు చేసిన కారు అటువంటిది. ఎక్కడో అక్కడ ఆగక తప్పదు. తను తప్పించుకోవాలంటే ఇంజన్ వేడిగా ఉండాలి. ఇప్పటి వరకు Nos వాడలేదు గోపీ.
అనుకున్నట్టే ఎదురుగా బ్లాక్ చేశారు. పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాడు కారుకి అడ్డంగా నిలబడి నవ్వుతుంటే కోపం వచ్చింది. వేగంగా ఇంకా పూర్తిగా స్పీడ్ పెంచాడు. ఆగిపోతాడేమో అనుకున్న గోపీ ఇంకా వేగం పెంచేసరికి ఏం చెయ్యాలో తెలీక గన్ ఫైరింగ్ చేశాడు. అవి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. గోపీ మొహంలో నవ్వు కనిపించిన మరుక్షణం కారు వాడి పొట్టని చీల్చుతూ గుద్దేశాడు గోపీ.
గోపీకి దెబ్బలు తగిలాయి. తేరుకుని చూసాడు. ఇంజన్ ఓవర్ హీట్ సింబల్ చూపిస్తుంది. కిల్ స్విచ్ ఆన్ చేసి Nos పూర్తిగా తిప్పి వదిలేసాడు. మెల్లగా కిందకి దిగాడు. అప్పటికే అక్కడికి వచ్చిన మెయిన్ డాన్ గోపీ మెడ పట్టుకుని కిందకి ఈడ్చాడు. గట్టిగా నవ్వాడు. చుట్టూ మనుషులు. You are going to die అని నవ్వాడు గోపీ. ఏదో తేడా జరగబోతుందని తెలిసేలోపే ఒక్క ఉదుటున లేచి గుండె మీద తన్నాడు. వాడు కారు దగ్గర పడటం. కారులో ఓవర్ హీట్ ఆగిపోకుండా వెలగడం, దానికి పర్యావసానంగా జోయా కలిపి పెట్టిన వైర్లలో చిన్న నిప్పు రవ్వ. కారులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్. BOOOOOOOM.MM.MM
ముందే పక్కకి దూకేసిన గోపీ అందరూ తెరుకోక ముందే ఇంకో కారు ఎక్కి అక్కడి నుంచి జంప్ అయ్యాడు. మెయిన్ హెడ్ చచ్చాడు. వాడి కింద చేసే వాడు చచ్చాడు. గోపీ వెనక ఇంకెందుకు చేజ్ చెయ్యాలో మిగతా వాళ్లకి అర్ధం కాలేదు. అక్కడే ఆగిపోయారు.
అలుపు లేకుండా కారు నడపడం బాడీ మీద వెయిట్ పడుతుంది గోపీకి. స్వర్ణా.. అని పిలిస్తే అప్పటి వరకు గోపీ ఏమైనా మాట్లాడతాడేమో అని చూసిన స్వర్ణ వెంటనే రెస్పాండ్ అయ్యింది.
ఏం చేస్తున్నావ్ అక్కా..
నవ్వింది స్వర్ణ. (Pos:18)
ఓ పాట పాడు.
ఏం పాట !
ఒకడే ఒక్కడు మొనగాడు.. ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు.. తల ఎత్తుకు తిరిగే మొనగాడు
గోపీ పాడుతుంటే పిచ్చిగా నవ్వుతుంది స్వర్ణ.
పాడు.. ఇలాంటి టైంలొ రజినీకాంత్ మోటివేషనల్ సాంగ్స్ బాగా పని చేస్తాయి. Next lapకి టైర్లు మార్చాలి. స్వర్ణ టీంకి టైర్స్ అని చెప్పింది.
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టుకు ఢీ కొట్టు.. ఇంజన్ పేలెట్టు
Overspeed వెళ్తున్నావ్. గుర్తుచేసింది స్వర్ణ
కాసేపు మౌనంగా ఉన్నాడు గోపీ.. ఉన్నట్టుండి స్వర్ణ చెవుల్లో మనసు ఉన్న మనిషినయా.. నేను మీసమున్న బాలునయ. నేను మేలు చేయు వాణ్ణయా మేలుమరిచి పొనయా.. ఈ జన్మ ఎత్తింది నీకోసమే జోయా.. జిజ్జు నక్కు జిజ్జు నక్కు.. జిజ్జు నక్కు జిజ్జు నక్కు..
ఒరేయ్ నువ్వెంత స్పీడ్ వెళ్తున్నావో తెలుసా.. ఇలాంటి టైములొ పాటలేంటి. నువ్వే కాదు నీ వెనక వచ్చే వాళ్ళు కూడా.. అంటుంటే గోపీ మధ్యలో ఆపేశాడు.
