Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#67
ఏజెంట్ రూహి వాసుదేవ్...32



రూహి కష్టపడి ఎలాగోలా సర్వర్ రూమ్ కి చేరుకుంది. అక్కడికి రాగానే తన పని మొదలుపెట్టింది. తన చేతి వేళ్ళు గాలి కంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఇంకొన్ని నిమిషాల్లో ఇండియా మీద జరగబోయే దాడి గురించి ఊహిస్తుంటే తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. నుదుటి మీద నుంచి చమట జారుతుంది.

తన మదిలో రేగిన అలజడి తన పనిని మరింత త్వరగా పూర్తి చేయమని పోరు పెట్టింది. తను అదే పనిలో ఉంది.
ఇంతలో తన తల మీద ఓ తుపాకీ గురి పెట్టారు. రూహి వెంటనే చేస్తున్న పని ఆపి టక్కున తల తిప్పి వెనక్కి చూసింది.

తనకు ఎదురుగా... జాంగ్ లీ...
ఈ ఆపరేషన్ FISH కి నాయకుడు తనే..
చైనా మొత్తం అతనిని ముద్దుగా రాక్షసుడు అని పిలుచుకుంటారు. పచ్చి నెత్తురు తాగే క్రూరుడు తను.
మనుషుల ప్రాణాలంటే ఏ మాత్రం లెక్క చేయడు. అందుకే చైనా ఈ ఆపరేషన్ తనకు అప్పజెప్పింది. తనని ఎదురుగా చూసి రూహి కాసేపు షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది.

తనని అలా చూసి జాంగ్ లీ ఒక్కసారి పెద్దగా నవ్వాడు.
"ఆ దేవుడు సృష్టించిన మనిషికి రెండే కళ్ళు. కాని ఆ దేవుడినే శాసించే నాలాంటి రాక్షసుడికి ఒళ్ళంతా కళ్ళే.. నన్ను దాటి ఈ ఆపరేషన్ ఆపుదాం అనుకున్నావా ఏజెంట్..." అని అన్నాడు.

"నీ జీవితం లో ఎంతమంది ఏజెంట్లను చూసావో నాకు తెలీదు. కాని నేను మాత్రం నీలాంటి రాక్షసులని చాలా మందిని చూసాను. అందరిని ఆ దేవుడి దగ్గరకే పంపించాను. కావాలంటే ఈ ఏజెంట్ రూహి దెబ్బ ఎలా ఉంటుందో అని చచ్చాక పైకి వెళ్లి నీ స్నేహితులను అడుగు. వాళ్లే చెప్తారు "

"నా తుపాకీ చివర నీ తల ఉన్నా సరే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావ్ అంటే నీ ధైర్య సాహసాలు గురించి నేను విన్నది నిజమే అనమాట..."

"నువ్వేం విన్నా సరే అది సగమే విని ఉంటావ్. ఎందుకంటే నా ధైర్యం పూర్తిగా చూసిన ఒక్కడు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేడు."

"నీ పొగరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కాని నాలోని దేశ భక్తి నిన్ను చంపమని అంటుంది. "

"నీలాంటి దుర్మార్గులు దేశ భక్తి గురించి మాట్లాడితే ఆ దేశం కూడా సిగ్గు పడుతుంది జిన్ పింగ్..
నీకు నిజంగా దేశం మీద భక్తి, ప్రేమ, గౌరవం ఉంటే...
మీ దేశం ఎదగడం కోసం ఇంకా ఎలా అభివృద్ధి చేయచ్చా అని ఆలోచించి కృషి చేయాలి. అంతేకాని పక్క దేశాన్ని నాశనం చేయాలని కాదు." రూహి దీటుగా బదులిచ్చింది.

"నా తెలివైన ఎత్తులు ముందు మీ ఇండియా నిలువలేదు రూహి.."

"మహాభారతం లో కర్ణుడు ఓ గొప్ప సైనికుడు. కాని స్నేహం కోసం అధర్మం వైపు నిలబడి ఓడిపోయాడు.
నువ్వు ఎంత పెద్ద యోధుడైనా సరే నీ వెనుక న్యాయం లేకపోతే చివరకు ఓటమి తప్పదు."

"నీ పురాణాలు అన్ని నీ దేశం లో పాఠాలు గా చెప్పుకో రూహి.. మరి కాసేపట్లో మీ దేశం మొత్తం ఉలిక్కిపడుతుంది. ఐదు నగరాలు నామ రూపాలు లేకుండా కూలిపోతాయి. రక్తపు వర్షం కురుస్తుంది. " అని క్రూరంగా నవ్వాడు.

"నేను ప్రాణాలతో ఉండగా అది జరగనివ్వను."

