Thread Rating:
  • 5 Vote(s) - 4.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ఏజెంట్ రూహి వాసుదేవ్

#21

ఏజెంట్ రూహి వాసుదేవ్...10



[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]




అర్ధరాత్రి సమయం...

హైదరాబాద్ నగరం మొత్తం ప్రశాంతంగా పడుకొని ఉంది. అమావాస్య కావడం తో కటిక చీకటి అలుముకుంది. దూరంగా వీధి కుక్కల భౌ భౌ కబుర్లు వినిపిస్తున్నాయి. పగలంతా కష్టపడి అలిసిపోయిన మనుషులు ఆదమరిచి నిద్రిస్తున్నారు. అలాంటి సమయం లో.... ఒక నలుగురు అడుగులో అడుగు వేస్తూ, మొహానికి ముసుగు కప్పుకొని టెలికాం నగర్ లోకి అడుగుపెట్టారు.

వారు మరెవరో కాదు, జలంధర్ దగ్గర పని చేసే రౌడీలు.
ఏజెంట్ రూహి వాసుదేవ్ తల్లి సుజిత ను చంపడం కోసం వారు ఇక్కడికి వచ్చారు. మెల్లగా నడుస్తూ సుజిత నివసించే ఇంటికి చేరుకున్నారు. అంతకు ముందు రోజు సాయంత్రమే ఆ ప్రాంతం లో పక్కాగా రెక్కి నిర్వహించడం తో, ఆ చీకట్లో కూడా సుజిత ఉండే ఇంటి ని చాలా సులభంగా కనిపెట్టారు. అడుగుల శబ్దం రాకుండా ఉండటం కోసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు. కానీ వారి జేబులోని ఆయుధాలు మాత్రం అప్పుడప్పుడు శబ్దం చేస్తున్నాయి.

కాసేపటి తరువాత ఆ రౌడీలు సరిగ్గా సుజిత ఇంటి పిట్ట గోడ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక్కసారి అటు ఇటు చూసారు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఆ కాలని లో పని చేసే సెక్యూరిటీ కూడా నిద్ర ముంచుకు రావడం తో కూని రాగాలు తీస్తున్నాడు. అది ఈ రౌడీలకు కలిసి వచ్చింది.

ఆ కాలనీ లో ఉన్న ప్రతి ఇంటి గోడ మీద దొంగలు రాకుండా ఉండటం కోసం గాజు పెంకులు పేర్చి ఉన్నాయి. కానీ సుజిత నివసించే ఇంటి గోడ మీద మాత్రం అలాంటివేమి లేవు. అది చూసి తమ కోసమే అవి లేవేమో అని రౌడీలు నవ్వుకున్నారు.

అందరూ ఆ గోడ మీదకు ఎక్కి ఒకేసారి ఆ ఇంటి లోపలకు దూకారు. అంతే... ఒక్కసారిగా ఆ రౌడీల ప్రాణం పోయినంత నొప్పి కలిగింది. గట్టిగా అరవకుండా ఒకరి చేతిని ఒకరు నోట్లో పెట్టుకొని కొరికారు. అసలు ఏమైంది అంటే... సుజిత ఇంటి గోడ మీద గాజు పెంకులు లేవు కానీ, గోడ ఇవతల అంటే ఇంటి పెరట్లో అవి చల్లి ఉన్నాయి. అది కూడా చాలా పదునైన గాజు పెంకులు.. ఆ చీకట్లో రౌడీలు ఇంట్లోకి దుకగానే అవి వారి కాళ్ళ లోకి బలంగా దిగాయి. దెబ్బకు వారి కాళ్ళ నుంచి రక్తం చిమ్మింది. నొప్పికి విల విల లాడిపోయారు.

'గోడ మీద గాజు పెంకులు లేవు. ఈ సుజిత ఎంత తెలివి తక్కువది అనుకున్నాం. కానీ సరిగ్గా గోడ దూకే దగ్గర పెట్టింది. ఇప్పుడు అర్థమైంది ఎవరు తెలివి తక్కువ వారో..' అని ఆ రౌడీలు తమని తాము తిట్టుకున్నారు.

