07-05-2026, 12:03 AM
గోపీ ఒక్కడే చాల సేపు ఆలోచిస్తూ చివరికి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు మొహం పెట్టి లేచి నిలుచున్నాడు. కింద కారు శబ్దం విని వెళ్లి చూస్తే ప్రీతీ కారు దిగి చెయ్యి ఊపుతుంది. గోపీ కిందకి వెళ్ళాడు.
ఏంటి ప్రీతీ గారు ఇటు వచ్చారు ?
నీతో మాట్లాడాలి గోపి
చెప్పండి
ఇక్కడ కాదు. ఎటైనా వెళదాం అంటే సరే అని కారు ఎక్కి కూర్చున్నాడు గోపి. పైన తలుపులు తీసే ఉన్నాయి.
ప్రీతీ నేరుగా రెస్టారెంట్‌కి పోనించింది
ముందు చెప్తే మంచి డ్రెస్ వేసుకుని వచ్చేవాడిని కదా అని గోపి అడిగితే సారీ చెప్పింది ప్రీతీ
ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు. బిల్ నువ్వే కడతావ్ కదా అని అడిగితే ప్రీతీ అయోమయంగా చూస్తూ అవును అంది. గోపి సంతోషంగా వాడికి నచ్చిన మెనూ మొత్తం చదివేశాడు. వెయిటర్ కూడా నవ్వుతూ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం అని మెనూ కార్డు పక్కన పెట్టి అడిగాడు.
మా అమ్మ హాస్పిటల్ బిల్ కట్టింది నువ్వే కదా ?
గోపి నవ్వి అవును, ఎలా తెలిసింది అని అడిగితే తన ఫ్రెండ్ విశాల్ గురించి చెప్పింది.
అసాధ్యురాలివే. ఈ స్వర్ణకి యాక్టింగ్ కూడా రాదు అని తిట్టుకున్నాడు.
ఎందుకు గోపీ..
సాయం పొందినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అంతే కానీ ఎందుకు ఏంటి అని అడక్కూడదు. నా వల్ల నీకు పిఎ పోస్ట్ రాలేదు, దాని వల్ల నీకు లోన్ రాలేదు. అందుకే హెల్ప్ చేశా అనుకో అని గోపి అంటుంటే ప్రీతీ కృతజ్ఞతగా రెండు చేతులు పట్టుకుంది.
వెయిటర్ వచ్చింది. ఐటమ్స్ టేబుల్ మీద పెట్టి వడ్డిస్తుంటే ప్రీతీ తనని వెళ్ళమని చెప్పి లేచి గోపీ పక్కన కూర్చుని దెగ్గరుండి వడ్డించింది. గోపీ కూడా ఏమి అనకుండానే తినేసాడు. ప్రీతీ తననే తదేకంగా చూస్తుంటే ఏంటి అని సైగ చేసాడు. గోపీకి దగ్గరగా జరిగి ముద్దు పెడదామని పెదవులని దెగ్గరికి తెచ్చింది. గోపీ వెంటనే ప్రీతీ గడ్డం పట్టుకుని మొహం తిప్పేసాడు. నీ ముద్దు కోసం సాయం చెయ్యలేదు ప్రీతీ. ఫీలింగ్స్ లేకుండా పెట్టే తీయని ముద్దు కూడా చేదు కొడుతుంది అని బుగ్గ మీద ముద్దు పెట్టి పదా వెళదాం అన్నాడు. ప్రీతీ బిల్ కట్టేసి ఇంటి దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది.
ఇంటి బైట నుంచే తల ఎత్తి చూసాడు. తొందరలో తలుపులు వేయడం మర్చిపోయాడని గుర్తుకు వచ్చింది. పైకి పరిగెత్తి చూస్తే అప్పటికే పిల్లులు స్టవ్ మీద పాలు, అన్నం గిన్నెలో అన్నం గది అంతా చిందరవందరగా చేసేశాయి.
ఇది గనక జఫర్ గాడు చూస్తే నా వీపు మోత మోగించేస్తాడు అని భయపడుతూనే ముందు పిల్లులని తరిమి ఇల్లంతా శుభ్రం చెయ్యడం మొదలుపెట్టాడు.
గది మొత్తం శుభ్రం చేసి కూర్చుంటే బైట కారు శబ్దం వినిపించింది. లేచి పై నుంచే తొంగి చూసాడు. జఫర్ కారు దిగిన తరువాత అమృత కూడా కారు దిగి జఫర్‌ని గట్టిగా వాటేసుకుని సిగ్గు పడుతూ బై చెప్పి కారు ఎక్కింది. జఫర్ కూడా చెయ్యి ఊపి టాటా చెప్పాడు. కారు వెళ్ళాక తల కొట్టుకుంటూ పైకి చూస్తే గోపీ కనిపించాడు. గోపీ నవ్వుతూ సూపర్ అని చెయ్యి చూపిస్తే వీడొకడు అనుకుంది. మళ్ళీ వెంటనే అమృత తనతో ఎలా ప్రవర్తించిందో అలా గోపీతో తనెప్పుడు ఉంటుందో అనుకుంటూ గోపీని చూసి మెట్లు ఎక్కింది. ఇంట్లో అంతా శుభ్రంగా ఉండటం చూసి గోపీ వంక అనుమానంగా చూసింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)