"అందుకే ముందు నీ ప్రాణం తీస్తాను " అంటూ జిన్ పింగ్ చూపుడు వేలు ట్రిగ్గర్ మీద పెట్టాడు. రూహి అప్పటిదాకా పడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది, ఈ దేశాన్ని నువ్వే కాపాడు నాన్న అంటూ విక్రమ్ ను తలుచుకొని కళ్ళు మూసుకుంది.

-------------------------------------------------------------

సరిగ్గా అదే సమయం లో...

జలంధర్ మనుషులకు సుజిత చిక్కింది. వారు తనని కుర్చీలో కట్టేసారు. సుజిత వారి నుంచి తప్పించుకోవాలని చూసింది కాని తన వల్ల కాలేదు. జలంధర్ మెల్లగా తన వైపు కదిలాడు. తన కట్లు విప్పేసాడు.

"నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది సుజిత. అరేయ్... ఇప్పుడు దీని ఒంటి మీద ఒక్కో వస్త్రం తీసేస్తాను. చూసి పండగ చేసుకోండి రా..." అని జలంధర్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు.

ఆ మాటకు సుజిత కోపంగా వాడి చెంప మీద కొట్టాలని చూసింది. కాని జలంధర్ తన చేతిని బలంగా పట్టుకున్నాడు.

"నీ పొగరు నాలో సెగలు రగిలిస్తుందే... ఈరోజు నీకు నరకం చూపించి మరీ చంపుతాను." అంటూ సుజిత చీర కొంగును తన చేతిలోకి తీసుకున్నాడు.

సుజిత తేరుకునేలోగా ఆ చీరను గట్టిగా లాగేసాడు. సుజిత ఏడుస్తూ తన ఒంటిని చేతులతో కప్పుకుంది.

అది చూసి జలంధర్ తో పాటు అక్కడున్న వాడి మనుషులు కూడా పగలబడి నవ్వారు.

"నా మనుషులనే తరిమి కొడతావా.. నీ సంగతి చెప్తాను...
ఒరేయ్ దీని అందాన్ని వీడియో లో రికార్డు చేయండి. దేశం మొత్తం సెల్యూట్ చేసిన ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ భార్య అందాలు చూసి ఈ దేశం మొత్తం మైమరచి పోవాలి." అని జలంధర్ గట్టిగా ఆదేశించాడు.

ఆ మాటలకు వాడి మనుషులు ఫోన్లు బయటకు తీసి అక్కడ జరిగేది రికార్డు చేస్తున్నారు. సుజిత వెంటనే ఒక మూలకు జరిగి కింద కూర్చొని తన ఒళ్ళు కనపడకుండా చేతులతో కప్పుకుంది.

అది చూసి జలంధర్ లోని రాక్షసుడు మరింతగా నవ్వాడు. తన మిగిలిన బట్టలు కూడా లాగేయడానికి మెల్లగా తన వైపు అడుగులు వేసాడు. సుజిత తన కన్నీళ్లను ఆపుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంది.

------------------------------------------------------------

నిస్సహాయంగా రూహి కళ్ళు మూసుకుంది. జిన్ పింగ్ తనని కాల్చడానికి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.

"నీ చివరి కోరిక ఏమైనా ఉందా.." అని అడిగాడు.

రూహి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ...
"నీకు ఏ మాత్రం బ్రతకాలి అన్న ఆశ ఉన్నా సరే. వెంటనే నన్ను వదిలేసి పారిపో... లేకపోతే నా దేశం మీద నువ్వు చేయాలి అనుకుంటున్న దాడి కి ప్రతి ఫలంగా నీ తల నరికేస్తాను."

రూహి కళ్ళలో కొంచెం కూడా భయం కనిపించలేదు. అది చూసి జిన్ పింగ్ కోపంగా ట్రిగ్గర్ నొక్కబోయాడు.

ఇంకొక్క క్షణంలో రూహి తలలో బుల్లెట్ దిగుతుంది. తన ముందు దారులు అన్ని మూసుకుపోయాయి. ఏం చేయడానికి లేదు. నిరాశ లో ఉండిపోయింది.

సరిగ్గా అప్పుడే...
"May I come In..." అనే గొంతు వినిపించింది.

జిన్ పింగ్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. రూహి కూడా తలుపు వైపు చూసాడు.

ఎదురుగా ఒక యువకుడు.. తుపాకీ చేత పట్టుకొని నిలబడ్డాడు. అప్పటిదాకా శత్రువుల గుండెల్లో తూటాల వర్షం కురిపించిన దానికి గుర్తుగా అతని చొక్కా రక్తం తో తడిచి ఉంది. అతని పెదాల మీద చిరునవ్వు మాత్రం తొలిగిపోలేదు. కళ్ళలో ధైర్యం, నడకలో తెగింపు కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఆ యువకుడు మరెవరో కాదు... అయాన్...

