23-05-2026, 05:29 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...31
రూహి ప్రాణాలకు తెగించి జిన్ పింగ్ గదిలోకి చేరింది. అక్కడ వాడి ద్వారా అసలు ఆపరేషన్ FISH (Five Cities to Sack Hindustan ) అంటే ఏంటో అర్ధమైంది.
చైనా మన దేశం లోని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై మరియు కొలకత్తా మీద బాంబు దాడి చేయాలని ప్లాన్ చేసారని తెలిసి షాక్ అయ్యింది. అదే జరిగితే మన దేశం పూర్తిగా పతనం వైపు అడుగులు వేస్తుంది. ఇక ఎప్పటికీ శత్రువుల గుప్పిట్లో ఉండిపోవాల్సి వస్తుంది.
ఎలాగైనా సరే ఆ వినాశనం ఆపాలి అని దృడంగా నిర్ణయించుకుంది. కాని ఇంతలో తనని చైనా సైనికులు చుట్టు ముట్టారు. అదే సమయంలో తనకెదురుగా ఉన్న కెమెరా స్క్రీన్ మీద వంశీ, పార్వతి శత్రువులకు చిక్కినట్టు కనిపించింది. రూహి కి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఓ వైపు చుట్టు ముట్టిన శత్రువులు...
మరో వైపు ప్రమాదంలో తన బృందం...
అన్నిటికీ మించి మరి కొద్ది సేపట్లో చైనా ఇండియా మీద బాంబు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది.
ఆ క్షణం రూహి ఓ పెద్ద పద్మవ్యూహం లో చిక్కుకుంది. ఎలా బయటపడాలో అర్థం కాలేదు.
ఇంతలో తనని చుట్టు ముట్టిన సైనికులలో నుంచి ఒకడు ముందుకు వచ్చి రూహి తలకు తుపాకీ గురి పెట్టాడు.
రూహి వాడి వంక కోపంగా చూసింది. వాడు నవ్వుతూ
"గుడ్ బాయ్ రూహి.." అని అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.
సరిగ్గా అప్పుడే ఓ తూటా వేగంగా వచ్చి వాడి తలలో నుంచి దూసుకొని వెళ్ళింది. ఆ చోటు మొత్తం రక్తం తో తడిచింది. అందరూ షాక్ అయ్యి తల తిప్పి చూసారు.
ఎదురుగా అమిర్... చైనా సైనికులు అందరూ తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. రూహి అదే అదునుగా పక్కనే ఉన్న తుపాకీ తన చేతిలోకి తీసుకుంది. రెప్ప పాటులో తన సత్తా ఏంటో చూపించింది. పక్కనే ఉన్న సోఫా వెనక్కి దూకి శత్రువుల మీదకు తుపాకీ ఎక్కు పెట్టింది.
ఒకవైపు రూహి, మరో వైపు అమిర్... చైనీయులకు ఏం జరుగుతుందో అర్థమవడానికి సమయం పట్టింది. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇద్దరూ అడవిలో ఆకలిగొన్న సింహాలు వేటాడినట్టు విరుచుకుపడ్డారు. ఒకరి తరువాత ఒకరు పిట్టాల్లా రాలిపోయారు. కళ్ళు ముసి తెరిచే లోగా చైనా సైనికులు అందరూ మట్టి కరిచారు.
అమిర్ వేగంగా రూహి దగ్గరకు వచ్చాడు.
"నీకేం కాలేదు కదా..." అని కంగారుగా అడిగాడు.
అలా అడుగుతున్నప్పుడు అమిర్ కళ్ళలో కన్నీళ్లు తిరగడం రూహి చూపు దాటి పోలేదు. ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని ఆపుకుంటూ...
"నాకేం కాలేదు. మరి నీకు?" అని అడిగింది.
"నేను కూడా బాగానే ఉన్నాను మేడమ్." అని అమిర్ సమాధానం ఇచ్చాడు.
"అమిర్... ఆపరేషన్ FISH అంటే ఏంటో మొత్తం తెలిసింది. మరి కొద్దిసేపట్లో మన ఇండియా మీద బాంబు దాడి చేయబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మన దేశం లోని ఐదు నగరాలను రక్తం తో తడపనున్నారు. "
"అది మనకు తెలిసిందే కదా మేడం. కాని ఆపడం ఎలా?"