అవన్నీ నాకు తెలుసులే.. నాకు నిద్రొస్తుంది.
వచ్చేయి విష్ణు వెళ్తాడు.
ఇప్పుడే కాదు. Pos:15కి వెళ్ళాక. అయినా పాపం విష్ణు ఒక్కడే చాలా మానేజ్ చేశాడు. Scrutineering మొత్తం వాడే చూసుకున్నాడు. ప్రాక్టీస్ చేశాడు. డ్రైవర్స్ పరేడ్‌కి వాడే వెళ్ళాడు. నిన్ను రేస్ ఇంజనీరింగ్‌గా పెట్టుకుంటే మా కింద మేము బాంబు పెట్టుకున్నట్టే
నేనేం చేశాను !!
సాయంత్రం నాలుగింటికి మొదలయిన రేస్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ?
పది అవుతుంది.
మరి ఇప్పుడు ఎవరు రావాలి ? నైట్ డ్రైవర్ స్పెషలిస్ట్ ఎవరు?
షరీఫ్
అవును.. వాడిని రెడీగా ఉండమను. స్పీడ్ పెంచాడు గోపీ. రాత్రి పదకొండు అయ్యేసరికి pos:12లొ ఉన్నారు.
స్వర్ణ మాటలు వినిపించాయి. గోపీ.. విష్ణు నువ్వెందుకు స్పీడ్ వెళ్లట్లేదని అడుగుతున్నాడు.
నేను ఇంజురీ.. రాత్రి మొత్తం షరీఫ్ నడపాలి. మన పోజిషన్ ముందు ఉంటే వాడు ఇబ్బంది పడతాడు. మబ్బులు ఏ డైరక్షన్‌లొ వెళ్తున్నాయో గమనించావా ?
స్వర్ణ కోపంగా పక్కన ఉన్న ఇంజనీర్లని చూసింది.
మాములుగా ఫ్రాన్స్ అయితే వర్షం పడేదేమో కానీ ఇక్కడ గాలి దిశ మారుతుంది. ట్రాక్ టెంపరేచర్ కూడా మారుతుంది. బ్రేక్స్ వేసేటప్పుడు నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు హై స్పీడ్‌లొ కారు మనకి అనుగుణంగా ఉండదు. ఇవన్నీ మీరు చెప్పాలి. నా ఖర్మ. ఏం చేస్తా.. మాట్లాడుతూనే నడుపుతున్నాడు. వాడికి ఇది కూడా అర్ధం కాలేదా అని గొణిగాడు గోపీ..
పదకొండుంబావుకి కారు దిగాడు గోపీ. షరీఫ్ కారు ఎక్కాడు. లోపలికి వెళ్లి పడుకుంటే జోయా వచ్చింది. బుజ్జి ఏది అని అడిగాడు.
అది మెచ్యుర్ అయ్యింది.
ఇప్పుడా !!
హా.. మీ అమ్మ హోటల్‌కి తీసుకెళ్ళింది. తను చూసుకుంటానంది.
ఓహ్ !! దగ్గరికి రారా.. కాసేపు.
నేనెళ్ళాలి అంది జోయా. గోపీ బ్లీడింగ్ చూసి డాక్టర్‌ని పిలిచింది.
డాక్టర్ వచ్చి దెబ్బ చెక్ చేశాడు. బ్లీడింగ్ అవుతుంటే మళ్ళీ కట్టు కట్టి వెళ్ళిపోయాడు. తరువాత ఏం చెయ్యాలో విష్ణుతో మాట్లాడాక తాతయ్యతో పొద్దున జరిగిన గొడవ గురించి ఏదైనా సమస్య అయ్యిందేమోనని కనుక్కున్నాడు. రేస్ గురించి ఎంత ఆలోచించినా లాభం లేదు. పరిస్థితుల బట్టీ పోవాల్సిందేనని ఆలోచించడం మానేశాడు. పెయిన్ కిల్లర్స్ వల్ల త్వరగా నిద్ర పట్టేసింది.
పొద్దున్నే ఐదింటికి మెలుకువ వచ్చింది గోపీకి. విష్ణు అప్పటికే లేచి స్ట్రెచ్ చేస్తున్నాడు. జోయా ఎడతెరపి లేకుండా పని చేస్తుంది. గోడ మీద టీవీని చూస్తూ నవ్వాడు గోపీ.
ఏమైంది అని అడిగాడు విష్ణు. వేలు పెట్టి షరీఫ్‌ని చూపించాడు(pos:12). వాడికి రాత్రి నేను కారు ఇచ్చినప్పుడు పన్నెండో పొజిషన్‌లొ ఉన్నాం. తెల్లారినా వాడు పన్నెండో పొజిషన్‌లోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు గోపీ. జోయా కూడా అది విన్నది. ఇద్దరు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు గోపీ అర్ధంకాక. ఇద్దరు నవ్వడం ఆపేసారు.
