22-04-2026, 04:00 PM
(This post was last modified: 22-04-2026, 04:01 PM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ నాలుగు ఐదు రోజులు నా దెగ్గరే ఉందువు పదా అంది గీత. జఫర్ ముందు వద్దన్నా గీత, హిమజ బలవంతం చేసేసరికి కాదనలేకపోయింది జఫర్. రెండు జతల బట్టలు తీసుకుని గీత ఇంటికి వెళ్ళింది. గది చూపిస్తే మంచం మీద కూర్చుంది. కాసేపటికి హిమజ వెళ్ళిపోయాక గీతా, జఫర్ ఇద్దరే మిగిలారు.
ఆంటీ.. మీ ఆయన! అంది జఫర్.
కంగారుపడకు. ఆయన క్యాంపుకి వెళ్లారు.
క్యాంప్ అంటే..
మొదట బిజినెస్ చేసేవారు, తరువాత నష్టం వచ్చిందని ఇప్పుడేదో చేస్తున్నారు. అదేంటో నాకు తెలీదు, నాకు వివరంగా చెప్పలేదు. అందుకే క్యాంప్ అంటాను అని నవ్వింది గీత. మొన్నే వెళ్ళారు. ఇప్పుడల్లా రారులే.. నీకు భయం లేదు అంటే జఫర్ అలాగే అంది. అయినా నువ్వు ఇన్ని రోజులు గోపీతోనే ఉంటున్నావ్, కలిసి తిరుగుతున్నారు, మొన్న నీ నడక చూసినప్పుడే ఒక క్షణం ఆగిపోయాను నేను, వాడికి అసలు అనుమానం రాలేదా అంటే నవ్వింది జఫర్. లేదని నవ్వుతూనే తల అడ్డంగా ఊపింది.
గోపీ తింగరోడు ఆంటీ.. అలా అని ముద్దపప్పేం కాదు. కాకపోతే నన్ను పూర్తిగా నమ్మేశాడు. ఎప్పుడైనా నాకు గడ్డం, మీసం లేదని ఏడిపిస్తుంటాడు.
అవును అంది గీత. నిన్ను ఇంతగా నమ్మాడు కదా. నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో
జఫర్ మొహంలో చిన్న బాధ గమనించింది గీత. లేచి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని వెళ్ళింది.
గోపీకి ఫోన్ చేసింది జఫర్.
ఎలా ఉందిరా ఇప్పుడు ?
బానే ఉంది.
ఆఫీస్‌కి వస్తావా?
లేదు, ఇక్కడ తెలిసిన చుట్టాలున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చా, రెండు రోజుల్లో వస్తా.
ఓహ్.. మరి ఇక్కడా.. సరే నేను చూసుకుంటాలే. ఎంజాయి అంటే హ్మ్ అని ఉ కొట్టి పెట్టేసింది. ఏమంటున్నాడు అంది గీత నవ్వుతూ.. చుట్టాలంటికి వచ్చాను, రెండు రోజుల్లో వస్తానని చెప్పాను అంది జఫర్. అయితే ఈ రెండు రోజులు దాగుడుమూతలు అన్నమాట అని ఇద్దరు నవ్వుకున్నారు.
***
ఒక్కడే షెడ్‌లో జఫర్ పని చూస్తున్నాడు గోపీ. జఫర్ ఎలా పనిచేస్తాడో అర్ధం చేసుకోవడానికే చాలా టైం పట్టింది. సాయంత్రం అయ్యేసరికి తాతయ్యని ఇంట్లో డ్రాప్ చేసాడు. బండి మీద ఇంటికి వచ్చాడు.
బండి శబ్దం వినగానే కిటకీలో నుంచి తొంగి చూసింది జఫర్. గోపీ పైకి వెళ్ళిపోయాడు. తలుపు తీసి లోపలికి వెళితే అన్నం కూరా వండేసి ఉన్నాయి. హమ్మయ్యా అనుకున్నాడు గోపీ. వెంటనే జఫర్‌కి ఫోన్ చేసాడు.
ఎలా ఉందిరా ఇప్పుడు?
తగ్గింది.
సరే..
హా..
ఉంటా అయితే
హా..
సరే బై అని పెట్టేసాడు గోపీ. స్నానం చేసి అన్నం తిన్నాడు. ఒక్కడే గది నుంచి బైటికి వచ్చి ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు. రోజూ ఈ టైంకి జఫర్ చెవిలో తూనీగలా చిరాకు తెప్పించేవాడు. ముందు తను గెలకడం ఆ తరువాత వాడితో డొక్కలో గుద్దించుకోవడం.. ఇప్పుడు చాలా రోజుల తరువాత మళ్ళీ ఒంటరితనం ఆవహించింది. స్వర్ణకి ఫోన్ చేసాడు.
