3 hours ago
వాడిని కొద్ది సేపు గమనించా క తెలిసింది ఏమిటి అంటే , వీళ్ళు అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళను కన్వర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ మేధ్య బాగా పాపులర్ అయిన పదం “లవ్ జిహాద్” అని.
వీళ్ళను ట్రాప్ చేసిన తరువాత వాళ్ళు ఏం చేస్తారు అనే విషయం క్లారిటీ లేదు , ఆ గడ్డం గాణ్ని పట్టుకుంటే తెలుస్తుంది అనుకొంటూ ఉండగా, కాలేజీ లో మేము చూసిన వాడు లేచి వెళ్ళాడు ఆ పెద్దాయన దగ్గరకు.
పెట్టినవి మైక్రో కేమరాలు అయినా వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగా వినబడుతూ ఉంది.
“నేను కాలేజీ కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అధికారి లతో పాటు సివిల్ డ్రస్ లో ఎవరో ఆ వ్యక్తి వచ్చాడు , వాడికి గట్టిగా సమాధానం చెప్పి వచ్చాను” అన్నాడు.
“ఇంతకు నువ్వు మొదట పాకెట్ ఇచ్చిన వాళ్ళని కలుపావా?”
“ఇంకా లేదు ఈరోజు మీటింగ్ అవ్వగానే వెళతాను కలవడానికి.”
“జాగ్రత్త ఎటువంటి పరిస్థితి లోనూ మన విషయం బయటకు రాకూడదు”
“మీరు ట్రైనింగ్ ఇచ్చారు గా, ఆ రూల్స్ ఫాలో అవుతాము, మీకు ఈ ఇబ్బందీ రానీయము.” అంటూ తనకు రావాల్సిన డబ్బులు తీసుకొని వెళ్ళి సీట్ లో కూచున్నాడు.
మేము చూస్తూ ఉండగా మొత్తం 25 మంది వచ్చి వాడికి ప్రోగ్రెస్ ఇచ్చి , వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ ల లో సర్దుకొని రెడీ అవుతున్నారు వెళ్ళడానికి.
వాళ్ళు అక్కడ ఉండగా వస్తే బాగుండు అనుకొంటూ ఉండగా పెద్ద వ్యాన్ వచ్చింది, అందులోంచి కొంమెండోస్ దిగారు , నేను వ్యాన్ లోంచి కిందకు దిగగానే అక్కడ ఆఫీసు లాంటి వ్యక్తి వచ్చి, “శివా అంటే ఎవరు” అన్నాడు నాతో పాటు వచ్చిన ఆఫీసర్ ని చూసి.
నేను చేయి ముందుకు చాపి, “నేనే శివా సర్, వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు , ఇది రైట్ టైమ్ దాడి చేయడానికి అంటూ” వాళ్ళు ఉన్న హాల్ చూపించాను.
“మీరు ఇక్కడే ఉండండి , మేము వెళతా ము మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా” అన్నాడు
అక్కడ ఉన్న ఫీడ్ మొత్తం చూపించాను , “కొద్దిగా చూసిన తరువాత, ఇది చాలు నాకు ఒక కాపీ ఇవ్వండి, మిగతా ది నేను చూసుకుంటా” అంటూ ట్రూప్ కి ఆర్డర్ చేశాడు.
మేము అక్కడే కేమరాలో చూస్తూ ఉండగా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కించారు, వాళ్ళ గురువుతో సహా.
అక్కడ ఉన్న వాళ్ళు కలెక్ట్ అయ్యి గ్రూప్ అవుతూ ఉండగా, వ్యాన్ అక్కడ నుంచి వెళ్ళింది , వెళుతూ నా దగ్గర ఓ పెన్ డ్రైవ్ లో ఆ రికార్డింగ్స్ తీసుకొని వెళ్ళాడు.
“సర్ మన పని ఏం లేదా ఇక్కడ ?” అన్నాడు నాతో వచ్చిన ఆఫీసర్
“ఇంకా మనకు ఏం పని , మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు”
“ఇంతకీ వాళ్ళు ఎవరు సర్” అన్నాడు వాళ్ళను చూడగానే commandos అని తెలుస్తుంది కానీ ఈ సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చా రో తెలుసుకోవాలని ఉన్నట్లు ఉంది.
“NIA , అనుకుంటా” అన్నాను
“వాళ్ళు అయితే కరెక్ట్ సర్” మనం స్టేషన్ కి వెళదాం అంటూ ఆ వ్యాన్ ని స్టేషన్ వైపు తిప్పారు.
మేము స్టేషన్ కి వెళ్ళగానే, అక్కడ ఉన్న తన పై ఆఫీసర్ కి విషయం తెలిసినట్లు ఉంది, ఆఫీసర్ ని తనతో అక్కడ ఉన్న కేమరా ఫిక్స్ చేసిన ఇద్దరికీ క్లాస్ పీకుతున్నాడు. మనం వాళ్ళ డిపార్ట్‌మెంట్ కాదు కాబట్టి బయటే ఉండి పోయాను.
ఓ 20 నిమిషాల తరువాత వచ్చిన ముఖాలతో బయటకు వచ్చారు, వాళ్ళు రావడం చూసి నేను అక్కడ ఉండడం బాగోదు అని , బయటకు వెళ్ళి దానికి ఎదురుగా ఉన్న హోటల్ లో టీ తాగుతూ ఉండగా ఆఫీసర్ అక్కడికి వచ్చాడు.
“సర్, రెవెట్టేశాడు , నేను చెప్పాను నాది ఏం లేదు సర్, తనకి సెంట్రల్ నుంచి orders వచ్చాయి అని చెప్పాను , అప్పుడు కొద్దిగా శాంత బడ్డాడు.”
“అక్కడ మనకు టైమ్ లేదుగా , నువ్వే చెప్పావుగా అక్కడికి రావాలి అంటే లోకల్ వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి , లోకల్ ప్రజాప్రతినిధులతో, అందుకే సెంట్రల్ కు చెప్పాల్సి వచ్చింది, లేదంటే వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళు”
“మనం తీసుకొన్న డెసిషన్ కరెక్ట్ సర్ , ఇదేం ఉంది లెండి, ఓ రోజే కదా, ఎలాగూ ఇలాంటి కేసు లు ఆ తరువాత వాళ్ళకే ట్రాన్సఫర్ చేస్తారు, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్ళింది మంచిది అయ్యింది”
“అక్కడ హాస్పిటల్ లో ఉన్నా ఇంకో బాస్ వచ్చారా?”
“లేదు సర్ , తను అక్కడ నుంచి , ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఏమైనా ప్రోగ్రెస్ ఉంది అంటారా వాళ్ళ ద్వారా?”
“వాళ్ళ బాస్ లు జంప్ అయ్యరుగా, ఇంక వాళ్ళ బాస్ లను పట్టుకుంటే గాని ఆ కేసు ఓ కొలిక్కి రాదు”
అప్పటికే టైమ్ 4 అవుతూ ఉంది, “సరే రేపు ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే చెప్పు , నేను ఇంటికి వెళతా” అని ఆ ఆఫీసర్ దగ్గర సెలవు తీసుకొని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)