నేను వాడి మీద జోక్ చెయ్యట్లేదు. రాత్రంతా నడిపినా వాడు పొజిషన్ కాపాడాడు. వాడికున్న అనుభవానికి అక్కడున్న రేసర్లకి చాలా కష్ట పడ్డాడు.
అవును.. ఇందాకటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కంప్లైంట్స్ బ్రేక్స్ ప్రాబ్లం ఉందని.. బ్రేక్ పాడ్స్ మార్చాం అయినా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. నవ్వుతూ చెప్పింది జోయా.
వాట్ ! ఆశ్చర్యపోయాడు గోపీ
కానీ మానిటర్ అంతా బానే చూపిస్తుంది. ఎక్కడా ఫాల్ట్ కనిపించలేదు.
ఏమి జరగకపోతే వాడు అలా ఎందుకు చెప్తాడు. రమ్మను. గోపీ విష్ణు వంక చూసాడు. విష్ణు అర్ధమైనట్టు ట్యాబ్ తీసుకుని చూసాడు. ఏదో అర్ధమైనట్టు డక్ట్ పోయిందేమో కానీ అదేం కనిపించట్లేదే.. అన్నాడు.
షరీఫ్ వచ్చేలోపు ఐస్ వాటర్‌తో మొహం కడుక్కుని హెల్మెట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు గోపీ.
విష్ణు కాదా వెళ్ళేది? అడిగింది జోయా
లేదు నేనే వెళ్ళాలి. బుజ్జి ఎలా ఉంది?
పడుకుందట, తాతయ్య చెప్పారు
ఓకే అన్నాడు గోపీ. షరీఫ్ కార్ దిగుతూనే మొదటి సారి పడట్లేదు.. బ్రేక్ రెండు సార్లు నొక్కితే కానీ పడట్లేదు అన్నాడు. గోపీ వింటూనే కారు ఎక్కి పోనించాడు. ఇక్కడితో షరీఫ్ పని అయిపోయింది. రెస్ట్ కోసం లోపలికి వెళుతు విష్ణుకి ప్రాబ్లం చెప్పి వెళ్ళాడు. విష్ణు కూడా వెనకే వెళ్ళాడు.
కెర్బ్‌స్(race track మలుపులో ఉండే ఎర్రని పెయింట్ ఉంటుంది) మీదకి ఎక్కించినట్టున్నావ్.
అది కామన్ కదా అన్నాడు షరీఫ్
అవును.. కానీ ఓవర్ స్పీడ్ మీద ఎక్కిస్తే కారు బౌన్స్ అవుతుంది. సస్పెన్షన్ వల్ల ఏమైనా సమస్య వస్తుందేమో.. చూద్దాం. గోపీ వెళ్లాడుగా అన్నాడు విష్ణు.
గోపీ చెక్ చేశాడు. నిజంగానే మొదటి సారి బ్రేక్ వేసినప్పుడు మిస్ అవుతుంది. రెండో సారి నొక్కినప్పుడు పడుతుంది. అంటే రోటర్‌కి బ్రేక్ పాడ్స్ దూరం జరిగాయి. బ్రేక్ ప్రెజర్ ఫీల్ అవ్వట్లేదు. అంటే కూలింగ్ డక్ట్‌లొ ఏదో ఇరుక్కుని ఉండాలి.
స్వర్ణా.. డక్ట్ మార్చాలి. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా.. ఫాస్ట్. Iam coming అని అరిచాడు. స్వర్ణ జోయాకి చెప్పింది. కారు పిట్ స్టాప్ దగ్గరికి రాగానే విష్ణు, షరీఫ్ ఇద్దరు దగ్గరికి వచ్చారు. గోపీ జరిగింది చెప్పాడు.
ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇక నుంచి ఎవరీ సెకండ్ మనకి చాలా ఇంపార్టెంట్. లెట్స్ గొ అని చెయ్యి పెడితే మిగతా ఇద్దరు బంప్ ఇచ్చారు. కారు రెడీ అయ్యింది.
గోపీ మళ్ళీ పదమూడు నుంచి పన్నెండో పొజిషన్‌కి తెచ్చాడు.
గోపీ you are late by 48 seconds అని గుర్తు చేసింది స్వర్ణ.
Got it.. Im good. Lets do this.
Lets do this అంది స్వర్ణ.
ఫుల్ స్పీడులొ కొడుతున్నాడు గోపీ. 312-328 టచ్ అవుతుంది స్పీడ్. స్వర్ణ గుర్తు చేస్తుంది.