గోపీ.. అంది స్వర్ణ
ఏం డూయింగు?
ఇప్పుడే తినేసి కూర్చున్నా. నువ్వు?
నేను కూడా
చెప్పడం మర్చిపోయా ఆ ప్రీతీ నీకోసం వెతుకుతుంది.
దేనికి?
డెబ్భై లక్షలు పెట్టి వాళ్ళ అమ్మని బతికిస్తే వెతకదా.. డబ్బు కట్టింది నేనే అని తెలుసుకుని నా ఆఫీస్ దాకా వచ్చింది. మీకెలా తెలుసు, నాకెందుకు సాయం చేశారు అని చాలా అడిగింది. నోటికొచ్చినవి చెప్పి పంపించేసాను. నువ్వే అని చెప్పేద్దామా అనుకున్నా.. మళ్ళీ నీకిష్టం లేదు కదా అని ఆగిపోయా..
అదే మంచిదిలే..
హా.. హాస్పిటల్ బిల్స్ టాక్స్‌లో కలిపేస్తా.. అదొక బెనిఫిట్ నీ వల్ల నాకు. ఇక్కడికి రావచ్చు కదా
వస్తాలే..
ఏంటి డల్‌గా ఉన్నావ్
అదేం లేదు. బోర్ కొడుతుంది.
నీ ఫ్రెండ్ లేడా
వాడు ఎటో వెళ్ళాడు
ఇక్కడికి వచ్చేయి మరి
ఇప్పుడు అంత దూరం రాలేనులే.. గుడ్ నైట్
స్వర్ణ హలో.. అంటున్నా పెట్టేసాడు.
పొద్దున్నే కళ్ళు తెరిచి చూస్తే రోజూ కనిపించే జఫర్ మొహం కనిపించలేదు. బ్రష్ చేసుకుని బైటికి వెళ్ళాడు. కాఫీ చెపితే అది చెండాలంగా ఉంది, అక్కడే పారబోసి ఇంకో టీ కొట్టు దెగ్గరికి వెళ్ళాడు. ఇంకో నాలుగైదు తిరిగినా ఎవరూ జఫర్‌లా కాఫీ పెట్టివ్వలేదు. చేసేది లేక ఇంటికి వచ్చి జఫర్‌కే ఫోన్ చేసాడు.
ఒరేయి ఈ కాఫీ ఎలా పెట్టాలి? పాలు ఎక్కడున్నాయి. కాఫీ పొడి ఎక్కడుంది?
నవ్వాడు జఫర్
ముందు స్టవ్ ఆన్ చెయ్యి
ఆ చేశా..
ఫ్రిడ్జ్ లో కింద మూలకి చిన్న గిన్నెలో పాలు ఉంటాయి చూడు. కాఫీ పొడి పాకెట్లు కారం డబ్బా పక్కన ఉంటాయి.
అదెక్కడుంది?
ఉప్పు డబ్బా పక్కన
ఆ దొరికింది.
ముందు పాలు కాగపెట్టు
ఆ పెట్టా
సింలో పెట్టు
ఆ పెట్టా
మరిగాయా
ఇంకా లేదు.
అయితే ఆగు.
ఏం పని మీద వెళ్ళావ్
ఊరికే వచ్చాను. వీళ్ళని కలిసి చాలా రోజులు అవుతుంది.
హా.. పొంగుతున్నాయి
స్టవ్ ఆపు
ఆపేసా
కాఫీ పొడి పాకెట్ చించి అందులో పొయ్యి
హా పోసా
పంచదార కూడా వెయ్యి
హా వేసా
బాగా కలుపు
హా స్పూన్ ఎక్కడుంది. ఆ.. కలిపా
గ్లాసులో పోసుకుని తాగేయి
ఒరినీ ఇంతేనా!
అంతే అని నవ్వాడు.
సిప్ వేసాడు. నువ్వు చేసినట్టు రాలేదురా
ఒక్క సారికే ఎలా వస్తుంది..
అంతేలే.. సరే త్వరగా వచ్చేయి. నిన్ను తాతయ్య అడిగాడు. ఆయనకి కూడా చెప్పు అంటే సరే అని పెట్టేసింది జఫర్. తాతయ్యకి ముందే చెప్పేసింది. గోపీ అలా అనేసరికి చిన్నగా నవ్వుకుంది. ఫోన్ పక్కన పెట్టి గీత కోసం వంటింట్లోకి వెళ్ళింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)