కాసేపు అక్కడే వారి కాళ్లలో దిగిన గాజు పెంకులు అన్ని జాగ్రత్తగా బయటకు తీసుకొని ముందుకు నడిచారు. ఇంటి ముందు వైపు ఉన్న తలుపు నుంచి లోపలకు వెళ్లడం సురక్షితం కాదని, వెనుక వైపు నుంచి వెళ్ళాలి అనుకున్నారు.

ఆ రక్తపు కాళ్ళతో మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు దగ్గరకు నడిచారు. అలా నడిచే దారిలో పచ్చని గడ్డి ఉంది. అసలే కాళ్లకు గాయాలు అవ్వడం తో... ఆ గడ్డి మీద నడిస్తే చల్లగా ఉంటుంది అనిపించి అందరూ ఆ గడ్డి మీద నుంచి అడుగులు వేశారు. సరిగ్గా రెండు అడుగులు వేసాక... ఆ రౌడీల అందరికీ నరకం అంటే ఏంటో కనిపించింది.

బయటకు శబ్దం రాకుండా గట్టిగా ఏడ్చారు. అసలేమైందో చూద్దాం అని కింద కూర్చొని ఆ గడ్డి లోకి చెయ్యి పెట్టి చూసారు. అప్పుడర్థమైంది... ఆ గడ్డి లో కారం చల్లి ఉంది అని. అసలే రక్తాలు కారుతున్న కాళ్ళు.. పైగా దాని మీద కారం... ఆ రౌడీలకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది. పుండు మీద కారం చల్లడం అంటే ఏంటో మొదటి సారి అర్థమైంది.

ఆ తర్వాత రౌడీలు అందరూ వారి చొక్కాలు విప్పి, కాళ్లకు కట్టుకొని ముందుకు నడిచారు. చివరకు ఇంటి వెనుక వైపుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తలుపు ను చూడగానే రౌడీల మోహం లో అప్పటిదాకా ఉన్న బాధ తగ్గి, మెరుపు వచ్చింది. ఆనందం తో సంబర పడ్డారు. ఎందుకంటే ఆ తలుపు కు ఎలాంటి తాళం వేయలేదు.

"చూసావా గురు... ఈరోజు ఆ సుజిత తన చావును ఆహ్వానించడం కోసం తనే తలుపుకు తాళం వేయడం ఎలా మర్చిపోయిందో.. " అని ఒక రౌడీ నవ్వుతూ అన్నాడు. అది విని మిగతా రౌడీలు కూడా నవ్వేశారు.

ఆ తరువాత మొదటి రౌడీ... మెల్లగా ఆ తలుపు మీద చెయ్యి వేసాడు. అంతే... కరెంట్ షాక్ కొట్టిన కాకి లాగా ఊగిపోయాడు. వాడే కాదు... వాడిని తాకిన మరో రౌడీ కూడా అలాగే కరెంట్ షాక్ తో గిల గిల లాడుతున్నాడు. అది చూసి మిగతా ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ఒక కర్ర తీసుకొని తలుపు ముట్టుకున్న రౌడీ చేతి మీద కొట్టాడు. దాంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ షాక్ కొట్టిన రౌడీల మొహాలు మాత్రం నల్లగా మాడిపోయాయి. నోట్లో నుంచి, చెవిలో నుంచి తెల్లని పొగలు కూడా వచ్చాయి. కాసేపటి తరువాత స్పృహలోకి వచ్చారు.

"మనం అనుకున్నంత పిచ్చిది కాదు రా ఆ సుజిత... మన అందరికీ బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుంది. ఈరోజు ఎలాగైనా దాన్ని చంపి తీరాలి." అని ఆ రౌడీలు మరింత కోపంగా ఊగిపోయారు.