బ్రేక్ సెట్స్ రెడీ పెట్టుకోమను. They will be red hot అన్నాడు గోపీ. (స్పీడ్ 335)
ఆ మాటకి స్వర్ణకి కూడా ఊపు వచ్చింది.
pos పదకొండు..
తరువాతి ఐదు లాప్స్‌లొ తొమ్మిది.
గోపీ -33 seconds. చెప్పింది స్వర్ణ.
Ok.. okay
చివరి మలుపు దగ్గర కాంపిటీషన్ టైట్‌గా ఉంది. గోపీ స్పీడ్ తగ్గించలేదు. ఆఖరి క్షణంలొ వేసిన బ్రేకు. వీల్స్ దగ్గర ఉన్న బ్రేకులు ఎర్రగా మెరిసాయి. రెండు కార్లని తప్పించి స్ట్రెయిట్ రోడ్ వచ్చేసరికి మళ్ళీ వేగం పెంచాడు. (pos:07) (స్పీడ్ 342)
-18 seconds (స్వర్ణ గొంతు)
మెల్లగా సూర్య కిరణాలు రోడ్డు మీద పడుతూ కారు కూడా మెరుస్తుంది. ఒక్కో కారుని దాటుకుంటూ వెళుతుంటే చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతీ సంఘటన గుర్తుకు వస్తుంది. (స్పీడ్ 355) నిద్ర లేచి చూస్తున్న ఆడియన్స్ నుంచి అందరి కళ్ళు గోపీ కారు మీదే ఉన్నాయి. గోపీ వెళుతున్న వేగానికి మిగతా అందరి కార్ల కంటే గోపీ కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫోనులో ఫోటో తీయడానికి ప్రయత్నించారు కొంతమంది. గాలి తప్ప ఏమి పడలేదు ఫొటోలో (స్పీడ్ 362)
స్వర్ణ అరుస్తుంది. గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డాడు గోపీ. ఒంటరిగా ఎండలో పనిష్మెంట్ తీసుకుంటున్న గోపీ నుంచి మొన్న జోయా కోప్పడి ప్రేమగా గోడ కుర్చీ వేయించిన గోపీ.. వీటన్నిటిని పక్కకి నెట్టేస్తే కానీ మళ్ళీ రోడ్డు స్పష్టంగా కనపడలేదు. స్వర్ణ గొంతు చిరాకు తెప్పించింది.
ఎందుకు అరుస్తున్నావ్.
నువ్వు వెళ్తున్న స్పీడ్. ఓవర్ స్పీడ్. ఓవర్ స్పీడ్..
ఒకే ఒకే.. గాట్ ఇట్.
గోపీ కారు దిగి విష్ణు కారు ఎక్కేటప్పటికి వాళ్ళున్న పొజిషన్ 4 (ఐదు సెకండ్ల వెనక ఉన్నారు)
Dont lose this one అని హెచ్చరించాడు గోపీ. విష్ణు ఓకే అని కారు ఎక్కాడు. (ఎనిమిది గంటల్లో రేస్ ముగుస్తుంది)
తరువాత మూడు గంటల్లో విష్ణు pos04 నుంచి pos03కి తెచ్చాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే గోపీ కూడా కొట్టాడు. అందులో ఎటకారం చూసింది జోయా. డొక్కలో పొడవబోయి ఇంజురీ ఉందని ఆగిపోయింది.
నేను మామూలుగానే చప్పట్లు కొట్టానురా..
స్వర్ణ ఎనర్జీ డ్రింకులు తాగుతుంటే నవ్వుకున్నాడు. జోయా అది చూసి నువ్వు మారవు అని వెళ్ళిపోయింది. టీం దగ్గరికి వెళ్ళాడు గోపీ.
నాకు పిట్ స్టాప్ చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. నట్లు స్పయిర్ క్యారీ చెయ్యండి. డోంట్ డిలే అంటే ఊ కొట్టారు అంతా..
గోపీ కారు తీసుకున్న తరువాత pos01 కోసం వేట మొదలయింది. ఒకటి గెలుపు అలవాటు అయిన ఫెరారి ఇంకోటి ఈ మధ్య గెలిచి సెన్సేషన్ సృష్టించిన ఫోర్డ్. ఈ ఇద్దరి వెనకాల అనుభవం లేని టీముతో గోపీ. అయినా చాలా వరకు కూల్‌గానే అందరినీ డీల్ చేశాడు. పెయిన్ కిల్లర్స్ వేసుకోమన్నారు. కానీ దాని వల్ల ఫోకస్ ఉండదు. అతి వేగం, అతి బ్రేకుల వల్ల బాడీ మూమెంట్ ఇచ్చినప్పుడల్లా సూదితో గుచ్చినట్టు అనిపిస్తుంది.
