07-05-2026, 12:31 AM
అక్కడ మేము మాట్లాడే ది ఏం లేదు అనుకొంటూ ఉండగా నా వెనుక ఉన్న ఉజ్జయిని గట్టిగా కేక వేసి వెనుక నుంచి నన్ను గట్టిగా కౌగలించుకుంది. అది పాడు పడి చాలా రోజులు అయినట్లు ఉంది ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న జీవాలు తిరుగుతూ ఉన్నాయి , డోర్ కి ఎదురుగా కాకుండా పక్కనే ఉన్న ఓ చిన్న యంత్రం చాటుగా ఉన్నాము, ఆ యంత్రం మీద ఉన్న బల్లిని చూసి భయపడి ఆ కేక వేసింది. తన కేక ఫిరంగి పేలినప్పుడు వచ్చే సౌండ్ లా వినబడింది ఆ హాల్ లో , లోపల ఉన్న వాళ్ళు పరుగెత్తు కొంటూ వచ్చి మిమ్మల్ని చుట్టూ ముట్టారు. మొత్తం నలుగురు ఉన్నారు, చూస్తుంటే మన వాళ్ళ లాగా కనబడ లేదు. హిందీలో మాట్లాడడం మొదలు పెట్టారు. “ఏయ్ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు” అన్నాడు వాళ్లలో కొద్దిగా లావుగా పొడుగ్గా ఉన్న వాడు, ఇందాక బిర్యానీ తింటున్న ది వాడే అనుకుంటా వాడి కుడి చేయి మీద బిర్యానీ మరకలు ఉన్నాయి,
“హెలొ సర్ , తను నా గర్ల్ ఫ్రెండ్ మేము లవర్స్ , బయట ఎక్కడా సరియైన ప్లేస్ దొరక లేదు , అందుకే ఇక్కడ ఎవరు ఉండరు అని ఇక్కడికి వచ్చాము , మీరు ఉంటారు అని అనుకోలేదు” అన్నాను వెనుక వైపు నుంచి ఉజ్జయిని నన్ను గట్టిగా పట్టేసుకుంది.
“ఎంత సేపు అయ్యింది మీరు వచ్చి”
“ఇప్పుడే వస్తున్నాము , ఇదిగో ఈ బల్లిని చూసి నా గర్ల్ ఫ్రెండ్ భయపడింది”
“మేము మాట్లాడింది ఏమైనా విన్నారా?”
“మేము ఇప్పుడే వస్తూ ఉన్నాము సర్, మాకు తెలీదు మీరు ఇక్కడ ఉన్నట్లు”
“ఈ ప్లేస్ లో కి రావాలని ఎందుకు అనిపించింది?”
“మా ఫ్రెండ్ ఒకడు ఇంతక ముందు తన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడు , వాడు చెప్పడు ఇక్కడైతే ఎవ్వరూ ఉండరు అని అందుకె వచ్చేము”
“వాడితో ఏంటి మాటలు , ఆ పిల్ల చూడడానికి బాగానే ఉంది గా రాత్రంతా వాడుకొని పొద్దునే పంపిద్దాము, వాడిని నాలుగు పీకి ఇక్కడే పడుకో పెడదాము” ఆనాడు ఒకడు వాళ్ళ బాషలో అది హిందీ కాదు కానీ , కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో.
“వద్దు , వాళ్ళు ఇక్కడే ఎక్కడో దగ్గరే ఉంటారు , వాళ్ళు ఇంటికి రాలేదు అంటే , వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెక్యూరిటీ అధికారి కంప్లయింట్ ఇస్తారు, అప్పుడు మనం దొరికి పోతాము, వాళ్ళను వదిలి పెట్టేద్దాము” అన్నాడు లీడర్ లాగా ఉన్నా వాడు.
“దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ ఎలా వదిలే ది, మనం ఎలాగూ రేపు ఖాళీ చేస్తున్నాము గా ఇద్దరినీ ఇక్కడే కప్పేట్టేద్దాము అన్నాడు” ఇంకోకడు.
“నా మాట వినండి , అది మన మెడకు చుట్టూ కొంటుంది”
“నువ్వు లోపలికి వెళ్ళి పడుకో మేము చూసుకుంటాము” అంటూ ఒకడు ముందుకు వచ్చాడు
“భయ్యా తప్పు అయిపోయింది , మేము వెళ్ళి పోతాము” అంటూ మేము వచ్చిన దారి వైపు నడవడానికి అడుగు వేశాను, నా వెనుకనే నన్ను అనుకోని ఉన్న ఉజ్జయినీ కూడా నాతో పాటే బయలు దేరింది. అంత వరకు మెషిన్ చాటున ఉన్నాము వాళ్ళకు సరిగా కనబడ లేదు , మేము ఎప్పుడైతే బయటకు వచ్చా మో అప్పుడు వాళ్ళు ఉజ్జయిని చూసే సరికి వాళ్ళ కళ్ళు ఎరుపెక్కుతూ ఉండగా నాకు ఎదురుగా వచ్చాడు ఒకడు.