తరువాత ఆ తలుపు పైన తగిలేలా ఉంచిన వైర్ ఒకదాన్ని గమనించారు. వెంటనే దాన్ని కర్ర సాయం తో పక్కకు లాగేసారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ తలుపు ముట్టుకున్నా సరే వారికి ఎలాంటి షాక్ కొట్టకపోవడం తో నవ్వుకున్నారు. అలా ఆ తలుపు తెరిచి వంట గదిలోకి అడుగు పెట్టారు. ఒక రెండు అడుగులు వేయగానే వారి కాళ్లకు ఒక దారం అడ్డుగా తగిలింది. ఆ దారం తగలగానే.. ఏమైందో అర్థం కాక ఆ రౌడీలు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

సరిగ్గా అప్పుడే... వారి తల మీద నుంచి ఏదో ద్రవం కారడం మొదలైంది. అది నేరుగా ఆ రౌడీల తలల మీద పడింది. అందరూ తల ఎత్తి పైకి చూసారు. పైన రెండు బాటిల్స్ నుంచి బ్రాందీ పడుతుంది. అది చూడగానే మొదట ఆశ్చర్యపోయినా సరే ఆ తర్వాత ఆనందించారు. అసలే కాళ్లకు తగిలిన గాయాలు నొప్పి ని ఇస్తుంటే, ఈ సమయం లో మందు దొరకడం తో పోటీ పడుతూ తాగారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే... మరో ప్రమాదం వారి కోసం సిద్ధంగా ఉందని.

పైన తగిలించిన సీసాలలో నుంచి సగం మందు కింద పడగానే, ఆ సీసాలకు కట్టిన మరో దారం బిగుసుకుంది. ఆ దారం ఆ సీసాల ముందు వైపు కట్టిన ఏదో వస్తువును బలంగా లాగాయి. అలా లాగగానే ఆ సీసాల ముందు వైపు ఒక నిప్పు రేగింది. బ్రాందీ ఆ నిప్పు ను తాకగానే ఒక పెద్ద మంటను రేపాయి.

ఇంకేముంది...అప్పటిదాకా పై నుంచి మందు పదితే ఆనందించారు. కానీ ఇప్పుడు నిప్పుల వర్షం కురిసింది. పైగా ఆ నిప్పు.. ఇందాక ఆ రౌడీల తలల మీద పడిన బ్రాందీ ని తాకింది. దెబ్బకు రౌడీల తలలకు నిప్పు అంటుకున్నాయి. అందరి తల మీద నిప్పు మండుతుంది. అది చూసి రౌడీలు భయపడిపోయారు. ఆ నిప్పుని ఆపాలని కింద మీద పడ్డారు. అలా వాళ్లల్లో వాళ్లే ఒకరి మోహం ఒకరు కాల్చుకున్నారు. చివరకు ఆ గదిలో మూలన ఉన్న సింక్ లో నీళ్లు రావడం చూసి పరుగున వెళ్లి మంటలు ఆర్పుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది.

ఆ నలుగురి రౌడీల తల మీద జుట్టులో సగం కాలిపొయింది. సగం జుట్టు, సగం గుండు తో వారి మోహం వారికే భయంకరంగా అనిపించింది. మొహాలు కూడా మాడిపోయాయి. ఒక రౌడీ ముక్కు అయితే కాలి పోయి ఎర్రని టమాటో మాదిరి అయ్యింది.

"అన్నా.. ఈ సుజిత మామూలుది కాదు. చూస్తుంటే మనం తనని చంపడానికి వచ్చినట్టు లేదు. తన చేతిలో చావడానికి వచ్చినట్టు ఉంది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పద.." అని ఒక రౌడీ భయంగా ఏడుస్తూ అన్నాడు.

"ఆగరా... ఇంత దూరం వచ్చాం. ఈరోజు మనకు జరిగిన దానికి బదులు తీర్చుకుందాం. దానిని చంపేసే వెళ్దాం." అని పళ్ళు కొరుకుతూ మరో రౌడీ పలికాడు.

ఇక చేసేదేం లేక నలుగురు రౌడీలు లేచి నిలబడ్డారు. మెల్లగా ముందుకు అడుగులు వేశారు. ఎటు వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయం భయంగా నడుస్తున్నారు. వంట గది లో నుంచి హల్ లోకి వచ్చారు. ఒక్కసారి చుట్టూ చూసారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం కనిపించలేదు. హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక రౌడీ ఆ హాల్ మధ్యలో ఒక ఆపిల్ పండు ఉండటం చూసాడు.