6 గంటల్లో రేస్ ముగుస్తుంది. విష్ణు ముందున్న రెండు కార్లతో పోటీ పడి నడుపుతున్నాడు. స్వర్ణ మాటల సహాయం విష్ణుకి చాలా బూస్ట్ ఇస్తుంది. మధ్యలో ఒకసారి pos02కి కూడా వచ్చి మళ్ళీ మూడో స్థానానికి వచ్చాడు. మొదట నాలుగు కార్లకి మిగతా కార్లకి దూరం పెరుగుతుంది. పెద్ద రేస్‌లొ ఇక్కడ ఇంకో చిన్న రేస్ జరుగుతుంది. రెండో పొజిషన్‌లొ ఉండనివ్వడం లేదు విష్ణుని. కావాలనే కార్నర్ చెయ్యడం, సెంటర్ చెయ్యడం. రాగ్గింగ్ చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా విష్ణుకి దారి ఇవ్వడం లేదు.
పిట్ దగ్గరున్న జోయా కూడా అదే అంది. పదే పదే గోపీకి చెపుతుంటే ఆళ్లేందుకిత్తారే అన్నాడు. ఆశ్చర్యపోయి చూసింది జోయా. ఇదే మొదటి సారి తనని ఓరేయ్, రారా అని కాకుండా రే అన్నది. మెల్లగా మారుతున్నాడని నవ్వుకుంది.
రాయ్య రా అని దారిస్తారా.. వీడే తీసుకోవాలి. వాడిని రమ్మను.
ఇంకా అరగంట ఉంది కదా లాస్ట్ మూడు గంటలకి ?
చాల్లే రమ్మను. వాడి వల్ల కావట్లేదు. అలా లాక్ చేసినప్పుడు మిగతా మూడు కార్లని వీడు స్లో చెయ్యగలగాలి. అప్పుడు వెనక ఉన్న వాళ్లకి వీళ్ళకి డిస్టన్స్ తగ్గుతుంది. అది వాళ్ళు గమనించగానే వీడిని వదిలేసి వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడానికి చూస్తారు. ఆ గ్యాప్‌లొ విష్ణు ఓవర్‌టేక్ చెయ్యాలి. వాడు ఆల్రెడీ పానిక్ అయ్యాడు. స్వర్ణ మొత్తుకుంటుంది చూడు అంటే జోయా స్వర్ణకి డ్రైవర్ చేంజ్ సింబల్ చూపించింది.
కారు ఎక్కడమే ఆలస్యం. టైర్లు చేంజ్ అయిన క్షణం టైర్లు జుమ్మని పరిగెత్తాయి. కారుని మొదట ఉన్న ముగ్గురి మధ్యలోకి తీసుకెళ్లాడు గోపీ. స్వర్ణ కూడా ఊపిరి పీల్చుకుంది. మొదట విష్ణు నడిపినప్పుడు అంతా కంగారు కంగారు, తరువాత గోపీ వచ్చాక తను కూల్‌గా ఉండటమే కాక స్వర్ణని కూడా కూల్ చేశాడు. రాత్రి అంతా షరీఫ్‌తో కుస్తీ చేసింది. పొద్దున గోపీ పాటలు పాడి జోకులు చేసి ఓ పక్క పొజిషన్ మార్చుతూనే వాతావరణం సరదా చేశాడు. ఇందాక విష్ణుతో మళ్ళీ యుద్ధమే జరిగింది. ఆఖరికి విష్ణుకి ఎలా నడపాలో చెపుతుంటే నోరు మూసుకోమని అరిచాడు విష్ణు. గట్టిగా హర్ట్ అయ్యి అలిగింది స్వర్ణ. ఇప్పుడు మళ్ళీ గోపీ వచ్చి రాగానే వాళ్ళతో ఫైట్ మొదలు పెట్టేసాడు.. టాప్ త్రీలో ఉన్న ముగ్గురి మధ్యలోకి వెళ్లి చెప్పు స్వర్ణా.. ఏం చేద్దాం వీళ్ళని అన్నాడు సరదాగా
ఇలాంటి రేస్‌లో అందరూ ప్రొఫెషనల్స్ & అచీవర్స్ మాత్రమే ఎందుకు ఉంటారో బాగా అర్ధమైంది స్వర్ణకి. ఈ అనుభవం చాలా పాఠాలు నేర్పింది. ముఖ్యంగా గోపీ గురించి, తన ధైర్యం గురించి, తన స్కిల్ గురించి ఇంకా డీప్‌గా తెలుసుకుంది. ఎమోషనల్ బాలన్స్ గురించి గోపీ ఒక్క ముక్క కూడా ఎప్పుడూ మాట్లాడలేదు.. వాడి జీవితం దగ్గరగా చూస్తే చాలు. జీవితం అదే నేర్పిస్తుంది. కాకపోతే స్వర్ణ ఏం చూడకుండానే ఆ అనుభవం పొందింది గోపీ వల్ల.