తనని చూడగానే రూహి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయింది. జిన్ పింగ్ కి తన ఎదురుగా ఎవరు ఉన్నారో అర్థమవగానే తుపాకీ తో అయాన్ ని కాల్చాలని చూసాడు. కాని రూహి తనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. దెబ్బకు జిన్ పింగ్ చేతిలోని తుపాకీ కింద పడిపోయింది. రూహి ఆలస్యం చేయకుండా దాన్ని తన చేతిలోకి తీసుకుంది.

"ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడు గెలవడు. గెలవాలంటే సత్తా ఉండాలి. ఆ సత్తా పట్టుకునే ఆయుధం లో కాదు. ఆ ఆయుధం పట్టిన గుండెలో ఉండాలి." అంటూ రూహి జిన్ పింగ్ రెండు కాళ్లలోకి కాల్చింది.

జిన్ పింగ్ నొప్పికి విల విల లాడుతూ పెద్దగా అరిచాడు.
ఇంతలో రూహి అయాన్ ముందుకు చేరింది.

"అయాన్..." అని ప్రేమగా పిలిచింది.

ఆ పిలుపు వినగానే అయాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. రూహి ని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. కొన్ని క్షణాలు వారు అలాగే ఉండిపోయారు. రూహికి చాలా ఆనందంగా ఉంది. ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎంత బాధ ఉంటుందో, అదే తిరిగి వస్తే కలిగే ఆనందం అంతకు రెట్టింపు ఉంటుంది అని మొదటిసారి అర్థమైంది.

కాసేపటికి తేరుకొని...
"నువ్వెలా ఇక్కడికి వచ్చావ్ అయాన్.." అని అడిగింది

"ఆ అడవిలో ఉన్న నదిలోకి పడిపోయిన తరువాత స్పృహ కోల్పోయాను. ఆ నది చైనా గుండా ప్రవహిస్తుంది. అదృష్టం కొద్ది నన్ను ఒక వ్యక్తి చూసి కాపాడి వైద్యం చేశాడు. ఆ తరువాత మన RAW ఏజెంట్ల ద్వారా మీరు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్నాను. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే నేను కూడా వచ్చేసాను." అంటూ అయాన్ జరిగింది మొత్తం చెప్పాడు.

తన మాట పూర్తి అవకుండానే...
"I Love You అయాన్..." అని రూహి అంది.

ఆ మాట వినగానే అయాన్ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. తను ఏం విన్నాడో అర్థమవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అర్థమయ్యాక సంతోషం తో పెద్దగా అరుస్తు తనని గాల్లో తిప్పాడు. ప్రపంచం మర్చిపోయి ఆ ప్రేమికులు కొన్ని క్షణాలు ప్రేమలో మునిగిపోయారు.

సరిగ్గా అప్పుడే...
ఆ రూమ్ మధ్యలో ఉన్న గడియారం పెద్ద శబ్దం చేస్తూ మోగింది. దాని మీద 15:00 అని కౌంట్ డౌన్ మొదలయింది.

అంటే బాంబు పేలడానికి ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది అని అర్థమైంది. రూహి ఈ లోకం లోకి వచ్చింది. పరిగెత్తుకుంటూ సిస్టమ్ ముందు కూర్చుంది.
ఆ బాంబు దాడి ఆపడానికి ప్రయత్నిస్తుంది.

అప్పుడే జిన్ పింగ్ ...
"రూహి.. ఒక్కసారి ఇది చూడు..." అంటూ తన జేబులో ఉన్న రిమోట్ నొక్కాడు.

రూహి ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద సుజిత కనిపించింది. తన చుట్టు చాలా మంది రౌడీలు నిలబడి ఉన్నారు. సుజిత ఏడుస్తూ వారికి దూరంగా భయపడుతూ మూలన కూర్చుంది. తన ఒంటి మీద చీర లేదు.

వాళ్ళ అమ్మను అలా చూడగానే రూహి రక్తం మరిగిపోయింది. రేయ్... అని గట్టిగా అరిచింది.

"నువ్వు ఇప్పుడు ఆ బాంబు ఆపాలని చూస్తే మీ అమ్మ అందాలు ఈ ప్రపంచం ముందు పెడతాను. మీ అమ్మ కావాలా? లేక దేశం కావాలో తేల్చుకో రూహి..." అని అన్నాడు.

రూహి కళ్లలో నీళ్లు తిరిగాయి. గుండెల్లో రక్తం చిమ్ముతుంది. ప్రాణం పోతున్నట్టు అనిపించింది.
ఒక వైపు కన్న తల్లి... మరో వైపు కన్న దేశం...
ఎవరిని కాపాడాలో అర్థం కాలేదు.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:31 AM



Users browsing this thread: 1 Guest(s)