"ఇందాక ఈ జిన్ పింగ్ లాప్టాప్ లో ఒక విషయం చూసాను. చైనా ఈ ఐదు బాంబులను ఒకేసారి పేల్చడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించారు. దాన్ని ఈ ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న సర్వర్ గదిలో ఉంచారు. ఎలాగైనా సరే అక్కడికి చేరుకొని ఈ విధ్వంసం ఆపాలి."
"పదండి మేడమ్. ఇప్పుడే అక్కడికి వెళ్దాం." అని అమిర్ ఒక అడుగు ముందుకు వేసాడు.
రూహి తనని ఆపింది.
"ఆ పనికి నేను వెళ్తాను. నువ్వు వెళ్లి మన వంశీ, పార్వతి సంగతి చూడు "
"సర్వర్ గది చుట్టు సెక్యూరిటీ ఉంటుంది. అంతమంది ని దాటి మీరు ఒక్కరే వెళ్లడం కష్టం కదా "
"పర్లేదు అమీర్.. మనల్ని నమ్మి మనతో వచ్చిన తోటి సైనికుడి ప్రాణం కాపాడటం కూడా మన బాధ్యతే...
నువ్వు వెళ్లి ఆ సంగతి చూడు. బాంబు సంగతి నేను చూసుకుంటాను." రూహి స్పష్టంగా చెప్పింది.
"మేడం..." అమిర్ తన కళ్ళలోకి చూస్తూ పిలిచాడు.
రూహి ఏంటి అన్నట్టు తన వంక చూసింది.
"జాగ్రత్త మేడం. ఈ ఆపరేషన్ లో మనం గెలిస్తే మీకొక విషయం చెప్తాను. చాలా రోజులుగా చెప్పాలని అనుకుంటున్నాను. దేశం కోసం మీరు ఉన్నట్టు, మీకోసం నేను ఉన్నానని మర్చిపోకండి." అని అక్కడి నుంచి వేగంగా కదిలి వెళ్ళిపోయాడు.
రూహి తను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. తన కళ్ళు కాసేపు అలాగే షాక్ లో ఉండిపోయాయి. తన మనసుకు అయాన్ గుర్తొచ్చాడు. తన జీవితం ఎటు పోతుందో ఏమి అర్థం కాలేదు. ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని ముందు జరగాల్సింది చేద్దామని అనుకుంది.
ఒక్కసారి జిన్ పింగ్ గది ని తీక్షణంగా గమనించింది. అప్పుడే ఆ గదిలో గోడ మీద ఒక మ్యాప్ కనిపించింది. అది ఆ ఫ్యాక్టరీ బ్లూ ప్రింట్. ఆ ఫ్యాక్టరీ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం స్పష్టంగా అందులో గీసి ఉంది. అమిర్ చెప్పినట్టుగా ఆ సెక్యూరిటీ గది కి చేరుకోవడం చాలా కష్టం. ఆ గది ముందు లేకపోయినా దానికి చేరే దారిలో తప్పకుండా కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది. కాబట్టి అందులోకి వెళ్లడానికి మరో దారి కావాలి. ఎంత ప్రయత్నించినా అదేంటో తెలియడం లేదు. అప్పుడే తన తండ్రి విక్రమ్ చెప్పిన ఓ మాట గుర్తొచ్చింది.
"నిరాశ రేపిన నీడలో ఆగిపోకు మిత్రమా...
కమ్ముకున్న చీకటి లో కూలిపోకు నేస్తమా...
నీ తోడుగా నేనున్నా...
నీ జతగా నేనున్నా...
నీ వెంట నేనున్నా...
నీ ఆలోచన ప్రసరించే వెలుగు కిరణాలు ముందు ఆ చీకట్లు ఎక్కువ సేపు నిలువవులే...
లే.. లేచి నడు...
నీ అడుగుల సవ్వడి శత్రువుల గుండెల్లో సునామి రేపాలి..