స్వర్ణ ఉన్నావా ?
ఉన్నా..
గెలుద్దామా వద్దా
గెలుద్దాం.
మరి స్టాట్స్ చెప్పకుండా ఏం చేస్తున్నావ్.
సారీ.. మైండ్ ఫ్రెష్ చేసుకుంది స్వర్ణ. పక్కన ఇంజనీర్లతో కోఆర్డినేట్ చేస్తూ అన్నీ చెపుతుంటే గోపీ మాటలు వినిపించాయి. You wanna play.. Lets play then.. ముందున్న ఎడ్జ్ దగ్గరికి వస్తుంది. ఎవ్వరు స్పీడ్ తగ్గించడం లేదు. ఎవ్వరు తగ్గించరనుకున్నారు అంతా.. కానీ గోపీ ముందే స్లో చేసి టక్కున గడ్డి మీదగా తిప్పేసాడు. (pos02)
పక్కనే ఫెరారి. వెనక ఫోర్డ్. ఆ వెనకే GT ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవ్వరు తక్కువ కాదు, ముఖ్యంగా ఆ డ్రైవర్లు. ఫెరారితో పాటు గొపీ నడిపే కారు ఒకటంటే ఒకటి పోటీగా ముందుకు దూకుతున్నాయి. చూసే రాజారావుకి రెండు గుర్రాలు పొటీ పడుతున్నట్టు కనిపించింది. కారుని చూసి పిట్ వాళ్ళతో మాట్లాడుతున్న జోయా వంక చూసాడు. ఈ అమ్మాయా ఆ కారు తయారు చేసింది !!
కారులో కూర్చున్న గోపీ కూడా అదే కాంఫిడెన్స్‌తో ఉన్నాడు. 348కిమీ పైన వెళుతున్నా ఎక్కడా ప్రెజర్ లేదు. ట్రాన్సమిషన్‌లో ఇబ్బందులు లేవు. జోయా తయారు చేసిన DCT ఎంత బాగా పని చేస్తుందో దానికి ప్రాణంలా సృష్టించిన స్వర్ణ TCU అంతే ఇదిగా DCTకి స్పందిస్తుంది. ఇద్దరు గోల్డ్ ఎహె అనుకున్నాడు. దానికి తోడు స్వర్ణ డిజైన్ చేసిన కారు ఫ్లాప్స్ కారుని షేక్ చెయ్యకుండా స్టేబిలిటీకి హ్యాట్సాఫ్ కొట్టేశాడు. ముఖ్యంగా జోయా బిగించిన ఇంజన్. ఎవరిని ఎక్కువగా పొగడాలో అర్ధం కాలేదు. వీళ్ళ కష్టం అంతా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. మిగతా కార్లకి దీనికి తేడా ఎన్ని లాప్స్ కొట్టినా ఇంజన్ పవర్ తగ్గదు. అందరూ పది నుంచి పదిహేను లాప్స్ వరకు పిట్ స్టాప్‌కి వెళతారు కానీ గోపీ పడ్డెనిమిది రిస్క్ చేస్తే ఇరవై వరకు ఆగగలడు. ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్.
ఇప్పటికే 362 లాప్స్ అయ్యాయి. ఇంకా గంటన్నర ఉంది. మహా అయితే ఇంకో పదిహేను నుంచి ఇరవై లాప్స్ అంతే.. నాలుగు కార్లు కొట్టుమిట్టాడుతున్నాయి. అందరూ పిట్ స్టాప్‌కి వెళుతున్నారు. గోపీ కూడా వెళ్ళాడు. టైర్లు ఫ్యూయల్ అన్నీ చేంజ్ అయ్యాయి. గోపీ కారు ఎంత వేగంగా నడిపినా గోపీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్‌తో పాటు మేజర్ డిస్-అడ్వాంటేజ్ పిట్ కౄ.. మిగతా వారితో పోల్చితే వీళ్ళు చాలా లేటు.
ఇక ఒకటే పిట్‌స్టాప్ ఉంది. రోడ్డుని టైర్లని ఇంజన్‌ని అన్నిటినీ ఫీల్ అయ్యాడు. కళ్ళు మూసుకుని తెరిస్తే చనిపోయిన వాళ్ళు బుజ్జిది జనని రాజారావు స్వర్ణ అందరూ కనిపించారు. ఆఖరిగా జోయా కనిపించింది. పానర్ పట్టుకుని నవ్వుతూ నన్ను నమ్ము అంది లాలనగా..