దానిని చూడగానే బాగా ఆకలిగా అనిపించింది. వెంటనే వెళ్లి ఆ ఆపిల్ ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. ఆ ఆపిల్ కి ఒక దారం కట్టి ఉందని... దాన్ని చేతిలోకి తీసుకోవడం తో ఆ దారం లాగబడింది అని... అది చూసి రౌడీలు అందరూ ఉలిక్కి పడ్డారు. ఎటు వైపు నుంచి ఏమి ముంచుకు వస్తుందో అని వణికిపోయారు. వారి ఊహను నిజం చేస్తూ... ఒక గుండు సూది వేగంగా వచ్చి ఒక రౌడీ సీటులోకి దిగింది. దాంతో వాడు నొప్పితో పెద్దగా అరిచాడు. ఇంతలో ఆ గది నలు మూలల నుంచి పదునైన గుండు సూదులు దూసుకొని వచ్చాయి. ఒకటి రెండు కాదు.. కొన్ని వందల సూదులు..

అవి ఆ రౌడీల అందరి శరీరాల లోకి వేగంగా దిగాయి. ఒళ్ళంతా గాయాలు, రక్తాల తో వారి ప్రాణం పోయినట్టు అనిపించింది. కాసేపటికి ఆ గుండు సూదుల వర్షం ఆగింది. మెల్లగా ఒక్కో రౌడి వారి శరీరం లో దిగిన గుండు సూదులు తీసుకున్నారు. అందరిలో సుజిత మీద కోపం మరింతగా పెరిగింది. ఈరోజు ఎలాగైనా తనని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ ఇంట్లో కింద వైపు ఎవరు లేరని అర్థమైంది. కచ్చితంగా సుజిత మేడ మీద ఉన్న గదిలోనే ఉంటుందని అనిపించి, పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. సరిగ్గా నాలుగు మెట్లు ఎక్కగానే... ఆ మెట్ల మీద చల్లిన నూనె కారణంగా ముందు నడుస్తున్న రౌడీలు కాలు జారి వెనుక వస్తున్న రౌడీల మీద ఎగిరి పడ్డారు. అలా వారంతా ఆ హల్ లో చెల్లా చెదురుగా పడి ఉన్న గుండు సూదుల మీద పడ్డారు. అవి వారి శరీరం లో మరింత లోతుగా దిగాయి.

దెబ్బకు వారి ప్రాణాలు పోయినట్టు అనిపించింది. ఒళ్ళంతా చిద్రమైంది. శరీరం మొత్తం గాయాలతో ఆ గదిలో పైకి లేవలేక ఆ రౌడీలు అలాగే పడిపోయారు. వారికి ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. భరించలేని నొప్పి కలిగింది.

సరిగ్గా అప్పుడే వారికి ఒక నవ్వు వినిపించింది. ఎవరా అని తల తిప్పి చూస్తే... ఎదురుగా మెట్ల పక్కనే ఉన్న గదిలో నుంచి సుజిత నవ్వుతూ బయటకు వచ్చి నిలబడింది.

తనని చూడగానే ఆ రౌడీల కు కోపం మరింతగా పెరిగింది. ఒక రౌడీ ఎలాగోలా పైకి లేచి తన మీదకు కోపంగా వెళ్ళాడు.
తనని పొడవడానికి కత్తిని గాల్లోకి లేపాడు. సుజిత ఆ కత్తిని ఒడుపుగా తప్పించుకొని తన చీరను పైకి ఎగ్గట్టి శివంగి లా మారి ఆ రౌడీ గుండెల మీద ఒకే ఒక్క తన్ను తన్నింది. వంద ఏనుగులు ఒకేసారి మీద పడ్డట్టు అయ్యింది. వాడు అమాంతం ఎగిరి దూరంగా పడిపోయాడు. ఆ రౌడీ నోట్లో నుంచి రక్తం వచ్చింది.

అది చూసి మిగతా రౌడీలు నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు. సుజిత కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. అపర భద్ర కాళీ లాగా నిలబడి ఉంది తను...