నీ భీకర గర్జన వారి వెన్నులో వణుకు పుట్టించాలి.
కదిలిరా నేస్తమా... బరిలోకి దిగు"
ఆ మాటలు గుర్తురాగానే రూహి బుర్ర పాద రసం మాదిరి పదునుగా మారింది. మరోసారి ఆ మ్యాప్ చూడటం మొదలుపెట్టింది. అప్పుడే తన చూపు పక్కనే ఉన్న నీళ్ల బాటిల్ మీద పడింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన వచ్చింది. అదే వాటర్ పైప్...
ఆ ఫ్యాక్టరీ లో ఉన్న ప్రతి గదికి నీళ్లు సప్లై కోసమని పెద్ద పెద్ద పైప్ లు అమర్చినట్టు తను ఇందాకే చూసింది. ఆ మ్యాప్ ప్రకారం... అందులో ఒక పైప్ లోకి దూకితే అది నేరుగా ఆ సర్వర్ రూమ్ లోపలకు చేరుస్తుంది అని అర్థమైంది.
అనుకున్నదే తడువుగా ఆ జిన్ పింగ్ గది బయటకు వచ్చింది. మ్యాప్ లో ఉన్నట్టే అక్కడ మ్యాన్ హోల్ కనిపించింది. ఒక్కసారి శ్వాస తీసుకొని అందులోకి దూకింది. తన భుజాల దాకా నీళ్లు ఉన్నాయి. నడవడం కష్టంగా ఉంది. మొత్తం చీకటిగా ఉంది. వెంట తెచ్చిన టార్చ్ లైట్ ఆన్ చేసింది.
ఆ వెలుతురు లో ఒక్కో అడుగు ముందుకు వేసింది. గాలి ఆడటం చాలా కష్టంగా అనిపించింది. అందుకే అక్కడక్కడా ఆ పైప్ కి వెంట తెచ్చిన కత్తి తో రంద్రాలు చేస్తూ వెళ్తుంది. ఎలాంటి వ్యక్తికైనా సరే అందులో నడవడం ఓ పెద్ద సాహసమనే చెప్పాలి. అదొక చీకటి గుహ లాంటిది. పైగా ఇరుకుగా ఉంటుంది. అయినా సరే దేశాన్ని కాపాడాలి అనే రూహి ఆశయం ముందు అవేవి అడ్డుగా కనిపించలేదు.
దారిలో ఒక చోట పదునుగా ఉన్న ఒక ఇనుప కమ్మి తగిలి రూహి పాదాల నుండి రక్తం కారింది. చాలా నొప్పిగా అనిపించింది. ప్రాణం పోతున్నంత బాధ కలిగింది. కాని పంటి బిగువున ఆ బాధ భరించింది.
అలా కొన్ని నిమిషాలు నడిచిన తరువాత తను అనుకున్న చోటుకు వచ్చాను అని అర్థమైంది. వెంటనే అక్కడున్న మ్యాన్ హోల్ కొంచెం పైకి లేపి తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. తను అనుకున్నట్టుగానే తన ముందు పెద్ద అక్షరాల తో సర్వర్ రూమ్ అని ఉంది. వెంటనే పైకి వచ్చింది. ఎదురుగా ఉన్న కిటికీ పగలకొట్టింది.
తమ స్థావరం మధ్యలో ఉన్న ఆ గది కి ఎవరు వస్తారులే అనే అతి ధైర్యం కాబోలు... ఆ గది దగ్గర కాపలా ఎవరూ లేరు. అదే రూహి కి కలిసి వచ్చింది. చాలా సులభంగానే ఆ గదిలోకి అడుగు పెట్టింది. అక్కడ చాలా సర్వర్స్ ఉన్నాయి.
RAW ఏజెంట్ గా పని మొదలుపెట్టిన అందరికీ మొదటి రోజే సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్, మెషిన్ లెర్నింగ్, హ్యాకింగ్ లాంటివి క్షుణ్ణంగా నేర్పిస్తారు. అవి ఎందుకో ఇప్పుడు తనకు అర్థమైంది.