కళ్ళు తెరిచాడు గోపీ. స్వర్ణ మాటలు వినిపించకుండా సపోర్ట్ బటన్ ఆఫ్ చేసేసాడు. ముందు ఏమైనా ఇబ్బందేమో అనుకుంది స్వర్ణ కానీ గోపీ ఆఫ్ చేసేసాడని అర్ధమయ్యి లేచి నిలబడి పక్కకి వచ్చింది. విష్ణు అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వర్ణ కంగారు చూసి జోయా రాజారావు కూడా ఏం జరిగింది అని వచ్చేసారు. పక్కన ఇంజనీర్లు కూడా అదే అయోమయంలో ఉన్నారు.
స్వర్ణ విష్ణు దగ్గరికి వచ్చేసింది.
ఏమైంది ? అని అడిగాడు విష్ణు.
గోపీ మైక్ ఆఫ్ చేసేసాడు. ఎందుకో తెలీదు. నాకేం అర్ధం కావట్లేదు. రాజారావు, జోయా ఎందుకు ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంటే విష్ణు భుజం మీద షరీఫ్ చెయ్యి పడింది. అందరూ షరీఫ్ వంక చూస్తే షరీఫ్ గోపీ కారుని వేలు పెట్టి చూపించాడు. మానిటర్‌లో ఉన్నట్టుండి గోపీ కారు భీభత్సమైన వేగం పుంజుకుంటుంది. తన పర్సనల్ మానిటర్ దగ్గరికి పరిగెత్తింది స్వర్ణ. కారు 362 దాటుతుంది.
ఏం చేస్తున్నాడు గోపీ అని అడిగింది జోయా కంగారుగా. అందరిలో సమాధానం తెలిసిన మొహం విష్ణుదే కనపడింది.
He is risking it.. గెలుస్తామన్న నమ్మకంతో నవ్వాడు గోపీ. అందరూ ఉత్ఖంటగా చూస్తున్నారు. లాస్ట్ నలభై నిమిషాలు. అందరూ పిట్‌స్టాప్ దగ్గర ఆగారు. జోయా కూడా సిద్ధంగా ఉంది.. కానీ గోపీ కారు రాలేదు. అందరి మొహంలో కంగారు. ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. నాకు మాత్రం తెలుసు అన్నట్టు మొహం పెట్టాడు విష్ణు. జోయా పక్కకి వచ్చేసింది.
గోపీ ఏమాలోచిస్తున్నాడో. మిగతా వాళ్ళ పిట్‌స్టాప్ టైముని ఎలా మిగల్చాలని చూస్తున్నాడో చెప్పాడు.
కారు తట్టుకుంటుందా.. కారు తట్టుకున్నా టైర్లు, ఫ్యూయల్ గురించి. బ్రేక్స్ ట్రాన్సమిషన్ లిక్విడ్. అన్నీ అడిగేసాడు రాజారావు. సమాధానం విష్ణు దగ్గర లేదు. గోపీ మీద నమ్మకం మాత్రమే ఉంది. విష్ణు కళ్ళార్పకుండా చూస్తుంటే చూడటం తప్ప చేసేదేమి లేదని అర్ధమైంది రాజారావుకి.