నేను వచ్చిన మెషిన్ కి పక్కనే పెద్ద చక్రానికి తిప్పడానికి అన్నట్లు ఓ హ్యాండిల్ ని తగిలించి ఉన్నారు, చూపు వారి మీద నుంచి తిప్పకుండా కుడి చేతిని మెషిన్ మీదకు జరిపి ఆ హ్యాండిల్ ని చేతిలోకి లాక్కొని, నువ్వు కొద్దిగా వెనుకగా ఉండు అంటూ, . చేతిలోని శక్తిని అంతా ఆ హాండెల్ మీద పెడుతూ హ్యాండిల్ ని స్పీడుగా ముందు ఉన్న వాడి వైపు మానును కొట్టే గొడ్డలి లా వాడి భుజం మీద కు దింపాను. ఇంతక ముందు ఉజ్జయినీ అరిచిన దాని కంటే గట్టిగా అరుస్తూ కింద పడి పోయాడు, వాడి చేయి భుజం జాయింట్ నుంచి జారీ పోయింది. ఆ చేతిని పట్టుకొని అక్కడ దొర్ల సాగాడు, ఈ లోపున వాడి పక్కన ఉన్న వాడు లోపలికి వెళ్ళాడు ఆయుధం కోసం అనుకుంటా.
వాడి పక్కన ఉన్న వాడు మాత్రం, ఆయుధం కోసం చూడ కుండా ఇంతకు ముందు వాడి లాగా మీదకు వచ్చాడు. నా చేతిలో ఉన్న హాండెల్ మరో మారు పైకి లేచింది, ఈ సారి వాడి భుజం మీద కాకుండా వాడి దవడ మీద వాలింది , ఆ దెబ్బకు వాడి దవడ షేప్ మారి పోయింది, ఆ దెబ్బకు వారి పళ్ళు రెండు వాడి నోటిలోంచి ఊడి నేలమీద పడ్డాయి, వీడు కింద పడ్డాడు కానీ వాడి నోటిలోంచి ఎటువంటి పెద్ద సౌండ్ రాలేదు కానీ సన్నని ములుగు మాత్రమే వినబడింది ఆ పైన ఆ నొప్పికి తాళ లేక వాడు స్పృహ తప్పి పోయాడు. ఈ లోపల , లోపలికి వెళ్ళిన వాడు ఓ కత్తి పట్టుకొని వచ్చాడు, వాడి ఫ్రెండ్ ఇద్దరు కింద పడడం చూసి వాళ్ళ లీడర్ లాంటి వాడు కొద్దిగా వెనకంజు వేశాడు, కానీ లోపల ఉన్న వాడు తెచ్చిన కత్తి చూసి వాడికి ధైర్యం వచ్చినట్లు ఉంది, “వాడిని వదిలి పెట్టకు, నరికేయి” అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తూ వాడి వెనుక నుంచి ఫోర్స్ చెయ్య సాగాడు. కత్తితో వచ్చిన వాడు తన చేతిలోని కత్తితో ఫోర్స్ గా నా వైపు దూశాడు, వాడి చేతిలోని కత్తి పోటుకు తప్పు కొంటూ ఆ చేతి మీద ఫోర్స్ గా హ్యాండిల్ తో బాదాను. ఆ దెబ్బకు వాడి మని కట్టు దగ్గర పచ్చి కొమ్మ విరిగినట్లు సౌండ్ వస్తూ ఉండగా వాడి చేతిలోని కత్తి కింద పడి టంగు మని సౌండ్ వచ్చింది, కిందకు వంగి చేతిలోని హాండెల్ ని వాడి కాళ్ల మీద ఫోర్స్ గా విసురుతూ కింద పడ్డ కత్తిని చేతిలోకి తీసుకున్నాను. హాండెల్ విసరడం వాళ్ళ వాడి మోకాలు కింద తగలడం వల్ల వాడు కింద కూచోండి పోయాడు, చేతి లోని కత్తిని ఫోర్స్ గా సైడుకి దూశాను, ఆ ఫోర్స్ కి కింద పడ్డ వాడి అర చేయి సగానికి తెగి కింద పడ్డది, వాడి చేతి లోంచి రక్తం ఫౌంటెన్ లోంచి వచ్చే వాటర్ లా ఫ్లోర్ ని తడుపుతూ ఉంటే వాడు కింద పది దొర్ల సాగాడు, వాళ్ళ అందరికీ సూచనలు ఇస్తున్న వాడు తన ఫ్రెండ్స్ కి పట్టిన గతి చూసి, భయపడి బయటకు పరిగెత్తాలని చూశాడు.
వాడు తప్పించు కొంటె వెళ్ళి హోటల్ లో ఉన్న వాళ్ళను అలర్ట్ చేస్తాడు అని , వాడిని వెళ్ళకుండా చేయాలి అని ఆలోచిస్తూ గా నా చేయి ఆటోమేటిక్ గా కత్తిని వాడి కాళ్ల వైపు విసిరింది, నేను విసిరిన యాంగిల్ కి అది సరిగా వాడి మోకాలి కింద తగిలింది, బాగా పదును పెట్టినట్లు ఉన్నారు ఆ కత్తికి దెబ్బకు వాడి కాలు తెగి కింద పడింది , కానీ వాడు మోషన్ లో ఉన్నాడు , స్పీడు కంట్రోల్ చేసుకోలేక కొద్ది దూరం అలాగే వెళ్ళి కింద పడ్డాడు. ఇదంతా రెండు నిమిషాల లోపల జరిగి పోయింది , నా వెనుక ఉన్న ఉజ్జయిని నేను వెనక్కు నెట్టగానే బిగుసుకొని పోయింది , నేను ఎప్పుడైతే కత్తి విసిరి లేచి వాడి వైపు వెళుతూ ఉండగా తను స్పృహ లోకి వచ్చి నా వెనుక పరిగెత్తు కొంటూ వచ్చింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)