"ఒంటరిగా ఉంది. సులభంగా చంపేయచ్చు అని అనుకున్నారా... కానీ ఇక్కడ ఉన్నది ఎవరో మరిచారా...
దేశాన్ని కాపాడే సైనికుడు, తమ కుటుంబానికి కాపాడుకోవడం నేర్పరా...
నాకు కూరగాయలు కోయడం వచ్చు. అలాగే నీలాంటి పోరంబోకుల తలలు నరకడం కూడా వచ్చు.
మళ్ళీ ఇంకోసారి ఇలా వస్తే, ఈసారి వార్నింగులు ఉండవు. చంపడాలు మాత్రమే ఉంటాయి.
నా గుండెకున్నంత సహనం నా చేతిలోని ఆయుధానికి ఉంటుందని అనుకోను. ఆ తరువాత మీ ఇష్టం.
వెళ్లి ఈ మాట మిమ్మల్ని పంపిన వాడికి చెప్పండి.
చెప్పింది ఎవరని అడిగితే...
ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ భార్య... రూహి వాసుదేవ్ తల్లి... ఈ సుజిత వాసుదేవ్ చెప్పిందని చెప్పు..."

ఆ మాట వినగానే ఆ రౌడీలు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటి బయటకు పరుగు తీశారు.

సుజిత వాసుదేవ్... వారి వంక చూస్తూ నిలబడి ఉండి.
తనలో ఆ ధైర్యం చూసి పైనున్న విక్రమ్ వాసుదేవ్ కూడా గర్వంగా పొంగిపోయాడు.

" ఏజెంట్ రూహి వాసుదేవ్...10 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 12-05-2026, 06:38 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 12-05-2026, 02:42 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 12-05-2026, 06:00 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 12-05-2026, 07:02 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 13-05-2026, 05:40 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 13-05-2026, 05:44 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 13-05-2026, 09:29 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 13-05-2026, 03:25 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 14-05-2026, 01:37 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 14-05-2026, 06:29 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 14-05-2026, 06:31 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 14-05-2026, 07:37 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 14-05-2026, 08:39 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 14-05-2026, 10:37 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 15-05-2026, 06:19 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 15-05-2026, 06:21 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 15-05-2026, 07:41 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 15-05-2026, 07:47 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 15-05-2026, 10:51 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 16-05-2026, 06:11 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 16-05-2026, 06:14 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 16-05-2026, 09:55 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 16-05-2026, 12:43 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 17-05-2026, 12:33 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 17-05-2026, 07:24 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 17-05-2026, 07:26 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 17-05-2026, 09:53 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 17-05-2026, 10:35 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 17-05-2026, 12:30 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 18-05-2026, 07:36 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 18-05-2026, 07:38 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 18-05-2026, 09:06 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 18-05-2026, 11:46 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 18-05-2026, 01:46 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 19-05-2026, 08:20 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 19-05-2026, 08:22 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by styleraja - 21-05-2026, 02:57 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 19-05-2026, 10:47 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 19-05-2026, 01:53 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 19-05-2026, 12:56 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 19-05-2026, 07:24 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 20-05-2026, 07:18 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 20-05-2026, 07:21 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by styleraja - 21-05-2026, 07:04 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 20-05-2026, 10:51 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 20-05-2026, 03:32 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 20-05-2026, 06:15 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 21-05-2026, 07:14 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 21-05-2026, 07:24 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 21-05-2026, 01:01 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sachin@10 - 21-05-2026, 10:13 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Sunny73 - 21-05-2026, 04:18 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by Reddy 211993 - 22-05-2026, 07:49 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 22-05-2026, 08:01 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 22-05-2026, 08:04 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 22-05-2026, 08:06 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by styleraja - 22-05-2026, 03:45 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:17 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:19 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:21 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:21 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:22 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:23 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:25 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:26 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:29 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:31 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:34 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by styleraja - 23-05-2026, 11:39 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by k3vv3 - 23-05-2026, 08:58 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 23-05-2026, 09:18 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by ash.enigma - 23-05-2026, 09:19 AM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 01:27 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 03:23 PM
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by parinda35 - 17-10-2026, 07:31 AM



Users browsing this thread: 1 Guest(s)