నట్టు శబ్దం లేకుండా ఎవ్వరు మాట్లాడకుండా చూస్తుండగానే ఆ ఆవరేజ్ ఐదు సెకండ్ల టైము గోపీకి కలిసి వచ్చింది. మొత్తానికి గోపీ pos01కి వచ్చేసాడు. తన వెనకే ఫెరారి. ఇక్కడ నుంచి ఎన్ని లాప్స్ ఉంటే అన్ని లాప్స్ పర్ఫెక్ట్ లాప్ చెయ్యాలి లేదంటే కష్టం. అదే చేస్తున్నాడు గోపీ. ఎక్కడా రవ్వంత తప్పు చెయ్యకుండా నడుపుతున్నాడు. తల మీద నరం గుండె వేగంతో కొట్టుకునే స్పర్శ తెలుస్తుంది. మొహం మీద చెమటలు లేవు, వేరే ఆలోచన లేదు. చేతిలో స్టీరింగ్. స్వర్ణ బాడీ. జోయా ఇంజన్. మిగతా డ్రైవర్లందరికి తెలుసు గోపీ పిట్‌స్టాప్ చెయ్యలేదని. అందుకే ధీమాగా ఉన్నారు. ఎక్కడో అక్కడ గోపీ కారు ఇంజన్ పికప్ తగ్గుతుంది. బ్రేక్ వేసిన తరువాత కారు వేగం అందుకోవడానికి సెకండ్ డిలే అయితే చాలు.. ఆ గ్యాప్‌లో ఓవర్ టేక్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ అది జరగలేదు. లాస్ట్ లాప్ వరకు ఇదే నడిచింది. ఆఖరిది కూడా గోపీ ఎవ్వరికి తావు ఇవ్వకుండా పోతున్నాడు. ఒకానొక సమయంలో కారు జెర్క్ ఇవ్వగానే చమటలు పట్టేసాయి గోపీకి. అరక్షణంలో నేనూ నీతోనేనంటూ కారు ఇంజన్ మాటిచ్చింది.. ఆలా అనిపించింది. రేసులో ఆఖరి మలుపు. వేగం 372. వెనక కార్లకి గోపీ కారుకి మెల్లగా దూరం పెరుగుతుంది. అదే స్పీడ్‌లో వెళుతుంటే కరెక్ట్‌గా ఫినిష్ లైన్ ముందు క్లచ్ కొట్టేసినట్టు త్స్‌స్ అన్న శబ్దం వచ్చింది.. కానీ రేస్ గెలిచేసాడు గోపీ.
గోపీ కారు జెండా దాటిన క్షణం వరకు అందరూ మౌనంగా ఉన్న స్టేడియం.. మొదటగా చూస్తున్న ఒక అమెరికా పిల్లాడి చేతిలో పాప్‌కార్న్ ఎగిరిపడింది. పైన క్రాకర్స్ పేలడం. అందరూ అరవడం. కామెంటరీ అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. రాజారావు సంతోషంగా బషీర్ దగ్గరికి పరిగెత్తాడు అప్పటికే బషీర్ కళ్ళలో నీళ్లు.. ఇద్దరు కౌగిలించుకుని ఆకాశం వైపు చూసారు. తమ స్నేహితుడు రెహ్మాన్‌ని తలుచుకున్నారు.
అందరూ ఒక దగ్గర చేరుతూ అమృత కూడా వచ్చేసింది కానీ స్వర్ణ పిచ్చి సంతోషంతో విష్ణు నడుము ఎక్కి డాన్స్ వేస్తూ విష్ణుకి ముద్దులు పెడుతుంటే విష్ణు స్వర్ణని ఎత్తుకునే డాన్స్ వేస్తున్నాడు. అది చూసి అక్కడే ఆగిపోయింది అమృత. అందరూ ఎంజాయిమెంట్ మూడ్లో ఉంటే జోయా గోపీ కోసం వెళుతు ట్రాక్ ఎక్కింది. వేగంగా వెళుతుంటే అప్పుడే కారు దిగాడు గోపీ.. హెల్మెట్ తీశాడు. జోయా నడక వేగం తగ్గించింది. తన గెలుపుకి గోపీ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటాడో చూడాలనుకుంది జోయా.. గట్టిగా అరుస్తాడో గాల్లో ఎగిరి పంచ్ ఇస్తాడో అనుకుంది. కానీ అవేమి చెయ్యలేదు గోపీ. హెల్మెట్ కారు మీద పెట్టి కారు ముందుకు వెళ్ళాడు. ఇంజన్ తెల్లని పొగలు కక్కడం కనిపిస్తుంది. గోపీ వేసుకున్న యూనిఫామ్ ఎర్రగా మారింది నడుము దగ్గర. మళ్ళీ బ్లీడింగ్ అయ్యింది. ముందు కారుకి వంగి దణ్ణం పెట్టుకున్నాడు గోపీ.. నవ్వుకుంది జోయా.. గోపీ దగ్గరికి పరిగెత్తి వాడిని అందుకుంది. గట్టిగా కౌగిలించుకున్నాడు. థాంక్స్ జోయా అన్నాడు చెవిలో.. గోపీని ప్రేమగా చూస్తూ లిప్‌లాక్ చేసేసింది.
అప్పటికే అందరూ తమ దగ్గరికి వస్తుంటే విడిపడ్డారు. విష్ణుని, షరీఫ్‌ని కౌగిలించుకున్నాడు. ఆ వెనకే వచ్చిన స్వర్ణని అందరినీ.. అందరూ కౌగిలించుకుంటుంటే గోపీ పడుతున్న ఇబ్బందిని గమనించి గోపీని అందరి నుంచి వేరు చేసి పిట్ వరకు నడిపించింది. అందరూ గోపీ తెల్లని యూనిఫామ్ మీద ఎర్రగా మచ్చ పడటం అప్పుడు చూసారు.

★★

Ferrari | Ford | Rao

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)