రూహి చేతి వేళ్ళు వేగంగా సిస్టమ్ మీద పని చేస్తున్నాయి. సరిగ్గా ఇంకొక ఐదు నిమిషాల్లో చైనా ఇండియా మీద బాంబు దాడి చేయబోతుంది. రూహి మదిలో రేగుతున్న అలజడి కి తన నుదుటి మీద చేరిన స్వేద బిందువులు అద్దం పడుతున్నాయి. తన దేశం లో జరగబోయే దాడి తలుచుకుంటుంటేనే తన ఒంట్లో వణుకు కలుగుతుంది. ఊపిరి భారంగా మారింది. గుండెల్లో దడ పెరిగింది.
సరిగ్గా అప్పుడే...
రూహి తల మీద తుపాకీ ఎక్కు పెట్టారు. రూహి షాక్ అయ్యి వెనక్కి తిరిగింది.
ఎదురుగా ఆపరేషన్ FISH కి నాయకుడు...
చైనా మొత్తం రాక్షసుడు అని ముద్దుగా పిలుచుకునే... అత్యంత క్రూరుడు...
జాంగ్ లీ...
తన తుపాకీ చివర రూహి దొరకడం తో వాడి మోహం లో ఆనందం కలిగింది. తుపాకీ పేల్చడానికి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు.
ఇంకొక్క క్షణం లో రూహి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అప్పటిదాకా పడిన కష్టం మొత్తం వృధా అయ్యింది అని బాధపడుతూ రూహి కళ్ళు మూసుకుంది
----------------------------------------------------------
సరిగ్గా అదే సమయంలో...
"పెళ్ళై పిల్లలు పుట్టినా సరే నీ అందం ఏ మాత్రం తగ్గలేదే... నిన్ను చూస్తుంటే నాలో కోరికలు మరింతగా రగులుతున్నాయి." జలంధర్ పెదవి కొరుకుతూ అన్నాడు.
ఎదురుగా సుజితను కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసారు. తను తప్పించుకోడానికి ప్రయత్నించింది. కాని వీలు చిక్కలేదు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నా అనుకుంది. కాని ఇలా శత్రువుల స్తావరానికి వచ్చి చిక్కుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు. జలంధర్ మాటలకు కోపంగా వాడి వంక చూసింది.
"నువ్వు అలా చూడకు.. నీ పదునైన చూపులు నా గుండెల్లో గంటలు మొగిస్తున్నాయి." జలంధర్ మాటలకు అక్కడున్న రౌడీలు అందరూ పగలబడి నవ్వారు.
"రేయ్ కుక్క... నన్ను చంపడానికి వచ్చిన నీ మనుషులకు ఎలాంటి గతి పట్టిందో అప్పుడే మర్చిపోయావా?" అని సుజిత అరిచింది.
"అది చూసే కదా నీ మీద కోపం పెరిగింది. కాని నీ అందం చూసాక ఆ కోపం కామం లా మారింది."
"నేనేవరో తెలుసా... విక్రమ్ వాసుదేవ్ భార్యను.
రూహి వాసుదేవ్ తల్లిని.."
"ఇప్పటికే ఒకడు చచ్చాడు. ఇంకాసేపట్లో నీ కూతురు కూడా చావ బోతుంది. నిన్ను ఇంకెవరు కాపాడుతారు."
ఆ మాటకు సుజిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కూతురు ప్రమాదం లో ఉందా... తన భర్తను కోల్పోయింది. ఇప్పుడు తనకేమైనా అయితే తన గుండె అస్సలు తట్టుకోలేదు. కళ్ళ నుంచి నీళ్లు జారుతూనే ఉన్నాయి.
తను అలా బాధలో ఉండగానే... జలంధర్ అడుగు ముందుకు వేసాడు.
"రేయ్ ఈరోజు దీన్ని బట్టలు లేకుండా నిలబెడతాను. దీన్ని అందాలతో అందరం పండగ చేసుకుందాం. "
అంటూ సుజిత చీర ను తన చేతిలోకి తీసుకున్నాడు.
ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జారుతున్నాయి. ఆ ఘోరం చూడలేక సూర్యుడు కూడా మబ్బుల వెనుక దాక్కున్నాడు.
సుజిత నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)